మారుతీ ‘ఎక్స్‌ఎల్‌ 6’ ఎంపీవీ | Maruti Suzuki India Launch MPV XL6 | Sakshi
Sakshi News home page

మారుతీ ‘ఎక్స్‌ఎల్‌ 6’ ఎంపీవీ

Published Thu, Aug 22 2019 8:38 AM | Last Updated on Thu, Aug 22 2019 8:38 AM

Maruti Suzuki India  Launch MPV XL6 - Sakshi

న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ ఇండియా(ఎంఎస్‌ఐ).. తన అధునాతన మల్టీ పర్పస్‌ వెహికిల్‌ (ఎంపీవీ)ని బుధవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ‘ఎక్స్‌ఎల్‌ 6’ పేరిట విడుదలైన ఈ కారు ధరల శ్రేణి రూ. 9.79 లక్షలు–11.46 లక్షలు (ఎక్స్‌షోరూం)గా ప్రకటించింది. ప్రోగ్రెసివ్‌ స్మార్ట్‌ హైబ్రిడ్‌ సిస్టమ్, లిథియం–అయాన్‌ బ్యాటరీ కలిగి.. 1.5 లీటర్ల పెట్రోల్‌ ఇంజిన్‌తో అందుబాటులోకి వచ్చింది. ఫైవ్‌ స్పీడ్‌ మాన్యువల్, 4–స్పీడ్‌ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్లు ఈ కొత్త ఎంపీవీలో ఉన్నట్లు కంపెనీ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఉన్న నెక్సా ప్రీమియం రిటైల్‌ చైన్ల ద్వారా ఈ వాహనాన్ని కొనుగోలుచేయవచ్చని కంపెనీ వివరించింది. ఈ నూతన కారు విడుదలతో.. బీఎస్‌–6 ప్రమాణాలకు అనుగుణంగా మారుతీ నుంచి విడుదలైన మొత్తం కార్ల సంఖ్య ఏడుకు చేరింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement