కరోనా వైరస్ విజృంభించిన తరువాత భారతదేశంలో చాలా మందికి ఉద్యోగాలు పోయాయి. దీంతో కొందరు డబ్బు సంపాదించడానికి మార్గాలు వెతుక్కునే క్రమంలో కొత్త ఆలోచనలకు రూపం పోశారు. గతంలో కొందరు ఖరీదైన కార్లలో కూరగాయలు విక్రయించడం, టీ విక్రయించడానికి సంబంధించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఢిల్లీకి చెందిన వ్యక్తి తన కొత్త కియా కారెన్స్ కారులో ఫుడ్ విక్రయించాడు. దీనికి సంబంధించిన వీడియో హర్‌సిమ్రాన్ సింగ్ తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. ఈ వీడియోలో గమనించినట్లతే ఒక వ్యక్తి తన కియా కారెన్స్ (Kia Carens) కారులో ఆహారం విక్రయిస్తుండం చూడవచ్చు.
కియా కారు బూట్ స్పేస్‌లో హోమ్ మేడ్ ఫుడ్ విక్రయిస్తున్నాడు. ఆ ఫుడ్ మొత్తం తన భార్య తయారు చేసి ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈ సంఘటన ఢిల్లీలో ఎక్కడనేది తెలియాల్సి ఉంది. ఖరీదైన కారులో ఆహారం విక్రయించడం వెనుక ఉన్న అసలు కథ కూడా స్పష్టంగా తెలియదు.
ఇదీ చదవండి: ఇషా అంబానీ రైట్ హ్యాండ్ ఇతడే.. జీతం లక్షల్లో కాదు కోట్లల్లోనే..
కియా కారెన్స్ ప్రారంభ ధర రూ. 10.45 లక్షలు, కాగా.. టాప్ వేరియంట్ ధర రూ. 19.45 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ కారు ఏకంగా 23 వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులో ఉంది. కారెన్స్ MPV పటిష్టమైన సేఫ్టీ ఫీచర్స్ కూడా కలిగి ఉండటం వల్ల ఎక్కువమంది ఎగబడి కొనుగోలు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment