హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా టూర్ హెచ్1 పేరుతో సరికొత్త కారును ప్రవేశపెట్టింది. భారత్‌లో అధిక మైలేజీ ఇచ్చే ప్రారంభ స్థాయి కమర్షియల్ హ్యాచ్‌బ్యాక్ ఇదేనని కంపెనీ ప్రకటించింది. మైలేజీ పెట్రోల్ వెర్షన్ లీటరుకు 24.60 కిలోమీటర్లు, సీఎన్‌జీ వేరియంట్ కిలోకు 34.46 కిలోమీటర్లు ఇస్తుందని వెల్లడించింది.
ధర రూ.4.8 లక్షల నుంచి ప్రారంభం. సీఎన్‌జీ వేరియంట్ ధర రూ.5.7 లక్షలు. ఆల్టో కే10 ఆధారంగా టూర్ హెచ్1 రూపొందింది. కె–సిరీస్ 1.0 లీటర్ డ్యూయల్ జెట్ ఇంజిన్ పొందుపరిచారు. రెండు ఎయిర్‌బ్యాగ్స్, ప్రిటెన్షనర్, ఫోర్స్ లిమిటర్‌తో ముందు సీట్ బెల్ట్‌లు, సీట్ బెల్ట్ రిమైండర్, ఇంజిన్ ఇమ్మొబిలైజర్, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్‌తో యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, స్పీడ్ లిమిటింగ్ సిస్టమ్, రివర్స్ పార్కింగ్ సెన్సార్ వంటి హంగులు జోడించారు.
Comments
Please login to add a commentAdd a comment