Suzuki
-
టయోటాకు సుజుకీ ఈవీలు.. గుజరాత్ ప్లాంటులో తయారీ
న్యూఢిల్లీ: పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని టయోటా మోటార్ కార్పొరేషన్‌కు సుజుకీ మోటార్ కార్పొరేషన్ సరఫరా చేయనుంది. ఈ మేరకు ఇరు సంస్థలు తమ సహకారాన్ని మరింత విస్తరింపజేశాయి. ఈ మోడల్‌ను 2025 ప్రారంభంలో గుజరాత్ ప్లాంటులో తయారు చేయనున్నట్లు సుజుకీ మోటార్ కార్పొరేషన్ ఒక ప్రకటనలో తెలిపింది.మారుతీ సుజుకీ ఇండియా వచ్చే ఏడాది పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ ఎస్‌యూవీని విడుదల చేయాలని యోచిస్తోంది. ఈ మోడల్ కోసం తీసుకున్న బీఈవీ యూనిట్, ప్లాట్‌ఫామ్‌లను సుజుకీ, టయోటాతోపాటు డైహట్సు మోటార్ కార్పొరేషన్ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.‘ప్రపంచవ్యాప్తంగా టయోటాకు మా మొదటి బీఈవీ (బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికల్) సరఫరా చేస్తాం. ఈ విధంగా రెండు కంపెనీల మధ్య సహకారం మరింతగా కొనసాగినందుకు చాలా సంతోషంగా ఉంది. పోటీదారులుగా కొనసాగుతూనే ఇరు కంపెనీలు విభిన్న మార్గాల ద్వారా కార్బన్–న్యూట్రల్ సొసైటీని సాకారం చేయడంతో సహా సామాజిక సమస్యలను పరిష్కరించడంలో మరింత సహకరించుకుంటాయి’’ అని సుజుకీ ప్రెసిడెంట్ తోషిహిరో సుజుకీ తెలిపారు.ఇదీ చదవండి: టీవీఎస్ రికార్డ్.. 4.89 లక్షల వాహనాలు అమ్మేసింది!ఉత్పత్తులను ఇచ్చిపుచ్చుకోవడం, తయారీ కేంద్రాల వినియోగానికై భాగస్వామ్యం కోసం టయోటా మోటార్ కార్పొరేషన్, సుజుకీ మోటార్ కార్పొరేషన్ 2017లో అవగాహన ఒప్పందంపై సంతకం చేశాయి. మారుతీ సుజుకీలో... సుజుకీ కార్పొరేషన్‌కు దాదాపు 58 శాతం వాటా ఉంది. -
ఆటోమొబైల్ రంగంలో సుజుకి సరికొత్త సంచలనం.. నాలుగు చక్రాల బైక్‌తో
-
సుజుకి జిమ్నీ హెరిటేజ్ ఎడిషన్: కేవలం 300 మందికి మాత్రమే!
ప్రపంచ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన సుజుకి జిమ్నీ ఇటీవల ఆస్ట్రేలియన్ మార్కెట్లో 'జిమ్నీ హెరిటేజ్ ఎడిషన్' రూపంలో విడుదలైంది. ఇది లిమిటెడ్ ఎడిషన్ కావున కేవలం 300 యూనిట్లకు మాత్రమే పరిమితం చేయడం జరిగింది. సుజుకి జిమ్నీ హెరిటేజ్ ఎడిషన్ ధర 33,490 AUD (భారతీయ కరెన్సీ ప్రకారం సుమారు రూ. 18 లక్షలు). ఇది కేవలం ఆస్ట్రేలియాలో మాత్రమే విక్రయించడానికి అందుబాటులో ఉంది. ఇప్పటికే గ్లోబల్ మార్కెట్లో ఆఫ్ రోడర్స్ మనసు దోచిన ఈ మోడల్ మరింత ఆదరణ పొందుతుందనటంలో ఎటువంటి సందేహం లేదు. కొత్త జిమ్నీ హెరిటేజ్ ఎడిషన్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో మాత్రమే లభిస్తుంది. ఇది 5 స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. అంతే కాకుండా ఇందులో ఫోర్-వీల్ డ్రైవ్ ట్రైన్ స్టాండర్డ్‌గా లభిస్తుంది. పర్ఫామెన్స్ పరంగా దాని మునుపటి మోడల్స్ మాదిరిగానే ఉంటుంది. (ఇదీ చదవండి: Dao EVTech: వంద కోట్ల పెట్టుబడికి శ్రీకారం.. ఆ ప్రాంతానికి మహర్దశ) సుజుకి జిమ్నీస్పెషల్ హెరిటేజ్ ఎడిషన్ బ్లాక్ పెర్ల్,జంగిల్ గ్రీన్, వైట్, మీడియం గ్రే కలర్ ఆప్సన్స్‌లో అందుబాటులో ఉంటుంది. ఇందులో తెలుసుకోవాల్సిన అంశం దాని డిజైన్. ఈ ఆఫ్ రోడర్ కొత్త డీకాల్స్, రెడ్ కలర్స్‌లో ఫ్రంట్ అండ్ రియర్ మడ్ఫ్లాప్లతో చూడచక్కగా ఉంటుంది. ఇది 15 ఇంచెస్ అల్లాయ్ వీల్స్ పొందుతుంది. అంతే కాకుండా జిమ్నీ హెరిటేజ్ ఎడిషన్ అనే అక్షరాలు సైడ్ ప్రొఫైల్‌లో చూడవచ్చు. ఇంటీరియర్ డిజైన్, ఫీచర్స్ అన్నీ కూడా టాప్-స్పెక్ జిమ్నీ మాదిరిగానే 7-ఇంచెస్ టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, క్లైమేట్ కంట్రోల్, కీలెస్ ఎంట్రీ, మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే, లెదర్ చుట్టబడిన స్టీరింగ్ వీల్, నావిగేషన్, క్లైమేట్ కంట్రోల్, రివర్స్ పార్కింగ్ కెమెరా వంటివి లభిస్తాయి. ఈ స్పెషల్ ఎడిషన్ భారతీయ మార్కెట్లో విడుదలయ్యే అవకాశం లేదని సమాచారం. దీనిపైన కంపెనీ ఎటువంటి అధికారిక ప్రకటన వెల్లడించలేదు. -
అక్కడ చుక్కలు తాకిన మారుతి ధరలు.. ఏకంగా రూ. 21 లక్షలకు చేరిన ఆల్టో
ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్‌లో నిత్యావసర వస్తువులు మాత్రమే కాకుండా కార్ల ధరలు కూడా భారీగా పెరిగాయి. భారతదేశంలో తక్కువ ధరకే లభించే మారుతి ఆల్టో ధరలకు రెక్కలొచ్చాయి, ఇప్పుడు పాకిస్థాన్‌లో ఆల్టో బేస్ మోడల్ ధర రూ. 21 లక్షలు, కాగా టాప్ మోడల్ రూ. 27 లక్షల వద్ద అందుబాటులో ఉన్నాయి. పాకిస్థాన్‌లో ఇప్పటికే భారీ ధరలను పెంచిన సుజుకి మరో సారి ధరలను అమాంతం పెంచింది. ఈ కారణంగా సుజుకి బ్రాండ్ కార్లు ఏ దేశంలో లేనంతగా పెరిగాయి. భారతీయ మార్కెట్లో మారుతి సుజుకి ఆల్టో బేస్ మోడల్ ధరలు రూ. రూ.3.50 లక్షలు, టాప్ ఎండ్ మోడల్ ధరలు రూ. 5.12 లక్షల వరకు ఉన్నాయి. భారదేశంలో విక్రయించబడుతున్న ఆల్టో ధరలతో పోలిస్తే, పాకిస్థాన్ సుజుకి ఆల్టో ధర సుమారు ఐదు రేట్లు కంటే ఎక్కువ అని స్పష్టంగా అర్థమవుతోంది. పాకిస్థాన్‌లో ద్రవ్యోల్బణం తీవ్రస్థాయిలో ఉన్న కారణంగా అన్ని ధరలు భారీగా పెరుగుతున్నాయి, భారతీయ కరెన్సీతో పోలిస్తే పాకిస్థాన్ కరెన్సీ విలువ చాలా తక్కువగా ఉంది. సుజుకి ఆల్టో కొత్త ధరలు: సుజుకి ఆల్టో విఎక్స్: రూ.2,144,000 సుజుకి ఆల్టో విఎక్స్ఆర్: రూ. 2,487,000 సుజుకి ఆల్టో విఎక్స్ఆర్ ఏజిఎస్: రూ. 137,000 సుజుకి ఆల్టో ఏజీఎస్: రూ. 2,795,000 సుజుకి వ్యాగన్ ఆర్ కొత్త ధరలు: వ్యాగన్ ఆర్ విఎక్స్ఆర్: రూ. 3,062,000 వ్యాగన్ ఆర్ విఎక్స్ఎల్: రూ.3,248,000 వ్యాగన్ ఆర్ ఏజీఎస్: రూ.3,563,000 సుజుకి కల్టస్ కొత్త ధరలు: కల్టస్ విఎక్స్ఆర్: రూ. 3,540,000 కల్టస్ విఎక్స్ఎల్: రూ. 3,889,000 కల్టస్ ఏజిఎస్: రూ. 4,157,000 సుజుకి స్విఫ్ట్ కొత్త ధరలు: స్విఫ్ట్ జిఎల్ ఎమ్‌టి: రూ. 4,052,000 స్విఫ్ట్ జిఎల్ సివిటి: రూ. 4,335,000 స్విఫ్ట్ జిఎల్ఎక్స్ సివిటి: రూ. 4,725,000 సుజుకి రవి కొత్త ధరలు: సుజుకి రవి: రూ. 1,768,000 సుజుకి రవి డెక్: రూ. 1,693,000 సుజుకి బోలాన్ కొత్త ధరలు: బోలాన్ వ్యాన్: రూ. 1,844,000 బోలాన్ కార్గో: రూ. 1,852,000 Pak Suzuki Cars Prices Increased!#pakwheels #paksuzuki #suzuki #carprices #pricehike pic.twitter.com/b0Eikq3mGw — PakWheels.com (@PakWheels) February 20, 2023 -
లోకలైజేషన్ పెరగాలి
