హోండా మొబిలియో కధ కంచికి ! | End of road for Honda Mobilio in India | Sakshi
Sakshi News home page

హోండా మొబిలియో కధ కంచికి !

Published Fri, Mar 3 2017 1:40 AM | Last Updated on Tue, Sep 5 2017 5:01 AM

హోండా మొబిలియో కధ కంచికి !

హోండా మొబిలియో కధ కంచికి !

పనాజి(గోవా): జపాన్‌ కార్ల కంపెనీ హోండా తన మల్టీ పర్పస్‌ వెహికల్‌(ఎంపీవీ) మోబిలియో విక్రయాలను ఆపేసింది. ఈ కారుకు డిమాండ్‌ లేకపోవడం, కొత్త భద్రతా నియామాలకు అనుగుణంగా లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని హోండా కార్స్‌ ఇండియా తెలిపింది. ఈ మోడల్‌లో కొత్త వేరియంట్‌ను తెచ్చేదీ లేనిదీ మరో రెండు నెలల్లో నిర్ణయిస్తామని కంపెనీ ప్రెసిడెంట్, సీఈఓ యోచిరో యునొ చెప్పారు. గత నెలలో ఒక్క కారును కూడా అమ్మలేకపోయామని పేర్కొన్నారు.

ఈ ఏడాది నుంచి అమల్లోకి వచ్చే కొత్త భద్రతా నియమాలకనుగుణంగా ఈ కారు లేదని వివరించారు. ఈ కారును కొనసాగించాలంటే కొత్తగా తెచ్చే వేరియంట్‌ కోసం భారీగా పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుందని తెలిపారు. మరోవైపు మోబిలియోలో కొత్త వేరియంట్‌ను ఇప్పటికే ఇండోనేíసియాలో అందుబాటులోకి తెచ్చామని, దీన్ని భారత్‌లోకి తేవాలా, వద్దా అనేది మదింపు చేస్తున్నామని తెలిపారు.  2014, జూలైలో ఈ కారును భారత మార్కెట్లోకి తెచ్చామని, ఇప్పటిదాకా 40,789 కార్లను విక్రయించామని వివరించారు. ఈ కారు ధర రూ.6.49 లక్షలు–రూ.10.86 లక్షల (ఎక్స్‌ షోరూమ్, ఢిల్లీ)రేంజ్‌లో ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement