సాక్షి,ముంబై: మారుతి సుజుకి తన పాపులర్ మోడల్ స్విఫ్ట్‌లో S-CNG వెర్షన్‌ను దేశంలో విడుదల చేసింది. హ్యాచ్‌బ్యాక్ కారు రెండు (VXi , ZXi) వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. అంతేకాదు కిలోకి 30.90 కిలోమీటర్లతో మోస్ట్‌పవర్‌ఫుల్, అద్భుతమైన ఇంధన సామర్థ్యమున్న హ్యాచ్‌బ్యాక్ కార్ అని కంపెనీ చెబుతోంది.
మారుతి కొత్త స్విఫ్ట్ వెర్షన్ ధరలు రూ. 7.77 లక్షల (ఎక్స్-షోరూమ్)నుండి ప్రారంభం. అలాగే నెలవారీ సబ్‌స్క్రిప్షన్ రుసుముతో రూ. 16,499తో (అన్ని కలుపుకొని) ఈ కారును సొంతం చేసుకోవచ్చని మారుతి వెల్లడించింది.
కొత్త మారుతి సుజుకి స్విఫ్ట్ ఎస్-సీఎన్‌జీ
1.2L K-సిరీస్ డ్యూయల్ జెట్, డ్యూయల్ VVT ఇంజన్‌తో 6,000rpm వద్ద 76bhp, 4,300rpm వద్ద 98Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్ యూనిట్‌తో మాత్రమే వచ్చింది. 2022 మారుతి సుజుకి స్విఫ్ట్ S-CNGలో డ్యూయల్ ఇంటర్ డిపెండెంట్ ఎలక్ట్రానిక్ కంట్రోల్ యూనిట్స్, (ECU) ఇంటెలిజెంట్ ఇంజెక్షన్ సిస్టమ్‌ను జోడించింది. తుప్పు ఎలాంటి లీకేజీ లేకుండాస్టెయిన్‌లెస్ స్టీల్ పైపులు, జాయింట్‌లతో ఈ మోడల్ మరింత సేఫ్టీగా ఉంటుందని కంపెనీ మారుతీ సుజుకి ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) శశాంక్ శ్రీవాస్తవ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment