దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఎస్-సీఎన్‌జీ వేరియంట్ వాహనాల అమ్మకాలు సరికొత్త మైలురాయిను తాకింది. భారత్‌లో ఏకంగా 10 లక్షల యూనిట్లకు పైగా ఎస్-సీఎన్‌జీ వేరియంట్ వాహనాలు అమ్ముడైనట్లు కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది.
గ్రీన్ మొబిలిటీ లక్ష్యంగా..!
గ్రీన్ మొబిలిటీ వైపు అడుగులు వేస్తూ మారుతి సుజుకి కంపెనీ పోర్ట్‌ఫోలియోలోని పలు మోడళ్లను సీఎన్‌జీ వేరియంట్స్‌గా మార్చింది. ఆల్టో, ఎస్-ప్రెస్సో, వ్యాగన్ఆర్, సెలెరియో, డిజైర్, ఎర్టిగా, ఈకో, సూపర్ క్యారీ , టూర్-ఎస్ మోడళ్లను సీఎన్‌జీ వేరియంట్స్‌గా కొనుగోలుదారులకు అందుబాటులోకి తెచ్చింది. మారుతి సుజుకి ఎస్-సీఎన్‌జీ కార్లు మైలేజ్‌లో రారాజుగా నిలుస్తూ కొనుగోలుదారుల నుంచి భారీ ఆదరణను పొందాయి.
ఆటోమొబైల్ ఇండస్ట్రీలో అత్యధిక సీఎన్‌జీ మోడల్స్‌ను ఉత్పత్తి చేసిన కంపెనీగా మారుతి సుజుకీ నిలుస్తోందని మారుతి సుజుకీ ఇండియా లిమిటెడ్ మేనేజింగ్ డైరక్టర్ అండ్ సీఈవో కెనిచీ అయుకవా అన్నారు. అంతేకాకుండా గ్రీన్ మొబిలిటే లక్ష్యంగా, సురక్షితమైన, విశ్వసనీయమైన, మన్నికైన వాహనాలను అందించేందుకు సిద్దంగా ఉన్నామని అభిప్రాయపడ్డారు.
2016-17లో మారుతీ సుజుకి 3.5 లక్షల S-CNG విక్రయాల మైలురాయిని చేరుకుంది సీఎన్‌జీ విస్తరణతో తక్కువ వ్యవధిలోనే 10 లక్షల మైలురాయిని అందుకుంది. కొద్ది రోజుల క్రితం ఎస్-సీఎన్‌జీ పోర్ట్‌ఫోలియో భాగంగా న్యూ డిజైర్ మోడల్‌ను కంపెనీ లాంచ్ చేసింది. సీఎన్‌జీ మోడళ్లలో సెలెరియో 35. 60 కిమీ/కేజీ, వ్యాగనఆర్ 34.05 కిమీ/కేజీ, ఆల్టో 31.59 కిమీ/కేజీ, ఎస్ ప్రెస్సో 31.20 కిమీ/కేజీ, డిజైర్ 31.12 కిమీ/కేజీ, ఎర్టిగా 26.08 కిమీ/కేజీ, ఈకో 20.88 కిమీ/కేజీ మేర మైలేజ్‌ను అందిస్తున్నాయి.
చదవండి: అత్యధిక మైలేజ్ ఇచ్చే కారును లాంచ్ చేసిన మారుతి సుజుకీ..!
Comments
Please login to add a commentAdd a comment