32 కిలోమీటర్ల మైలేజ్‌తో సుజుకీ కొత్త కారు
స్విఫ్ట్ హైబ్రిడ్ కారును సుజుకీ జపాన్ మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. ఎస్‌జీ, ఎస్‌ఎల్ మోడల్‌లలో ఈ కారు జపాన్ మార్కెట్‌లో అందుబాటులో ఉండనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ కారులో పెట్రోల్ యూనిట్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటార్ కూడా ఉంటుందని పేర్కొంది.
ఒక లీటరు 32 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. పర్యావరణహితాన్ని దృష్టిలో ఉంచుకుని కారును డిజైన్ చేసినట్లు వెల్లడించింది. హైబ్రిడ్ ఇంజిన్‌తో పాటు పలు రకాల టెక్నికల్ అప్‌గ్రేడ్‌లు కూడా ఈ మోడల్ స్విఫ్ట్‌లో ఉంటాయని తెలిపింది. అయితే, స్విఫ్ట్ హైబ్రిడ్‌ను భారత్‌లో లాంచ్ చేసే ఉద్దేశం లేదని వెల్లడించింది.