ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంకు చెందిన యువ కళాకారిణి పేరూరి లక్ష్మీ సహస్ర ప్రతిష్టాత్మక 17వ టొయోటా డ్రీమ్ కార్ ఆర్ట్ కాంటెస్ట్ (TDCAC) గ్లోబల్ కాంపిటీషన్‌లో ఉత్తమ ఫైనలిస్ట్‌లలో ఒకరిగా ఎంపికైంది. ఈ సందర్బంగా "టొయోటాస్ మెమరీ కార్" ఆర్ట్‌ను రూపొందించిన ఆమెను టొయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) ఇటీవల సత్కరించింది. 90 దేశాలనుంచి 712,845 ఎంట్రీల్లో టాప్ 26 ప్రపంచ ఫైనలిస్ట్‌లలో లక్ష్మీ సహస్ర సంపాదించు కోవడం విశేషం. 12-15 ఏళ్ల విభాగంలో ఆమె సాధించిన అత్యుత్తమ విజయానికి గుర్తింపుగా, రూ.2.51 లక్షల (3,000 డాలర్లు) బహుమతి గెల్చుకుంది.
టొయోటా మోటార్ కార్పొరేషన్ 2004లో టయోటా డ్రీమ్ కార్ ఆర్ట్ కాంటెస్ట్‌ను ప్రారంభించింది. "డ్రీమ్ కార్లను" తయారు చేసేలా విద్యార్థులను, యువ ఇంజనీర్లను ప్రోత్సహిస్తుంది. లక్షల కొద్దీ పిల్లల ఆసక్తితో పోటీ విపరీతంగా పెరిగింది. ప్రారంభంనుంచి ఇప్పటిదాకా 144 దేశాలు, ప్రాంతాల 9.4 మిలియన్లకు పైగా పిల్లలు పాల్గొన్నారు, సృజనాత్మకతను పెంపొందించడం , రవాణా మరియు స్థిరత్వ భవిష్యత్తు గురించి ఆలోచించేలా యువతలో ఆలోచన రేకెత్తించడమే దీని ఉద్దేశం.
15 ఏళ్లు, అంతకంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను మూడు విభాగాలుగా విభజించారు: 7, 8–11 ,12–15 ఏళ్లలోపు. ఈ సంవత్సరం, ప్రపంచవ్యాప్తంగా 26 మంది విజేతలు ఎంపికయ్యారు. వీరిలో పేరూరి లక్ష్మీ సహస్ర కూడా ఒకరు.
ఆమె కళాత్మక సృష్టి స్ఫూర్దిదాయకం
టొయోటా డ్రీమ్ కార్ ఆర్ట్ కాంటెస్ట్ అనేది పోటీ కంటే ఎక్కువ- మొబిలిటీ ద్వారా ప్రకాశవంతమైన, మరింత అనుసంధానమైన భవిష్యత్తును ఊహించుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లలకు ఆహ్వానం పలకడమని టొయాటో సేల్స్-సర్వీస్-యూజ్డ్ కార్ బిజినెస్, వైస్ ప్రెసిడెంట్ శబరి మనోహర్ తెలిపారు. ప్రపంచ వేదికపై సహస్ర సాధించిన విజయం స్ఫూర్తిదాయకమన్నారు.
చాలా సంతోషంగా ఉంది
టొయోటా డ్రీమ్ కార్ ఆర్ట్ కాంటెస్ట్‌లో గ్లోబల్ ఫైనలిస్ట్‌లలో ఒకరిగా ఉండటం చాలా సంతోషంగా ఉందని పేర్కొంది లక్ష్మీ సహస్ర. భవిష్యత్తులోని కార్లు ప్రపంచాన్ని ఎలా మార్చగలనో ఊహించా..అదే డ్రీమ్ కారు టొయోటాస్ మెమరీ కార్. సాంకేతికత అనేది మొబిలిటీకి సాధనంగా మాత్రమే కాకుండా జ్ఞాపకాలను భద్రపరచడంలో, అర్థవంతమైన మార్గాల్లో కనెక్ట్ చేయడంలో సహాయపడే ఆలోచనతో దీన్ని రూపొందించినట్టు తెలిపింది. తన లాంటి యువతకు ఇంత అద్భుతమైన వేదికను అందించినందుకు టొయోటాకు కృతజ్ఞతలు చెప్పింది.
టొయోటా డ్రీమ్ కార్ ఆర్ట్ కాంటెస్ట్ గురించి మరింత సమాచారం, పేరూరి లక్ష్మీ సహస్ర అవార్డు-గెలుచుకున్న కారుఘార్ట్ ఇతర అద్భుతమైన ఎంట్రీలు చూడాలనుకుంటే, అధికారిక పోటీ వెబ్‌సైట్ toyota-dreamcarart.com. వీక్షించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment