హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న మారుతి సుజుకీ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్ కారు కొత్త రికార్డు సృష్టించింది. గడిచిన 16 ఏళ్లలో మొత్తం 25 లక్షల పైచిలుకు స్విఫ్ట్ కార్లు రోడ్డెక్కాయి. విక్రయాల పరంగా గత ఆర్థిక సంవత్సరంలో ఈ మోడల్ ముందంజలో ఉంది.
భారత్‌లో 2005లో స్విఫ్ట్ రంగ ప్రవేశం చేసింది. రూపు, సామర్థ్యం పరంగా అద్భుతమైన వారసత్వాన్ని ఈ మోడల్ సృష్టించిందని కంపెనీ మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. ‘ఈ విజయం బ్రాండ్ స్విఫ్ట్ పట్ల వినియోగదారులు, విమర్శకుల ప్రేమకు నిదర్శనం. 35 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న 52 శాతం మంది వినియోగదార్లతో.. యువ కస్టమర్ల మారుతున్న ఆకాంక్షలకు అనుగుణంగా స్విఫ్ట్ నిరంతరం కొత్తదనాన్ని సంతరించుకుంటోంది’ అని వివరించారు.
1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, మాన్యువల్, ఆటో గేర్ షిఫ్ట్ ట్రాన్స్‌మిషన్‌తో ఈ కారు రూపుదిద్దుకుంది. ట్రాన్స్‌మిషన్‌నుబట్టి లీటరుకు 23.20–23.76 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment