Swift
-
ఫెస్టివ్ సీజన్: మారుతి కార్లపై భారీ తగ్గింపు
ఫెస్టివ్ సీజన్ సందర్బంగా దేశీయ కార్ల దిగ్గజం మారుతి సుజుకి తన కార్లపై భారీ తగ్గింపును ప్రకటించింది. సెప్టెంబర్ 2023లో మారుతీ సుజుకి కార్ లవర్స్ కోసం భారీ డిస్కౌంట్లు ప్రకటించింది.మారుతి పాపులర్ మోడల్స్ ఆల్టో కే10, S-ప్రెస్సో, వ్యాగన్ఆర్, ఈకో, సెలెరియో, స్విఫ్ట్, డిజైర్, బ్రెజ్జా, ఎర్టిగా వంటి పాపులర్ మోడల్స్ దాదాపు 60వేల దాకా తగ్గింపుతో అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్టులో మంత్లీ సేల్స్ పరంగా టాప్ పొజిషన్లో నిలిచిన మారుతి, పండుగ సీజన్లో సేల్స్ మరింత పెంచుకోవడంపై ఫోకస్ చేసింది. ఈ నెలలో మారుతి సుజుకి మోడల్స్‌పై అందుబాటులో ఉన్న ఆఫర్లు ఇప్పుడు చూద్దాం. (జీ20 సమ్మిట్: మెగా రైల్వే అండ్ షిప్పింగ్ ప్రాజెక్ట్‌పై ఉత్కంఠ) మారుతి సుజుకి స్విఫ్ట్ ఐకానిక్ కారు కొనుగోలుపై రూ.60,000 వరకు ప్రయోజనాలు లభ్యం. ఇందులో రూ.35,000 క్యాష్ డిస్కౌంట్, రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్ ఉన్నాయి. అదనంగా సెలక్టెడ్ ట్రిమ్‌లపై రూ.5,000 కార్పొరేట్ డిస్కౌంట్ లభిస్తుంది. (బంగారం ధర దిగింది: కిలో వెండి ధర ఎలా ఉందంటే?) మారుతి సుజుకి డిజైర్: రూ.10,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌తో అందుబాటులో ఉంది. కానీ ఎలాంటి నగదు ప్రయోజనాన్ని అందించలేదు. అలాగే ఎక్స్ఛేంజ్ బోనస్ పెట్రోల్ ట్రిమ్‌లకు మాత్రమే అనేది గమనించాలి. ( సెలెరియో: కారుపై రూ.20,000 ఎక్స్ఛేంజ్ బోనస్‌తో పాటు రూ.40,000 క్యాష్ డిస్కౌంట్, రూ.4,000 కార్పొరేట్ బెనిఫిట్‌ను అందిస్తోంది.అలాగే మారుతి సుజుకి ఆల్టో K10పై రూ.54,000 వరకు డిస్కౌంట్. ఇందులో బ్రాండ్ రూ.15,000 ఎక్స్చేంజ్ బోనస్‌తో కలిపి రూ.35,000 వరకు క్యాష్ బెనిఫిట్ లభ్యం. వ్యాగన్ఆర్: మారుతికి చెందిన మరో పాపులర్కారుపై రూ.20,000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్, రూ.35,000 వరకు క్యాష్ డిస్కౌంట్ అందిస్తుంది. అదనంగా రూ.4,000 కార్పొరేట్ బోనస్ డీల్ కూడా పొందవచ్చు. (ఉత్తరాఖండ్ వరదలు:పెద్ద మనసు చాటుకున్న అనంత్ అంబానీ) -
ఇటివల కొత్త ఇంట్లోకి ప్రవేశం.. తాజాగా లగ్జరీ కారు కొన్న నటి శ్రీవాణి
బుల్లితెరపై లేడీ విలన్‌గా విలనీజం చూపించిన నటి శ్రీవాణి. ప్రస్తుతం సీరియల్స్, షోలు మానేసి ఇంటికే పరిమితమైన ఆమె సోషల్ మీడియాలో అలరిస్తోన్న సంగతి తెలిసిందే. సొంతంగా యూట్యూబ్ చానల్ పెట్టి దాని ద్వారా తరచూ తన వ్యక్తిగత విషయాలను, ఇంట్లో జరిగే శుభకార్యలకు సంబంధించిన వ్లాగ్స్ చేసి వీడియోలు షేర్ చేస్తుంది. తన భర్త విక్రమ్ ఆదిత్య, కూతురు నందినిలతో కలిసి ఈ యూట్యూబ్ చానల్‌ను రన్ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఇటివలె కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన ఆమె తాజాగా లగ్జరీ కారు కొనుగోలు చేసింది. మారుతి గ్రాండ్ విటారా కొన్న ఆమె కారు ఫొటోలు, వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అంతేకాదు షో రూంలో కారు కొన్న అనంతరం నుంచి కారుకు పూజ చేయించి.. తన సహానటీనటులకు, సన్నిహితులకు పార్టీ ఇచ్చిన ఫుల్ వీడియోను తన యూట్యూబ్ చానల్లో అప్లోడ్ చేసింది. ఇక ఈ కారు ధర విషయానికి వస్తే రూ. 13 లక్షలపై ఉంటుందని తెలుస్తోంది. కాగా యాంకర్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన శ్రీవాణి, ఆ తర్వాత పలు టీవీ సీరియల్స్‌లో నటించింది. ‘కలవారి కోడలు’, ‘మనసు మమత’, ‘కాంచన గంగ’, ‘చంద్రముఖి’ లాంటి సీరియల్స్‌లో నటించి మంచి గుర్తింపు పొందింది. చదవండి: ఎన్టీఆర్ వర్థంతి నాడు నాగ్ అలా.. ఏఎన్ఆర్ వర్ధంతి నాడు బాలయ్య ఇలా.. విజయ్ ఆంటోని కోమాలోకి వెళ్లాడా? ఆస్పత్రి బెడ్‌పై హీరో.. ఫొటో రిలీజ్! View this post on Instagram A post shared by Strikers (@strikersinsta) -
మారుతి స్విఫ్ట్-2023 కమింగ్ సూన్: ఆకర్షణీయ, అప్డేటెడ్ ఫీచర్లతో
సాక్షి,ముంబై: దేశీయ కార్‌మేకర్ మారుతి సుజుకి తన హ్యాచ్‌బ్యాక్ మారుతి స్విఫ్ట్ మోడల్లో కొత్త వెర్షన్‌ను తీసుకొస్తోంది. కొత్త డిజైన్, అప్డేట్స్, ఇంటీరియర్ అప్‌గ్రేడ్స్‌తో 2023 జనవరి నాటికి కొత్త తరం సుజుకి స్విఫ్ట్‌ను గ్లోబల్‌గా లాంచ్ చేయనుంది. అంతేకాదు 2023లో జరగనున్న ఆటోఎక్స్పోలో దీన్ని ప్రదర్శించవచ్చని ఊహాగానాలు విస్తృతంగా ఉన్నాయి. రానున్నమారుతి స్విఫ్ట్ 2023లో గణనీయమైన కాస్మెటిక్ మార్పులు , ఫీచర్ అప్గ్రేడ్లు చేసే అవకాశం ఉందని ఆటో వర్గాలు భావిస్తున్నాయి. గ్రేటర్ నోయిడాలోని ఇండియా ఎక్స్పో సెంటర్లో ద్వైవార్షిక ఆటోమోటివ్ ఈవెంట్ జనవరి 13 నుండి ప్రారంభం కానుంది. కొత్తగా డిజైన్ చేసిన గ్రిల్, కొత్త సీ-ఎయిర్ స్ప్లిటర్లతో అప్డేట్ చేసిన బంపర్, కొత్త LED ఎలిమెంట్స్‌తో కూడిన స్లీకర్ హెడ్‌ల్యాంప్‌లు , ఫ్రంట్ ఎండ్‌లో.. కొత్త ఫాగ్ ల్యాంప్, డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్, కొత్త బాడీ ప్యానెల్స్, వీల్ ఆర్చ్‌లపై ఫాక్స్ ఎయిర్ వెంట్లు, బ్లాక్ అవుట్ పిల్లర్లు, రూఫ్ మౌంటెడ్ స్పాయిలర్‌తో రివైజ్ చేసినట్టు సమాచారం. దాదాపు కొత్త బాలెనో హ్యాచ్‌బ్యాక్ మాదిరిగానే, హార్ట్‌టెక్ ప్లాట్‌ఫారమ్‌లో డిజైన్ చేసిందట. ఇంకా డ్యూయల్ టోన్ ఇంటీరియర్ ,లెదర్ సీట్లుతొపాటు ఆపిల్ కార్ప్లే ,ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీ, సుజుకి వాయిస్ అసిస్ట్ , OTA (ఓవర్-ది-ఎయిర్ అప్డేట్లు)తో కూడిన పెద్ద ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ (కొత్త స్మార్ట్‌ప్లే ప్రో+) ఉండవచ్చు. దీంతోపాటు 360 డిగ్రీల కెమెరా, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్, లేన్-కీప్ అసిస్ట్ ,అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్ లాంటి ఇతర ఇంటీరియర్ అప్డేట్స్ను అందించనుంది. ఇక ఇంజీన్ విషయానికి వస్తే..1.2 లీటర్ల పెట్రోల్ ఇంజిన్, 5-స్పీడ్ మాన్యువల్ లేదా AMT గేర్‌బాక్స్‌తో ఉండవచ్చు. దీంతో పాటు యూరప్‌తో సహా ఇతర మార్కెట్లలో విక్రయిస్తున్న 1.4 లీటర్ల బూస్టర్‌జెట్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజీన్‌తో, కొత్త తరం సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్‌ను కూడా ఇండియాలో ఆ విష్కరించనుందని అంచనా. అయితే కొత్త స్విఫ్ట్ అరంగేట్రంపై అధికారిక ధృవీకరణ ఇంకా వెలువడాల్సి ఉంది. -
మారుతి బంపర్ ఆఫర్స్: అన్ని మోడల్స్‌పై ఫెస్టివ్ డిస్కౌంట్స్
సాక్షి, ముంబై: దేశీయ టాప్ వాహన తయారీ సంస్థ మారుతి సుజుకి తన కస్టమర్ల కోసం భారీ ఫెస్టివ్ ఆఫర్లను అందిస్తోంది. సీఎన్జీ మోడల్ సహా, పలు కార్ల మోడళ్లపై సుమారు రూ. 56,000 వరకు తగ్గింపును అందిస్తోంది. అరేనా షోరూమ్‌లు ఈ (అక్టోబర్) నెలలో తగ్గింపు ధరలకు అందుబాటులో ఉంటాయి. ఇందులో కార్పొరేట్, క్యాస్, ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా మారుతీ సుజుకి ఆల్టో 800, స్విఫ్ట్ ,వ్యాగన్-ఆర్, సెలెరియో, డిజైర్ సహా పలు కార్లు ఇపుడు తగ్గింపు ధరల్లో లభ్యం. మారుతి సుజుకి డిజైర్ మారుతి సుజుకి ఏఎంటీ వెర్షన్లపై రూ. 52,000 దాకా తగ్గింపు అందిస్తోంది. ఇందులో రూ. 35,000 నగదు తగ్గింపు, రూ. 7,000 కార్పొరేట్ డిస్కౌంట్లు రూ. 10,000 ఎక్స్చేంజ్ బోనస్‌లు ఉన్నాయి. అలాగే మాన్యువల్ ట్రాన్స్మిషన్ మోడల్ కార్లపై రూ. 17,000 తగ్గింపు లభ్యం. మారుతీ సుజుకి S-ప్రెస్సో రూ. 35,000 నగదు తగ్గింపు. రూ. 6,000 కార్పొరేట్, రూ. 15,000 ఎక్స్చేంజ్ ప్రోత్సాహకాలున్నాయి. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో S Presso హై-రైడింగ్ హ్యాచ్‌బ్యాక్‌కు మొత్తం తగ్గింపును రూ. 56,000కి తగ్గింపు లభిస్తుంది. అలాగే S ప్రెస్సో AMT మోడల్లకు మొత్తం రూ. 46వేలు డిస్కౌంట్ లభ్యం. మారుతీ సుజుకి స్విఫ్ట్ అక్టోబర్ నెలలో, మారుతి సుజుకి స్విఫ్ట్ యొక్క ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ (AMT) వెర్షన్లు రూ. 47,000 మొత్తం ప్రయోజనాలకు అర్హమైనవి, స్విఫ్ట్ యొక్క మాన్యువల్ ట్రాన్స్మిషన్ వేరియంట్లు రూ. 30,000 విలువైన మొత్తం ప్రయోజనాలకు అర్హులు. ఆల్టో 800కి మొత్తం రూ. 36,000 తగ్గింపు ఉంటుంది. మారుతి సుజుకి వ్యాగన్-ఆర్ మారుతి సుజుకి డ్యూయల్‌జెట్ టెక్నాలజీతో వచ్చిన రెండు ఎకనామిక్ పెట్రోల్ కార్ల (1.0 ,1.2 లీటర్లు) వ్యాగన్ ఆర్ కొనుగోలుదారులు మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ మోడల్‌లలో రూ. 31,000 ఆదా చేయవచ్చు. అదనంగా, మారుతీ రూ. 15,000 ధర తగ్గింపును కూడా అందిస్తోంది. సీఎన్జీ బేస్ మోడల్, టాప్-టైర్ వేరియంట్‌పై రూ. 5000 తగ్గింపు. మారుతి సుజుకి ఆల్టో K10 కొత్తగా విడుదల చేసిన ఆల్టో కె10 బడ్జెట్ హ్యాచ్‌బ్యాక్ ఆటోమేటిక్ మరియు మాన్యువల్ వెర్షన్లపై రూ.39,500 తగ్గింపును అందిస్తోంది. ఇందులో రూ. 17,500 విలువైన రూ. 7,000 నగదు తగ్గింపు , రూ. 15,000 విలువైన ఎక్స్ఛేంజ్ బోనస్, కార్పొరేట్ రివార్డు ఉన్నాయి. -
మారుతి స్విఫ్ట్ ఎస్-సీఎన్జీ వచ్చేసింది, ఫీచర్లు చూసి వావ్ అనాల్సిందే!
సాక్షి,ముంబై: మారుతి సుజుకి తన పాపులర్ మోడల్ స్విఫ్ట్‌లో S-CNG వెర్షన్‌ను దేశంలో విడుదల చేసింది. హ్యాచ్‌బ్యాక్ కారు రెండు (VXi , ZXi) వేరియంట్లలో అందుబాటులో ఉంది. అంతేకాదు కిలోకి 30.90 కిలోమీటర్లతో మోస్ట్పవర్ఫుల్, అద్భుతమైన ఇంధన సామర్థ్యమున్న హ్యాచ్‌బ్యాక్ కార్ అని కంపెనీ చెబుతోంది. మారుతి కొత్త స్విఫ్ట్ వెర్షన్ ధరలు రూ. 7.77 లక్షల (ఎక్స్-షోరూమ్)నుండి ప్రారంభం. అలాగే నెలవారీ సబ్స్క్రిప్షన్ రుసుముతో రూ. 16,499తో (అన్ని కలుపుకొని) ఈ కారును సొంతం చేసుకోవచ్చని మారుతి వెల్లడించింది. కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ ఎస్-సీఎన్జీ 1.2L K-సిరీస్ డ్యూయల్ జెట్, డ్యూయల్ VVT ఇంజన్‌తో 6,000rpm వద్ద 76bhp, 4,300rpm వద్ద 98Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ యూనిట్‌తో మాత్రమే వచ్చింది. 2022 మారుతి సుజుకి స్విఫ్ట్ S-CNGలో డ్యూయల్ ఇంటర్ డిపెండెంట్ ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్స్, (ECU) ఇంటెలిజెంట్ ఇంజెక్షన్ సిస్టమ్‌ను జోడించింది. తుప్పు ఎలాంటి లీకేజీ లేకుండాస్టెయిన్లెస్ స్టీల్ పైపులు, జాయింట్లతో ఈ మోడల్ మరింత సేఫ్టీగా ఉంటుందని కంపెనీ మారుతీ సుజుకి ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ పేర్కొన్నారు. -
చిన్న వయసు.. పెద్ద ఆలోచన
చిన్న హృదయంలో తట్టిన ఆలోచన ఎందరో మహిళల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. సేవా దృక్పథంతో 42 మంది విద్యార్థులు ఏకమై ఓ సంస్థను నెలకొల్పారు. సింహపురి చిన్నోడి మదిలో మెదిలిన ఆలోచన దేశ, విదేశాలల్లోని విద్యార్థులను కదిలించగా.. వారి దన్నుతో ఆర్థిక సంక్షోభంలో ఉన్న మహిళలను ఆదుకునేందుకు ‘స్విఫ్ట్’ సంస్థ వెలిసింది. రెండేళ్లుగా వడ్డీలేని సూక్ష్మ రుణాలను అందిస్తూ.. లండన్ ప్రిన్స్ విలియమ్స్ మనసు గెలుచుకుని.. ‘ప్రిన్స్ డయానా’ అవార్డు దక్కించుకున్నారు. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: నెల్లూరు నగరంలోని రాంజీనగర్‌కు చెందిన కొరిశపాటి గోభాను శశాంకర్ అనే విద్యార్థికి పట్టుమని పదిహేడేళ్లు కూడా లేవు. మస్కట్‌లోని ఇంటర్నేషనల్ స్కూల్లో 11వ తరగతి చదువుతున్నాడు. మైక్రో ఫైనాన్స్‌పై ఆసక్తి పెంచుకుని వినూత్న సేవపై దృష్టి సారించాడు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న మహిళలను ఆదుకోవడం కోసం 2019 డిసెంబరులో ‘సస్టెయినింగ్ ఉమన్ ఇన్ మైక్రో ఫైనాన్స్ టర్మేయిల్’ (స్విఫ్ట్) పేరిట సూక్ష్మ రుణ సంస్థను ప్రారంభించాడు. దీనికి 42 మంది తోటి విద్యార్థుల మద్దతు లభించింది. వారంతా కలిసికట్టుగా పని చేస్తామని ధ్రువీకరిస్తూ విధి విధానాలను షేర్ చేసుకున్నారు. అలా ప్రారంభమైన స్విఫ్ట్ సంస్థ దినదినాభివృద్ధి చెందుతోంది. ఆన్లైన్ ద్వారా మహిళలకు వడ్డీలేని రుణాలందించాలనే లక్ష్యం మేరకు నిరాటంకంగా రుణాలందిస్తున్నారు. రెండేళ్లలో వ్యక్తిగత, గ్రూపులతో కలిసి 1,450 రుణాలను మంజూరు చేశారు. వివిధ ప్రాంతాలకు చెందిన మహిళలకు రూ.60 లక్షలను ఆన్లైన్ ద్వారా అందించారు. రూ.25 లక్షలతో ప్రారంభం విద్యార్థులతో ఏర్పాటైన ఈ సంస్థ రూ.25 లక్షలతో మైక్రో ఫైనాన్స్ కార్యకలాపాలను మొదలుపెట్టింది. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న మహిళలకు ఆ సంస్థ ఓ ప్రశ్నావళిని (క్వశ్చనీర్) ఆన్లైన్లోనే అందుబాటులో ఉంచుతోంది. రుణం అవసరమైన వారు దానిని నింపితే.. వారి బ్యాంక్ ఖాతాకు రుణం జమ అవుతోంది. ఇలా రుణం పొందిన మహిళలు వారు తీసుకున్న మొత్తం ఆధారంగా వాయిదాల రూపంలో తిరిగి చెల్లించాల్సి ఉంది. ఒక్కొక్కరికీ రూ.2,500 నుంచి రూ.40 వేల వరకు రుణం అందించారు. వారిలో గ్రూపులుగా ఏర్పడి రుణాలు పొందిన వారూ ఉన్నారు. స్విఫ్ట్ సంస్థకు రుణగ్రహీతల నుంచి కూడా మంచి సహకారం దక్కుతోంది. 98 శాతం మంది రుణాలు తిరిగి చెల్లిస్తున్నారు. ఇలా ప్రస్తుతం రూ.60 లక్షలను వివిధ వృత్తులు, వ్యాపారాల్లో ఉన్న మహిళలకు రుణాలుగా అందించారు. ప్రిన్స్ డయానా అవార్డుకు ఎంపిక సామాజిక దృక్పథం, మానవీయ విలువలు ఉన్న వారికి దివంగత లండన్ రాణి డయానా అవార్డును ప్రిన్స్ విలియమ్స్ ఏటా అందిస్తారు. విద్యార్థులతో ఏర్పాటైన స్విఫ్ట్ సంస్థ ఈసారి ప్రిన్స్ విలియమ్స్ మనసు గెల్చుకుంది. చిన్న వయసులో సామాజిక దృక్పథంతో.. లాభాపేక్ష లేకుండా సోషల్ ప్లాట్‌ఫామ్ ఆధారంగా మహిళలకు అండగా నిలుస్తున్న స్విఫ్ట్ సంస్థను డయానా అవార్డుకు ఎంపిక చేశారు. ఈ విషయాన్ని స్విఫ్ట్ సంస్థకు ఈ–మెయిల్ ద్వారా తెలియజేశారు. మరింత బాధ్యత పెరిగింది ప్రిన్స్ డయానా అవార్డు దక్కడం సంతోషంగా ఉంది. మహిళలకు దన్నుగా నిలవాలనే దృక్పథంతో ఆర్థికంగా చేయూత అందిస్తూ వడ్డీ లేని సూక్ష్మ రుణాలు ఇస్తున్నాం. నా తోటి 42 మంది విద్యార్థులతో స్విఫ్ట్ సంస్థను ఏర్పాటు చేశాం. swiftmfi.org వెబ్సైట్ ద్వారా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాం. – గోభాను శశాంకర్, స్విఫ్ట్ ఫౌండర్ -
2022లో ఇప్పటివరకూ టాప్ సెల్లింగ్ కార్లు ఇవే!
సాక్షి, ముంబై: 2022 మొదటి అర్ధభాగంలో కార్ల అమ్మకాలు ప్రతికూల వృద్ధిని నమోదు చేశాయి. 2022 జనవరి- జూన్ వరకు అత్యధికంగా అమ్ముడైన కార్ల మోడల్స్‌లో మారుతి సుజుకి టాప్ లో నిలిచింది. ఈ ఏడాది విక్రయాల్లో టాప్-10 కార్లలో తొలి ఐదు స్థానాలను ఆక్రమించడం విశేషం. పాపులర్ మోడల్స్ వ్యాగన్-ఆర్, స్విఫ్ట్, బాలెనో, డిజైర్, ఆల్టో లాంటి మోడల్స్ ఉన్నాయి. అయితే 2021 మొదటి అర్ధభాగంలో అమ్మకాలతో ఈ ఏడాది ఇదే సమాయానికి అమ్మకాల్లో తగ్గుదల కనిపించింది. మారుతి సుజుకి స్విఫ్ట్, బాలెనో, ఆల్టో లాంటి కార్లతోపాటు, టాటా , హ్యుందాయ్ మోడల్ అమ్మకాలు బాగా పడిపోయాయి. టాప్ 10 బెస్ట్ సెల్లింగ్ కార్ల జాబితాలో మారుతి సుజుకి ది వ్యాగన్ R, స్విఫ్ట్, డిజైర్, బాలెనో , ఆల్టోతో సేల్స్ చార్ట్‌లో అగ్రస్థానంలో ఉంది. వ్యాగన్ ఆర్ 20 శాతం వృద్ధితో 1,13,407 కార్లు అమ్ముడయ్యాయి. డిజైర్ 21 శాతం వార్షిక అమ్మకాలను నమోదు చేసింది. ఐదు మోడళ్లలో, వరుసగా 91,177 యూనిట్లు, 85,929 యూనిట్లు, 74,892 యూనిట్లు, 68,660 కార్లను సేల్ చేఏసింది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 52,333 యూనిట్లను విక్రయాలతో ఆరవ స్థానంలో నిలిచింది. గత ఏడాదితో పోలిస్తే అమ్మకాలు 7 శాతం క్షీణించాయి. గత ఏడాది ఇదే కాలంలో హ్యుందాయ్ 56,286 యూనిట్లను విక్రయించింది. సెలెరియో, S-ప్రెస్సో వరుసగా 46,764 యూనిట్లు , 34,123 యూనిట్లతో మారుతి సుజుకి ఏడు, ఎనిమిదవ స్థానాలను కైవసం చేసుకుంది. మారుతి సుజుకి సెలెరియో 144 శాతం వృద్ధిని నమోదు చేయగా, ఎస్-ప్రెస్సో 4 శాతం వృద్ధిని నమోదు చేసింది. హ్యుందాయ్ i20 తొమ్మిదో ప్లేస్‌లో ఉంది. గత సంవత్సరం 41,326 యూనిట్లతో పోలిస్తే 34,119 యూనిట్లను విక్రయించి, 17 శాతం ప్రతికూల వృద్ధిని నమోదు చేసింది. టాటా ఆల్ట్రోజ్ 28,808 యూనిట్లతో టాప్-10 లో నిలిచింది. దీని అమ్మకాలు కూడా 23 శాతం పడిపోయాయి.. -
Russia Ukraine war: రష్యాపై ఆంక్షలకు ఈయూ ఆమోదం
కీవ్/మాస్కో: రష్యా నుంచి చమురు దిగుమతిపై నిషేధంతో సహా పలు ఆంక్షలను యూరోపియన్ యూనియన్(ఈయూ) శుక్రవారం అధికారికంగా ఆమోదముద్ర వేసింది. రాబోయే ఆరు నెలల్లో రష్యా నుంచి చమురు దిగుమతులను పూర్తిగా నిలిపివేస్తామని ఈయూ ప్రధాన కార్యాలయం వెల్లడించింది. ఇతర పెట్రోలియం ఉత్పత్తులపై నిషేధాన్ని వచ్చే ఎనిమిది నెలల్లో పూర్తిగా నిషేధిస్తామని పేర్కొంది. హంగేరి, చెక్ రిపబ్లిక్, స్లొవేకియా, బల్గేరియా, క్రొయేషియా తదితర దేశాల అవసరాలను దృష్టిలో పెట్టుకొని తాత్కాలికంగా కొన్ని మినహాయింపులు ఇచ్చినట్లు తెలిపింది. ఈ ఏడాది ఆఖరు నాటికి రష్యా నుంచి చమురు దిగుమతులను 90 శాతం నిలిపేస్తామని ఈయూ నేతలు ప్రకటించారు. అంతర్జాతీయ బ్యాంకు లావాదేవీలకు వేదిక అయిన ‘స్విఫ్ట్’ వ్యవస్థను రష్యా ఉపయోగించుకోకుండా ఈయూ ఇప్పటికే కట్టడి చేసింది. రష్యా టీవీ చానళ్లను కూడా ఈయూ నిషేధించింది. రష్యా క్రూర దాడులు: జెలెన్స్కీ తూర్పు డోన్బాస్లో భీకర యుద్ధం కొనసాగుతోందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ చెప్పారు. రష్యా క్రూరంగా దాడులు చేస్తోందని ఆరోపించారు. సీవిరోడోంటెస్క్‌లో రష్యా దాడులను తిప్పికొట్టడంలో తాము కొంత పురోగతి సాధించామని అన్నారు. సమీపంలోని లీసిచాన్స్క్, బఖ్‌ముత్‌లో పరిస్థితి సంక్లిష్టంగానే ఉందని తెలిపారు. పలు నగరాలు, పట్టణాలపై రష్యా సేనలు క్షిపణి దాడులు కొనసాగిస్తున్నాయని పేర్కొన్నారు. డోన్బాస్లో రష్యా అనుకూల వేర్పాటువాదుల ఆధీనంలో ఉన్న ప్రాంతాల నుంచి జనాన్ని సమీకరించి, యుద్ధ రంగంలోకి దించుతున్నారని జెలెన్స్కీ ఆరోపించారు. సాధారణ ప్రజలను ముందు వరుసలో ఉంచి, వారి వెనుక రష్యా సైనికులు వస్తున్నారని వెల్లడించారు. మున్ముందు మరింత సిగ్గుమాలిన, హేయమైన పరిణామాలను చూడబోతున్నామని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్‌కు అత్యాధునిక రాకెట్ సిస్టమ్స్ ఇచ్చేందుకు అంగీకరించిన అమెరికాకు జెలెన్స్కీ కృతజ్ఞతలు తెలిపారు. లీసిచాన్స్క్.. 60 శాతం ధ్వంసం తూర్పు ఉక్రెయిన్‌లోని రెండు ప్రధాన నగరాల్లో ఒకటైన లీసిచాన్‌స్క్‌లో రష్యా సేనలు క్షిపణుల మోత మోగిస్తున్నాయి. సిటీలో 60 శాతం మౌలిక సదుపాయాలు, నివాస భవనాలు ధ్వంసమయ్యాయి. రష్యా నిరంతర దాడుల వల్ల విద్యుత్, సహజ వాయువు, టెలిఫోన్; ఇంటర్నెట్ సర్వీసులు నిలిచిపోయినట్లు స్థానిక అధికారి ఒలెగ్జాండ్రా జైకా చెప్పారు. బఖ్ముత్–లీసిచాన్స్క్ రహదారిపై రాకపోకలకు అంతరాయం కలుగుతోందన్నారు. లీసిచాన్స్క్ నుంచి ఇప్పటిదాకా 20,000 మంది పౌరులకు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోయారు. గతంలో ఇక్కడ 97,000 జనాభా ఉండేది. షోల్జ్‌తో ఉక్రెయిన్ పార్లమెంట్ స్పీకర్ భేటీ ఉక్రెయిన్ పార్లమెంట్ స్పీకర్ రుస్లాన్ స్టెఫాన్చుక్ జర్మనీ చాన్సలర్ ఒలాఫ్ షోల్జ్‌తో బెర్లిన్‌లో సమావేశమయ్యారు. తమ పార్లమెంట్ సభ్యులను ఉద్దేశించి మాట్లాడాలని కోరారు. జర్మనీ పార్లమెంట్ సమావేశంలో స్టెఫాన్చుక్ పాల్గొన్నారు. జర్మనీ పార్లమెంట్ స్పీకర్ బెయిర్బెల్ బాస్ ఆయనకు స్వాగతం పలికారు. ఉక్రెయిన్‌లో పౌర మరణాలు 4,945: ఐరాస రష్యా దాడుల వల్ల ఉక్రెయిన్‌లో 9,094 మంది సాధారణ పౌరులు బాధితులుగా మారారని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హైకమిషనర్ కార్యాలయం తాజా నివేదికలో వెల్లడించింది. 4,149 మంది ప్రాణాలు కోల్పోయారని, 4,945 మంది క్షతగాత్రులయ్యారని తెలియజేసింది. బలమైన పేలుడు సంభవించే ఆయుధాల వల్లే ఎక్కువ మంది మరణించారని, గాయపడ్డారని పేర్కొంది. ఉక్రెయిన్‌పై రష్యా సైన్యం భారీ వైమానిక దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. రష్యా ప్రారంభించిన యుద్ధంలో తమ దేశంలో 243 మంది చిన్నారులు బలయ్యారని, 446 మంది గాయాలపాలయ్యారని ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్ జనరల్ కార్యాలయం వివరించింది. -
స్విఫ్ట్ నుంచి బహిష్కరణ.. రష్యాకు నిజంగానే నష్టమా?
ఆంక్షలతో రష్యాను ఉక్కిరి బిక్కిరి చేస్తున్న పాశ్చాత్య దేశాలు.. మరో కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. స్విఫ్ట్ నుంచి రష్యాను బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఇది ఇక్కడితోనే ఆగలేదు.. రష్యా కంపెనీలు, కుబేరులకు ఉన్న ఆస్తులను గుర్తించి జప్తు చేసేందుకు ఉమ్మడి టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయాలని కూడా అమెరికా, యూరోపియన్ కమిషన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, ఇంగ్లండ్, కెనడా నిర్ణయించాయి. పుతిన్‌కు ఈ యుద్ధం అతిపెద్ద వ్యూహాత్మక వైఫల్యంగా మిగిలిపోయేలా చేసి తీరతామంటూ ఆయా దేశాల నేతలు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. క్రమంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుంచి రష్యాను పూర్తిగా బహిష్కరిస్తామని స్పష్టం చేశారు. ఆర్థిక ఆంక్షల్లో చివరి అస్త్రంగా అభివర్ణించే స్విఫ్ట్ బహిష్కరణ వల్ల నిజంగా రష్యాకు జరిగే నష్టం ఎంతో చూద్దాం.. సొసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలికమ్యూనికేషన్.. షార్ట్ కట్లో స్విఫ్ట్. హెడ్ క్వార్టర్స్ బెల్జియంలో ఉంది. ప్రపంచంలోని 200 దేశాలకు పైగా లావాదేవీలకు అనుసంధానకర్త ఈ స్విఫ్ట్. సుమారు 11 వేలకు పైగా బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు.. ఇందులో సభ్యులుగా ఉంటాయి. స్విఫ్ట్ పేరుకు తగ్గట్లే వేగంగా పని చేస్తుంది. ప్రపంచంలోని ఏ మూల ఉన్నా సరే.. క్షణాల్లో వ్యక్తులు ఆర్థిక లావాదేవీలు నిర్వహించుకోవచ్చన్నమాట. స్విఫ్ట్పరంగా ఆంక్షలు విధిస్తే.. ఆటోమేటిక్‌గా అంతర్జాతీయ సమాజం నుంచి ఆ దేశం దూరమైనట్లే లెక్క!. అలాగే అవసరం అనుకుంటే ఆ నిషేధాన్ని ఎత్తేయొచ్చు కూడా. ఎఫెక్ట్ ఎంతంటే.. మరి స్విఫ్ట్ నుంచి రష్యాను తొలగించడం వల్ల ఏమేర ప్రభావం ఉంటుందంటే.. రష్యా బ్యాంకులు అమెరికా, కెనడా, యూరప్‌లోని బ్యాంకులతో అనుసంధానం కాలేవు. ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోతాయి(ఆల్రెడీ పోయాయి కూడా). ముఖ్యంగా రష్యా ధనికులపై తీవ్ర ప్రభావం పడుతుంది. రష్యా బ్యాంకుల కార్యకలాపాలు విదేశీయంగా నిలిచిపోతాయి. ఏటీఎం, నెట్‌బ్యాంకింగ్ సహా ఏవీ పని చేయవు. క్రమక్రమంగా రష్యాలోనూ ఈ ప్రభావం చూపెట్టే అవకాశాలు ఉన్నాయి. రష్యా సెంట్రల్ బ్యాంకు దగ్గర ఉన్న దాదాపు 60 వేల కోట్ల డాలర్లకు పైగా విదేశీ మారక ద్రవ్య నిధులపైనా ఈ నిషేధం కొనసాగుతుంది. చివరికి.. రష్యా కీలక సంపద చమురు, సహజవాయువు ఎగుమతులపైకు కూడా స్విఫ్ట్ వ్యవస్థ అవసరం. పరిస్థితి చేజారితే.. రష్యా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే అవకాశం లేకపోలేదు. అందుకే నిషేధంపై రష్యా లోలోపల గుర్రుగా ఉంది. అయితే దీనివల్ల తమకొచ్చిన నష్టం లేదని, స్విఫ్ట్‌కు ప్రత్యామ్నయ వ్యవస్థ ఏర్పాటు చేసుకుంటామని పైకి మేకపోతే గాంభీర్యం ప్రదర్శిస్తోంది. ఇంతకు ముందు.. ఇలా స్విఫ్ట్ ఆంక్షలు విధించడం గతంలోనూ జరిగింది. అణు ఒప్పందాన్ని ఉల్లంఘించిన ఇరాన్‌పై ఈ తరహా నిషేధం విధించడం వల్ల .. విదేశీ వాణిజ్యంలో 30 శాతం నష్టపోయింది. ఇంతకుముందు రష్యాకు ఓసారి స్విఫ్ట్ వార్నింగ్ పడింది కూడా. 2014 క్రిమియా (ఉక్రెయిన్ ఆధీనంలో ఉండేది) ఆక్రమణ సందర్భంగా స్విఫ్ట్ నిషేధం విధిస్తామని పాశ్చాత్య దేశాలు బెదిరించగా.. ఇది యుద్ధమే అవుతుందంటూ రష్యా ప్రకటించడంతో వెనక్కి తగ్గాయి. యూరప్ దేశాల నుంచి అభ్యంతరాలు? ఆర్థికంగా రష్యా రెక్కలు విరిచే చర్యలను అమెరికా, నాటో సభ్య దేశాలు ఒక్కొక్కటిగా అమల్లో పెడుతున్నాయి. అయితే.. యూరప్ తో రష్యా ఏడాదికి 8 వేల కోట్ల యూరోలకు పైనే వాణిజ్యం జరుపుతోంది. అందుకే స్విఫ్ట్‌పై పలు యూరప్ దేశాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అయితే ఉక్రెయిన్‌పై మొండిగా రష్యా ముందుకు పోతుండడంతో.. నిన్నటిదాకా వ్యతిరేకించిన యూరప్ దేశాలు సైతం అంగీకారం చెప్తుండడం విశేషం. అంతేకాదు ఆంక్షలను సమర్థవంతంగా అమలు చేసేందుకు టట్రాన్స్ అట్లాంటిక్ సంయుక్త కార్యదళాన్ని ఏర్పాటు చేయనున్నట్లు యూరప్ కమిషన్(ఈసీ) ప్రెసిడెంట్ ఉర్సులా వానెడెర్ లియాన్ తెలిపారు. -
బ్యాంక్ దిగ్బంధనం... ఏటీఎంకి క్యూ కట్టిన రష్యన్ వాసులు
రష్యా దురాక్రమణకు అడ్డుకట్ట వేసేందుకు అమెరికా, పశ్చిమ దేశాలు కీలక చర్యలు చేపట్టాయి. అమెరికా, ఐరోపా సమాఖ్య కెనడా, బ్రిటన్లు..స్విఫ్ట్(సోసైటీ ఫర్ వరల్డ్ వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలీకమ్యూనికేషన్స్) నుంచి రష్యాకు చెందిన కీలక బ్యాంకులను తీసేస్తున్నట్లు ప్రకటించాయి. దీంతో రష్యాన్ వాసుల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఉక్రెయిన్ పై దాడికి కఠినమైన పాశ్చాత్య ప్రతిస్పందనగా గ్లోబల్ పేమెంట్స్ సిస్టమ్ స్విప్ట్ నుంచి రష్యాను మినహాయించే ఒప్పందం గురించి వార్తలు గుప్పుమన్నాయి. దీంతో వందల కొలది రష్యన్ వాసులు ఏటీఎం మిషన్ల వద్ధ బారులు తీరి ఉన్నారు. దేశానికి వ్యతిరేకంగా ఆర్థిక ఆంక్షల నేపథ్యంలో రష్యా అంతటా అంతర్గత భయాందోళనలు మొదలైయ్యాయి. శనివారం, రష్యా మిలిటరీ ఉక్రెయిన్ నగరాలపై దాడిని వేగవంతం చేయడంతో, పాశ్చాత్య మిత్రదేశాలు దేశ బ్యాంకింగ్ రంగాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నించాయి. ఈ మేరకు డబ్బును బదిలీ చేయడానికి ఉపయోగించే అంతర్జాతీయ వ్యవస్థ అయిన స్విప్ట్ నుంచి ఎంపిక చేయబడిన బ్యాంకులను తగ్గించడం ద్వారా రష్యా అంతర్జాతీయ వాణిజ్య సామర్థ్యాన్ని తీవ్రంగా అడ్డుకుంటుంది. అంతేకాదు సుమారు 200 దేశాలలో దాదాపు 11వేల కంటే ఎక్కువ ఆర్థిక సంస్థలు స్విఫ్ట్‌ని ఉపయోగిస్తున్నాయి. నేషనల్ అసోసియేషన్ రాస్విఫ్ట్ ప్రకారం, రష్యా వినియోగదారుల సంఖ్య పరంగా యునైటెడ్ స్టేట్స్ తర్వాత రెండవ అతిపెద్ద దేశం రష్యా, దాదాపు 300 రష్యన్ ఆర్థిక సంస్థలు ఈ వ్యవస్థకు చెందినవి. దీంతో రష్యా అంతర్జాతీయ లావాదేవీలు నిర్వహించడం కష్టమైపోతుంది. ఈ భయాందోళనలతో రష్యా వాసులు ఏటీఎంకు క్యూలు కడుతున్నారు. (చదవండి: అమెరికా వీసా దరఖాస్తుదారులకు తీపి కబురు..) -
తిరుగులేని మోడల్, సరికొత్త రికార్డ్లను క్రియేట్ చేసిన మారుతి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహన తయారీలో ఉన్న మారుతి సుజుకీ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ స్విఫ్ట్ కారు కొత్త రికార్డు సృష్టించింది. గడిచిన 16 ఏళ్లలో మొత్తం 25 లక్షల పైచిలుకు స్విఫ్ట్ కార్లు రోడ్డెక్కాయి. విక్రయాల పరంగా గత ఆర్థిక సంవత్సరంలో ఈ మోడల్ ముందంజలో ఉంది. భారత్‌లో 2005లో స్విఫ్ట్ రంగ ప్రవేశం చేసింది. రూపు, సామర్థ్యం పరంగా అద్భుతమైన వారసత్వాన్ని ఈ మోడల్ సృష్టించిందని కంపెనీ మార్కెటింగ్, సేల్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శశాంక్ శ్రీవాస్తవ తెలిపారు. ‘ఈ విజయం బ్రాండ్ స్విఫ్ట్ పట్ల వినియోగదారులు, విమర్శకుల ప్రేమకు నిదర్శనం. 35 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న 52 శాతం మంది వినియోగదార్లతో.. యువ కస్టమర్ల మారుతున్న ఆకాంక్షలకు అనుగుణంగా స్విఫ్ట్ నిరంతరం కొత్తదనాన్ని సంతరించుకుంటోంది’ అని వివరించారు. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్, మాన్యువల్, ఆటో గేర్ షిఫ్ట్ ట్రాన్స్‌మిషన్‌తో ఈ కారు రూపుదిద్దుకుంది. ట్రాన్స్మిషన్నుబట్టి లీటరుకు 23.20–23.76 కిలోమీటర్ల మైలేజీ ఇస్తుందని కంపెనీ తెలిపింది. చదవండి: పండుగ సెంటిమెంట్, కార్లను తెగకొనేస్తున్నారు -
పండుగ సెంటిమెంట్, కార్లను తెగకొనేస్తున్నారు
ముంబై: పండుగ సీజన్ సెంటిమెంట్ కలిసిరావడంతో ఆగస్టులో వాహన విక్రయాలు పెరిగాయి. మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్, ఎంఅండ్ఎం,హోండా కంపెనీలు అమ్మకాల్లో స్థిరమైన వృద్ధిని కనబరిచాయి. చదవండి : ఫెస్టివల్ బొనాంజా ఆఫర్..సర్వీస్, ప్రాసెసింగ్ చార్జీల ఎత్తివేత మారుతీ సుజుకీ మొత్తం అమ్మకాలు ఐదు శాతం పెరిగి 1,30,699 యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే ఆగస్ట్‌లో 1,24,624 వాహనాలను విక్రయించింది. అయితే దేశీయ విక్రయాలు 6% తగ్గి 1,10,080 యూనిట్లకు పరిమితమైంది. అంతర్జాతీయంగా సెమికండెక్టర్ల కొరత ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావాన్ని చూపిందని కంపెనీ తెలిపింది. ఇదే నెలలో హ్యుందాయ్ మోటార్ 12 శాతం వృద్ధిని సాధించి మొత్తం 59,068 వాహనాలను విక్రయించింది. గతేడాది ఆగస్టులో 35,420 యూనిట్లు అమ్మిన టాటా మోటార్స్.., ఈ ఆగస్టులో 53 శాతం వృద్ధిని సాధించి 54,190 వాహనాలను విక్రయించింది. మహీంద్రా అండ్ మహీంద్రా అమ్మకాలు 17 శాతం పెరిగి 15,973 యూనిట్లు అమ్ముడైనట్లు కంపెనీ ప్రకటించింది. థార్, ఎక్స్‌యూవీ 300, బోలెరో నియో, బొలెరో పిక్–అప్ కార్ల బుకింగ్స్ కలిసొచ్చాయని ఎంఅండ్ఎం కంపెనీ సీఈఓ విజయ్ నాక్రా తెలిపారు. కియా మోటార్స్ ఇండియా వాహన విక్రయాలు 55 శాతం వృద్ధిని సాధించి మొత్తం 16,750 యూనిట్ల అమ్మింది. గతేడాదిలో ఇదే నెలలో విక్రయాలు 10,845 యూనిట్లు. ‘‘ఆటో కంపెనీలు పండుగ సీజన్‌ను స్థిరమైన విక్రయాలతో ప్రారంభించాయి. రానున్న రోజుల్లో కస్టమర్ల నుంచి బుక్సింగ్ మరింత పెరగవచ్చు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సెమికండక్టర్ల కొరత ఉత్పత్తిపై ప్రభావాన్ని చూపుతున్న వేళ డిమాండ్‌కు తగ్గట్లు వాహనాలను అందుబాటులో ఉంచడం ఆటో పరిశ్రమకు సవాలుగా మారవచ్చు’’ అని నిస్సాన్ మోటార్ ఎండీ రాకేష్ శ్రీవాస్తవ తెలిపారు. -
సేఫ్టీ క్రాష్ టెస్ట్‌లో స్విఫ్ట్, డస్టర్ ఫెయిల్!
రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు అందులో ప్రయాణించే వారికి రక్షణ కల్పించే విషయంలో మారుతి సుజూకి స్విఫ్ట్, రెనాల్ట్ డస్టర్ కార్ల పని తీరు అస్సలు బాగోలేదంటూ లాటిన్ ఎన్సీఏపీ స్పష్టం చేసింది. ఇటీవల నిర్వహించిన క్రాష్ టెస్ట్‌లో ఈ రెండు కార్లు దారుణమైన ఫలితాలను పొందాయి. క్రాష్ టెస్ట్ కార్లలో ప్రయాణికుల భద్రతకు సంబంధించి వివిద దేశాలు న్యూ కార్ ఎస్సెస్మెంట్ ప్రోగ్రామ్ (ఎన్సీఏపీ) పేరుతో క్రాష్ టెస్ట్‌లు నిర్వహించి రేటింగ్స్ ఇస్తుంటాయి. ఇటీవల లాటిన్ ఎన్సీపీఏ పరీక్షలు నిర్వహించగా మారుతి సుజూకి స్విఫ్ట్, రెనాల్ట్ డస్టర్ కార్లు ఈ పరీక్షలో పాల్గొన్నాయి. ఇటీవల కొత్తగా అమల్లోకి తెచ్చిన నిబంధనలను అనుసరించి ఈ పరీక్షలు నిర్వహించగా ఈ రెండు ప్రముఖ కార్లు దారుణంగా జీరో స్టార్స్ రేటింగ్ సాధించి నిరాశజనకమైన ఫలితాలు కనబరిచాయి. మారుతి స్విఫ్ట్ పరిస్థితి మారుతి సిఫ్ట్కి సంబంధించి హ్యాచ్‌బ్యాక్, సెడాన్ రెండు కార్లు సైతం ఈ టెస్టులో అత్తెసరు మార్కులు కూడా సాధించలేపోయాయి. ఆడల్డ్ ఆక్యుపెంట్ బాక్స్ కేటగిరిలో 15.53 శాతం, చిల్డ్రెన్ ఆక్యుపెంట్ బాక్స్ కేటగిరీలో సున్నా శాతం. పెడస్ట్రియన్ ప్రొటెక్షన్, వల్నరబుల్ రోడ్ బాక్స్ కేటగిరిలో 66 శాతం, సేఫ్టీ అసిస్ట్ బాక్స్ కేటగిరిలో 6.98 శాతం పాయింట్లనే సాధించగలిగింది. దీంతో మారుతి స్విఫ్ట్‌కి లాటిన్ ఎన్సీఏపీ జీరో రేటింగ్ ఇచ్చింది. డస్టర్దీ అదే దారి రెనాల్ట్ స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ డస్టర్‌కి ఈ క్రాష్ టెస్ట్‌లో ఆడల్డ్ ఆక్యుపెంట్ బాక్స్ కేటగిరిలో 29.47 శాతం, చిల్డ్రెన్ ఆక్యుపెంట్ బాక్స్ కేటగిరీలో 22.93 శాతం. పెడస్ట్రియన్ ప్రొటెక్షన్, వల్నరబుల్ రోడ్ బాక్స్ కేటగిరిలో 50.79 శాతం, సేఫ్టీ అసిస్ట్ బాక్స్ కేటగిరిలో 34.88 శాతం పాయింట్లనే సాధించగలిగింది. రక్షణ చర్యలేవి లాటిన్ ఎన్సీఏపీ పరీక్షలో విఫలమైన మారుతి స్విఫ్ట్, రెనాల్ట్ డస్టర్ల్ కార్లలో స్టాండర్డ్‌గా రెండు ఎయిర్‌బ్యాగులు అందించారు. అయితే ప్రమాదం జరిగినప్పుడు సైడ్ ఇంపాక్ట్ ప్రొటెక్షన్ విషయంలో ఈ రెండు కార్లలో భద్రతా ప్రమాణాలు నాసిరకంగా ఉన్నాయని లాటిన్ ఎన్సీఏపీ అభిప్రాయపడింది. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ సిస్టమ్ లేకపోవడం పెద్దలోటని తెలిపింది. ఇప్పుడే కష్టం యూఎన్ 95 నిబంధనలకు తగ్గట్టుగా స్విఫ్ట్ , డస్టర్ కార్లలో భద్రతా ఏర్పాట్లు లేనందున వీటిని ఇప్పుడే లాటిన్ దేశాల్లో అనుమతించే అవకాశం లేదు. 2018లో జరిగిన క్రాష్ టెస్ట్‌లో స్విఫ్ట్‌కి 2 స్టార్ రేటింగ్ వచ్చింది. ఈసారి రేటింగ్ మెరుగవుతుందని భావిస్తే దారుణంగా పడిపోయింది. యూరోపియన్, లాటిన్ దేశాల్లో కార్లకు 6 ఎయిర్‌బ్యాగ్స్‌తో పాటు ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ సిస్టమ్‌లు తప్పనిసరిగా మారాయి. చదవండి : హ్యుందాయ్ సంచలనం! త్వరలో హైడ్రోజన్ వేవ్ కారు!! -
కార్ల ధరలు పెంచిన మారుతి.. ఏ మోడళ్లపై అంటే?
ఢిల్లీ: వినియోగదారులకు మారుతి ఆటో షాక్ ఇచ్చింది. మారుతిలో మోస్ట్ పాపులర్ మోడల్ స్విఫ్ట్‌తో పాటు ఇతర వేరియంట్లకు ధరలను అమాంతం పెంచేసింది. కారు తయారీలో ఉపయోగించే విడి భాగాల ధరలు పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మారుతి ప్రకటించింది. రూ. 15,000 మారుతి కార్ల ధరలు పెంచుతామంటూ 2021 జూన్ 21న ఇప్పటికే ప్రకటించామని, దానికి తగ్గట్టుగా స్విప్ట్ మోడల్‌తో పాటు అన్ని సీఎన్జీ వేరియంట్ల కార్ల ధరలు పెంచుతున్నామని మారుతి ప్రకటించింది. ఢిల్లీ ఎక్స్‌షోరూం ప్రకారం కనీసం రూ.15,000 ధర పెంచామని వెల్లడించింది. పెరిగిన ధరలు జులై 12 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది. ఈ మోడళ్లపై ప్రస్తుతం మారూతిలో స్విఫ్ట్ డిజైర్ టూర్‌తో పాటు ఎర్టిగా, వ్యాగన్ ఆర్, ఆల్టో, సెలేరియో, ఎస్ప్రెస్సో, ఏకో మోడళ్లలో సీఎన్జీ కార్లు లభిస్తున్నాయి. మొత్తంగా మారుతిలో ఎక్కువగా అమ్ముడయ్యే మోడల్స్‌పై ధరలు పెరిగాయి. ధరల పెంపు నిర్ణయాన్ని ప్రకటించిన వెంటనే స్టాక్మార్కెట్లో మారూతి షేర్ల ధరలు కూడా పెరిగాయి. -
సొంత కారు కలకు షాకిచ్చిన మారుతి
సాక్షి, ముంబై: సొంత కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న వినియోగదారులకు దేశీయ కార్ల తయారీ సంస్థ మారుతీ సుజుకీ షాకిచ్చింది. ఎంపిక చేసిన మోడళ్ల కార్ల ధరలను మరోసారి పెంచింది. కొన్ని మోడళ్ల కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. సవరించిన కొత్త ధరలు తక్షణం (శుక్రవారం) అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. ఇన్పుట్ వ్యయాలు పెరగడంతో ధరల్ని పెంచక తప్పలేదని కంపెనీ వివరణ ఇచ్చింది. ధరల పెంపు నిర్ణయంతో స్విఫ్ట్, సెలెరియా మినహా అన్ని మోడళ్లకు చెందిన వాహన ధరలు రూ.22,500 వరకు పెరిగే అవకాశం ఉంది.మోడల్‌ను బట్టి 1.6 శాతం మేర ధరల పెంపుదల ఉంటుంది. ఈ ఏడాది జనవరి 18న ధరలు పెంచిన కంపెనీ... కేవలం మూడు నెలల వ్యవధిలోనే రెండోసారి ధరల పెంపు నిర్ణయాన్ని తీసుకుంది. -
మారుతీ దూకుడు: టాప్ సెల్లింగ్ కారు ఇదే!
సాక్షి, ముంబై: కార్ల విక్రయాల్లో వరుసగా నాలుగో ఏడాది మారుతీ సుజుకీ సత్తా చాటింది. గడిచిన ఆర్థిక సంవత్సరం(2020–21)లో జరిగిన కార్ల అమ్మకాల్లో తొలి ఐదు స్థానాలను మారుతీ కంపెనీ మోడళ్లే దక్కించుకున్నాయి. ఈ ఐదు మోడళ్లలో స్విఫ్ట్ కారు అత్యధికంగా అమ్ముడై తొలి స్థానాన్ని దక్కించుకుంది.(రెండో దశకు ఎయిరిండియా విక్రయం) 2020–21 ఏడాదిలో మొత్తం 1.72 లక్షల స్విఫ్ట్ కార్లు అమ్ముడుపోయాయి. ఈ తర్వాత స్థానాల్లో వరుసగా ఇదే కంపెనీకి చెందిన బాలెనో(1.63 లక్షలు), వేగనార్(1.60 లక్షలు), ఆల్టో(1.59 లక్షలు), డిజైర్(1.28 లక్షలు) మోడళ్లు నిలి చాయి. 5 మోడళ్లు మొత్తం అమ్మకాలు ప్యాసింజర్ కార్ల విక్రయాల్లో 30 శాతాన్ని ఆక్రమించాయి. ఇతర కంపెనీల నుంచి పోటీ ఉన్నప్పటికీ.., మారుతీ సుజుకీ చెందిన ఐదు ప్యాసింజర్ వాహన మోడల్స్ తొలి ఐదు స్థానాలను దక్కించుకోవడం గర్వంగా ఉందని కంపెనీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీవాస్తవ తెలిపారు. (అంచనాలను మించిన పరోక్ష పన్నులు) -
ప్రతి నెల పదివేలు చెల్లిస్తే మారుతి స్విఫ్ట్ కారు మీదే
దేశంలో అత్యంత అధికంగా అమ్ముడవుతున్న బ్రాండ్లలో మారుతి స్విఫ్ట్ ప్రధానంగా చెప్పవచ్చు. ఈ కారు మోడల్ మార్కెట్లోకి విడుదలై 15 సంవత్సరాలు గడిచినప్పటికీ ఇంకా సేల్స్ లో టాప్ గేర్ లో కొనసాగుతోంది. మారుతి సుజుకి ఇండియా 2021 స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్‌ను ఫిబ్రవరి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.5.73 లక్షలకు(ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) విడుదల చేసింది. టాప్-ఆఫ్-లైన్ వేరియంట్ రూ.8.41 లక్షలకు(ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) లభిస్తుంది. 2021 మారుతి సుజుకి స్విఫ్ట్ సరికొత్త నెక్స్ట్-జెన్ కె-సిరీస్ డ్యూయల్-జెట్, డ్యూయల్-వివిటి పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది. 2021 మారుతి సుజుకి స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్ మధ్యలో బోల్డ్ హారిజాంటల్ క్రోమ్ తో సరికొత్త మెష్ గ్రిల్‌ను పొందుతుంది. ఎల్ఈడీ డీఆర్ఎల్లు, ఎల్ఈడీ టెయిల్ లాంప్స్, 15-అంగుళాల ప్రెసిషన్-కట్ అల్లాయ్ వీల్స్ ఉన్న ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు అవుట్గోయింగ్ మోడల్ నుంచి ముందుకు తీసుకెళ్లబడ్డాయి. 1.2 లీటర్ కె-సిరీస్ పెట్రోల్, 1.3 లీటర్ డీడీఐఎస్ డీజిల్ ఇంజిన్లను కొత్త స్విఫ్ట్‌లోనూ వాడారు. మారుతి సుజుకి ఇండియా 2021 స్విఫ్ట్ ఎంటి 23.20 కిలోమీటర్లు, 2021 స్విఫ్ట్ ఎఎమ్‌టి 23.76 కిలోమీటర్లు మైలేజీ ఇస్తుందని పేర్కొంది. భారత్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్-5 కార్లలో ఒకటిగా స్విఫ్ట్ నిలిచింది. మార్కెట్ షేర్లో 35 శాతం వాటా దీనిదే కావడం విశేషం. ఇక ఈ కారు ఫైనాన్స్ విషయానికి వస్తే కనిస్టంగా రూ.1,28,759 డౌన్ పేమెంట్ చెల్లించి కారును సొంతం చేసుకోవచ్చు. అంతేకాదు మార్కెట్లో బ్యాంకులు అత్యల్పంగా 7 నుంచి 9 శాతం మధ్యలో కార్ల వడ్డీ రేట్లతో లోన్లను అందిస్తున్నారు. ఈ లెక్కన 5 సంవత్సరాల కాల వ్యవధికి సుమారు రూ.10 వేల వరకూ ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది. చదవండి: డేంజర్ జోన్లో వాట్సప్ యూజర్లు! -
కొత్తగా ముస్తాబైన మారుతి స్విఫ్ట్: ధర ఎంతంటే..
సాక్షి, ముంబై: మారుతి సుజుకి తన పాపులర్ మోడల్ హ్యాచ్‌బ్యాక్ కారు స్విఫ్ట్‌లో అప్డేట్ వెర్షన్‌ను తీసుకొచ్చింది. 2021 స్విఫ్ట్ ఫేస్‌లిఫ్ట్‌ను దేశంలో విడుదల చేసింది. దీని ధర 5.73 లక్షలు (ఎక్స్-షోరూమ్,న్యూఢిల్లీ) నుండి ప్రారంభం. జనాదరణ పొందిన మారుతి స్విఫ్ట్ కారు ఇంటీరియర్ డిజైన్, కాస్మొటిక్స్ మార్పులతోపాటు భద్రతాపరంగా మెరుగైన ఫీచర్లను జోడింది. 10.67 సెం.మీ మల్టీ-ఇన్ఫర్మేషన్ కలర్ టీఎఫ్టీ డిస్ప్లే, కొత్త గ్రిల్, మోడల్ కాంట్రాస్ట్ రూఫ్, కొత్త డ్యూయల్-టోన్ ఎక్స్‌టిరియర్ లాంటి అప్‌గ్రేడ్స్ ఉన్నాయి. కొత్త స్విఫ్ట్‌లో ఐడిల్ స్టార్ట్ స్టాప్ (ఐఎస్ఎస్) టెక్నాలజీతో నెక్ట్స్ జనరేషన్ కే-సిరీస్ డ్యూయల్ జెట్ డ్యూయల్ వీవీటీ ఇంజిన్ అందించినట్టు మారుతి సుజుకి ప్రకటించింది. అలాగే కూల్డ్ ఎగ్జాస్ట్ గ్యాస్ రీరిక్యులేషన్ (ఇజిఆర్) వ్యవస్థతో పాటు కొత్త స్విఫ్ట్ తక్కువ ఉద్గారాలను విడుదల చేస్తుందని, అధిక ఇంధన సామర్థ్యం దీని సొంతమని పేర్కొంది. -
ఇండియాలో బెస్ట్ సెల్లింగ్ కారు ఇదే!
సాక్షి,ముంబై: 2020 ఏడాదిలో ప్రముఖకార్ల కంపెనీ మారుతి సుజుకికి చెందిన వాహనం అత్యధిక అమ్ముడైన కారుగా నిలిచింది. కోవిడ్-19 సంక్షోభంలో కూడా మారుతి స్విప్ట్ టాప్ బ్రాండ్‌గా ఖ్యాతి దక్కించుకుంది. 2020 ఏడాదిలో లక్షా అరవై వేలకుపైగా విక్రయాలతో ఈ రికార్డు సాధించింది. టెక్ సావీ ఫీచర్లు, సరియైన ధర, స్పోర్టి డిజైన్లతో యువతరం మనుసు దోచుకుందని కంపెనీ వెల్లడించింది. స్విఫ్ట్ కస్టమర్లలో 53 శాతానికి పైగా 35 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారేనని కంపెనీ తెలిపింది. గత ఏడాది 1,60,700 యూనిట్లతో స్విఫ్ట్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడుపోయే కార్గా నిలిచిందని మారుతి సుజుకి ఇండియా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్అండ్ సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ శనివారం వెల్లడించారు. 15 సంవత్సరాలుగా 2.3 మిలియన్లకు పైగా వినియోగదారులతో దేశంలో అత్యధికంగా అమ్ముడైన ప్రీమియం హ్యాచ్‌బ్యాక్‌గా ఉందని పేర్కొన్నారు. 2005లో లాంచ్ చేసిన మారుతి స్విఫ్ట్ ఇప్పటికి 23 లక్షల యూనిట్ల మైలురాయిని కూడా దాటేసిందన్నారు. ఇది 2010 లో 5 లక్షల మైలురాయిని, 2013 లో 10 లక్షలను, 2016 లో 15 లక్షలను దాటిందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. -
కర్ణాటక బ్యాంక్‌కు భారీ జరిమానా
సాక్షి, న్యూఢిల్లీ: ప్రయివేటురంగ బ్యాంకు కర్ణాటక బ్యాంకుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భారీ జరిమానా విధించింది. నిబంధనలను ఉల్లంఘించినందుకు బ్యాంకుపై ఆర్బీఐ 4 కోట్ల రూపాయల జరిమానా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్ సేవలకు వినియోగించే సాఫ్ట్వేర్ స్విఫ్ట్ (సొసైటీ ఫర్ వరల్డ్‌వైడ్ ఇంటర్ బ్యాంక్ ఫైనాన్షియల్ టెలీ కమ్యూనికేషన్) సంబంధిత కార్యాచరణ నియంత్రణ లోపం కారణంగా ముఖ్యంగా, నాలుగు నిబంధనల అమలులో ఆలస్యం జరిగిందని ఆర్బీఐ పేర్కొంది. దీంతోపాటు మరో నాలుగు బ్యాంకులు( ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, దేనా బ్యాంక్, ఐడిబిఐ)కు నిబంధనల ఉల్లంఘన ఆరోపణలతో నగదు జరిమానా విధించింది. యూనియన్ బ్యాంక్, దేనా బ్యాంకుకు రూ. 2కోట్లు, ఐడీబీఐ, ఎస్బీఐలకు తలా ఒక కోటి రూపాయలు చొప్పున జరిమానా విధించింది. శనివారం రెగ్యులేటరీకి అందించిన సమాచారంలో ఆయా బ్యాంకులు వెల్లడించాయి. కాగా స్విఫ్ట్ లావాదేవీల అక్రమాల కారణంగానే ప్రభుత్వ రంగ బ్యాంకులో రూ.14వేల కోట్ల స్కాం సంభవించిన సంగతి తెలిసిందే. బ్యాంకింగ్ రంగంలో అతిపెద్ద కుంభకోణంగా నిలిచిన ఈ స్కాంలో పీఎన్‌బీలోవజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ అక్రమాలు గత ఏడాది ఫిబ్రవరిలో వెలుగులోకి రావడంతో ప్రభుత్వం అన్ని రకాల లావాదేవీలపై నిబంధనలను కఠినతరం చేసింది. -
ఆల్టోను అధిగమించిన స్విఫ్ట్
న్యూఢిల్లీ: అధికంగా అమ్ముడవుతున్న ప్రయాణికుల కారుగా మారుతీ ఆల్టోను తోసిరాజని అదే కంపెనీకి చెందిన స్విఫ్ట్ నిలిచింది. గత నెలలో అత్యధికంగా అమ్ముడైన ప్రయాణికుల కారుగా మారుతీ సుజుకీ ఇండియాకు చెందిన స్విఫ్ట్ రికార్డ్‌ను సాధించింది. గత ఏడాది ఇదే నెలలో అమ్మకాల పరంగా అగ్రస్థానంలో నిలిచిన మారుతీ ఆల్టో కారు ఈ ఏడాది నవంబర్‌లో 4వ స్థానంలో నిలిచింది. మొత్తం టాప్ టెన్ కార్లలో మొదటి 6 స్థానాలను మారుతీ కార్లే సాధించగా, చివరి నాలుగు స్థానాలను హ్యుందాయ్ సాధించింది. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) గణాంకాల ప్రకారం... ∙గత ఏడాది నవంబర్‌లో అమ్మకాల పరంగా ఆరో స్థానంలో ఉన్న మారుతీ స్విఫ్ట్ ఈ నవంబర్‌లో మొదటి స్థానానికి దూసుకువచ్చింది. ∙మారుతీ కంపెనికి చెందిన డిజైర్ కారు గత నవంబర్లోనూ, ఈ నవంబర్లోనూ రెండో స్థానంలోనే నిలిచింది. అయితే అప్పటితో పోలిస్తే ఈ నవంబర్‌లో అమ్మకాలు స్వల్పంగా తగ్గాయి. ∙ అప్పుడు – ఇప్పుడు కూడా మూడో స్థానాన్ని ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ బాలెనో సాధించింది. ∙ గతంలో నాలుగో స్థానంలో నిలిచిన విటారా బ్రెజా ఈ సారి ఐదో స్థానానికి పడిపోయింది. ∙ గత ఏడాది నవంబర్‌లో 9వ స్థానంలో ఉన్న హ్యుందాయ్క్రెటా ఈఏడాది నవంబర్‌లో ఎనిమిదవ స్థానానికి చేరింది. ∙ గత ఉడాది నవంబర్‌లో 7వ స్థానంలో ఉన్న హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 ఈ సారి తొమ్మిదవ స్థానానికి పడిపోయింది. -
దివాలీ ఆఫర్: మారుతి కార్లపై భారీ తగ్గింపు
