రోజు రోజుకి దేశీయ మార్కెట్లో విడుదలవుతున్న కొత్త వాహనాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇటీవల జిమ్నీ ఆఫ్-రోడర్ విడుదల చేసిన మారుతి సుజుకి వచ్చే నెలలో మరో MPV విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
మారుతి సుజుకి 2023 జులై 05న విడుదల చేయనున్న సరికొత్త ఎంపివి పేరు 'ఎంగేజ్' (Engage). ఇది ఇప్పటికే ప్రజాదరణ పొందుతున్న టయోటా ఇన్నోవా హైక్రాస్ మాదిరిగానే తప్పకుండా మంచి అమ్మకాలు పొందే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇది జులై చివరి నాటికి నెక్సా డీలర్‌షిప్‌ల ద్వారా అమ్మకానికి రానున్నట్లు సమాచారం.
మారుతి సుజుకి విడుదల చేయనున్న ఎంగేజ్ భిన్నమైన డిజైన్ కలిగి చూడగానే ఆకర్శించే విధంగా ఉంటుంది. ఈ ఎంపివి ముందు భాగంలో హానీ కూంబ్ మెష్ గ్రిల్, గ్రిల్ మధ్యలో క్రోమ్ బార్‌లు, ఇరువైపులా హెడ్‌ల్యాంప్‌లు ఉండనున్నాయి. ఫ్రంట్ బంపర్ ట్వీక్ చేసిన విధంగా కనిపిస్తుంది, స్కిడ్ ప్లేట్ మాదిరిగా కనిపించేలా చేయడానికి ఫాక్స్ బ్రష్డ్ అల్యూమినియం ఫినిషింగ్ పొందుతుంది. కంపెనీ దీనికి సంబంధించిన చాలా వివరాలు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.
(ఇదీ చదవండి: రూ. 77712 వద్ద హోండా డియో హెచ్-స్మార్ట్ - పూర్తి వివరాలు)
మారుతి సుజుకి కొత్త ఎంపివి TNGA-C ఆర్కిటెక్చర్ ఆధారంగా తయారవుతుంది. కావున ఇన్నోవా హైక్రాస్‌లో కనిపించే న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ అండ్ స్ట్రాంగ్-హైబ్రిడ్ పెట్రోల్ ఇంజన్‌లు ఇందులో ఉండే అవకాశం ఉంటుంది. పర్ఫామెన్స్ కూడా ఉత్తమంగా ఉంటుందని భావిస్తున్నాము.
(ఇదీ చదవండి: పిట్ట కొంచెం.. కూత ఘనం అంటే ఇదేనేమో - 19 ఏళ్లకే కోట్లు విలువైన కంపెనీ)
నిజానికి 2017 లో టయోటా & మారుతి సుజుకి మధ్య సత్సంబంధం ఏర్పడినప్పటి నుంచి బాలెనొ, అర్బన్ క్రూయిజర్, గ్లాంజా వంటి ఉత్పత్తులు పుట్టుకొచ్చాయి. కావున ఇప్పుడు రానున్న ఈ ఎంపివి కూడా రెండు కంపెనీల కలయికతో రీబ్యాడ్జ్ చేసిన టయోటా ఉత్పత్తి అవుతుందని భావిస్తున్నారు. మారుతి సుజుకి కొత్త ఎంపివి గురించి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment