home made foods
-
లక్షల విలువ చేసే కారులో 'హోమ్ మేడ్ ఫుడ్' బిజినెస్.. వీడియో వైరల్
కరోనా వైరస్ విజృంభించిన తరువాత భారతదేశంలో చాలా మందికి ఉద్యోగాలు పోయాయి. దీంతో కొందరు డబ్బు సంపాదించడానికి మార్గాలు వెతుక్కునే క్రమంలో కొత్త ఆలోచనలకు రూపం పోశారు. గతంలో కొందరు ఖరీదైన కార్లలో కూరగాయలు విక్రయించడం, టీ విక్రయించడానికి సంబంధించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఢిల్లీకి చెందిన వ్యక్తి తన కొత్త కియా కారెన్స్ కారులో ఫుడ్ విక్రయించాడు. దీనికి సంబంధించిన వీడియో హర్సిమ్రాన్ సింగ్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. ఈ వీడియోలో గమనించినట్లతే ఒక వ్యక్తి తన కియా కారెన్స్ (Kia Carens) కారులో ఆహారం విక్రయిస్తుండం చూడవచ్చు. కియా కారు బూట్ స్పేస్‌లో హోమ్ మేడ్ ఫుడ్ విక్రయిస్తున్నాడు. ఆ ఫుడ్ మొత్తం తన భార్య తయారు చేసి ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈ సంఘటన ఢిల్లీలో ఎక్కడనేది తెలియాల్సి ఉంది. ఖరీదైన కారులో ఆహారం విక్రయించడం వెనుక ఉన్న అసలు కథ కూడా స్పష్టంగా తెలియదు. ఇదీ చదవండి: ఇషా అంబానీ రైట్ హ్యాండ్ ఇతడే.. జీతం లక్షల్లో కాదు కోట్లల్లోనే.. కియా కారెన్స్ ప్రారంభ ధర రూ. 10.45 లక్షలు, కాగా.. టాప్ వేరియంట్ ధర రూ. 19.45 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ కారు ఏకంగా 23 వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులో ఉంది. కారెన్స్ MPV పటిష్టమైన సేఫ్టీ ఫీచర్స్ కూడా కలిగి ఉండటం వల్ల ఎక్కువమంది ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Harsimran Singh (@therealharryuppal) -
ఇంట్లో వండిన ఆహార పదార్థాలకు డిమాండ్
-
మామ్స్ హోమ్ మేడ్ ఫుడ్.. ఫుల్‌టైమ్ వంట
‘అమ్మ చేతి వంట ఎప్పుడూ రుచిగానే ఉంటుంది. అమ్మ మనసు పంచే ప్రేమలా’ అంటారు హైదరాబాద్ టోలీచౌకీలో ఉంటున్న జరీనా షా. పన్నెండేళ్లుగా మామ్స్ హోమ్ మేడ్ ఫుడ్ పేరుతో హోమ్ షెఫ్‌గా రాణిస్తున్న జరీనా పిల్లల స్నేహితులు అడిగారని ఇంటి నుంచే ఫుడ్ బిజినెస్‌ను మొదలుపెట్టారు. దీనినే ఉపాధిగా మలుచుకొని ఉద్యోగులకు, ఫంక్షన్లకు ఆర్డర్ల మీద వంటలు చేస్తున్నారు. అంతటితో ఆగిపోకుండా మాల్స్, కైట్ ఫెస్టివల్, లిటరరీ ఫెస్టివల్స్ అంటూ నగరంలో జరిగే కార్యక్రమాల్లో ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేస్తూ ఇంటి వంటను రుచిగా అందిస్తున్నారు. ‘వంట చేయడం అంటే ఇష్టం, చేసిన వంటను నలుగురు మెచ్చుకుంటూ తింటూ ఉంటే మనసుకు చాలా ఆనందం కలుగుతుంది’ అంటారు జరీనా. రెండు వందల మందికైనా టిఫిన్లు, భోజనాలను సిద్ధం చేసే పనిలో రోజంతా తీరికలేకుండా ఉంటారామె. (కొరమీను, నాటు కోడి, రొయ్య, మటన్ ఖీమా.. ఈ పచ్చళ్లు టేస్ట్ చేశారా) ఆరుగురు కోడళ్లలో ఒకరిగా.. యాభై నాలుగేళ్ల తన జీవితం గురించి ప్రస్తావిస్తూ ‘‘ముప్పై ఏళ్లుగా వంటలోనే మమేకం అయి ఉన్నాను. పుట్టింట్లో ఉన్నప్పుడు వంటలో అసలు ఓనమాలు కూడా తెలియవు. అత్తింటిలో అడుగుపెట్టాకే వంట నేర్చుకున్నాను. ఆరుగురు కోడళ్లలో రెండవకోడలిని. అందరం కలిసి పనులు చేసుకుంటూ ఉండేవాళ్లం. నా చేతి వంట బాగుంటుందని మా అత్తగారు గొప్పగా చెబుతుండేవారు. ఇంటిల్లిపాది మెచ్చుకుంటుంటే ఎంతో సంతోషంగా ఉండేది. మా కుటుంబసభ్యులు అందరు కలిస్తేనే రెండు వందల మంది అయ్యేవారు. పిల్లలు కాలేజీలకు వచ్చే సమయానికి వేరు కాపురాలు అయిపోయాయి. పిల్లలకు లంచ్ బాక్సులు కట్టి ఇస్తే, వాటిని వాళ్ల స్నేహితులు తిని తెగ మెచ్చుకునేవారట. వారి కోసం కూడా స్వయంగా బాక్సులు కట్టి పంపేదాన్ని. (చికెన్- పాలకూర ఫ్రిట్టర్స్ ఎలా తయారు చేయాలో తెలుసా?) ఇదే విధానం వాళ్లు ఉద్యోగాల్లోకి వచ్చాక కూడా కొనసాగింది. పిల్లలు, వారి స్నేహితులు అడిగారు కదా కొన్ని కొన్ని ఫుడ్ ఐటమ్స్ చేసి ఇచ్చేదాన్ని. ఆర్డర్లు పెరుగుతుండటంతో దీనినే ఫుల్‌టైమ్ జాబ్‌గా ఎంచుకున్నాను. ఉద్యోగుల కోసం టిఫిన్లు, లంచ్ బాక్సులు, చిన్న చిన్న పార్టీలకు ఆర్డర్స్ మీద వెజ్, నాన్‌వెజ్ వంటకాలను అందిస్తూ వచ్చాను. నోటి మాటగానే చాలా మందికి తెలిసిపోయింది. మా ఏరియా నుంచే కాకుండా నగరంలో మిగతా చోట్ల నుంచి కూడా ఫుడ్ ఆర్డర్లు వస్తాయి. హోమ్మేడ్ హలీమ్‌తో పాటు బిర్యానీ, ఇతర మాంసాహార వంటకాలు, ఖద్దూకా ఖీర్.. వంటి అన్ని రకాల స్వీట్ల తయారీ ఉంటుంది. నా వంట ద్వారా నేను ఉపాధి పొందడమే కాదు, దీని ద్వారా మరో ఆరుగురికి ఉపాధి కల్పిస్తున్నందుకు తృప్తిగానూ ఉంటుంది. ఉచితంగా ఆహారం ఇప్పుడు పిల్లలు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఆర్థిక అవసరం ఏమీ లేదు. పిల్లలు ఇప్పుడు కూర్చో, ఎందుకు కష్టపడతావు అంటారు. కానీ, రుచికరమైన ఆహారాన్ని తయారుచేయడంపై ఉన్న ఇష్టమే ఇంకా ఈ బిజినెస్‌లో కొనసాగేలా చేస్తోంది. రోజులో ఎక్కువ గంటలు నిల్చొనే పనులు చేయడం వల్ల కాలు నొప్పి సమస్య వచ్చిందని, ఇంట్లో ఈ పనిని వదిలేయమంటారు. కానీ, మనసు ఒప్పుకోదు. నేను వంటలు చేస్తాను అని మా చుట్టుపక్కల వారికి తెలుసు కాబట్టి, పేదవాళ్లు ఎవరైనా వచ్చి భోజనం అడుగుతారు. నేనీ పని ఆపేస్తే వారికి ఎలా సాయం చేయగలను. దీని ద్వారా రోజులో కొంతమంది పేదవారికైనా నా చేతులతో వండిన ఇంటి భోజనాన్ని అందిస్తాను కదా అనిపిస్తుంది. స్వయంగా సిద్ధం వంటకు రుచి రావాలంటే అందులో వాడే మసాలా దినుసుల వాడకం ముఖ్యం. సన్నని మంట మీద సువాసన వచ్చేలా వేయించిన మసాలా దినుసులను ఏ రోజుకు ఆ రోజు నేనే స్వయంగా తయారుచేసుకుంటాను. వంటకాలలో మిక్సీ వాడకం అంటూ ఉండదు’ అని చెప్పే జరీనా కరోనా పాజిటివ్ వచ్చినవారు కోరితే అన్ని రోజులూ ఉచితంగా ఫుడ్ డెలివరీ చేశారు. ‘చేసిన సాయం చెప్పుకుంటే దేవుడు హర్షించడు, నాకు ఆ శక్తిని ఇచ్చినందుకు వారికే నేను కృతజ్ఞతలు చెప్పుకుంటాను’ అంటారామె. – నిర్మలారెడ్డి -
హలీమ్.. వియ్ వాంట్ యూ..
హలీమ్...రంజాన్ సీజన్లో నగరవాసులను మురిపించే వంటకం. లాక్డౌన్ కారణంగా ఈ ఏడాది దీన్ని మిస్సవుతున్నామని చాలా మంది ఫీలవుతున్నారు. కొందరు డైహార్డ్ హలీమ్ ఫ్యాన్స్ మాత్రం మిస్సయ్యే ఛాన్సే లేదంటూ కొత్తదారులు వెతుక్కుంటున్నారు. హోమ్ చెఫ్స్‌ను సంప్రదిస్తూ హోమ్ మేడ్ హలీంను రుచి చూస్తున్నారు. ఆన్‌లైన్‌లోనూ కొందరు హలీమ్‌ను విక్రయిస్తున్నారు. – సాక్షి, సిటీబ్యూరో సాక్షి, హైదరాబాద్ : అరబ్ పర్షియన్ ప్రాంత మూలాలున్న వంటకమైనప్పటికీ స్థానిక ముడిదినుసులు, సుగంధ ద్రవ్యాలతో హైదరాబాదీ హలీమ్ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. దేశంలోనే జియోగ్రాఫిక్ ఇండికేషన్(జిఐ) సర్టిఫికెట్ అందుకున్న తొలి మాంసాహార వంటకం హైదరాబాద్ హలీమ్. దేశవిదేశాలకు సైతం హలీమ్ ఎగుమతులు చేస్తున్న మన నగరంలో 50ఏళ్లుగా హలీమ్ లభించని తొలి ఏడాది ఇదే. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది హలీమ్ తయారు చేయబోమని ది హైదరాబాద్ హలీమ్ మేకర్స్ అసోసియేషన్(హెచ్హెచ్ఎమ్ఏ), ట్విన్ సిటీస్ హోటల్ ఓనర్స్ అసోసియేషన్లు ప్రకటించాయి. హలీమ్‌ను అందించే దాదాపు 6వేల రెస్టారెంట్స్, ఫుడ్ జాయింట్స్ ఇవన్నీ కలిపి ఈ ఏడాది రూ.500 కోట్ల విలువైన హలీమ్ విక్రయాలను కోల్పోయినట్టు అంచనా. (లాక్డౌన్: తీవ్ర నిరాశలో హలీమ్ ప్రియులు) రంజాన్ పండుగ గురించి ముస్లిం సమాజం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో ఆ సమయంలో మాత్రమే అందుబాటులోకి వచ్చే హలీమ్ గురించి హైదరాబాద్ మొత్తం అంతే ఆసక్తిగా ఎదురు చూస్తుంది. ఏడాదికి ఒకే ఒక్కసారి తమను పలకరించి జిహ్వలను పులకరింపజేసే హలీమ్ కోసం ఏడాది మొత్తం వెయిట్ చేసే ఫుడ్ లవర్స్ ఆశలపై ఈ సారి కరోనా నీళ్లు చల్లింది. మొత్తం మీద పండుగ ముగిసే సమయంలో ఫుడ్ డోర్ డెలివరీకి ఆదివారం కేంద్ర ప్రభుత్వం ఓకే చెప్పడంతో హలీమ్ ఫ్యాన్స్‌కు ఊపొచ్చింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఏం నిర్ణయిస్తుందో వేచి చూడాలి. అంతమాత్రాన సిటిజనులు పూర్తిగా హలీమ్‌కు దూరంగా లేరని సమాచారం. లాక్‌డవున్ టైమ్‌లో హలీమ్ హంటర్స్ ఏం చేశారు? ఓ రౌండప్.. – సాక్షి, సిటీబ్యూరో హోమ్ చెఫ్స్.. హలీమ్ రెడీ.. మరోవైపు ఎలాగైనా హలీమ్ తినాల్సిందే అన్నట్టు ఆరాటం చూపే వారి కోసం నగరంలో కొందరు హలీమ్ తయారీదార్లు, హోమ్చెఫ్స్ విక్రయాలు జరుపుతున్నట్లు సమాచారం. బంజారాహిల్స్‌కు చెందిన ఓ హోమ్చెఫ్ ఈ నెల 15 నుంచి హలీమ్ విక్రయించడానికి నిర్ణయించగా, పెద్ద సంఖ్యలో ఆర్డర్లు వచ్చాయని రోజుకు కనీసం 30 ఆర్డర్లు సర్వ్ చేస్తున్నామన్నారు. సికింద్రాబాద్ వరకూ డెలివరీ చేస్తున్నట్టు తెలిపారు. వీరిలో కొందరు అదనపు ఛార్జీలతో డోర్ డెలివరీ చేస్తుండగా మరికొందరు కస్టమర్లే వచ్చి తీసుకెళ్లాలని కోరుతున్నారు. కాస్త పేరున్న వారి దగ్గర కొనాలంటే ఒక హలీమ్ రూ.300.. అదే ఫ్యామిలీ ప్యాక్ అయితే రూ.1000 ధర పలుకుతున్నట్టు తెలుస్తోంది. అలాగే హైటెక్ సిటీ ప్రాంతంలో ఉన్న ఓ చిన్న ఫుడ్ జాయింట్ కొన్ని రోజులుగా హలీమ్ తయారు చేసి 3 కి.మీ పరిధిలో అందిస్తోంది. రోజుకు 40 కిలోల దాకా మటన్ హలీమ్‌ను విక్రయిస్తున్నట్టు సమాచారం. (మోదీపై విషంకక్కిన అఫ్రిది: పెను దుమారం) మార్కెట్ ఉండాలే గానీ మార్గాలనేకం.. కొందరు ఇన్‌స్ట్రాగామ్ అకౌంట్స్ ద్వారా కస్టమర్లకు చేరువవుతుంటే చాలామంది మౌత్ టాక్ ద్వారానే బిజినెస్ చేస్తున్నారు. కొన్ని రోజులుగా హలీమ్ విక్రయిస్తున్న టోలీచౌకికి చెందిన మహిళా చెఫ్ తాను నగదు చెల్లింపులను అంగీకరించడం లేదన్నారు. అపరిచితులు తనకు వేరే మార్గాల ద్వారా ముందస్తు చెల్లింపు చేస్తేనే సరుకు అందిస్తామన్నారు. కొన్ని హోటళ్లు బాహాటంగానే తమ ట్విట్టర్ అకౌంట్ ద్వారా ప్రచారం చేస్తూ హలీమ్‌ను అందిస్తున్నాయి. పైగా తమకు ఎస్సెన్షియల్ సర్వీసెస్ పాస్ ఉందంటోంది. అయితే వంటకాలు తయారు చేసి విక్రయాలు జరపడం చట్టవ్యతిరేకమని తాజాగా హలీమ్ విక్రయించిన కేసులో నిందితులను అదుపులోకి తీసుకున్న మొఘల్‌పురా పోలీసులు స్పష్టం చేశారు. మరోవైపు ఎక్కడ పడితే అక్కడ హలీమ్ కొనడం ప్రమాదకరమని నగరానికి చెందిన పిస్తాహౌజ్ ప్రతినిధులు హెచ్చరిస్తున్నారు. నగరంలో అత్యధిక కేసులు నమోదైన జియాగూడ నుంచే వీరిలో ఎక్కువ మంది జంతు మాంసం కొనుగోలు చేస్తున్నారని అంటున్నారు. (తల్లికి కరోనా.. ఐసోలేషన్లోకి నటుడు ) ఇల్లే పదిలం.. ఈ నేపథ్యంలో పలువురు హలీమ్ ప్రియులు ఇంట్లోనే హలీమ్‌ను తయారు చేసుకుంటూ ఆస్వాదిస్తున్నారు. ‘ఏటేటా హలీమ్‌ను మిస్సవ్వకుండా టేస్ట్ చేసేవాళ్లం. అయితే ఈ ఏడాది కుదరకపోవడంతో ఇంట్లోనే తయారు చేసుకున్నాం. చాలా బాగా కుదిరింది’ అని చెప్పారు నగరానికి చెందిన రాజేశ్వరి కరణమ్. హలీమ్ పట్ల ఇంట్లో ఉండే మగవారి ఇష్టం తెలిసున్న కొందరు మహిళలు కష్టపడి నేర్చుకుని మరీ అందిస్తున్నారు. ‘మా అమ్మాయి ఈ ఏడాది నా కోసం మటన్ హలీమ్ చేసి పెట్టింది చాలా అద్భుతంగా అనిపించింది’ అంటూ యూసఫ్‌గూడలో నివసించే రాంబాబు వర్మ ఆనందం వ్యక్తం చేశారు. తనకెంతో ఇష్టమైన హలీమ్‌ని ఈ సారి మిస్ అవకూడదని కష్టపడి యూట్యూబ్‌లో చూసి నేర్చుకున్నానని, తాను చేసిన చికెన్ హలీమ్‌ని ఇంటిల్లిపాదీ ఆస్వాదించారని చందానగర్ వాసి డేనియల్ అంటున్నాడు. -
అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ధనుర్మాసంలో వచ్చే పండగల్లో భోగి.. మకర సంక్రాంతి.. కనుమ పండగలు సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక. అందుకే ఈ పండగలకు అంత ప్రాముఖ్యత. దూరాన ఉన్న కొడుకులు.. కోడళ్లు.. అల్లుళ్లు.. మనమలు, మనవరాళ్లు.. అంతా కలసి చేసుకునే పండగ. మూడు రోజుల పాటు జరిగిన సంబరాలు అంబరాన్నంటాయి. ఆవుపేడ అలికిన వాకిళ్లు .. రంగు రంగుల ముగ్గులు.. మధ్యలో గొబ్బెమ్మలు.. ఇంటి ముంగిట మామిడాకుల తోరణాలు.. గంగిరెద్దుల విన్యాసాలు.. హరిదాసుల భజనలు. ఇంట్లో పిండ వంటల ఘుమఘుమలు.. పతంగులు.. కబడ్డీ.. ముగ్గులు.. ఎద్దులు.. కోళ్ల పందేలు పోటీలు. కొత్తబట్టలతో పండక్కి వచ్చిన చుట్టాలతో ఇల్లంతా సందడి.. సందడిగా సంక్రాంతి పండగ జరుపుకున్నారు. ముఖ్యంగా కొత్త అల్లుళ్లకు రాచమర్యాదలు.. అప్యాయతానురాగాల మధ్య పండగ అంబరాన్నింటింది. గురువారం సంక్రాంతి రోజున పల్లెల్లో మహిళలు ప్రత్యేకంగా మట్టిపాత్రలో పాలతో పొంగళ్లుపెట్టి.. కొత్తబట్టలతో పెద్దలకు నైవేద్యంగా సమర్పించుకున్నారు. అందులో భాగంగా నెల్లూరులోని బోడిగాడి తోటలో నగరవాసులు పెద్ద ఎత్తున పాల్గొని పూర్వీకుల సమాధుల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి తర్పణం వదలటం కనిపించింది. జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి పండగను సంప్రదాయబద్ధంగా చేసుకున్నారు. మూడవరోజైన శుక్రవారం కనుమ పండగ సందర్భంగా జిల్లా వ్యాప్తంగా పశువులకు పూజలు నిర్వహించారు. నెల్లూరులో గురువారం రాత్రి శ్రీతిక్కన మహాకవి లలితకళాపీఠం ఆధ్వర్యంలో శ్రీరాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో మకరసంక్రాంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కళాపీఠం వ్యవస్థాపకులు ఆలూరు శిరోమణిశర్మ ఆధ్వర్యంలో కవిసమ్మేళనం, సంగీత కార్యక్రమాలతో ఆహూతులను అలరింపజేశారు. కనుమ పండగ రోజైన శుక్రవారం జిల్లా వ్యాప్తంగా పశువులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. మర్రిపాడు మండలంలోని బ్రాహ్మణపల్లిలో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి బంధుమిత్రుల మధ్య సంక్రాంతి పండగను ఘనంగా జరుపుకున్నారు. నెల్లూరులో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ ఇస్కాన్ మందిరం ప్రాంగణంలో నిర్వహించిన గోపూజోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న 15 గోశాలలోనూ ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. కనుమ పండగ సందర్భంగా కావలిలోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో కనులపండువగా గోదాదేవి, రంగనాథస్వామి కల్యాణం జరిగింది. కావలి ఇలవేల్పు శ్రీకళుగోళశాంభవి దేవి అమ్మవారి గ్రామోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా గురువారం అర్ధరాత్రి నుంచి అమ్మవారి ఆలయం నుంచి ప్రారంభమైన గ్రామోత్సవం శుక్రవారం రాత్రి వరకు పురవీధులలో ఊరేగారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని దీవెనలు అందుకున్నారు. సంగంలో కొండతిరుగుడు ఉత్సవాలు వేడుకగా నిర్వహించారు. వెంకటగిరిలో శుక్రవారం గొబ్బెమ్మ నిమజ్జనం వేడుకగా నిర్వహించారు. స్థానిక కాశీతోట ప్రాంతంలోని కైవల్యానదితీరంలో మహిళలు గొబ్బిపాటలు, ఆటలు, వనభోజనాలతో సందడి చేశారు. అనంతరం గొబ్బెమ్మ( గౌరమ్మ)ను నిమజ్జనం చేశారు. వెంకటగిరి పట్టణం కుమ్మరిగుంట సాయిబాబా ఆశ్రమం ఆధ్వర్యంలో కుమ్మరిగుంట పుష్కరిణిలో సాయిబాబా తెప్పోత్సవం కనుల పండువగా సాగింది. వెంకటగిరి, డక్కిలి, బాలాయపల్లి మండలాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. పెంచలయ్యకోనలో కనుమ పండగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కనుల పండువగా తెప్పోత్సవం... నెల్లూరు నవాబుపేట మైపాడుగేట్వద్ద జాఫర్సాహెబ్కెనాల్లో శుక్రవారం రాత్రి శ్రీభ్రమరాంబసమేత శ్రీమల్లేశ్వరస్వామివారి కనుమ తెప్పోత్సవం కనుల పండువగా సాగింది. సంప్రదాయంలో భాగంగా నగర పరిసరాల్లో కొలువైన దేవతలు దేవేరులతో కలసి నవలాకులతోట ప్రాంతానికి కల్యాణమహోత్సవం అనంతరం వనవిహారానికి మేళతాళాలతో సర్వాలంకారశోభితులుగా విచ్చేసి విహరించారు.