సాక్షి, ముంబై: దీపావళి సీజన్‌ని క్యాష్ చేసుకునేందుకు మార్కెట్ లీడర్ మారుతీ సుజుకీ భారీ ఆఫర్లను ప్రకటించింది. ఇన్సూరెన్స్ ప్రీమియం పెంపుతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులకు శుభవార్త. స్విఫ్ట్, డిజైర్, బాలెనో మోడళ్ల కార్లపై దివాలీ ఆఫర్‌గా భారీ డిస్కౌంట్లను ప్రకటించింది. ముఖ్యంగా హ్యుందాయ్ నుంచి తీవ్రమైన పోటీ ఉండటంతో డిస్కౌంట్లను పెంచి కస్టమర్స్‌ని అట్రాక్ట్ చేస్తోంది. తాజాగా 23శాతం డిస్కౌంట్ అందిస్తోంది. స్విఫ్ట్, డిజైర్, బాలెనోలపై రూ.18,750 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. గతంలో ఇచ్చిన డిస్కౌంట్ కన్నా ఇది రూ.3,500 ఎక్కువ. ధంతేరస్, దీపావళి సందర్భంగా డిస్కౌంట్ ద్వారా మరిన్ని అమ్మకాలను సాధించనున్నామని సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (మార్కెటింగ్ మరియు అమ్మకాలు) ఆర్ ఎస్‌కల్సీ చెప్పారు పెట్రోల్, డీజిల్ ధరలు, మరోవైపు ఇన్సూరెన్స్ రేట్లు పెరగడం, వడ్డీ రేట్లు అక్టోబర్ నెల రీటైల్ విక్రయాలను ప్రభావితం చేశాయి. మరోవైపు అక్టోబర్ నెల విక్రయాల్లో మారుతి సుజుకి మెరుగైనప్రదర్శన కనబర్చింది. గత సెప్టెంబరు నెలలో తొలిసారి 1.5శాతం క్షీణతతో 1,38,100 యూనిట్స్ అమ్మితే... అక్టోబర్‌లో 1,46,766 యూనిట్స్‌ను విక్రయించింది. అటు రెండవ అతిపెద్ద కార్ల తయారీదారు హ్యుందాయ్ కూడా కార్ల ధరలపై డిస్కౌంట్‌ను ప్రకటించనుందని తెలుస్తోంది. -
సేఫ్టీ రేటింగ్‌లో ‘స్విఫ్ట్’ నిరాశపరిచింది
న్యూఢిల్లీ : మారుతీ సుజుకీ ‘స్విఫ్ట్’ భద్రతా ప్రమాణాల పరీక్షలో నిరాశ పరిచింది. కేవలం 2-స్టార్ రేటింగ్‌ను మాత్రమే ఈ కారు సాధించింది. గ్లోబల్ న్యూకార్ అసెస్మెంట్ ప్రొగ్రామ్(జీఎన్సీఏపీ), ‘‘సేఫర్ కార్స్ ఫర్ ఇండియా’ క్యాంపెయిన్‌లో భాగంగా మారుతీ సుజుకీ స్విఫ్ట్ క్రాష్ టెస్ట్ ఫలితాలను విడుదల చేసింది. ఈ ఫలితాలు పూర్తిగా నిరాశజనకంగా ఉన్నట్టు వాహనదారులు పెదవి విరుస్తున్నారు. జీఎన్ఏసీపీ ప్రకారం... కారు పెద్దల భద్రతకు సంబంధించిన ప్రమాణాలను అందుకోలేకపోయిందని తెలిసింది. అంతేకాక ప్రమాద సమయంలో కారు డ్రైవర్ తల, మెడకు రక్షణ లభిస్తున్నా.. ఛాతీ, మోకాళ్లకు మాత్రం గాయాలయ్యే అవకాశం ఉందని పేర్కొంది. మారుతీ సుజుకీ స్విఫ్ట్ లేటెస్ట్ వెర్షన్లో రెండు స్టాండర్డ్ డబుల్ ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నా.. 4-ఛానల్ యాంటీలాక్ బ్రేకింగ్ వ్యవస్థ లేకపోవడంతో కేవలం 2-స్టార్ రేటింగ్‌నే పొందినట్టు తెలిపింది. పెద్దలకు, చిన్నారులకు రక్షణ విషయంలో కేవలం 2-స్టార్ రేటింగ్‌నే పొందినట్టు పేర్కొంది. ‘భారత్‌లో విక్రయిస్తున్న కొత్త మోడల్ స్విఫ్ట్ కార్లలో రెండు స్టాండర్డ్ ఎయిర్ బ్యాగ్‌లున్నాయి. భారత ప్రభుత్వపు కొత్త క్రాష్ టెస్ట్ రెగ్యులేషన్ ఫలితాలు ఇప్పుడు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే భారత్‌లో విక్రయించే స్విఫ్ట్ కార్ల కంటే యూరప్, జపాన్లలో విక్రయించే కార్లే సురక్షిత ప్రయాణం విషయంలో మెరుగైన రేటింగ్‌ను సాధించాయి. ఈ నేపథ్యంలో మారుతీ సుజుకీ భారత్‌లో తన ప్రమాణాలను మరింత మెరుగుపర్చుకోవాల్సి ఉంది’ అని జీఎన్సీఏపీ సెక్రటరీ జనరల్ డేవిడ్ చెప్పారు. స్థానికంగా తయారు చేసే బ్రిజా మోడల్స్‌ను అత్యంత భద్రతా ప్రమాణాలతో మారుతీ సుజుకీ రూపొందిస్తోందని, ఇదే ఫార్ములాను స్విఫ్ట్‌కు అవలంభించాలని, కనీసం యూరోపియన్, జపనీస్ వెర్షన్లకు అందుబాటులో ఉన్న భద్రతా ఫీచర్లనైనా తీసుకు రావాలని జీఎన్సీఏపీ టెక్నికల్ డైరెక్టర్ అలెజాండ్రో ఫ్యూరస్ సూచించారు. -
కొత్త డిజైర్, స్విప్ట్ కార్ల రీకాల్
సాక్షి, న్యూఢిల్లీ: ఆటోదిగ్గజం మారుతి సుజుకి దేశంలో భారీ ఎత్తున కార్లను రీకాల్ చేస్తోంది. ఎయిర్ బాగ్స్‌లో లోపాల కారణంగా కొత్త జనరేషన్ స్విఫ్ట్, డిజైర్ కార్లను వెనక్కి తీసుకుంటోంది. ఈ మేరకు మారుతి ఒక ప్రకటన విడుదల చేసింది. మే 7నుంచి జులై 5, 2018 మధ్య ఉత్పత్తి అయిన మొత్తం 1279 కార్లను పరీక్షిస్తున్నట్టు తెలిపింది. 2018, జులై 25నుంచి ఈ రీకాల్ ప్రారంభమవుతుందని ప్రకటించాంది. మారుతి సుజుకి దేశంలో కొత్త తరం స్విఫ్ట్ , డిజైర్ మోడళ్ల కార్లలో లోపాలను తనిఖీ చేయడానికి ఈ రీకాల్ చేపట్టినట్టు కంపెనీ తెలిపింది. 566 స్విఫ్ట్ , 713 డిజైర్ కార్లను వెనక్కి తీసుకుంటోంది. సంబంధిత వాహన యజమానులను మారుతి సుజుకి డీలర్లు సంప్రదించనున్నారని తెలిపింది. వారికి ఉచితంగా ఆయా భాగాలను ఉచితంగా అందిస్తామని వెల్లడించింది. అలాగే అధికారిక మారుతి సుజుకి వెబ్సైట్లో చెక్ చేసుకోవాలని కార్ల యజమానులను కంపెనీ కోరింది. -
కొత్త స్విఫ్ట్, బాలెనో కార్లు రీకాల్
న్యూఢిల్లీ : దేశీయ అతిపెద్ద కార్ల కంపెనీ మారుతీ సుజుకీ తన కొత్త స్విఫ్ట్, బాలెనో మోడల్స్‌ను రీకాల్ చేస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. 52686 యూనిట్ల కొత్త స్విఫ్ట్, బాలెనో మోడల్స్‌ను రీకాల్ చేయనున్నామని, అనంతరం వాటిని పరీక్షించి, లోపం ఉన్న బ్రేక్ వాక్యుమ్ను రీప్లేస్ చేయనున్నట్టు మారుతీ సుజుకీ పేర్కొంది. 2017 డిసెంబర్ 1 నుంచి 2018 మార్చి 16కు మధ్యలో తయారుచేసిన స్విఫ్ట్, బాలెనో వాహనాలకు ఈ సర్వీసు క్యాంపెయిన్ చేపట్టనున్నట్టు తెలిపింది. ఈ సర్వీసు క్యాంపెయిన్‌లో భాగంగా 2018 మే 14 నుంచి వాహన యజమానులు డీలర్లను సంప్రదించాలని, లోపం ఉన్న భాగాన్ని రీప్లేస్మెంట్ చేసుకోవాలని కంపెనీ సూచించింది. గ్లోబల్‌గా కూడా ఆటోమొబైల్ కంపెనీలు పెద్ద మొత్తంలో సర్వీసు క్యాంపెయిన్లను చేపడుతున్నాయి. కస్టమర్లకు అసౌకర్యం కలిగిస్తున్న లోపం ఉన్న భాగాలను సరిదిద్దుతున్నాయి. సర్వీసు క్యాంపెయిన్‌లో భాగంగా మారుతీ చేపడుతున్న ఈ తనిఖీ, రీప్లేస్మెంట్ కస్టమర్లకు ఉచితం. మీ స్విఫ్ట్ లేదా బాలెనో కారు రీకాల్‌లో భాగమై ఉందో లేదో తెలుసుకోవడం కోసం కస్టమర్లకు మారుతీ సుజుకీ అధికారిక సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. అక్కడ వాహన ఛాసిస్ నెంబర్‌ను నమోదుచేయాల్సి ఉంటుంది. అలా నమోదు చేసిన తర్వాత ఒకవేళ మీ కారు ఆ రీకాల్ జాబితాలో ఉంటే, కస్టమర్లు కంపెనీ సర్వీసు స్టేషన్‌ను సందర్శించి, పరీక్షించుకుని, లోపం ఉన్న భాగాన్ని రీప్లేస్ చేయించుకోవాలి. ఛాసిస్ నెంబర్ వాహన ఇన్వాయిస్లో, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లలో ఉంటుంది. కాగా, సియామ్ వెబ్సైట్లో పొందుపరిచిన డేటాలో 2018 తొలి మూడు నెలల కాలంలో 1.12 లక్షలకు పైగా వాహనాలను ఆటోమొబైల్ కంపెనీలు రీకాల్ చేసినట్టు తెలిసింది. ఈ మొత్తం 2017లో రీకాల్ చేసిన వాహనాల కంటే కూడా ఎక్కువే.