mpv
-
లక్షల విలువ చేసే కారులో 'హోమ్ మేడ్ ఫుడ్' బిజినెస్.. వీడియో వైరల్
కరోనా వైరస్ విజృంభించిన తరువాత భారతదేశంలో చాలా మందికి ఉద్యోగాలు పోయాయి. దీంతో కొందరు డబ్బు సంపాదించడానికి మార్గాలు వెతుక్కునే క్రమంలో కొత్త ఆలోచనలకు రూపం పోశారు. గతంలో కొందరు ఖరీదైన కార్లలో కూరగాయలు విక్రయించడం, టీ విక్రయించడానికి సంబంధించిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. తాజాగా మరో సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఢిల్లీకి చెందిన వ్యక్తి తన కొత్త కియా కారెన్స్ కారులో ఫుడ్ విక్రయించాడు. దీనికి సంబంధించిన వీడియో హర్సిమ్రాన్ సింగ్ తన ఇన్స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. ఈ వీడియోలో గమనించినట్లతే ఒక వ్యక్తి తన కియా కారెన్స్ (Kia Carens) కారులో ఆహారం విక్రయిస్తుండం చూడవచ్చు. కియా కారు బూట్ స్పేస్‌లో హోమ్ మేడ్ ఫుడ్ విక్రయిస్తున్నాడు. ఆ ఫుడ్ మొత్తం తన భార్య తయారు చేసి ఇచ్చినట్లు సమాచారం. అయితే ఈ సంఘటన ఢిల్లీలో ఎక్కడనేది తెలియాల్సి ఉంది. ఖరీదైన కారులో ఆహారం విక్రయించడం వెనుక ఉన్న అసలు కథ కూడా స్పష్టంగా తెలియదు. ఇదీ చదవండి: ఇషా అంబానీ రైట్ హ్యాండ్ ఇతడే.. జీతం లక్షల్లో కాదు కోట్లల్లోనే.. కియా కారెన్స్ ప్రారంభ ధర రూ. 10.45 లక్షలు, కాగా.. టాప్ వేరియంట్ ధర రూ. 19.45 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ కారు ఏకంగా 23 వేరియంట్లలో మార్కెట్లో అందుబాటులో ఉంది. కారెన్స్ MPV పటిష్టమైన సేఫ్టీ ఫీచర్స్ కూడా కలిగి ఉండటం వల్ల ఎక్కువమంది ఎగబడి కొనుగోలు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Harsimran Singh (@therealharryuppal) -
కొత్త సేఫ్టీ ఫీచర్లు, షాకింగ్ ధర: 2023 టయోటా వెల్ఫైర్
New Toyota Vellfire టయోటా ఇండియా తదుపరి తరం వెల్ఫైర్ ఎంపీవీ లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 1.19 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా నిర్ణయించింది. ఇది హై గ్రేడ్, VIP గ్రేడ్ అనే రెండు వేరియంట్లలో లభ్యమవుతుంది. ఎక్స్టీరియర్ స్టైలింగ్, మూడు ఇంటీరియర్ థీమ్‌లతో పాటు మూడు బాహ్య రంగులను పొందుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో వస్తుందని భావిస్తున్న వెల్‌ఫైర్‌ను ఊహించిన దానికంటే ముందుగానే ప్రారంభించింది. ధరలు హాయ్ గ్రేడ్ రూ. 1.20 కోట్లు, ఎగ్జిక్యూటివ్ లాంజ్ ప్యాకేజీతో VIP గ్రేడ్ రూ. 1.30 కోట్లుగా ఉండనుంది. వెల్ఫైర్ ఇంజన్: 2.5-లీటర్ 4 సిలిండర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్, 190bhp , 240Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది 19.28kpl మైలేజీ ఇస్తుందని టయోటా పేర్కొంది.వెల్ఫైర్ కొత్త TNGA-K ప్లాట్‌ఫారమ్ ద్వారా మద్దతునిస్తుంది 2023 వెల్ఫైర్ ఇంటీరియర్ అప్డేట్ క్యాబిన్ సన్‌సెట్ బ్రౌన్, బ్లాక్ , న్యూట్రల్ లేత గోధుమరంగు థీమ్‌లలో ఉంటుంది. డ్యాష్‌బోర్డ్ ఇప్పుడు Apple CarPlay మరియు Android Autoతో పాటు JBL నుండి 15-స్పీకర్ సౌండ్ సిస్టమ్‌తో పెద్ద 14-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ జోడించిది. రెండవ-వరుస లాంజ్ సీట్లు మసాజ్ సీట్లు, పవర్డ్ పుల్-డౌన్ సైడ్ సన్ బ్లైండ్లు అమర్చింది. కొత్త టయోటా వెల్ఫైర్ డిజైన్ విషయానికి వస్తే అవుట్గోయింగ్ మోడల్‌తో పోలిస్తే కొత్త వెల్ఫైర్ డిజైన్ పెద్దగా మారలేదు. టయోటా లోగో స్ప్లిట్ హెడ్‌ల్యాంప్, సిక్స్-స్లాట్ గ్రిల్ మధ్యలో ఉంటుంది.హెడ్‌ల్యాంప్‌ల దిగువ భాగంలో LED డేటైమ్ రన్నింగ్ ల్యాంప్‌లు ఉంటాయి. U-ఆకారపు క్రోమ్ స్ట్రిప్ రెండు హెడ్‌ల్యాంప్‌లను కలుపుతూ బంపర్ ఉంటుంది. మిడ్-లైఫ్ అప్డేట్గా క్రోమ్ , స్లీకర్ LED హెడ్‌ల్యాంప్‌లతో కూడిన పెద్ద ఫ్రంట్ గ్రిల్ అమర్చింది. స్లైడింగ్ రియర్ పవర్ డోర్లు , ఫ్లాట్ రూఫ్లైన్లో ఎలాంటి మార్పు లేదు, 2023 వెల్ఫైర్ సేఫ్టీ ఫీచర్లు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా , హిల్-అసిస్ట్ కంట్రోల్‌తో పాటు, వెల్ఫైర్ లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ మానిటర్ , హై బీమ్ అసిస్ట్ వంటి ADAS ఫీచర్లనులాంటివి కొత్త అప్‌డేట్స్‌గా ఉన్నాయి. ముందస్తు బుకింగ్‌లను కంపెనీ ఇప్పటికే షురూ చేసింది. రపండుగ సీజన్లో భారతదేశంలో వాహన డెలివరీలు ప్రారంభమవుతాయని ప్రకటించింది. దేవీయ మార్కెట్లో దీని పోటీ గురించి ఆలోచిస్తే కొత్త Lexus LM లాంచ్ అయ్యేవరకు వెల్ఫైర్కి భారత మార్కెట్లో ఎలాంటి పోటీ ఉండదు. -
జూలై 5న విడుదలకానున్న కొత్త కారు ఇదే - మారుతి సుజుకి
రోజు రోజుకి దేశీయ మార్కెట్లో విడుదలవుతున్న కొత్త వాహనాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇటీవల జిమ్నీ ఆఫ్-రోడర్ విడుదల చేసిన మారుతి సుజుకి వచ్చే నెలలో మరో MPV విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. మారుతి సుజుకి 2023 జులై 05న విడుదల చేయనున్న సరికొత్త ఎంపివి పేరు 'ఎంగేజ్' (Engage). ఇది ఇప్పటికే ప్రజాదరణ పొందుతున్న టయోటా ఇన్నోవా హైక్రాస్ మాదిరిగానే తప్పకుండా మంచి అమ్మకాలు పొందే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇది జులై చివరి నాటికి నెక్సా డీలర్‌షిప్‌ల ద్వారా అమ్మకానికి రానున్నట్లు సమాచారం. మారుతి సుజుకి విడుదల చేయనున్న ఎంగేజ్ భిన్నమైన డిజైన్ కలిగి చూడగానే ఆకర్శించే విధంగా ఉంటుంది. ఈ ఎంపివి ముందు భాగంలో హానీ కూంబ్ మెష్ గ్రిల్, గ్రిల్ మధ్యలో క్రోమ్ బార్లు, ఇరువైపులా హెడ్‌ల్యాంప్‌లు ఉండనున్నాయి. ఫ్రంట్ బంపర్ ట్వీక్ చేసిన విధంగా కనిపిస్తుంది, స్కిడ్ ప్లేట్ మాదిరిగా కనిపించేలా చేయడానికి ఫాక్స్ బ్రష్డ్ అల్యూమినియం ఫినిషింగ్ పొందుతుంది. కంపెనీ దీనికి సంబంధించిన చాలా వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. (ఇదీ చదవండి: రూ. 77712 వద్ద హోండా డియో హెచ్-స్మార్ట్ - పూర్తి వివరాలు) మారుతి సుజుకి కొత్త ఎంపివి TNGA-C ఆర్కిటెక్చర్ ఆధారంగా తయారవుతుంది. కావున ఇన్నోవా హైక్రాస్లో కనిపించే న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ అండ్ స్ట్రాంగ్-హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్లు ఇందులో ఉండే అవకాశం ఉంటుంది. పర్ఫామెన్స్ కూడా ఉత్తమంగా ఉంటుందని భావిస్తున్నాము. (ఇదీ చదవండి: పిట్ట కొంచెం.. కూత ఘనం అంటే ఇదేనేమో - 19 ఏళ్లకే కోట్లు విలువైన కంపెనీ) నిజానికి 2017 లో టయోటా & మారుతి సుజుకి మధ్య సత్సంబంధం ఏర్పడినప్పటి నుంచి బాలెనొ, అర్బన్ క్రూయిజర్, గ్లాంజా వంటి ఉత్పత్తులు పుట్టుకొచ్చాయి. కావున ఇప్పుడు రానున్న ఈ ఎంపివి కూడా రెండు కంపెనీల కలయికతో రీబ్యాడ్జ్ చేసిన టయోటా ఉత్పత్తి అవుతుందని భావిస్తున్నారు. మారుతి సుజుకి కొత్త ఎంపివి గురించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి. -
బడ్జెట్ ధరలో ‘రెనాల్ట్ ట్రైబర్’ వచ్చేసింది
ఫ్రెంచ్ ఆటో దిగ్గజం రెనాల్ట్ మొట్టమొదటి మల్టీపర్పస్ వెహికల్ (ఎంపివి)ని లాంచ్ చేసింది. రెనాల్ట్ ట్రైబర్ పేరుతో దీన్ని భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. రెనాల్ట్ క్విడ్ తరువాత రెండవ మోడల్‌గా దీన్ని తీసుకొచ్చింది. భారత్‌లో ఎక్స్ షోరూం ధర బేసిక్ మోడల్ ధర రూ.4.95 -టాప్ ఎండ్ వేరియంట్ ధర 6.49 లక్షలుగా ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఏడు సీట్లతో అందుబాటులోకి వచ్చిన రెనాల్ట్ ట్రైబర్‌ను నాలుగు వేరియంట్లలో ఆవిష్కరించింది. రెనాల్ట్ ట్రైబర్ నాలుగు వేరియంట్లు-ధరలు ఆర్ఎక్స్ఈ ధర రూ.4.95 లక్షలు ఆర్ఎక్స్ఎల్ ధర రూ.5.49 లక్షలు ఆర్ఎక్స్టీ ధర రూ.5.99 లక్షలు ఆర్ఎక్స్జెడ్ ధర 6.49 లక్షలు ఇక ఫీచర్ల విషయానికి వస్తే 1.0 లీటర్, 3 సిలిండర్ పెట్రోలక్ష ఇంజీన్, 5 స్పీడ్ మాన్యుల్ ట్రాన్స్మిషన్, 72 పవర్, 96 గరిష్ట్ టార్క్, నాలుగుఎయిర్బ్యాగ్స్, సులువుగా సీట్ల ఎరేంజ్మెంట్, 8 అంగుళాల మల్టీ మీడియా టచ్ స్క్రీన్ ప్రధానంగా ఉన్నాయి. 625 లీటర్ల బూట్ స్పేస్ సదుపాయం ఉండగా.. 6 సీట్ల కారులో 320 లీటర్ల బూట్ స్పేస్, 7 సీట్ల కారులో 84 లీటర్ల స్పేస్ ఉండనుంది. క్యాబిన్ స్టోరేజీ 31 లీటర్ల వరకు ఉండనుంది. డస్టర్, క్యాప్చర్ లాంటి ఎస్‌యూవీలలో అందిస్తున్న ఫీచర్లను ఎంపీవీ ట్రైబర్‌లో జోడించామని రెనాల్ట్ సీఎండీ వెంకటరాం తెలిపారు. రానున్న మూడేళ్లలో ఇండియాలో రెండు లక్షల కార్లను అమ్మాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. కాగా రెనాల్ట్ ట్రైబర్ కారు టయోటా ఇన్నోవా, మారుతి ఎర్టిగా కు సరిపోలిన ఫీచర్లతో, వాటి ధరతో పోలిస్తే తక్కువ ధరలో అందుబాటులో గట్టి పోటీ ఇవ్వనుందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. -
