Maruti car
-
మొదటిసారి పోలీస్ ఫ్లీట్లోకి జిమ్నీ.. వీడియో
మహీంద్రా థార్ ఎస్‌యూవీకి గట్టి పోటీ ఇచ్చేందుకు భారతీయ మార్కెట్లో లాంచ్ అయిన మారుతి జిమ్నీ ప్రారంభంలో కొంత ఆశాజనక అమ్మకాలను పొందినప్పటికీ.. ప్రస్తుతం డీలా పడింది. దీనికి ప్రధాన కారణం పరిమాణంలో చిన్నదిగా ఉండటమే కాకుండా.. థార్ కంటే ఎక్కువ ధర కలిగి ఉండటం. ఈ కారు అమ్మకాలు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. అయితే ఇటీవల ఈ కారును కేరళ పోలీసులు పెట్రోలింగ్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇప్పటి వరకు ఏ ప్రభుత్వ సంస్థ కూడా జిమ్నీ కార్లను తమ ఫ్లీట్‌లో చేర్చలేదు. మొదటిసారి కేరళ పోలీసులు ఈ కారును తమ విభాగంలో చేర్చారు. ఈ జిమ్నీ ఫ్రంట్ విండ్షీల్డ్పైన కేరళ పోలీస్ స్టిక్కర్స్ ఉండటం చూడవచ్చు. బానెట్‌పై రాజాక్కాడ్ పోలీస్ స్టేషన్ స్టిక్కర్ ఉండటం గమనించవచ్చు. ఈ కారును ప్రత్యేకంగా రెస్క్యూ కార్యకలాపాల కోసం ఉపయోగించనున్నట్లు సమాచారం.ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఉన్న ఆఫ్-రోడర్ కార్లలో ఒకటి ఈ మారుతి జిమ్నీ. ఇది కే15బీ 1.5 లీటర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 105 పీఎస్ పవర్, 134 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 5 స్పీడ్ మాన్యువల్, 4 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ పొందుతుంది.ఇదీ చదవండి: 'అప్పుడు రతన్ టాటా ముఖంలో చిరునవ్వు కనిపించింది'కేరళ పోలీసులు 4x4 వాహనాలను తమ విభాగాల్లో చేర్చడం ఇదే మొదటిసారి కాదు. ఇప్పటికే బోలెరో ఇన్వాడర్ 4x4, ఫోర్స్ గూర్ఖా 4×4 వంటి వాటిని పోలీసులు ఉపయోగిస్తున్నారు. ఇప్పుడు తాజాగా మారుతి జిమ్నీ 4x4 కార్లు.. పోలీస్ విభాగంలోకి అడుగుపెట్టాయి. పరిమాణం పరంగా జిమ్నీ.. దాని ప్రత్యర్థుల కంటే చిన్నదిగా ఉన్నప్పటికీ, మంచి డ్రైవింగ్ అనుభూతిని అందిస్తుంది. జిమ్నీ ప్రారంభ ధర రూ. 12.74 లక్షలు (ఎక్స్ షోరూమ్). View this post on Instagram A post shared by Rahulkaimal (@rahul.kaimal) -
రెండేళ్లలో రెండు లక్షల సేల్స్!.. అమ్మకాల్లో అరుదైన రికార్డ్
