Toyoto company
-
గ్లోబల్ టయోటా డ్రీమ్ కార్ ఆర్ట్ : ఫైనలిస్ట్‌గా విశాఖ విద్యార్థిని
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంకు చెందిన యువ కళాకారిణి పేరూరి లక్ష్మీ సహస్ర ప్రతిష్టాత్మక 17వ టొయోటా డ్రీమ్ కార్ ఆర్ట్ కాంటెస్ట్ (TDCAC) గ్లోబల్ కాంపిటీషన్లో ఉత్తమ ఫైనలిస్ట్‌లలో ఒకరిగా ఎంపికైంది. ఈ సందర్బంగా "టొయోటాస్ మెమరీ కార్" ఆర్ట్‌ను రూపొందించిన ఆమెను టొయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) ఇటీవల సత్కరించింది. 90 దేశాలనుంచి 712,845 ఎంట్రీల్లో టాప్ 26 ప్రపంచ ఫైనలిస్ట్‌లలో లక్ష్మీ సహస్ర సంపాదించు కోవడం విశేషం. 12-15 ఏళ్ల విభాగంలో ఆమె సాధించిన అత్యుత్తమ విజయానికి గుర్తింపుగా, రూ.2.51 లక్షల (3,000 డాలర్లు) బహుమతి గెల్చుకుంది.టొయోటా మోటార్ కార్పొరేషన్ 2004లో టయోటా డ్రీమ్ కార్ ఆర్ట్ కాంటెస్ట్‌ను ప్రారంభించింది. "డ్రీమ్ కార్లను" తయారు చేసేలా విద్యార్థులను, యువ ఇంజనీర్లను ప్రోత్సహిస్తుంది. లక్షల కొద్దీ పిల్లల ఆసక్తితో పోటీ విపరీతంగా పెరిగింది. ప్రారంభంనుంచి ఇప్పటిదాకా 144 దేశాలు, ప్రాంతాల 9.4 మిలియన్లకు పైగా పిల్లలు పాల్గొన్నారు, సృజనాత్మకతను పెంపొందించడం , రవాణా మరియు స్థిరత్వ భవిష్యత్తు గురించి ఆలోచించేలా యువతలో ఆలోచన రేకెత్తించడమే దీని ఉద్దేశం.15 ఏళ్లు, అంతకంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను మూడు విభాగాలుగా విభజించారు: 7, 8–11 ,12–15 ఏళ్లలోపు. ఈ సంవత్సరం, ప్రపంచవ్యాప్తంగా 26 మంది విజేతలు ఎంపికయ్యారు. వీరిలో పేరూరి లక్ష్మీ సహస్ర కూడా ఒకరు.ఆమె కళాత్మక సృష్టి స్ఫూర్దిదాయకంటొయోటా డ్రీమ్ కార్ ఆర్ట్ కాంటెస్ట్ అనేది పోటీ కంటే ఎక్కువ- మొబిలిటీ ద్వారా ప్రకాశవంతమైన, మరింత అనుసంధానమైన భవిష్యత్తును ఊహించుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లలకు ఆహ్వానం పలకడమని టొయాటో సేల్స్-సర్వీస్-యూజ్డ్ కార్ బిజినెస్, వైస్ ప్రెసిడెంట్ శబరి మనోహర్ తెలిపారు. ప్రపంచ వేదికపై సహస్ర సాధించిన విజయం స్ఫూర్తిదాయకమన్నారు. చాలా సంతోషంగా ఉందిటొయోటా డ్రీమ్ కార్ ఆర్ట్ కాంటెస్ట్‌లో గ్లోబల్ ఫైనలిస్ట్‌లలో ఒకరిగా ఉండటం చాలా సంతోషంగా ఉందని పేర్కొంది లక్ష్మీ సహస్ర. భవిష్యత్తులోని కార్లు ప్రపంచాన్ని ఎలా మార్చగలనో ఊహించా..అదే డ్రీమ్ కారు టొయోటాస్ మెమరీ కార్. సాంకేతికత అనేది మొబిలిటీకి సాధనంగా మాత్రమే కాకుండా జ్ఞాపకాలను భద్రపరచడంలో, అర్థవంతమైన మార్గాల్లో కనెక్ట్ చేయడంలో సహాయపడే ఆలోచనతో దీన్ని రూపొందించినట్టు తెలిపింది. తన లాంటి యువతకు ఇంత అద్భుతమైన వేదికను అందించినందుకు టొయోటాకు కృతజ్ఞతలు చెప్పింది. టొయోటా డ్రీమ్ కార్ ఆర్ట్ కాంటెస్ట్ గురించి మరింత సమాచారం, పేరూరి లక్ష్మీ సహస్ర అవార్డు-గెలుచుకున్న కారుఘార్ట్ ఇతర అద్భుతమైన ఎంట్రీలు చూడాలనుకుంటే, అధికారిక పోటీ వెబ్సైట్ toyota-dreamcarart.com. వీక్షించవచ్చు. -
