Maruti Jimny Bookings Crossed 150 Units Per Day - Sakshi
Sakshi News home page

Maruti Jimny Bookings: రోజుకి 150 దాటుతున్న జిమ్నీ బుకింగ్స్ - ప్రత్యర్థుల పని అయిపోయినట్టేనా?

Published Fri, Jun 16 2023 1:02 PM | Last Updated on Fri, Jun 16 2023 1:45 PM

Maruti jimny bookings crossed 150 units per day - Sakshi

మారుతి సుజుకి జిమ్నీ 2023 ఆటో ఎక్స్‌పో అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు విపరీతమైన బుకింగ్స్ పొందుతూ ముందుకు సాగుతోంది. విడుదలకు ముందే 30,000 బుకింగ్స్ పొందిన ఈ ఆఫ్ రోడర్ ఇప్పటికి కూడా భారీ స్థాయిలో బుకింగ్స్ పొందుతోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

మారుతి సుజుకి తన జిమ్నీ ధరలను 2023 జూన్ 7న అధికారికంగా ప్రకటించింది. జిమ్నీ బేస్ వేరియంట్ ధరలు రూ. 12.74 లక్షలు కాగా, టాప్ వేరియంట్ ధర రూ. 15.05 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా). ఈ ధరలు ప్రకటించడానికి ముందు కంపెనీ ఈ SUV కోసం రోజుకి దాదాపు 92 బుకింగ్స్ పొందింది. కాగా ధరలు ప్రకటించిన తరువాత రోజుకి 151 బుకింగ్స్ వస్తున్నట్లు మారుతి సుజుకి ఇండియా సేల్స్ & మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ వెల్లడించారు.

డిజైన్ పరంగా నిటారుగా ఉన్న పిల్లర్లు, క్లీన్ సర్ఫేసింగ్, రౌండ్ హెడ్‌ల్యాంప్‌లు, స్లాట్డ్ గ్రిల్, చంకీ ఆఫ్-రోడ్ టైర్లు, ఫ్లేర్డ్ వీల్ ఆర్చ్‌లు కలిగి ఉన్న ఈ ఆఫ్ రోడర్ 195/80 సెక్షన్ టైర్‌లతో 15 ఇంచెస్ అల్లాయ్ వీల్స్‌ పొందుతుంది. లోపలి భాగంలో 9 ఇంచెస్ స్మార్ట్‌ప్లే ప్రో+ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ అండ్ గో వంటి వాటితో పాటు ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో ఉంటాయి.

జిమ్నీ ఎస్‌యువి 1.5 లీటర్ 5 సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ పొందుతుంది. ఇది 105 bhp పవర్ 134 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. మారుతి సుజుకి తన జిమ్నీ కారుని కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా విదేశాల్లో కూడా విక్రయించడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే సంస్థ ఈ కారు ఉత్పత్తిని ప్రారంభించింది. దేశీయ విఫణిలో డెలివరీలను కూడా ప్రారంభించింది. ఇది ఇండియన్ మార్కెట్లో మహీంద్రా థార్‌కు ప్రధాన ప్రత్యర్థిగా ఉంటుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement