వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ త్వరలో జరిగే అధ్యక్ష ఎన్నికల బరిలోనుంచి తప్పుకోవాలన్న డిమాండ్ రోజురోజుకు ఎక్కవవుతోంది. సొంత పార్టీ డెమొక్రాట్లలోనే బైడెన్‌పై అసమ్మతి పెరుగుతోంది. ఇటీవల జరిగిన ప్రెసిడెన్షియల్ డిబేట్‌లో బైడెన్‌పై రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ పైచేయి సాధించినప్పటి నుంచి బైడెన్ అభ్యర్థిత్వంపై చర్చ మొదలైంది.
ఈ నేపథ్యంలో అధ్యక్ష ఎన్నికల పోటీ అంశంపై బైడెన్ క్లారిటీ ఇచ్చారు. శుక్రవారం(జులై 12) డెట్రాయిట్‌లో జరిగిన ప్రచార ర్యాలీలో బైడెన్ మాట్లాడారు. అధ్యక్ష ఎన్నికల రేసు నుంచి తాను తప్పుకునేది లేదని స్పష్టం చేశారు. అమెరికాకు ట్రంప్ రూపంలో పెద్ద ప్రమాదం పొంచి ఉందని హెచ్చరించారు. ‘రేసులో నేను పరిగెడుతున్నాను.
అధ్యక్ష ఎన్నికల్లో మనం మళ్లీ గెలవబోతున్నాం. నేను పోటీలోనే ఉంటా. మీడియా నన్ను టార్గెట్ చేస్తోంది. నాకు నిజం ఎలా చెప్పాలో తెలుసు. తప్పేదో ఒప్పేదో నాకు తెలుసు, అమెరికన్లకు అధ్యక్షుడు కావాలి. నియంత కాదు. మళ్లీ అధికారంలోకి వస్తే 100 రోజుల్లో సంచలన నిర్ణయాలు తీసుకుంటాం. ఎన్నికల్లో భారీ మెజారిటీ వస్తేనే ఇవి సాధ్యమవుతాయి’అని బైడెన్ తెలిపారు. ఈ ఏడాది నంబర్ 5న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment