New Toyota Vellfire టయోటా ఇండియా తదుపరి తరం వెల్‌ఫైర్ ఎంపీవీ లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 1.19 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా నిర్ణయించింది. ఇది హై గ్రేడ్, VIP గ్రేడ్ అనే రెండు వేరియంట్‌లలో లభ్యమవుతుంది. ఎక్స్‌టీరియర్ స్టైలింగ్, మూడు ఇంటీరియర్ థీమ్‌లతో పాటు మూడు బాహ్య రంగులను పొందుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో వస్తుందని భావిస్తున్న వెల్‌ఫైర్‌ను ఊహించిన దానికంటే ముందుగానే ప్రారంభించింది.
ధరలు
హాయ్ గ్రేడ్ రూ. 1.20 కోట్లు, ఎగ్జిక్యూటివ్ లాంజ్ ప్యాకేజీతో VIP గ్రేడ్ రూ. 1.30 కోట్లుగా ఉండనుంది.
వెల్‌ఫైర్ ఇంజన్: 2.5-లీటర్ 4 సిలిండర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్, 190bhp , 240Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది 19.28kpl మైలేజీ ఇస్తుందని టయోటా పేర్కొంది.వెల్‌ఫైర్ కొత్త TNGA-K ప్లాట్‌ఫారమ్ ద్వారా మద్దతునిస్తుంది
2023 వెల్‌ఫైర్ ఇంటీరియర్ అప్‌డేట్
క్యాబిన్ సన్‌సెట్ బ్రౌన్, బ్లాక్ , న్యూట్రల్ లేత గోధుమరంగు థీమ్‌లలో ఉంటుంది. డ్యాష్‌బోర్డ్ ఇప్పుడు Apple CarPlay మరియు Android Autoతో పాటు JBL నుండి 15-స్పీకర్ సౌండ్ సిస్టమ్‌తో పెద్ద 14-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ జోడించిది. రెండవ-వరుస లాంజ్ సీట్లు మసాజ్ సీట్లు, పవర్డ్ పుల్-డౌన్ సైడ్ సన్ బ్లైండ్‌లు అమర్చింది.
కొత్త టయోటా వెల్‌ఫైర్ డిజైన్ విషయానికి వస్తే అవుట్‌గోయింగ్ మోడల్‌తో పోలిస్తే కొత్త వెల్‌ఫైర్ డిజైన్ పెద్దగా మారలేదు. టయోటా లోగో స్ప్లిట్ హెడ్‌ల్యాంప్, సిక్స్-స్లాట్ గ్రిల్ మధ్యలో ఉంటుంది.హెడ్‌ల్యాంప్‌ల దిగువ భాగంలో LED డేటైమ్ రన్నింగ్ ల్యాంప్‌లు ఉంటాయి. U-ఆకారపు క్రోమ్ స్ట్రిప్ రెండు హెడ్‌ల్యాంప్‌లను కలుపుతూ బంపర్ ఉంటుంది. మిడ్-లైఫ్ అప్‌డేట్‌గా క్రోమ్ , స్లీకర్ LED హెడ్‌ల్యాంప్‌లతో కూడిన పెద్ద ఫ్రంట్ గ్రిల్ అమర్చింది. స్లైడింగ్ రియర్ పవర్ డోర్లు , ఫ్లాట్ రూఫ్‌లైన్‌లో ఎలాంటి మార్పు లేదు,
2023 వెల్‌ఫైర్ సేఫ్టీ ఫీచర్లు
ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా , హిల్-అసిస్ట్ కంట్రోల్‌తో పాటు, వెల్‌ఫైర్ లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ మానిటర్ , హై బీమ్ అసిస్ట్ వంటి ADAS ఫీచర్లనులాంటివి కొత్త అప్‌డేట్స్‌గా ఉన్నాయి. ముందస్తు బుకింగ్‌లను కంపెనీ ఇప్పటికే షురూ చేసింది. రపండుగ సీజన్‌లో భారతదేశంలో వాహన డెలివరీలు ప్రారంభమవుతాయని ప్రకటించింది. దేవీయ మార్కెట్లో దీని పోటీ గురించి ఆలోచిస్తే కొత్త Lexus LM లాంచ్ అయ్యేవరకు వెల్‌ఫైర్‌కి భారత మార్కెట్లో ఎలాంటి పోటీ ఉండదు.
Comments
Please login to add a commentAdd a comment