గత కొన్ని రోజులకు ముందు భారతీయ మార్కెట్లో విడుదలైన 'మారుతి ఫ్రాంక్స్' (Maruti Fronx) ప్రారంభం నుంచి మంచి అమ్మకాలతో ముందుకు సాగుతోంది. అయితే ఇప్పుడు దేశీయ తీరాలు దాటి విదేశాల్లో అడుగుపెట్టడానికి సన్నద్దమయిపోయింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
నివేదికల ప్రకారం, మారుతి సుజుకి కొత్త కారు ఫ్రాంక్స్ ఇప్పుడు మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలకు చేరుకోవడం ప్రారంభించింది. ఇందులో భాగంగానే ముంబై నుంచి 556 వాహనాలు మొదటి బ్యాచ్‌గా ఎగుమతికానున్నాయి. దీనికి సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కార్లు మన దేశం నుంచి విదేశాలకు ఎగుమతి కావడం ఇదే మొదటి సారి కాదు. గతంలో చాలా కంపెనీలు ఈ విధంగా ఎగుమతి చేశాయి.
2023 ఇండియన్ ఆటో ఎక్స్‌పోలో కనిపించిన మారుతి ఫ్రాంక్స్ ఏప్రిల్ నెలలో అధికారికంగా విడుదలైంది. ఈ SUV ధరలు రూ. 7.47 లక్షల నుంచి రూ. 13.13 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. డిజైన్, ఫీచర్స్ పరంగా దాని మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా ఉత్తమంగా ఉంటుంది.
(ఇదీ చదవండి: రాధిక ధరించిన ఈ డ్రెస్ అంత ఖరీదా? అంబానీ కోడలంటే మినిమమ్ ఉంటది మరి!)
మారుతి ఫ్రాంక్స్ ఎస్‌యువి 1.0-లీటర్ బూస్టర్‌జెట్ టర్బో-పెట్రోల్ ఇంజన్ పొందుతుంది. ఇది 100 హెచ్‌పి పవర్ 147 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌తో లభిస్తుంది. టర్బో-పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో ప్రస్తుతం అమ్ముడవుతున్న ఏకైక మారుతి సుజుకి కారు ఫ్రాంక్స్ అనే చెప్పాలి.
Comments
Please login to add a commentAdd a comment