మారుతీ ‘ఎక్స్ఎల్ 6’ ఎంపీవీ
న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ ఇండియా(ఎంఎస్ఐ).. తన అధునాతన మల్టీ పర్పస్ వెహికిల్ (ఎంపీవీ)ని బుధవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ‘ఎక్స్ఎల్ 6’ పేరిట విడుదలైన ఈ కారు ధరల శ్రేణి రూ. 9.79 లక్షలు–11.46 లక్షలు (ఎక్స్‌షోరూం)గా ప్రకటించింది. ప్రోగ్రెసివ్ స్మార్ట్ హైబ్రిడ్ సిస్టమ్, లిథియం–అయాన్ బ్యాటరీ కలిగి.. 1.5 లీటర్ల పెట్రోల్ ఇంజిన్‌తో అందుబాటులోకి వచ్చింది. ఫైవ్ స్పీడ్ మాన్యువల్, 4–స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్లు ఈ కొత్త ఎంపీవీలో ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఉన్న నెక్సా ప్రీమియం రిటైల్ చైన్ల ద్వారా ఈ వాహనాన్ని కొనుగోలుచేయవచ్చని కంపెనీ వివరించింది. ఈ నూతన కారు విడుదలతో.. బీఎస్–6 ప్రమాణాలకు అనుగుణంగా మారుతీ నుంచి విడుదలైన మొత్తం కార్ల సంఖ్య ఏడుకు చేరింది. -
రూ.11వేలతో రెనాల్ట్ ట్రైబర్ బుకింగ్స్
సాక్షి, ముంబై: ప్రముఖ కార్ల తయారీ దారు రెనాల్ట్ తన అప్‌కమింగ్ కారు బుకింగ్‌లను ప్రారంభించింది. కాంపాక్ట్ ఎంపీవీ క్రాస్ఓవర్, ట్రైబర్ అధికారిక బుకింగ్‌లను ఆగస్టు 17నుంచి ప్రారంభిస్తామని రెనాల్ట్ ప్రకటించింది. రెనాల్ట్ వెబ్సైట్, లేదా దగ్గరిలోని బ్రాండ్ డీలర్ ద్వారా కేవలం 11,000 రూపాయలు చెల్లించి ప్రీ బుక్ చేసుకోవచ్చని తెలిపింది.ఈ కార్ ధరలు సుమారు రూ. 5 - రూ. 7 లక్షల మధ్యన ఉంటుందని అంచనా. ఆగస్టు 28 న రెనాల్ట్ ట్రైబర్ లాంచ్ కానుంది. రెనాల్ట్ ట్రైబర్ ఫీచర్లు 1.0-లీటర్, 3-సిలిండర్ పెట్రోల్ యూనిట్, డ్యూయల్ టోన్ డాష్ బోర్డ్, ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్, ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ తదితర ఫీచర్లతో ఇది లాంచ్ కానుంది. 72 బిహెచ్పీ పవర్, 96 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ , 5-స్పీడ్ ఆటోమేటెడ్ మ్యాన్యువల్ ట్రాన్స్ మిషన్ అప్షన్స్లలో రానుంది. ట్రైబర్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడి డ్రిల్స్, రూఫ్ స్పోర్టివ్ లుక్‌తో వస్తున్న ఈ కారులో మూడో వరుసలో ఉన్న సీట్లను అవసరం లేకపోతే.. పూర్తిగా తొలగించుకునే అవకాశం కల్పించింది. మారుతి స్విఫ్ట్, ఫోర్డ్ ఫిగో, ఫ్రీస్టైల్, హ్యుందాయ్ గ్రాండ్ ఐ 10 నియోస్ లాంటి వాటికి రెనాల్ట్ ట్రైబర్ గట్టి పోటీ ఇవ్వనుందని భావిస్తున్నారు. భద్రతా ఫీచర్ల విషయానికొస్తే, రెనాల్ట్ ట్రైబర్ లో 4 ఎయిర్ బ్యాగులు, ఎబిఎస్, ట్విన్ ఎయిర్ బ్యాగులు, స్పీడ్ అలర్ట్ లు, సీట్ బెల్ట్ రిమైండర్, రివర్స్ పార్కింగ్ కెమెరాను జోడించింది. -
సీఆర్పీఎఫ్ ఇక మరింత బలోపేతం
న్యూఢిల్లీ: కశ్మీర్ లోయలో జవాన్ల భద్రతా చర్యల్లో భాగంగా కీలక ముందడుగు పడింది. వారి భద్రత కోసం మందుపాతర రక్షిత వాహనాలను (ఎమ్‌పీవీ), 30 సీటర్ బస్సులను సమకూర్చనున్నట్లు భద్రతా దళాధికారి ఒకరు తెలిపారు. అలాగే కశ్మీర్ లోయలో ఉగ్రవాద నిర్మూలన, శాంతి భద్రతల విధులను నిర్వహిస్తున్న 65 బెటాలియన్లలో బాంబులను గుర్తించే, నిర్వీర్యం చేసే స్క్వాడ్ బృందాలను పెంచాలని కూడా పారామిలిటరీ నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి 14న పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై పేలుడు పరికరం ఉపయోగించి చేసిన బాంబు దాడిలో 40 మంది ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో సీఆర్పీఎఫ్లో ఈ మేరకు చర్యలు చేపట్టారు. ‘కశ్మీర్లో మాకున్న ప్రతికూలతల నివారణకు చర్యలు చేపడుతున్నాం. బుల్లెట్ ప్రూఫ్ బస్సులు, ఎక్కువ మొత్తంలో ఎమ్‌పీవీలను సేకరిస్తున్నాం. పెద్ద బస్సులకు భద్రత కష్టంగా ఉంటుంది. అందుకే 30 మంది మాత్రమే కూర్చోడానికి వీలుండే బస్సులను సమకూరుస్తున్నాం’అని సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్ ఆర్.ఆర్.భట్నాగర్ పేర్కొన్నారు. -
మహీంద్రా మరాజో ఎమ్‌పీవీ లాంచ్
మహీంద్రా అండ్ మహీంద్రా అధికారికంగా మరాజొ ఎమ్‌పీవీ వెహికల్‌ను సోమవారం లాంచ్ చేసింది. 2002 లాంచ్ మహీంద్రా స్కార్పియో లానే మరాజో వాహనం విడుదల కూడా కీలకమైన మైలురాయి అని కంపెనీ వ్యాఖ్యానించింది. ఉత్తర అమెరికాలోని డిట్రాయ్ సమీపంలోని టెక్నికల్ సెంటర్, చెన్నైలోని మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ భాగస్వామ్యంతో ఇంజీన్‌ను, ఇటాలియన్ డిజైన్ హౌస్ పినిఇన్ ఫెరీరా భాగస్వామ్యంతో మరాజొ డిజైన్‌ను రూపొందించినట్టు తెలిపింది. ఇండియా సహా అంతర్జాతీయ మార్కెట్లలో కూడా దీన్ని ప్రవేశపెడుతున్నట్లు మహీంద్రా వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఉన్న తమ డీలర్లు ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభించారని తెలిపింది. మహీంద్రా మరాజొ ఎమ్‌పీవీ 1.5 లీటర్ సామర్థ్యం గల ఎమ్‌ఫాల్కన్ డీజల్ ఇంజీన్, 6 స్పీడ్ మ్యాన్యువల్ లేదా ఆటోమేటిక్ గేర్‌బాక్స్ , 120బిహెచ్పి పవర్, 300ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మల్టిపుల్ ఎయిర్ బ్యాగులు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్, బ్రేక్ అసిస్ట్, ఐఎస్ఒఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్స్ , రివర్స్ పార్కింగ్ లాంటి ప్రధాన సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. ఇక ఇంటీరియర్‌లో ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో అప్లికేషన్లను సపోర్ట్ చేసే 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ , పియానో బ్లాక్ డ్యాష్‌బోర్డ్, బీజీ కలర్ ఇంటీరియర్ ఎలిమెంట్లు ఉన్నాయి. మొత్తం నాలుగు వేరియంట్లలో(ఎం2, ఎం4, ఎం6, ఎం8) మహీంద్రా మరాజొ ఎమ్‌పీవీని అందుబాటులోకి తెచ్చింది. వీటి ధరల శ్రేణి ఎం2 వేరియంట్ రూ. 9.99 లక్షల నుంచి ప్రారంభం. ఎం8 ధర రూ.13.90 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. మరాజొ అంటే స్పానిష్‌లో షార్క్ చేప రూపం అనే అర్థం వస్తుంది. దీనికి తగ్గట్టుగానే ఈ వాహనాన్నిడిజైన్ చేసింది. కాగా దేశీయ ఎమ్‌పీవీ సెగ్మెంట్లో టయోటా ఇన్నోవా క్రిస్టా, టాటా హెక్సా మోడళ్లకు మహీంద్రా మరాజొ ఎమ్‌పీవీ గట్టిపోటీ ఇవ్వనుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
హోండా మొబిలియో కధ కంచికి !
పనాజి(గోవా): జపాన్ కార్ల కంపెనీ హోండా తన మల్టీ పర్పస్ వెహికల్(ఎంపీవీ) మోబిలియో విక్రయాలను ఆపేసింది. ఈ కారుకు డిమాండ్ లేకపోవడం, కొత్త భద్రతా నియామాలకు అనుగుణంగా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని హోండా కార్స్ ఇండియా తెలిపింది. ఈ మోడల్లో కొత్త వేరియంట్‌ను తెచ్చేదీ లేనిదీ మరో రెండు నెలల్లో నిర్ణయిస్తామని కంపెనీ ప్రెసిడెంట్, సీఈఓ యోచిరో యునొ చెప్పారు. గత నెలలో ఒక్క కారును కూడా అమ్మలేకపోయామని పేర్కొన్నారు. ఈ ఏడాది నుంచి అమల్లోకి వచ్చే కొత్త భద్రతా నియమాలకనుగుణంగా ఈ కారు లేదని వివరించారు. ఈ కారును కొనసాగించాలంటే కొత్తగా తెచ్చే వేరియంట్ కోసం భారీగా పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుందని తెలిపారు. మరోవైపు మోబిలియోలో కొత్త వేరియంట్‌ను ఇప్పటికే ఇండోనేíసియాలో అందుబాటులోకి తెచ్చామని, దీన్ని భారత్‌లోకి తేవాలా, వద్దా అనేది మదింపు చేస్తున్నామని తెలిపారు. 2014, జూలైలో ఈ కారును భారత మార్కెట్లోకి తెచ్చామని, ఇప్పటిదాకా 40,789 కార్లను విక్రయించామని వివరించారు. ఈ కారు ధర రూ.6.49 లక్షలు–రూ.10.86 లక్షల (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)రేంజ్లో ఉంది. -
రెనో మల్టీపర్పస్ వెహికిల్.. లాడ్జి
న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌కు చెందిన రెనో కంపెనీ మల్టీ పర్పస్ వెహికల్(ఎంపీవీ) సెగ్మెంట్లోకి లాడ్జి కారుతో ప్రవేశించింది. భారత మార్కెట్లోకి ఎంపీవీ లాడ్జీని ఎనిమిది వేరియంట్లలో గురువారం రెనో కంపెనీ ప్రవేశపెట్టింది. ధరలు రూ.8.19 లక్షల నుంచి రూ.11.79 లక్షల రేంజ్లో ఉంటాయని రెనో ఇండియా కంట్రీ సీఈఓ, ఎండీ సుమిత్ సాహ్ని చెప్పారు. టయోటా ఇన్నోవా, మారుతీ ఎర్టిగ, హోండా మొబిలియో, జనరల్ మోటార్స్ ఎంజాయ్‌కు ఈ రెనో లాడ్జి గట్టి పోటీనిస్తుందని పరిశ్రమ వర్గాలంటున్నాయి.