కొత్త సేఫ్టీ ఫీచర్లు, షాకింగ్ ధర: 2023 టయోటా వెల్ఫైర్
New Toyota Vellfire టయోటా ఇండియా తదుపరి తరం వెల్ఫైర్ ఎంపీవీ లాంచ్ చేసింది. దీని ప్రారంభ ధర రూ. 1.19 కోట్లు (ఎక్స్-షోరూమ్, ఇండియా)గా నిర్ణయించింది. ఇది హై గ్రేడ్, VIP గ్రేడ్ అనే రెండు వేరియంట్లలో లభ్యమవుతుంది. ఎక్స్టీరియర్ స్టైలింగ్, మూడు ఇంటీరియర్ థీమ్‌లతో పాటు మూడు బాహ్య రంగులను పొందుతుంది. ఈ ఏడాది సెప్టెంబర్‌లో వస్తుందని భావిస్తున్న వెల్‌ఫైర్‌ను ఊహించిన దానికంటే ముందుగానే ప్రారంభించింది. ధరలు హాయ్ గ్రేడ్ రూ. 1.20 కోట్లు, ఎగ్జిక్యూటివ్ లాంజ్ ప్యాకేజీతో VIP గ్రేడ్ రూ. 1.30 కోట్లుగా ఉండనుంది. వెల్ఫైర్ ఇంజన్: 2.5-లీటర్ 4 సిలిండర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజన్, 190bhp , 240Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది 19.28kpl మైలేజీ ఇస్తుందని టయోటా పేర్కొంది.వెల్ఫైర్ కొత్త TNGA-K ప్లాట్‌ఫారమ్ ద్వారా మద్దతునిస్తుంది 2023 వెల్ఫైర్ ఇంటీరియర్ అప్డేట్ క్యాబిన్ సన్‌సెట్ బ్రౌన్, బ్లాక్ , న్యూట్రల్ లేత గోధుమరంగు థీమ్‌లలో ఉంటుంది. డ్యాష్‌బోర్డ్ ఇప్పుడు Apple CarPlay మరియు Android Autoతో పాటు JBL నుండి 15-స్పీకర్ సౌండ్ సిస్టమ్‌తో పెద్ద 14-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ జోడించిది. రెండవ-వరుస లాంజ్ సీట్లు మసాజ్ సీట్లు, పవర్డ్ పుల్-డౌన్ సైడ్ సన్ బ్లైండ్లు అమర్చింది. కొత్త టయోటా వెల్ఫైర్ డిజైన్ విషయానికి వస్తే అవుట్గోయింగ్ మోడల్‌తో పోలిస్తే కొత్త వెల్ఫైర్ డిజైన్ పెద్దగా మారలేదు. టయోటా లోగో స్ప్లిట్ హెడ్‌ల్యాంప్, సిక్స్-స్లాట్ గ్రిల్ మధ్యలో ఉంటుంది.హెడ్‌ల్యాంప్‌ల దిగువ భాగంలో LED డేటైమ్ రన్నింగ్ ల్యాంప్‌లు ఉంటాయి. U-ఆకారపు క్రోమ్ స్ట్రిప్ రెండు హెడ్‌ల్యాంప్‌లను కలుపుతూ బంపర్ ఉంటుంది. మిడ్-లైఫ్ అప్డేట్గా క్రోమ్ , స్లీకర్ LED హెడ్‌ల్యాంప్‌లతో కూడిన పెద్ద ఫ్రంట్ గ్రిల్ అమర్చింది. స్లైడింగ్ రియర్ పవర్ డోర్లు , ఫ్లాట్ రూఫ్లైన్లో ఎలాంటి మార్పు లేదు, 2023 వెల్ఫైర్ సేఫ్టీ ఫీచర్లు ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, 360-డిగ్రీ కెమెరా , హిల్-అసిస్ట్ కంట్రోల్‌తో పాటు, వెల్ఫైర్ లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, బ్లైండ్ స్పాట్ మానిటర్ , హై బీమ్ అసిస్ట్ వంటి ADAS ఫీచర్లనులాంటివి కొత్త అప్‌డేట్స్‌గా ఉన్నాయి. ముందస్తు బుకింగ్‌లను కంపెనీ ఇప్పటికే షురూ చేసింది. రపండుగ సీజన్లో భారతదేశంలో వాహన డెలివరీలు ప్రారంభమవుతాయని ప్రకటించింది. దేవీయ మార్కెట్లో దీని పోటీ గురించి ఆలోచిస్తే కొత్త Lexus LM లాంచ్ అయ్యేవరకు వెల్ఫైర్కి భారత మార్కెట్లో ఎలాంటి పోటీ ఉండదు. -
టయోటో భారీ ప్రణాళికలు: రానున్న కాలంలో 10 కొత్త ఈవీ మోడళ్లు
సాక్షి, ముంబై:ఎలక్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో ప్రపంచంలోని అగ్రశ్రేణి వాహన తయారీ సంస్థ టయోటా భారీ ప్రణాళికలే వేస్తోంది. 2026 నాటికి 10 కొత్త ఈబీ మోడళ్లను విడుదల చేయనుంది. అలాగే 2030 నాటికి 3.5 మిలియన్ యూనిట్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు టయోటా మోటార్ కొత్త ప్రెసిడెంట్ సీఈవో కోజీ సాటో తన తొలి ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా వైస్ ప్రెసిడెంట్ హిరోకి నకాజిమా మాట్లాడుతూ, 2026 నాటికి కంపెనీ 10 కొత్త ఎలక్ట్రిక్ వాహన మోడళ్లను లాంచ్ చేయనుందనీ, తద్వారా ఏటా దాదాపు 1.5 మిలియన్ వాహనాలను విక్రయించాలని భావిస్తున్నట్టు వెల్లడించారు. టయోటా వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ-వాహన పరిశ్రమలో ఆకట్టుకోలేకపోయింది.ముఖ్యంగా టెస్లా ,చైనా బీవైడీతో పోలిస్తే ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలలో వెనుకబడి ఉంది. టెస్లా, బీవైడీ వేగంగా విస్తరిస్తున్న ఈ-మార్కెట్లో దూసుకు పోతుండటంతో టయోటా కొత్త మేనేజ్మెంట్ ఈ రంగంలో అభివృద్ధిని వేగవంతం చేయాలనే టాస్క్‌లో పడిందని నిక్కీ ఆసియా నివేదించింది. దీనికితోడు గత సంవత్సరం కంపెనీ తొలి భారీ-ఉత్పత్తి బ్యాటరీ-ఆధారిత మోడల్, bz4X రీకాల్ కావడం భారీగా దెబ్బతీసింది. ఎస్ అండ్పీ గ్లోబల్ మొబిలిటీ డేటా ప్రకారం, టయోటా 2022లో 21,650 బ్యాటరీతో నడిచే వాహనాలను విక్రయించింది.ఇది కేవలం 0.3 శాతం వాటాను మాత్రమే. అత్యధికంగా అమ్ముడైన టెస్లా 1.27 మిలియన్ యూనిట్లను, బీవైడీ 810,600 వాహనాలను సేల్ చేసింది. -
టయోటా మోటార్స్ కీలక నిర్ణయం
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ కార్ల కంపెనీ టయోటా మోటార్ కార్పొరేషన్ కీలక నిర్ణయాన్ని ప్రకటించింది. దేశంలో ఆటో పరిశ్రమపై అధిక పన్నుల విధానం కారణంగా మరింత విస్తరించబోమని ప్రకటించింది.ఇక మీదట ఇండియాలో విస్తరణ ప్రణాళికలపై దృష్టి లేదనీ, అయితే మార్కెట్లో ప్రస్తుతం కొనసాగుతామని జపాన్ కు చెందిన టయోటా తెలిపింది. భారతీయ పన్నుల విధానం వల్ల కార్ల ఉత్పత్తి చేసినా డిమాండ్ లేదని ఈ నేపథ్యంలో ఇండియాలో ఇక పెట్టుబడులు పెట్టేది లేదని స్పష్టం చేసింది టయోటా. కార్లు, మోటారు బైకులపై ప్రభుత్వం పన్నులు చాలా ఎక్కువగా ఉన్నాయనీ దీంతో తమ ఉత్పత్తి దెబ్బతింటోందనీ, ఫలితంగా ఉద్యోగావకాశాలు పడిపోతున్నాయని టయోటా కిర్లోస్కర్ మోటార్ వైస్ చైర్మన్ శేఖర్ విశ్వనాథన్ అన్నారు. భారీ పెట్టుబడుల తరువాత కూడా అధిక పన్నుల ద్వారా మిమ్మల్ని కోరుకోవడం లేదనే సందేశం అందుతోందని అని విశ్వనాథన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ప్రధానంగా ఇన్నోవా, ఫార్చునర్ కార్లతో భారతీయ వినియోగదారులకు చేరువైన ప్రపంచంలోనే అతిపెద్ద నాలుగో కార్ల కంపెనీ టయోటా 1997లో ఇండియా మార్కెట్లోకి వచ్చింది.