milege
-
CNG Price: సీఎన్జీ వినియోగదారులకు చేదు వార్త
సాక్షి, హైదరాబాద్: కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) ధర మళ్లీ పెరిగింది. కిలోపై రూ. 2 పెరగడంతో హైదరాబాద్‌లో దీని ధర రూ.92కు చేరింది. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను తట్టుకోలేక సీఎన్జీ వైపు వాహనదారులు మొగ్గు చూపుతుండగా తాజాగా సీఎన్జీ ధర కూడా అదే స్థాయికి ఎగబాగుతోంది. మరోవైపు పెట్రోల్ బంకులో కిలో ధరపై అదనంగా రూ.5 నుంచి రూ.10 బాదేస్తున్నాయి. కాలుష్య రహితంతో పాటు మైలేజీ అధికంగా వస్తుందన్న కారణంతో సీఎన్జీ వినియోగం వైపు వెళితే.. పెరిగిన ధరలతో మళ్లీ వెనక్కి వెళ్లని పరిస్థితి నెలకొంది. వాస్తవంగా పెట్రోల్, డీజిల్ కంటే సీఎన్జీ, గ్యాస్‌తో నడిచే వాహనాలు మైలేజీ అధికంగా ఇస్తాయి. పెట్రోల్, డీజిల్ లీటర్‌కు 15 నుంచి 20 కిలో మీటర్ల వరకు మైలేజీ ఇస్తే సీఎన్జీ, ఆటో గ్యాస్, ఎల్పీజీ కిలోకు 22 నుంచి 28 కిలో మీటర్ల వరకు మైలేజీ వస్తుందని అంచనా. ప్రయాణికులను చేరేవేసే ఆటోలు, ఇతర వాహనదారులు తమ ట్యాంకులను ఎక్కువ శాతం సీఎన్జీకి బదిలీ చేసుకున్నాయి. మరోవైపు ఇంధన కొరత మహానగరంలో సీఎన్జీ కొరత ఏర్పడింది. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను తట్టుకోలేక సీఎన్జీ గ్యాస్ కిట్లు అమర్చుకున్న వాహనాలకు కొరత వెంటాడుతోంది. గత ఆరు నెలలలో వాహనాల సంఖ్య ఎగబాగడంతో సీఎన్జీ బంకులకు సరఫరా అవుతున్న గ్యాస్ ఏ మూలకు సరిపోని పరిస్థితి నెలకొంది. బంకుల్లో లోడ్ నింపిన నాలుగైదు గంటల్లోనే గ్యాస్ నిండుకుంటోంది. ఫలితంగా వాహనదారులు సీఎన్జీ కోసం క్యూ కడుతున్నారు. (క్లిక్ చేయండి: అత్యంత విలువైన రైల్వే భూముల్లో రియల్ దందా) -
మైలేజ్‌లో రారాజు..మారుతి సుజుకీ సరికొత్త రికార్డు..!
దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఎస్-సీఎన్జీ వేరియంట్ వాహనాల అమ్మకాలు సరికొత్త మైలురాయిను తాకింది. భారత్‌లో ఏకంగా 10 లక్షల యూనిట్లకు పైగా ఎస్-సీఎన్జీ వేరియంట్ వాహనాలు అమ్ముడైనట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. గ్రీన్ మొబిలిటీ లక్ష్యంగా..! గ్రీన్ మొబిలిటీ వైపు అడుగులు వేస్తూ మారుతి సుజుకి కంపెనీ పోర్ట్‌ఫోలియోలోని పలు మోడళ్లను సీఎన్జీ వేరియంట్స్‌గా మార్చింది. ఆల్టో, ఎస్-ప్రెస్సో, వ్యాగన్ఆర్, సెలెరియో, డిజైర్, ఎర్టిగా, ఈకో, సూపర్ క్యారీ , టూర్-ఎస్ మోడళ్లను సీఎన్జీ వేరియంట్స్‌గా కొనుగోలుదారులకు అందుబాటులోకి తెచ్చింది. మారుతి సుజుకి ఎస్-సీఎన్జీ కార్లు మైలేజ్‌లో రారాజుగా నిలుస్తూ కొనుగోలుదారుల నుంచి భారీ ఆదరణను పొందాయి. ఆటోమొబైల్ ఇండస్ట్రీలో అత్యధిక సీఎన్జీ మోడల్స్‌ను ఉత్పత్తి చేసిన కంపెనీగా మారుతి సుజుకీ నిలుస్తోందని మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరక్టర్ అండ్ సీఈవో కెనిచీ అయుకవా అన్నారు. అంతేకాకుండా గ్రీన్ మొబిలిటే లక్ష్యంగా, సురక్షితమైన, విశ్వసనీయమైన, మన్నికైన వాహనాలను అందించేందుకు సిద్దంగా ఉన్నామని అభిప్రాయపడ్డారు. 2016-17లో మారుతీ సుజుకి 3.5 లక్షల S-CNG విక్రయాల మైలురాయిని చేరుకుంది సీఎన్జీ విస్తరణతో తక్కువ వ్యవధిలోనే 10 లక్షల మైలురాయిని అందుకుంది. కొద్ది రోజుల క్రితం ఎస్-సీఎన్జీ పోర్ట్‌ఫోలియో భాగంగా న్యూ డిజైర్ మోడల్‌ను కంపెనీ లాంచ్ చేసింది. సీఎన్జీ మోడళ్లలో సెలెరియో 35. 60 కిమీ/కేజీ, వ్యాగనఆర్ 34.05 కిమీ/కేజీ, ఆల్టో 31.59 కిమీ/కేజీ, ఎస్ ప్రెస్సో 31.20 కిమీ/కేజీ, డిజైర్ 31.12 కిమీ/కేజీ, ఎర్టిగా 26.08 కిమీ/కేజీ, ఈకో 20.88 కిమీ/కేజీ మేర మైలేజ్‌ను అందిస్తున్నాయి. చదవండి: అత్యధిక మైలేజ్ ఇచ్చే కారును లాంచ్ చేసిన మారుతి సుజుకీ..! -
కొత్త స్కీం: మైలేజ్ ఇవ్వని వాహనాలు వాపస్ ఇచ్చేయండి!
ఏ కంపెనీ అయినా ఇలాంటి ప్రకటన ఇస్తుందా? అనే అనుమానం రావొచ్చు. కానీ, మహీంద్రా గ్రూపు ఈ ఆసక్తికర స్కీంతో వాహనదారుల్ని ఆకట్టుకుంటోంది. అధిక మైలేజీ ఇవ్వని వాహనాలను వెనక్కి ఇచ్చేయొచ్చంటూ వాహనదారులకు ఆఫర్ ఇచ్చింది. ఈ మేరకు మహీంద్రా ట్రక్ అండ్ బస్ (ఎంటీబీ) చేసిన ప్రకటన ఆటోమొబైల్ రంగంలో చర్చనీయాంశంగా మారింది. ఎంటీబీ రూపొందించే బీఎస్6 ట్రక్కుల శ్రేణిలో ఏ ఒక్క మోడల్ అయినా అత్యధిక మైలేజీ ఇవ్వకపోతే దాన్ని వాపసు తీసుకుంటామని పేర్కొంది మహీంద్రా కంపెనీ. బీఎస్6 శ్రేణిలో భారీ, మధ్యస్థ, తేలికపాటి వాహనాలు ఉపయోగించేవాళ్లకు ఈ స్కీం వర్తిస్తుందని ప్రకటించుకుంది. ‘పోటీ కంపెనీ వాహనాల కంటే మా వాహనాలు మైలేజీ తక్కువ గనుక ఇస్తే.. వాహనదారులు నిరభ్యరంతంగా మా వాహనాల్ని వెనక్కి ఇచ్చేయొచ్చ’ని స్కీం గురించి వివరించింది కంపెనీ. ఈ మేరకు ‘బ్లేజో ఎక్స్ హెచ్ సీవీ, ఫ్యూరియో ఐసీవీ, ఫ్యూరియో 7, జేయో’ మోడల్ వాహనాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని ఎంటీబీ ఒక ప్రకటనలో తెలిపింది. ఇదిలా ఉంటే.. ఎండీఐ టెక్ ఇంజిన్లు, ఫ్యూయల్ స్మార్ట్ సాంకేతిక పరిజ్ఞానంతో ఎంటీబీ ఈ రవాణా వాహనాల్ని తయారు చేస్తోంది. ఇంధన ధరలు పెరిగిపోతున్న ప్రస్తుత తరుణంలో వినియోగదారుల పరంగా చూస్తే ఇది సరైన పథకం అని మహీంద్రా అండ్ మహీంద్రా ఆటోమోటివ్ సెక్టార్ సీఈవో వీజయ్ నక్రా చెబుతున్నారు. ‘మహీంద్రా సంస్థ సాంకేతిక సామర్థ్యంపై వినియోగదారుల్లో నమ్మకాన్ని పెంచాలనుకుంటున్నాం. తద్వారా రవాణా వాహన శ్రేణిలో అత్యుత్తమ ప్రమాణాలు నెలకొల్పడంలో నిబద్ధత కనబరుస్తున్నాం’ అని నక్రా ప్రకటించుకున్నారు. అయితే సరుకు రవాణా వాహన విభాగంలో పట్టు సాధించేందుకు మహీంద్రా అండ్ మహీంద్రా సంస్థ ఇలా సరికొత్త ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. కొత్తేం కాదు.. ‘‘మైలేజీ రాకపోతే వాహనాల్ని వెనక్కి ఇవ్వండి’’ అనే ప్రకటన మహీంద్రాకు కొత్తేం కాదు. 2016లో బ్లేజో ఎక్స్ హెచ్ సీవీ ట్రక్కుల విషయంలో ఇలాంటి స్కీమ్ అమలు చేసింది. అయితే ఆ టైంలో 33 వేల బ్లేజో ట్రక్కులు అమ్ముడుపోగా.. ఒక్క వాహనం కూడా వెనక్కి రాలేని ఎంటీబీ ప్రకటించుకుంది. చదవండి: ఐఫోన్ అమ్మకాలతో యాపిల్ ఉక్కిరిబిక్కిరి,భారత్‌లో దూసుకెళ్తున్న సేల్స్!! -
32 కిలోమీటర్ల మైలేజ్‌తో సుజుకీ కొత్త కారు
స్విఫ్ట్ హైబ్రిడ్ కారును సుజుకీ జపాన్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఎస్జీ, ఎస్ఎల్ మోడల్‌లలో ఈ కారు జపాన్ మార్కెట్లో అందుబాటులో ఉండనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ కారులో పెట్రోల్ యూనిట్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటార్ కూడా ఉంటుందని పేర్కొంది. ఒక లీటరు 32 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. పర్యావరణహితాన్ని దృష్టిలో ఉంచుకుని కారును డిజైన్ చేసినట్లు వెల్లడించింది. హైబ్రిడ్ ఇంజిన్‌తో పాటు పలు రకాల టెక్నికల్ అప్గ్రేడ్లు కూడా ఈ మోడల్ స్విఫ్ట్‌లో ఉంటాయని తెలిపింది. అయితే, స్విఫ్ట్ హైబ్రిడ్‌ను భారత్‌లో లాంచ్ చేసే ఉద్దేశం లేదని వెల్లడించింది.