
దివి.. బిగ్‌బాస్ నాలుగో సీజన్‌తో గుర్తింపు తెచ్చుకుంది. ఈ షో తర్వాత తన క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

సినిమాల్లొ బిజీ అయిపోయింది. ఇకపోతే తెలుగు బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్‌లో ఎనిమిది మంది మాజీ కంటెస్టెంట్లు వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇస్తున్నారు.

అందులో దివి కూడా ఉందని రూమర్స్ రాగా ఈ పుకార్లకు ఫుల్‌స్టాప్ పెట్టిందీ బ్యూటీ. తాను ఈ సీజన్‌లో అడుగుపెట్టడం లేదని క్లారిటీ ఇచ్చింది.

బిగ్‌బాస్ జర్నీ.. నాకు లైఫ్ చేంజింగ్ ఎక్స్‌పీరియన్స్.మీ ప్రేమ, ఆదరాభిమానాలతో కెరీర్ నిర్మించుకున్నాను.

ఈ ప్రయాణంలో నా ఎదుగుదల, ఒడిదొడుకులు అన్నీ మీరు చూశారు.

అప్పట్లో బిగ్‌బాస్‌కు వెళ్లిన మొదటి రోజు నుంచే నన్ను చిన్న ఆపిల్ బ్యూటీ, బ్యూటీ విత్ బ్రెయిన్ అంటూ ప్రేమతో పిలిచారు.

హౌస్‌లోని ప్రతి సంఘటన నాకు ఒక పాఠం వంటిదే! మీ ప్రేమ వల్ల ఇక్కడిదాకా వచ్చాను.

బిగ్‌బాస్‌తో నా జర్నీ ప్రారంభమవగా ఇంకా ముందుకు వెళ్తున్నాను.. సినిమాలతో బిజీ అయిపోయా.. మీ ఎంకరేజ్‌మెంట్ వల్లే నేను ఎదుగుతున్నాను అని మీకు చెప్పాలనిపించింది.

ఇప్పుడు బిగ్‌బాస్‌లో రీఎంట్రీ ఇవ్వలేకపోతున్నాను.

కానీ, నా కలల్ని సాకారం చేసిన మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా.. మనం కలిసి సెలబ్రేట్ చేసుకునే టైం ముందుంది అని రాసుకొచ్చింది.










