Contest
-
38 మందితో ఆప్ తుది జాబితా
సాక్షి, న్యూఢిల్లీ: వచ్చే ఫిబ్రవరిలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి అరి్వంద్ కేజ్రీవాల్ మరోసారి న్యూఢిల్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. ముఖ్యమంత్రి ఆతిశీ మర్లిన్ కల్కాజీ నుంచి బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు ఆదివారం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 38 మంది పేర్లతో నాలుగో, చివరి జాబితా ఆదివారం విడుదల చేసింది. ఇందులో ఆరోగ్య మంత్రి సౌరభ్ భరద్వాజ్ గ్రేటర్ కైలాష్ స్థానం, మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‌కు షకుర్ బస్తీ, ఎమ్మెల్యే సోమనాథ్ భారతికి మాలవీయ నగర్ కేటాయించారు. నవంబర్ 21 నుంచి డిసెంబర్ 15 మధ్య 25 రోజుల్లో మొత్తం 4 జాబితాల్లో అసెంబ్లీలోని మొత్తం 70 సీట్లకు అభ్యర్థుల పేర్లను ఆప్ ప్రకటించింది. నాలుగో లిస్టులో 26 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు సీటు దక్కలేదు. ఈ జాబితాలో ఐదుగురు ముస్లింలు, 10మంది మహిళలకు స్థానం కలి్పంచారు. డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను పట్పర్గంజ్ నుంచి జంగ్‌పురా అసెంబ్లీ స్థానానికి, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రాఖీ బిద్లాన్ను మంగోల్‌పురి నుంచి మాదిపూర్కు, ప్రవీణ్ కుమార్‌ను జంగ్‌పురా నుంచి జనక్‌పురికి, దుర్గేష్ పాఠక్‌ను కరవాల్ నగర్ నుంచి రాజేంద్రనగర్‌కు మార్చారు. 2020లో రాఘవ్ చడ్డా రాజేంద్రనగర్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. బీజేపీకి సీఎం అభ్యర్థే లేరు: కేజ్రీవాల్ రానున్న అసెంబ్లీ ఎన్నికలకు గాను బీజేపీకి ముఖ్యమంత్రి అభ్యర్థే కరువయ్యారని ఆప్ చీఫ్ కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు. ‘బీజేపీకి సీఎం అభ్యర్థి లేడు. ఢిల్లీపై విజన్ లేదు. నాయకుల బృందం లేదు. ప్రణాళిక లేదు. వాళ్ల నినాదం, విధానం, మిషన్ ఒక్కటే..అదే కేజ్రీవాల్‌ను ఓడించడం’అని పేర్కొన్నారు. అన్నిటికీ తన వైపే వేలెత్తి చూపుతున్న బీజేపీ నాయకులు ఈ ఐదేళ్లూ ఎక్కడున్నారని ప్రశ్నించారు. -
బిగ్‌బాస్ 8లో వైల్డ్‌కార్డ్ కంటెస్టెంట్‌గా దివి? బ్యూటీ ఏమందంటే?
-
గ్లోబల్ టయోటా డ్రీమ్ కార్ ఆర్ట్ : ఫైనలిస్ట్‌గా విశాఖ విద్యార్థిని
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంకు చెందిన యువ కళాకారిణి పేరూరి లక్ష్మీ సహస్ర ప్రతిష్టాత్మక 17వ టొయోటా డ్రీమ్ కార్ ఆర్ట్ కాంటెస్ట్ (TDCAC) గ్లోబల్ కాంపిటీషన్లో ఉత్తమ ఫైనలిస్ట్‌లలో ఒకరిగా ఎంపికైంది. ఈ సందర్బంగా "టొయోటాస్ మెమరీ కార్" ఆర్ట్‌ను రూపొందించిన ఆమెను టొయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) ఇటీవల సత్కరించింది. 90 దేశాలనుంచి 712,845 ఎంట్రీల్లో టాప్ 26 ప్రపంచ ఫైనలిస్ట్‌లలో లక్ష్మీ సహస్ర సంపాదించు కోవడం విశేషం. 12-15 ఏళ్ల విభాగంలో ఆమె సాధించిన అత్యుత్తమ విజయానికి గుర్తింపుగా, రూ.2.51 లక్షల (3,000 డాలర్లు) బహుమతి గెల్చుకుంది.టొయోటా మోటార్ కార్పొరేషన్ 2004లో టయోటా డ్రీమ్ కార్ ఆర్ట్ కాంటెస్ట్‌ను ప్రారంభించింది. "డ్రీమ్ కార్లను" తయారు చేసేలా విద్యార్థులను, యువ ఇంజనీర్లను ప్రోత్సహిస్తుంది. లక్షల కొద్దీ పిల్లల ఆసక్తితో పోటీ విపరీతంగా పెరిగింది. ప్రారంభంనుంచి ఇప్పటిదాకా 144 దేశాలు, ప్రాంతాల 9.4 మిలియన్లకు పైగా పిల్లలు పాల్గొన్నారు, సృజనాత్మకతను పెంపొందించడం , రవాణా మరియు స్థిరత్వ భవిష్యత్తు గురించి ఆలోచించేలా యువతలో ఆలోచన రేకెత్తించడమే దీని ఉద్దేశం.15 ఏళ్లు, అంతకంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలను మూడు విభాగాలుగా విభజించారు: 7, 8–11 ,12–15 ఏళ్లలోపు. ఈ సంవత్సరం, ప్రపంచవ్యాప్తంగా 26 మంది విజేతలు ఎంపికయ్యారు. వీరిలో పేరూరి లక్ష్మీ సహస్ర కూడా ఒకరు.ఆమె కళాత్మక సృష్టి స్ఫూర్దిదాయకంటొయోటా డ్రీమ్ కార్ ఆర్ట్ కాంటెస్ట్ అనేది పోటీ కంటే ఎక్కువ- మొబిలిటీ ద్వారా ప్రకాశవంతమైన, మరింత అనుసంధానమైన భవిష్యత్తును ఊహించుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పిల్లలకు ఆహ్వానం పలకడమని టొయాటో సేల్స్-సర్వీస్-యూజ్డ్ కార్ బిజినెస్, వైస్ ప్రెసిడెంట్ శబరి మనోహర్ తెలిపారు. ప్రపంచ వేదికపై సహస్ర సాధించిన విజయం స్ఫూర్తిదాయకమన్నారు. చాలా సంతోషంగా ఉందిటొయోటా డ్రీమ్ కార్ ఆర్ట్ కాంటెస్ట్‌లో గ్లోబల్ ఫైనలిస్ట్‌లలో ఒకరిగా ఉండటం చాలా సంతోషంగా ఉందని పేర్కొంది లక్ష్మీ సహస్ర. భవిష్యత్తులోని కార్లు ప్రపంచాన్ని ఎలా మార్చగలనో ఊహించా..అదే డ్రీమ్ కారు టొయోటాస్ మెమరీ కార్. సాంకేతికత అనేది మొబిలిటీకి సాధనంగా మాత్రమే కాకుండా జ్ఞాపకాలను భద్రపరచడంలో, అర్థవంతమైన మార్గాల్లో కనెక్ట్ చేయడంలో సహాయపడే ఆలోచనతో దీన్ని రూపొందించినట్టు తెలిపింది. తన లాంటి యువతకు ఇంత అద్భుతమైన వేదికను అందించినందుకు టొయోటాకు కృతజ్ఞతలు చెప్పింది. టొయోటా డ్రీమ్ కార్ ఆర్ట్ కాంటెస్ట్ గురించి మరింత సమాచారం, పేరూరి లక్ష్మీ సహస్ర అవార్డు-గెలుచుకున్న కారుఘార్ట్ ఇతర అద్భుతమైన ఎంట్రీలు చూడాలనుకుంటే, అధికారిక పోటీ వెబ్సైట్ toyota-dreamcarart.com. వీక్షించవచ్చు. -
J&K: 30 ఏళ్లలో తొలిసారి.. అసెంబ్లీ బరిలో మహిళా కాశ్మీరీ పండిట్
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో దాదాపు పదేళ్ల తర్వాత అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతున్నాయి. మరో పది రోజుల్లో మొదటి దశ పోలింగ్ జరగనున్న నేపత్యంలో ప్రధాన పార్టీలు ఇప్పటికే ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ క్రమంలో దాదాపు మూడు దశాబ్దాల తర్వాత తొలిసారి మహిళా కాశ్మీరీ పండిట్లు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు.జమ్మూకశ్మీర్‌లో సర్పంచ్‌గా పనిచేసిన డైసీ రైనా అనే మహిళా కాశ్మీరీ పండింట్ ఎమ్మెల్యే అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేశారు. ఎన్డీయూ కూటమిలో బీజేపీ మిత్రపక్షంగా ఉన్న రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా(అథవాలే) తరుపున పుల్వామాలోని రాజ్‌పోరా అసెంబ్లీ నియోజకవర్గం ఆమె బరిలోకి దిగుతున్నారు.అయితే జమ్మూకశ్మీర్‌లో మొత్తం తొమ్మిది మంది మహిళలు పోటీ చేస్తుండగా అందులో రైనా ఒకరు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్థానిక యువత తమ గొంతుకగా నిలవాలని కోరుకున్నందున తాను పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు.‘ఇక్కడి యువకులు నన్ను పోటీ చేయమని బలవంతం చేశారు. వారి వాయిస్ జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి చేరేలా చూడాలని నన్ను అడిగారు. నేను ఇక్కడ సర్పంచ్‌గా పని చేస్తున్నాను. ఇక్కడి యువకులను తరుచుగా కలుస్తుంటాను. వారి సమస్యలను విని అర్థం చేసుకున్నాను. ఇక్కడి యువత ఏం తప్పు చేయనప్పటికీ బాధ పడుతున్నారు. 1990వ కాలంలో జమ్మూ కాశ్మీర్లో జన్మించిన యువకులు కేవలం బుల్లెట్లను మాత్రమే చూశారు’ అని పేర్కొన్నారు.కాగా రైనా న్యూఢిల్లీలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేసి, 2020లో సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అయితే వసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని ఎప్పుడు నిర్ణయించుకున్నారని రైనాను ప్రశ్నించగా.. తాను అసలు ఎన్నికల్లో పోటీ చేయాలని కూడా అనుకోలేదని చెప్పారు. అయితే పుల్వామాను చక్కదిద్దగలనని చెప్పి ఒక్కరోజు ముఖ్యమంత్రి కావాలని యువకులు తనను కోరినట్లు ఆమె పేర్కొన్నారు. ఇదిలా ఉండగా శ్రీనగర్‌లోని హబ్బా కడల్ అసెంబ్లీ నియోజకవర్గం కాశ్మీరీ పండింట్ల విషయంలో ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. రెండో దశలో భాగంగా సెప్టెంబర్ 25న మరో 26 నియోజకవర్గాలతో పాటు హబ్బా కడల్‌కు ఎన్నికలు జరగనున్నాయి. అయితే అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి మొత్తం 14 మంది నామినేషన్ దాఖలు చేయగా.. వారిలో ఆరుగురు కాశ్మీరీ పండింట్లు ఉన్నారు.మొత్తం 90 స్థానాలున్న జమ్ముకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కమిషన్ ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. మూడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. మొదటి దశ పోలింగ్ సెప్టెంబర్ 18న, మిగతా రెండు రౌండ్లు సెప్టెంబర్ 25, అక్టోబర్ 1న జరగనున్నాయి. అక్టోబర్ 8వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఆర్టికల్ 370 రద్దు అనంతరం జరుగుతున్న తొలి అసెంబ్లీ ఎన్నికలు ఇవి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఓటరు ఏ పార్టీకి పట్టం కట్టనున్నాడనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
Haryana: అసెంబ్లీ ఎన్నికల్లో చౌతాలా-ఆజాద్ దోస్తీ
త్వరలో జరగబోయే హర్యానా అసెంబ్లీ ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఈ ఎన్నికల్లో జననాయక్ పార్టీకి చెందిన దుష్యంత్ చౌతాలా, ఆజాద్ సమాజ్ పార్టీకి చెందిన చంద్రశేఖర్ ఆజాద్ కలిసి పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్లో సంయుక్తంగా విలేకరుల సమావేశం నిర్వహించి, ఈ విషయాన్ని వెల్లడించారు. తమ రెండు పార్టీలు ఈసారి ఎన్నికల్లో ప్రత్యర్థులకు గట్టి పోటీనిస్తాయన్నారు.నేతలు దుష్యంత్ చౌతాలా, చంద్రశేఖర్ ఆజాద్‌లు మీడియాతో మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో 36 సంఘాలను ఏకతాటిపైకి తీసుకువస్తామని అన్నారు. రైతులు, యువత, మహిళల సమస్యలను వినిపిస్తూ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నామన్నారు. హర్యానాలోని 90 అసెంబ్లీ స్థానాల్లో ఉమ్మడిగా బరిలోకి దిగుతున్నామని దుష్యంత్ చౌతాలా తెలిపారు. ఈ ఎన్నికల్లో జేజేపీ 70 స్థానాల్లో, ఆజాద్ సమాజ్ పార్టీ 20 స్థానాల్లో పోటీ చేయనున్నదన్నారు. రైతులకు వారి హక్కులు దక్కేలా చూడటమే తమ ప్రయత్నమని చంద్రశేఖర్ అన్నారు. -
ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయసు తగ్గించాలి: ఆప్ ఎంపీ
న్యూఢిల్లీ: దేశంలో జరిగే ఎన్నికల్లో పోటీ చేసేందుకు కనీస వయస్సును 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించాలని ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు రాజ్యసభలో అత్యంత పిన్న వయస్కుడైన చద్దా గురువారం మాట్లాడుతూ.. యువ భారత్‌కు యువ రాజకీయ నాయకులు ఎంతో అవసరమని తెలిపారు. ప్రస్తుతం దేశ జనాభాలో 65 శాతం ప్రజలు 35 సంవత్సరాలలోపే ఉన్నారని పేర్కొన్నారు. జనాభాలో 50 శాతం మంది ప్రజలు 25 ఏళ్ల లోపువారే ఉన్నారని చెప్పారు. ‘‘యువ భారతం మనది. ఎన్నికల్లో పోటీ చేయాలంటే 25 ఏళ్లు ఉండాలనే నిబంధన ప్రస్తుత కాలానికి సరిపోదు. ప్రస్తుతం దేశ జనాభాలో 50 శాతం మంది ప్రజలు 25 ఏళ్ల లోపువారే ఉన్నారు. ఇక 65 శాతం జనాభా 35 ఏళ్ల లోపు వారే. దేశానికి స్వాతంత్రం వచ్చాక తొలిసారి లోక్‌సభ ఎన్నికైనప్పుడు 26 శాతం మంది సభ్యులు 40 ఏళ్ల కంటే తక్కువ వయస్సు గలవారే.ఇక రెండు నెలల క్రితం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 40 ఏళ్లలోపు వారు కేవలం 12 శాతం మంది మాత్రమే ఎన్నికయ్యారు. యువ భారత్‌కు యువ రాజకీయ నాయకులు ఎంతో అవసరం. అందుకే ఎన్నికల్లో పోటీ చేసే కనీస వయసును 25 నుంచి 21 ఏళ్లకు తగ్గించాలి. ఇదే కేంద్ర ప్రభుత్వానికి నా సూచన. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరుతున్నాను’ అని రాఘవ్ చద్దా అన్నారు. #WATCH | In Rajya Sabha, AAP MP Raghav Chadha demands the minimum age for contesting elections in India should be reduced from 25 years to 21 years. He says "India is one of the youngest countries in the world. 65% of our population is less than 35 years old and 50% of our… pic.twitter.com/NjL8p2Qjmb— ANI (@ANI) August 1, 2024 -
USA: ఎన్నికల్లో పోటీ.. బైడెన్ కీలక ప్రకటన
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ త్వరలో జరిగే అధ్యక్ష ఎన్నికల బరిలోనుంచి తప్పుకోవాలన్న డిమాండ్ రోజురోజుకు ఎక్కవవుతోంది. సొంత పార్టీ డెమొక్రాట్లలోనే బైడెన్‌పై అసమ్మతి పెరుగుతోంది. ఇటీవల జరిగిన ప్రెసిడెన్షియల్ డిబేట్లో బైడెన్‌పై రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ పైచేయి సాధించినప్పటి నుంచి బైడెన్ అభ్యర్థిత్వంపై చర్చ మొదలైంది.ఈ నేపథ్యంలో అధ్యక్ష ఎన్నికల పోటీ అంశంపై బైడెన్ క్లారిటీ ఇచ్చారు. శుక్రవారం(జులై 12) డెట్రాయిట్లో జరిగిన ప్రచార ర్యాలీలో బైడెన్ మాట్లాడారు. అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తాను తప్పుకునేది లేదని స్పష్టం చేశారు. అమెరికాకు ట్రంప్ రూపంలో పెద్ద ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. ‘రేసులో నేను పరిగెడుతున్నాను. అధ్యక్ష ఎన్నికల్లో మనం మళ్లీ గెలవబోతున్నాం. నేను పోటీలోనే ఉంటా. మీడియా నన్ను టార్గెట్ చేస్తోంది. నాకు నిజం ఎలా చెప్పాలో తెలుసు. తప్పేదో ఒప్పేదో నాకు తెలుసు, అమెరికన్లకు అధ్యక్షుడు కావాలి. నియంత కాదు. మళ్లీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో సంచలన నిర్ణయాలు తీసుకుంటాం. ఎన్నికల్లో భారీ మెజారిటీ వస్తేనే ఇవి సాధ్యమవుతాయి’అని బైడెన్ తెలిపారు. ఈ ఏడాది నంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. -
మిస్ టెక్సాస్ అందాల పోటీలో పాల్గొన్న 71 ఏళ్ల వృద్ధురాలిగా రికార్డు..! (ఫొటోలు)