సాక్షి, ముంబై: జర్మన్‌కు చెందిన లగ్జరీకారు మేకర్ బీఎండబ్ల్యూ మరో హైబ్రిడ్ కారును భారత మార్కెట్లో లాంచ్ చేసింది. బీఎండబ్ల్యూ ఎక్స్‌ఎం పేరుతో ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీని తీసుకొచ్చింది. భారతదేశంలో దీని ధరను రూ. 2.60 కోట్ల (ఎక్స్-షోరూమ్)గా నిర్ణయించింది. (ఉద్యోగాల ఊచకోత: ఇంటెల్ కూడా..వేలాదిమందికి)
బవేరియన్ కార్‌మేకర్ ఎం బ్రాండ్ నుంచి వచ్చిన రెండో లగ్జరీ కారుగాను, ఎం బ్యాడ్జ్‌తో వచ్చిన తొలి ప్లగ్-ఇన్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వాహనంగా ఇది నిలుస్తోంది. సెప్టెంబర్ ప్రారంభంలో ఎక్స్‌ఎం ప్లగ్-ఇన్హైబ్రిడ్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని ఆవిష్కరించింది. అమెరికాలోని స్పార్టాన్స్‌బర్గ్ ఫ్యాక్టరీలో ఉత్పత్తి ఇప్పటికే ప్రారంభమైంది.
బీఎండబ్ల్యూ ఎక్స్‌ఎం ఇంజీన్, ఫీచర్లు
ఇందులో అమర్చిన ట్విన్-టర్బోఛార్జ్డ్ 4.4లీటర్ పెట్రోల్ ఇంజీన్ 653బీహెచచ్‌పీ పవర్‌ను, 800ఎన్ఎం పీక్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. లగ్జరీ ఎస్‌యూవీ కేవలం 4.3 సెకన్లలోనే 0-100 కి.మీ వేగాన్ని అందుకోగలదు. అలాగే EV మోడ్‌లో గంటకు 140 కిమీ వేగంతో 88 కిమీ వరకు దూసుకెళుతుందని కంపెనీ పేర్కొంది.
ఈ మాసివ్ ఎస్‌యూవీలోని కిడ్నీ షేప్డ్ ఫ్రంట్ గ్రిల్ , LED స్పిట్ హెడ్‌లైట్‌లు, 8 స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఇంకా 23-అంగుళాల అల్లాయ్ వీల్స్, క్వాడ్-టిప్ ఎగ్జాస్ట్ ద్వారా డిజైన్‌ను ఆకర్షణీయంగా మార్చింది.రియర్‌లో వర్టికల్లీ స్టాకెడ్ ఎక్సాస్ట్ ఔట్లెట్స్,అడాప్టివ్ ఎం సస్పెన్షన్, ఎలక్ట్రానికల్లీ కంట్రోల్డ్ డ్యాంపర్స్, కొత్త 48వీ సిస్టెమ్ ఉన్నాయి.
ఇక ఇంటీరియర్‌గా హెడ్స్-అప్ డిస్‌ప్లే (HUD), 15,000 వాట్ బోవర్స్ అండ్ విల్కిన్స్ సరౌండ్ సౌండ్ సిస్టమ్, 12.3 ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 14.9 ఇంచెస్ టచ్‌స్క్రీన్, ఐడ్రైవ్ 8 సాప్ట్‌వేర్, ఏడీఏఎస్ టెక్, యాంబియంట్ లైటింగ్, 4 జోన్ ఆటోమెటిక్ కంట్రోల్ లాంటి ఇతర ఫీచర్లున్నాయి.
దీంతోపాటు బీఎండబ్ల్యూ ఎక్స్ 7 ఫేస్ లిఫ్ట్, బీఎండబ్ల్యూ ఎం 340ఐ ఎక్స్ డ్రైవ్‌ని కూడా లాంచ్ చేసింది. తద్వారా దేశంలో తన ఉత్పత్తి శ్రేణిని మరింత విస్తరిస్తోంది. BMW M340i xDrive ధర రూ. 69.20 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.
Comments
Please login to add a commentAdd a comment