2022 సెప్టెంబర్ 26న లాంచ్ అయిన మారుతి సుజుకి గ్రాండ్ విటారా అమ్మకాల్లో అరుదైన రికార్డ్ కైవసం చేసుకుంది. కంపెనీ లాంచ్ చేసిన ఈ కారు కేవలం 22 నెలల్లో 2 లక్షల యూనిట్ల కంటే ఎక్కువ అమ్మకాలను పొందగలిగింది.మారుతి గ్రాండ్ విటారా 2023 ఆర్థిక సంవత్సరంలో 51315 యూనిట్ల సేల్స్, 2024 ఆర్ధిక సంవత్సరం చివరినాటికి 1,21,169 యూనిట్లను విక్రయించగలిగింది. మొత్తం మీద గత జూన్ చివరి నాటికి మొత్తం 1,99,550 యూనిట్ల విక్రయాలను పొందగలిగింది.కేవలం 12 నెలల కాలంలో లక్ష యూనిట్ల అమ్మకాలను పొందిన గ్రాండ్ విటారా.. ఆ తరువాత కూడా అధిక అమ్మకాలను పొందగలిగింది. దీంతో కేవలం 10 నెలల కాలంలోనే మరో లక్షల యూనిట్ల అమ్మకాలను పొందగలిగింది. గ్రాండ్ విటారా మంచి డిజైన్, ఫీచర్స్ కలిగి ఉత్తమ పనితీరును అందిస్తుంది. ఈ కారణంగానే ఈ కారు ఉత్తమ అమ్మకాలను పొందగలిగింది. -
మారుతీ రికార్డుల స్పీడ్
న్యూఢిల్లీ: కార్ల తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ గత ఆర్థిక సంవత్సరం(2023–24) చివరి త్రైమాసికంతోపాటు పూర్తి ఏడాదికి ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. జనవరి–మార్చి(క్యూ4)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 48 శాతం జంప్‌చేసి రూ. 3,878 కోట్లను తాకింది. ఇది రికార్డుకాగా.. ఇందుకు జోరందుకున్న ఎస్యూవీ అమ్మకాలు, తగ్గిన కమోడిటీ ధరలు, వ్యయ నియంత్రణలు సహకరించాయి.అంతక్రితం ఏడాది(2022–23) క్యూ4లో కేవలం రూ. 2,624 కోట్లు ఆర్జించింది. వాటాదారులకు కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా షేరుకి రూ. 125 చొప్పున డివిడెండ్ ప్రకటించింది. మొత్తం ఆదాయం రూ. 30,822 కోట్ల నుంచి రూ. 36,697 కోట్లకు ఎగసింది. ఈ కాలంలో 13 శాతం అధికంగా 5,84,031 వాహనాలు విక్రయించింది. వీటిలో దేశీయంగా 5,05,291 యూనిట్లు విక్రయిస్తే.. 22% అధికంగా 78,740 వాహనాలు ఎగుమతి చేసింది. టాప్ ఎక్స్పోర్టర్మార్చితో ముగిసిన పూర్తి ఏడాదికి మారుతీ వాహన విక్రయాలు సరికొత్త రికార్డును నెలకొల్పుతూ 20 లక్షల యూనిట్లను అధిగమించాయి. దాదాపు 9 శాతం వృద్ధితో 21,35,323 యూనిట్లు అమ్ముడయ్యాయి. వీటిలో దేశీ విక్రయాలు 18,52,256కాగా.. 2,83,067 వాహనాలను ఎగుమతి చేసింది. తద్వారా మొత్తం ప్యాసింజర్ వాహన దేశీ ఎగుమతుల్లో 42 శాతం వాటాను ఆక్రమించింది. వెరసి వరుసగా మూడో ఏడాదిలోనూ టాప్ ఎక్స్‌పోర్టర్‌గా నిలిచింది. ఇక 2023–24లో నికర లాభం 64 శాతం దూసుకెళ్లి రూ. 13,209 కోట్లను అధిగమించింది. నికర అమ్మకాలు 20 శాతం వృద్ధితో రూ. 1,34,938 కోట్లకు చేరగా.. 2022–23లో ఇవి రూ. 1,12,501 కోట్లుగా నమోదయ్యాయి. క్యూ4 సహా పూర్తిఏడాదికి లాభాలు, అమ్మ కాలలో సరికొత్త రికార్డులు సాధించినట్లు కంపెనీ పేర్కొంది. ఈ ఏడాది ఎలక్ట్రిక్ వాహనాలుప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి ఎలక్ట్రిక్ వాహనాన్ని ఉత్పత్తి చేస్తున్నాం. తొలిగా వీటిని యూరోపియన్ దేశాలకు ఎగుమతి చేయనున్నాం.–ఆర్సీ భార్గవ, మారుతీ చైర్మన్లాభాల స్వీకరణతో మారుతీ షేరు బీఎస్ఈలో 1.7 శాతం నీరసించి రూ. 12,687 వద్ద ముగిసింది. -
మారుతి టూర్ హెచ్1 - దుమ్మురేపే మైలేజ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా టూర్ హెచ్1 పేరుతో సరికొత్త కారును ప్రవేశపెట్టింది. భారత్‌లో అధిక మైలేజీ ఇచ్చే ప్రారంభ స్థాయి కమర్షియల్ హ్యాచ్‌బ్యాక్ ఇదేనని కంపెనీ ప్రకటించింది. మైలేజీ పెట్రోల్ వెర్షన్ లీటరుకు 24.60 కిలోమీటర్లు, సీఎన్జీ వేరియంట్ కిలోకు 34.46 కిలోమీటర్లు ఇస్తుందని వెల్లడించింది. ధర రూ.4.8 లక్షల నుంచి ప్రారంభం. సీఎన్జీ వేరియంట్ ధర రూ.5.7 లక్షలు. ఆల్టో కే10 ఆధారంగా టూర్ హెచ్1 రూపొందింది. కె–సిరీస్ 1.0 లీటర్ డ్యూయల్ జెట్ ఇంజిన్ పొందుపరిచారు. రెండు ఎయిర్‌బ్యాగ్స్, ప్రిటెన్షనర్, ఫోర్స్ లిమిటర్‌తో ముందు సీట్ బెల్ట్‌లు, సీట్ బెల్ట్ రిమైండర్, ఇంజిన్ ఇమ్మొబిలైజర్, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్‌తో యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, స్పీడ్ లిమిటింగ్ సిస్టమ్, రివర్స్ పార్కింగ్ సెన్సార్ వంటి హంగులు జోడించారు. -
తగ్గేదేలే అంటున్న కార్ల అమ్మకాలు.. తొలి నెలలోనే అదరగొట్టారు
ముంబై: కొత్త క్యాలండర్ ఏడాది(2023) తొలి నెలలో కార్ల అమ్మకాలు జోరందుకున్నాయి. దిగ్గజాలు మారుతీ సుజుకీ, టాటా మోటార్స్, ఎంఅండ్ఎం, టీకేఎం, కియా ఇండియా, హ్యుందాయ్ జనవరిలో పటిష్ట విక్రయాలను సాధించాయి. అయితే ఎంజీ మోటార్, హోండా మాత్రం వాహన విక్రయాలలో వెనకడుగు వేశాయి. మారుతీ 12 శాతం అధికంగా 1,72,535 వాహనాలను విక్రయించగా.. ఎంఅండ్ఎం 37 శాతం వృద్ధితో 64,335 వాహనాలను అమ్మింది. ఈ బాటలో టాటా మోటార్స్ అమ్మకాలు సైతం 6 శాతం పుంజుకుని 81,069 వాహనాలకు చేరాయి. టయోటా కిర్లోస్కర్ మోటార్(టీకేఎం) అమ్మకాలు 175 శాతం జంప్‌చేసి 12,835 యూనిట్లను తాకాయి. కియా ఇండియా అమ్మకాలు 48 శాతం మెరుగుపడి 28,634 యూనిట్లకు చేరగా.. హ్యుండాయ్ మోటార్ ఇండియా 17 శాతం అధికంగా 62,276 వాహనాలను విక్రయించింది. చదవండి: Union Budget 2023-24: పెరిగేవి, తగ్గేవి ఇవే! -
ఆ కంపెనీ భారీ ప్లాన్.. లీటర్‌కి 40 కి.మీ వరకు మైలేజ్‌తో నడిచే కార్లు వస్తున్నాయట!
ఇటీవల కార్ల వాడకం పెరుగుతోంది. ఇదివరకు కస్టమర్లు స్టైలిష్ లుక్, సాకర్యాలు, ఫీచర్ల, ధరను చూసేవాళ్లు. ప్రస్తుతం ఇంధన ధరల భారీగా పెరుగుతున్న నేపథ్యంలో వాటిపై కూడా ఓ కన్నేస్తున్నారు. కొంతవరకు, (CNG) సీఎన్జీ ఇంధనం ఈ సమస్యను పరిష్కరించడంలో సహాయపడింది. అయితే ఇప్పుడు సీఎన్జీ ధరలు కూడా పెరుగుతున్నాయి. ఇక ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నాయి, కానీ అవి ప్రస్తుతం కొంచెం ఖరీదుగా ఉండడం, పైగా వాటి ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను పెద్దగా లేకపోవడంతో ప్రత్యామ్నాయం వైపు చూస్తున్నారు. ఇటువంటి సమయంలో, ఎక్కువ మంది కంపెనీలు తమ దృష్టిని హైబ్రిడ్ టెక్నాలజీ కార్ల వైపు మళ్లిస్తున్నాయి. అందుకే రానున్న కాలంలో అదిరిపోయే మైలేజ్‌తో ఉన్న కార్లు మార్కెట్లో విడుదలకు తయారీదారులు ప్లాన్ చేస్తున్నారు. నివేదికల ప్రకారం.. మారుతి నుంచి ఆ రెండు కార్లు ప్రస్తుతం ఉన్న స్విఫ్ట్, డిజైర్ మారుతి కంపెనీ నుంచి అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో ఒకటి. కస్టమర్లు కోరుకునే బడ్జెట్ ధరలతో పాటు ఫీచర్లు, కార్ల పనితీరు కారణంగా ఇవి సేల్స్‌లో దూసుకుపోతున్నాయి. తదపరి మారుతి నుంచి స్విఫ్ట్, డిజైర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీతో రానున్నాయని నివేదికలు చెప్తున్నాయి. మారుతి ఈ రెండు మోడళ్లలో 1.2 లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌ను అమర్చే అవకాశం ఉంది. ఈ కార్ల ఇంజిన్లు కూడా టయోటా స్ట్రాంగ్ హైబ్రిడ్ టెక్నాలజీతో తయారు కావచ్చని సమాచారం. నివేదికల ప్రకారం.. మారుతి స్విఫ్ట్, మారుతి డిజైర్ హైబ్రిడ్ మోడల్ కార్లు దేశంలో అత్యంత ఇంధన-సమర్థవంతమైన వాహనాలుగా మారనున్నాయి. ఇవి 35 km/l నుంచి 40 km/l వరకు మైలేజ్ వచ్చే అవకాశం ఉంది. హైబ్రిడ్ టెక్నాలజీతో స్విఫ్ట్ , డిజైర్ 2024 తొలి త్రైమాసికంలో మార్కెట్లో రావొచ్చు. ప్రస్తుతం మైలేజ్ పరంగా గ్రాండ్ విటారా SUV 27.97 కిమీ/లీతో ఫ్యూయల్ ఎకానమీ చార్ట్‌లలో ముందుంది. ఇదిలా ఉండగా మారుతీ సుజుకీ మాత్రం ఈ కొత్త స్ట్రాంగ్ హైబ్రిడ్ మోడళ్ల అంశంపై ఎలాంటి ప్రకటన చేయలేదు. చదవండి: నగదు చెల్లింపుల కోసం క్యూ ఆర్ కోడ్ స్కాన్.. ఇవి తెలుసుకోకపోతే జేబుకి చిల్లే! -
తిరుగులేని మోడల్, సరికొత్త రికార్డ్లను క్రియేట్ చేసిన మారుతి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న మారుతి సుజుకీ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్ కారు కొత్త రికార్డు సృష్టించింది. గడిచిన 16 ఏళ్లలో మొత్తం 25 లక్షల పైచిలుకు స్విఫ్ట్ కార్లు రోడ్డెక్కాయి. విక్రయాల పరంగా గత ఆర్థిక సంవత్సరంలో ఈ మోడల్ ముందంజలో ఉంది. భారత్‌లో 2005లో స్విఫ్ట్ రంగ ప్రవేశం చేసింది. రూపు, సామర్థ్యం పరంగా అద్భుతమైన వారసత్వాన్ని ఈ మోడల్ సృష్టించిందని కంపెనీ మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. ‘ఈ విజయం బ్రాండ్ స్విఫ్ట్ పట్ల వినియోగదారులు, విమర్శకుల ప్రేమకు నిదర్శనం. 35 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న 52 శాతం మంది వినియోగదార్లతో.. యువ కస్టమర్ల మారుతున్న ఆకాంక్షలకు అనుగుణంగా స్విఫ్ట్ నిరంతరం కొత్తదనాన్ని సంతరించుకుంటోంది’ అని వివరించారు. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, మాన్యువల్, ఆటో గేర్ షిఫ్ట్ ట్రాన్స్‌మిషన్‌తో ఈ కారు రూపుదిద్దుకుంది. ట్రాన్స్మిషన్నుబట్టి లీటరుకు 23.20–23.76 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ తెలిపింది. చదవండి: పండుగ సెంటిమెంట్, కార్లను తెగకొనేస్తున్నారు -
లీజుకు మారుతీ కార్లు
సాక్షి, న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద కార్ల తయారీ కంపెనీ మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ).. అద్దె వాహన సేవలను ప్రారంభించింది. ‘మారుతీ సుజుకీ సబ్‌స్క్రైబ్’ పేరిట తాజా సర్వీసులను గురువారం అందుబాటులోకి తెచ్చింది. ఈ విధానంలో కస్టమర్లు కారును కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా, లీజు పద్ధతిలో నచ్చిన కారును వినియోగించుకోవచ్చు. మారుతీ స్విఫ్ట్, డిజైర్, విటారా బ్రెజా, నెక్సా, బాలెనో, ఎర్టిగా, సియాజ్, ఎక్స్ఎల్ 6 కార్లను లీజు సభ్యత్వ సేవలో పొందవచ్చని కంపెనీ ప్రకటించింది. 24, 36, 48 నెలల కాలపరిమితితో ఈ కార్లను అందజేస్తున్నట్లు వివరించింది. నెలవారీ చందాలోనే కారు నిర్వహణ, బీమా మొత్తాలు కలిపి ఉంటాయని స్పష్టం చేసింది. భారత్‌లో ఈ సేవలను అందించడం కోసం.. జపాన్‌కు చెందిన ఒరిక్స్ ఆటో ఇన్ఫ్రాస్ట్రక్చర్ సర్వీసెస్ లిమిటెడ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రస్తుతం బెంగళూరు, గురుగ్రామ్ నగరాల్లో లీజింగ్ సేవలను అందిస్తున్నామని, త్వరలోనే ఈ సేవలను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానున్నట్లు స్టాక్ ఎక్స్చేంజీ ఇచ్చిన సమాచారంలో వెల్లడించింది. -
షోరూంలో మారుతీ కారు చోరీ
మారుతి కార్ల షోరూం నుంచి కొత్త మారుతి కారు చోరీకి గురైంది. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలోని మారుతి షోరూం తాళాలు పగలగొట్టిన గుర్తుతెలియని దుండగులు బుధవారం అర్ధరాత్రి కొత్త కారును ఎత్తుకెళ్లారు. గురువారం ఇది గుర్తించిన మేనేజర్ పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.