(సేల్స్ మరోసారి ఢమాల్, ఆందోళనలో పరిశ్రమ) అతిపెద్ద మార్కెట్ భారత్ నుంచి ఇప్పటికే (2017లో) అమెరికాకు చెందిన జనరల్ మోటర్స్ వైదొలిగింది.ఫోర్డ్ కంపెనీ కూడా విస్తరణ ప్రణాళికలకు స్వస్తి చెప్పి మహీంద్రాలో జాయింట్ వెంచర్ గా కొనసాగుతోంది. హార్లీ డేవిడ్ సన్ కూడా ఇదే బాటలో ఉన్నట్టు ఇటీవల నివేదికలు వెలువడ్డాయి. భారతదేశంలో కార్లు, ద్విచక్ర వాహనాలు, స్పోర్ట్స్ యుటిలిటీ వాహనాలు సహా మోటారు వాహనాలపై 28 శాతం జీఎస్టీ అమలవుతోంది. ఇంజిన్ సైజు, పొడుగు, లగ్జరీ కేటగిరీ వారీగా 1 శాతం నుంచి 22 శాతం అదనపు పన్నులు భారం పడుతోంది. 1500 సీసీ ఇంజిన్‌తో పాటు, నాలుగుమీటర్ల పొడువు దాటిన ఎస్‌యూవీల దాదాపు 50శాతం వరకూ పన్నులు పడుతున్నాయని కంపెనీలు అంటున్నాయి. అయితే ఎలక్ట్రిక్ వాహనాలకు మినహాయింపు ఉంది. కరోనా సంక్షోభం కంటే ముందే ఆటో రంగం కుదేలైన సంగతి తెలిసిందే. అమ్మకాలు క్షీణించి, ఆదాయాలు లేక ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయిన ఆటో పరిశ్రమను కరోనా మరింత దెబ్బతీసింది. పలు కంపెనీలు దేశం నుంచి వైదొలగుతున్నాయి. ఈ మందగమనం నుంచి బయటపడేందుకు కనీసం నాలుగేళ్లు పడుందని అంచనా. అటు టయోటా తాజా నిర్ణయంతో మేకిన్ ఇన్ ఇండియాలో భాగంగా విదేశీ కంపెనీలను ఆకర్షించి, భారీగా పెట్టుడులవైపు చూస్తున్న బీజేపీ ప్రభుత్వానికి ఇది ఎదురు దెబ్బేనని ఆటో రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఈ నెల 23న టయోటా అర్బన్ క్రూయిజర్ సబ్-4 ఎం ఎస్‌యూవీని లాంచ్ చేయనుంది. దీనికి సంబంధించిన ప్రీ బుకింగ్స్ ను ఇప్పటికే ప్రారంభించింది. -
ద రోబో ‘నర్స్’
రిమోట్ తీసుకురా.. అనగానే టక్కున ఇచ్చేస్తుంది.. నీరు కావాలంటే వెంటనే అందిస్తుంది.. పెన్ను, పేపర్ తీసుకురమ్మంటే రయ్‌మని తెచ్చిస్తుంది.. ఇంతకీ ఇవన్నీ చేసేదెవరనుకుంటున్నారా..! రోబో..! అవును రోబోనే.. ఇప్పుడు ఇంట్లో చిన్న చిన్న పనులు చేసి పెట్టేందుకు కూడా సిద్ధమైంది. టొయోటో కంపెనీ ప్రత్యేకంగా ఈ రోబోను తయారుచేసింది. వస్తువు ఎక్కడుందో కమాండ్ ఇస్తే చాలు దానికున్న చేతితో తీసుకొచ్చిస్తుంది. 4 అడుగుల 4 అంగుళాలు ఉండే ఈ రోబో.. చిన్న కాగితపు ముక్క నుంచి దాదాపు 1.2 కిలోల బరువున్న ఏ వస్తువునైనా మోయగలుగుతుంది. దీనికున్న కెమెరాలు, స్కానర్ల సాయంతో గదిలో ఏక్కడ ఏ వస్తువున్నా వెంటనే గుర్తుపట్టగలుగుతుంది. గంటకు దాదాపు 800 మీటర్ల వేగంతో మాత్రమే నడవగలిగే ఈ రోబోను ఎక్కడినుంచైనా ట్యాబ్లెట్, కంప్యూటర్, ల్యాప్‌టాప్ సాయంతో ఆపరేట్ చేయవచ్చు. అంతేకాదు వృద్ధులకు, వికలాంగులకు, ఆస్పత్రుల్లోని రోగులకు ఈ రోబోలు ఎంతో ఉపయోగపడతాయి కూడా.