న్యూఢిల్లీ: వాహన విడిభాగాల పరిశ్రమ స్థానికీకరణ (లోకలైజేషన్) పెంచడంపై మరింతగా దృష్టి పెట్టాలని ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కెనిచి అయుకావా అభిప్రాయపడ్డారు. నిలకడైన వృద్ధి సాధించేందుకు కొత్త టెక్నాలజీలపై పెట్టుబడులు పెంచడాన్ని కొనసాగించాలని ఆయన సూచించారు. ఆటో విడిభాగాల సంస్థల సమాఖ్య ఏసీఎంఏ 62వ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా అయుకావా ఈ విషయాలు తెలిపారు. ‘ముడి వస్తువులు మొదలుకుని అత్యంత చిన్న విడిభాగాలను కూడా వీలైనంత వరకూ స్థానికంగానే ఉత్పత్తి చేసేందుకు మార్గాలు వెతకాలి. భారతీయ ఆటో పరిశ్రమ దేశీయంగాను, అటు ఎగుమతులపరంగానూ భారీ స్థాయికి పెరిగింది. ఇలాంటప్పుడు నాణ్యత అత్యంత ప్రాధాన్యమైన అంశంగా ఉంటుంది. కాబట్టి నాణ్యతా ప్రమాణాలను మరింత మెరుగుపర్చుకోవడంపై దృష్టి పెట్టాలి’ అని పేర్కొన్నారు. 2070 నాటికి కర్బన ఉద్గారాలను సున్నా స్థాయికి తగ్గించాలన్న ప్రధాని లక్ష్యం సాకారం చేసే దిశగా భవిష్యత్ తరం టెక్నాలజీలపై పరిశ్రమ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందని చెప్పారు. పరిశ్రమను తిరిగి వృద్ధి బాట పట్టించేందుకు ఏసీఎంఏ, వాహనాల తయారీ సంస్థల సమాఖ్య సియామ్ కలిసి పనిచేయాలని అయుకావా తెలిపా రు. కాగా, ప్యాసింజర్, వాణిజ్య వాహనాల అమ్మకాలు కరోనా పూర్వ స్థాయికి చేరగా.. ద్విచక్ర వాహనాల విక్రయాలు కూడా ఈ పండుగ సీజన్లో ఆ స్థాయిని అందుకోగలవని అంచనా వేస్తున్నట్లు ఏసీఎంఏ ప్రెసిడెంట్ సంజయ్ కపూర్ చెప్పారు. వాహనాల పరీక్షకు కఠిన ప్రమాణాలు ఉండాలి: పవన్ గోయెంకా ఎలక్ట్రిక్ వాహనాలను కంపెనీలు ఆదరాబాదరాగా మార్కెట్లోకి తెచ్చేయకుండా తయారీకి సంబంధించి కఠిన ప్రమాణాలు, పరీక్షలు ఉండాలని ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ చైర్మన్ పవన్ గోయెంకా అభిప్రాయపడ్డారు. తద్వారా విద్యుత్ వాహనాలు అగ్ని ప్రమాదాల బారిన పడే ఉదంతాలను నివారించవచ్చని పేర్కొన్నారు. కఠిన చర్యలు.. సరఫరాదారులు విడిభాగాలను స్థానికంగా తయారు చేయకుండా అడ్డుపడే ఆటోమొబైల్ కంపెనీల విషయంలో కేంద్రం కఠినంగా వ్యవహరిస్తుంది. దేశీయంగానే విడిభాగాలను తయారు చేసుకోవడానికి పరిశ్రమ ప్రోత్సాహం ఉంటుందని ఆశిస్తున్నాం. – పీయూష్ గోయల్, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి -
సుజుకీ అప్.. హీరో డౌన్
న్యూఢిల్లీ: ఈ ఏడాది నవంబర్‌లో కూడా ఆటో రంగ అమ్మకాలు నెమ్మదించాయి.ద్విచక్ర వాహన విభాగంలో సుజుకీ మోటార్‌సైకిల్ విక్రయాలు 14.69 శాతం పెరిగాయి. దిగ్గజ కంపెనీలైన హీరో మోటోకార్ప్, బజాజ్ ఆటో అమ్మకాలు తగ్గాయి. వాణిజ్య వాహన విభాగంలో అశోక్ లేలాండ్ 25 శాతం తగ్గుదలను నమోదుచేసింది. ప్యాసింజర్ వాహన విభాగంలో మారుతీ వంటి దిగ్గజ కంపెనీల అమ్మకాలు తగ్గిన విషయం తెలిసిందే కాగా, తాజాగా వెల్లడైన టయోటా విక్రయాలు సైతం 22 శాతం క్షీణతను నమోదుచేశాయి. -
మార్కెట్లోకి సుజుకీ ‘జిక్సర్ 250’
న్యూఢిల్లీ: సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా (ఎస్ఎంఐపీఎల్)..‘జిక్సర్–250’ మోడల్ బైక్‌ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.ఫోర్–స్ట్రోక్ 249సీసీ ఇంజిన్‌తో విడుదలైన ఈ బైక్ ధర రూ.1,59,800 (ఢిల్లీఎక్స్‌షోరూం)గా నిర్ణయించినట్లు కంపెనీ ప్రకటించింది. మెరుగైన బ్రేకింగ్ వ్యవస్థను అందించడంలో భాగంగా డ్యూయల్ ఛానల్ యాంటీ–లాక్ బ్రేక్ సిస్టమ్ (ఏబీఎస్) అమర్చినట్లు తెలిపింది. ఈ సందర్భంగా ఎస్ఎంఐపీఎల్ హెడ్ కోచిరో హిరావ్ మాట్లాడుతూ..‘అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సుజుకీ సంస్థ మోటార్‌సైకిళ్లను అభివృద్ధి చేస్తుందనే అంశానికి ఈ నూతన బైక్ అద్దం పడుతోంది. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా నూతన బైక్‌ల విడుదలతో మా వృద్ధి వేగాన్ని కొనసాగిస్తాం’ అని వ్యాఖ్యానించారు. -
సుజుకీ ‘జిక్సర్’ కొత్త వెర్షన్
న్యూఢిల్లీ: సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా తన నూతన ‘జిక్సర్ ఎస్ఎఫ్’ సిరీస్‌లో 155సీసీ మోటో జీపీ ఎడిషన్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఫోర్ స్ట్రోక్, సింగిల్ సిలిండర్ ఫుయల్ ఇంజెక్షన్ ఇంజిన్‌తో అందుబాటులోకి వచ్చిన ఈ బైక్ ప్రారంభ ధర రూ.1,10,605 (ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ)గా కంపెనీ ప్రకటించింది. 249సీసీ ఇంజిన్ సామర్థ్యం కలిగిన జిక్సర్ ఎస్ఎఫ్ 250 మోటోజీపీ ఎడిషన్‌ను ఆగస్టులో విడుదల చేయనున్నట్లు ఈ సందర్భంగా సంస్థ వైస్ ప్రెసిడెంట్ దేవాశిష్ హండా వెల్లడించారు. -
మార్కెట్లోకి సుజుకీ ‘ఇన్ట్రూడర్’ 2019 ఎడిషన్
ముంబై: వాహన తయారీ కంపెనీ సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా.. తన ‘ఇన్ట్రూడర్’ క్రూయిజర్ బైక్‌లో నూతన ఎడిషన్‌ను శుక్రవారం మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. అధునాతన గేర్ షిఫ్ట్ డిజైన్, అభివృద్ధిపరిచిన బ్రేక్ పెడల్ వంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో అందుబాటులోకి వచ్చిన ఈ బైక్ ధర రూ.1.08 లక్షలుగా కంపెనీ తెలిపింది. ‘స్టాండర్డ్ ఏబీఎస్, 155సీసీ ఇంజిన్, పూర్తి డిజిటల్ ఉపకరణాలతో ఈ బైక్ విడుదలైంది. క్రూయిజర్‌ను ఇష్టపడే యువతకు ఈ అడ్వాన్స్డ్ వెర్షన్ సరిగ్గా సరిపడే మోటార్‌సైకిల్‌గా భావిస్తున్నాం’ అని ఎస్ఎంఐపీఎల్ వైస్ ప్రెసిడెంట్ దేవశిష్ హన్డా అన్నారు. -
సుజుకీ కొత్త జిక్సర్ బైక్స్..
న్యూఢిల్లీ: ప్రముఖ టూవీలర్ కంపెనీ ‘సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా’ తాజాగా 2018 ఎడిషన్ జిక్సర్, జిక్సర్ ఎస్ఎఫ్ బైక్స్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. వీటి ధరలు వరుసగా రూ.80,928, రూ.90,037గా ఉన్నాయి. అన్ని ధరలు ఎక్స్‌షోరూమ్ ఢిల్లీవి. రెండింటిలోనూ సుజుకీ ఎకో పర్ఫార్మెన్స్ టెక్నాలజీతో కూడిన 155 సీసీ ఇంజిన్‌ను అమర్చినట్లు కంపెనీ తెలిపింది. -
32 కిలోమీటర్ల మైలేజ్‌తో సుజుకీ కొత్త కారు
స్విఫ్ట్ హైబ్రిడ్ కారును సుజుకీ జపాన్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఎస్జీ, ఎస్ఎల్ మోడల్‌లలో ఈ కారు జపాన్ మార్కెట్లో అందుబాటులో ఉండనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఈ కారులో పెట్రోల్ యూనిట్‌తో పాటు ఎలక్ట్రిక్ మోటార్ కూడా ఉంటుందని పేర్కొంది. ఒక లీటరు 32 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుందని కంపెనీ వర్గాలు తెలిపాయి. పర్యావరణహితాన్ని దృష్టిలో ఉంచుకుని కారును డిజైన్ చేసినట్లు వెల్లడించింది. హైబ్రిడ్ ఇంజిన్‌తో పాటు పలు రకాల టెక్నికల్ అప్గ్రేడ్లు కూడా ఈ మోడల్ స్విఫ్ట్‌లో ఉంటాయని తెలిపింది. అయితే, స్విఫ్ట్ హైబ్రిడ్‌ను భారత్‌లో లాంచ్ చేసే ఉద్దేశం లేదని వెల్లడించింది. -
సుజుకి కొత్త గిక్సర్ బైక్స్ లాంచ్...
న్యూఢిల్లీ: సుజుకీ మోటార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (SMIPL) 2017 న్యూ గిక్సర్ సిరీస్‌ను ప్రారంభించింది. బీఎస్-4 నిబంధనలతో ఈ కొత్త మోటార్ సైకిళ్ళను లాంచ్ చేసింది. న్యూ గిక్సర్, గిక్సర్ ఎస్ఎఫ్, గిక్సర్ ఎస్ఎఫ్ ఫిక్షన్ అనే ముడు వేరియంట్లను మార్కెట్లో విడుదల చేసింది. అధునాతన కొత్త గ్రాఫిక్స్ ను జతచేసి ట్రెండీ లుక్స్‌తో వీటిని అందుబాటులోకి తెచ్చింది. గిక్సర్ ధరను రూ.80,528, గిక్సర్ ఎస్ఎఫ్ రూ. 89,659, గిక్సర్ ఎస్ఎఫ్ ఎఫ్ఐ రూ. 93,499 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) కంపెనీ నిర్ణయించింది. గిక్సర్ కలర్ వేరియంట్స్ ప్రెర్ల్ మిరా రెడ్/ గ్లాస్ స్పార్కిల్ బ్లాక్, మెటాలిక్ ట్రిటోన్ బ్లూ / గ్లాస్ స్పార్కిల్ బ్లాక్ అందుబాటులో ఉన్నాయి. గిక్సర్ ఎస్ఎఫ్ మోడల్ మెటాలిక్ ట్రిటోన్ బ్లూ, గ్లాస్ స్పార్కిల్ బ్లాక్ / మెటాలిక్ మాట్ బ్లాక్, పెర్ల్ మీరా రెడ్ మూడు వేరియంట్స్ లో లభ్యం. గిక్సర్ ఎస్ఎఫ్ ఫిక్షన్ వేరియంట్ లో హ ట్రిటోన్ బ్లూ , గ్లాస్ స్పార్కిల్ బ్లాక్ / మెటాలిక మాట్ బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంది. -
ఐఫోన్ కంటే చీప్ గా దొరుకుతున్న బైకులివే!
బీఎస్-3 వాహనాలపై ఏప్రిల్ 1నుంచి నిషేధం విధిస్తున్నట్టు సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరిచడంతో బైక్ ధరలన్నీ ఒక్క ఉదుడున కిందకి దిగొచ్చాయి. డెడ్ లైన్ ఏప్రిల్ 1కి ఇంకా ఒక్కరోజే ఉండటంతో భారీ డిస్కౌంట్ ఆఫర్లతో స్టాక్ ను సేల్ చేసుకోవడానికి కంపెనీ తహతహలాడుతున్నాయి. ఇదే ఛాన్సుగా భావించిన కస్టమర్లు కొనుగోళ్లకు వెనుకాడటం లేదు. దీంతో మోటార్ షోరూంలన్నీ కొనుగోలదారులతో కళకళలాడుతున్నాయి. అయితే దిగొచ్చిన బైక్ ధరలు ఐఫోన్ కంటే చౌకగా లభ్యమవుతున్నట్టు తెలుస్తోంది. ఆ బైకులేమిటో ఓసారి చూద్దాం.... బీఎస్-3 వాహనాలపై టూ-వీలర్స్ దిగ్గజాలు రూ.22వేల వరకు డిస్కౌంట్ ప్రకటించాయి. దీంతో 150సీసీ బైక్ ఐఫోన్ కంటే తక్కువ ధరకే లభ్యమవుతుందట. నమ్మట్లేదా అయితే ధరలు మీరే ఓసారి చూడండి... ఆపిల్ గతేడాది లాంచ్ చేసిన ఐఫోన్ 7 ప్లస్(128జీబీ) ధర రూ.82వేలు. నేడు సుజుకీ జిక్సర్ ధర షోరూంలో రూ.77,452లకే దొరుకుతోంది. సుజుకీ జిక్సర్ మాత్రమే కాక, యాక్టివా 3జీ కూడా 50,290కు, డ్రీమ్ యుగ 51,741 రూపాయలకు, సీబీ షైన్ 55,799 రూపాయల నుంచి 61,283 రూపాయల వరకు, సీడీ 110డీఎక్స్ 47,202 రూపాయల నుంచి 47,494 రూపాయల ధరల్లో లభ్యమవుతున్నాయి. ఈ బైకులకు హోండా రూ.22వేల వరకు క్యాష్ బ్యాక్ ఆఫర్ ప్రకటించడంతో ధరలు కిందకి తగ్గాయి. హీరో బైకులపై ఉన్న ఆఫర్లు... హీరో మోటార్ కార్పొరేషన్ కూడా బీఎస్-3 టూ-వీలర్స్ పై రూ.12,500 వరకు డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో స్కూటర్స్ డ్యూయెట్, ఐఫోన్ కంటే చీప్ గా రూ.49,480కు అందుబాటులోకి వచ్చింది. ఇక మాస్ట్రో ఎడ్జ్ నైతే రూ.51,030కే కొనుకోవచ్చు. ప్రీమియం బైకులపై రూ.7500, ఎంట్రీలెవల్ బైకులపై రూ.5000వేల వరకు హీరో ఆఫర్ ప్రకటించింది. దీంతో గ్లామర్ రూ.59,755కు, స్ప్లెండర్ 125 రూ.55,575కు కొనుకునేలా ఆఫర్ ఉంది. ఒక్క హీరో, హోండా కంపెనీలు మాత్రమే కాక, సుజుకీ బైకులు, బజాజ్ బైకులు కూడా ఐఫోన్ కంటే తక్కువ ధరకే మార్కెట్లోకి వచ్చాయి. -
మేమూ తప్పు చేశాం..
టోక్యో : కర్బన్ ఉద్గారాల పరీక్షల్లో అక్రమాలకు పాల్పడుతూ.. తప్పయిందరనీ లెంపలేసుకుంటున్న కంపెనీల కోవలోకి ఇపుడు మరో జపాన్ ఆటో దిగ్గజం చేరింది. మేమూ తప్పు చేశామంటూ బహిరంగంగా సుజుకి మోటార్ కార్పొరేషన్ ప్రకటించింది. దీంతో ఇంధన పరీక్షల్లో అక్రమాలకు పాల్పడుతూ మోటార్ కార్పొరేషన్లు భారీ చిక్కుల్లో పడుతున్నాయి. మిత్సుబిషీ అనంతరం మరో జపనీస్ ఆటో దిగ్గజం సుజుకీ మోటార్ కార్పొరేషన్ సైతం ఇంధన పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిందని వెల్లడైంది. ఈ విషయాన్ని మారుతి సుజికి పేరెంట్ కంపెనీ అయిన సుజికీనే ఒప్పుకుంది. కంపెనీ ప్రతినిధి ఆండ్రూ హెలాండ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ అక్రమ ఇంధన పరీక్ష విషయం మార్కెట్లోకి పొక్కగానే, సుజుకీ షేర్లు అంతర్జాతీయ మార్కెట్లో 15శాతం మేర పతనమయ్యాయి. జపనీస్ నిబంధనలకు వ్యతిరేకంగా ఇంధన సామర్థ్య టెస్టింగ్ పద్ధతులున్నాయని, కర్బన ఉద్గారాలను వాడుతున్నట్టు కంపెనీ ప్రకటించింది. జపాన్ లో 16 మోడళ్లను ఈ అక్రమ ఇంధన టెస్టింగ్ లతోనే విక్రయించినట్టు ఒప్పుకుంది. ఈ అక్రమ ఇంధన పరీక్షల వల్ల 2010 నాటి నుంచి ఉన్న 21లక్షల వెహికిల్స్ ప్రభావం చూపనుందని కంపెనీ వెల్లడించింది. సుజుకీ ప్రకటన అనంతరం జపాన్ రవాణా మంత్రి అన్నీ దేశీయ ఆటోమేకర్స్ పై ఇంధన ఎకానమీ టెస్టింగ్ పద్ధతులపై విచారణకు ఆదేశించారు. ఇప్పటికే మిత్సుబిషీ నిబంధనలకు అనుగుణంగా ఇంధన పరీక్ష పద్ధతులను చేపట్టడం లేదని వెల్లడైంది. అయితే ఈ విషయమై సుజుకీ కంపెనీ చైర్ పర్సన్ ఓసామో సుజుకీ రవాణా మంత్రితో భేటీ కానున్నారు. ఆకగా మారుతి సుజికీ ఇండియాలో సుజుకి మోటార్ కార్పొరేషన్ 56 శాతం వాటాను కలిగిఉంది. దీంతో మారుతి సుజికీ దేశీయ మార్కెట్ 4శాతాలను నమోదు చేసింది. -
మారుతీ వేగన్ ఆర్ అమ్మకాలు @ 15 లక్షలు
న్యూఢిల్లీ: దేశీయ మార్కెట్లో మారుతీ సుజుకీ వ్యాగన్ ఆర్ కారు 15 లక్షల అమ్మకాల మైలురాయిని సాధించింది. వినియోగదారుల అభిరుచులకనుగుణంగా ఎప్పటికప్పుడు ఈ మోడల్లో మార్పులు, చేర్పులు చేయడం, విజయవంతమైన మార్కెటింగ్ విధానాల ద్వారా ఈ ఘనతను సాధించామని కంపెనీ వైస్ ప్రెసిడెంట్(మార్కెటింగ్) మనోహర్ భట్ చెప్పారు. ఈ మోడల్‌ను 2000 సంవత్సరంలో మార్కెట్లోకి తెచ్చామని, భారత్‌లో విక్రయమవుతున్న అత్యుత్తమ 5 బ్రాండ్లలో ఒకటిగా నిలిచిందని పేర్కొన్నారు. 2010-11లో ఈ మోడల్లో సీఎన్జీ వేరియంట్‌ను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. గతనెలలో అత్యధికంగా అమ్ముడైన కార్లలో వ్యాగన్ ఆర్ మూడో స్థానంలో నిలిచిందని సియామ్(సొ సైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్స్ మాన్యుఫాక్చరర్స్) వెల్లడించిందని పేర్కొన్నారు. గత ఆర్థిక సంవత్సరంలో 1,56,000 కార్లను విక్రయించామని, ఈ ఆర్థిక సంవత్సరం ఇప్పటివరకూ 93 వేలకు పైగా కార్లను అమ్మామని చెప్పారు. కాగా ఈ కంపెనీ మోడళ్లు- మారుతీ 800, ఆల్టోలు ఒక్కోటి 25 లక్షలకు పైగా అమ్ముడయ్యాయి. -
టాప్‌టెన్‌లో ఆరు మారుతీ కార్లే..
న్యూఢిల్లీ: కార్ల విక్రయాల్లో మారుతీ సుజుకీ హవా పెరుగుతోంది. గత నెలలో అమ్ముడైన టాప్ టెన్ కార్లలో మారుతీ కంపెనీకి చెందిన ఆరు కార్లు చోటు సాధించాయి. గత ఏడాది ఇదే నెలలో టాప్‌టెన్‌లో నాలుగు మారుతీ కార్లే స్థానం సంపాదించాయి. అక్టోబర్‌లో అధికంగా అమ్ముడైన కారుగా మారుతీ సుజుకీ ఆల్టో నిలిచిందని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్(సియామ్) వెల్లడించింది. టాప్‌టెన్‌లో మొదటి నాలుగు స్థానాలు మారుతీ కార్లే నిలవడం విశేషం. మారుతీ సుజుకీ కొత్తగా మార్కెట్లోకి తెచ్చిన సియాజ్, సెలెరియా కార్లు కూడా టాప్‌టెన్ జాబితాలో ఉన్నాయి. -
వైజాగ్ లో జపాన్ కంపెనీ హౌసింగ్ ఫ్రాజెక్ట్
న్యూఢిల్లీ: దేశీ రియల్టీ మార్కెట్లోకి తొలిసారి జపాన్ కంపెనీ టమ హోమ్ అడుగుపెట్టనుంది. టోక్యో స్టాక్ ఎక్స్ఛేంజీలో లిస్టయిన టమ హోమ్ భారత్‌లో గృహ నిర్మాణ ప్రాజెక్ట్‌లను నిర్మించేందుకు సింగపూర్ కంపెనీ డెవలపర్ గ్రూప్‌తో జతకట్టనుంది. తొలుత వైజాగ్‌లో 50 ఎకరాల్లో ఒక టౌన్‌షిప్‌ను, లూథియానాలో 150 ఎకరాల్లో మరో టౌన్‌షిప్‌ను ఏర్పాటుచేయనున్నట్లు ప్రకటించింది. 4 నెలల్లో వైజాగ్ ప్రాజెక్ట్ టమ హోమ్‌తో భాగస్వామ్యంపై డెవలపర్ గ్రూప్ సీఈవో డేవిడ్ రెబెల్లో మాట్లాడుతూ ఐదేళ్లలో రూ. 6,000 కోట్లను వెచ్చించడం ద్వారా 12-18 ప్రాజెక్ట్‌లను చేపట్టనున్నట్లు చెప్పారు. రానున్న నాలుగు నెలల్లో వైజాగ్, లూథియానాలలో టౌన్షిప్ ప్రాజెక్ట్‌లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. ఆపై 2015 ద్వితీయార్థంలో చెన్నైలోనూ గృహ నిర్మాణ ప్రాజెక్ట్‌ను ప్రారంభించనున్నట్లు వివరించారు. తొలి దశలో హౌసింగ్ విభాగంపైనే దృష్టిపెడతామని, తదుపరి దశలో ఇతర విభాగాలలోకి ప్రవేశిస్తామని తెలిపారు. ఇండియాలో హౌసింగ్‌కు భారీ అవకాశాలున్నాయని టమ హోమ్ ప్రెసిడెంట్ యషుహిరో టమకి ఈ సందర్భంగా చెప్పారు. భారత రియల్టీ మార్కెట్లో భూకంపాన్ని తట్టుకునే సాంకేతికతను తీసుకురానున్నట్లు చెప్పారు. ఇండియాలో ప్రవేశించేందుకు ఏడాది క్రితమే ప్రణాళికలు వే సినప్పటికీ, ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన తరువాత ఇవి ఊపందుకున్నట్లు ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు. -
మారుతీ నిర్ణయాన్ని వ్యతిరేకించమంటాం
న్యూఢిల్లీ: గుజరాత్ ప్రాజెక్ట్‌ను మాతృ సంస్థ సుజుకీ కార్పొరేషన్‌కు అప్పగించేందుకు మారుతీ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకించమంటూ మైనారిటీ వాటాదారులకు సలహా ఇవ్వనున్నట్లు అడ్వయిజరీ సంస్థలు తెలిపాయి. గుజరాత్లో ఏర్పాటు చేయతలపెట్టిన భారీ తయారీ ప్రాజె క్ట్ను మొత్తంగా జపనీస్ మాతృ సంస్థ సుజుకీ కార్పొరేషన్‌కు అప్పగించేందుకు మారుతీ బోర్డు ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా సుజుకీ పూర్తి అనుబంధ కంపెనీ ద్వారా గుజరాత్ ప్లాంట్‌పై 100% పెట్టుబడులను వెచ్చించేందుకు నిర్ణయించింది. ఈ నిర్ణయం కారణంగా తదుపరి దశలో మారుతీ కేవలం పంపిణీ సంస్థగా మిగిలే అవకాశముండటంతో కంపెనీలో వాటాలున్న 16 ఇన్వెస్ట్మెంట్ సంస్థలు ఆందోళనకు దిగాయి. ఈ నేపథ్యంలో మారుతీ ప్రతిపాదనపై వ్యతిరేకంగా ఓటు చేయాల్సిందిగా మైనారిటీ వాటాదారులకు సలహా ఇవ్వనున్నట్లు ఇన్‌గవర్న్ రీసెర్చ్ సర్వీసెస్ వ్యవ స్థాపకుడు శ్రీరాం సుబ్రమణ్యన్ చెప్పారు. ప్రాజెక్ట్‌ను సొంతం చేసుకోవడంకాకుండా మారుతీలో పెట్టుబడుల ద్వారా సుజుకీ తన వాటాను పెంచుకోవాలని సూచించారు. ఈ అంశంపై మరో అడ్వైయిజరీ సంస్థ ఐఐఏఎస్ స్పందిస్తూ గుజరాత్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన నిధులను మారుతీ కలిగి ఉన్నదని, వెరసి ప్రాజెక్ట్‌ను సుజుకీకి అప్పగించాల్సిన అవసరంలేదని వ్యాఖ్యానించింది. మారుతీ ఆర్‌వోసీఈ 15%గా ఉంటే, ఇన్వెస్ట్మెంట్ ఈల్డ్ మాత్రం 7-8% ఉన్నదని, కనుక మారుతీ గుజరాత్ ప్రాజెక్ట్‌పై పెట్టుబడులను వెచ్చించడమే మేలని వివరించింది. అయితే ఎస్ఈఎస్ సంస్థ మాత్రం మారుతీ కొత్త ప్రతిపాదనకు అనుకూలంగా స్పందించమంటూ వాటాదారులకు సూచించనున్నట్లు తెలిపింది. ఎఫ్ఐఐల దారెటు?: ప్రయివేట్ రంగ మ్యూచువల్ ఫండ్స్‌తోపాటు, సంస్థాగత ఇన్వెస్ట్మెంట్ సంస్థలు మారుతీ సుజుకీ నిర్ణయాన్ని ఇప్పటికే వ్యతిరేకించాయి. మారుతీలో దాదాపు 7% వాటా కలిగిన ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం ఎల్ఐసీ సైతం గుజరాత్ ప్రాజెక్ట్ బదిలీపై ఇప్పటికే మారుతీ వివరణ కోరింది కూడా. అయితే ఈ విషయంలో కీలక పాత్ర పోషించగల విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల(ఎఫ్ఐఐలు) ఆలోచన ఏమిటన్నది ఇంతవరకూ వెల్లడికాకపోవడం గమనార్హం. మారుతీలో ఎఫ్ఐఐలకు 21.5% వాటా ఉంది. కాగా, కంపెనీలో వాటాలు కలిగిన మొత్తం 16 ఇన్వెస్ట్మెంట్ సంస్థలు ఈ అంశంపై సెబీకి ఫిర్యాదు కూడా చేశాయి. ఈ వ్యతిరేకత నేపథ్యంలో గుజరాత్ ప్రాజెక్ట్ నిర్ణయంపై మైనారిటీ వాటాదారుల అనుమతిని కోరనున్నట్లు మారుతీ ప్రకటించింది. దీంతో 16 ఇన్వెస్ట్మెంట్ సంస్థలు కంపెనీ తాజా నిర్ణయాన్ని స్వాగతించాయి. అంతేకాకుండా సవరణలతో కంపెనీ తీసుకురానున్న తాజా ప్రతిపాదనను చూశాక తగిన విధంగా స్పందించాలని నిర్ణయించుకున్నాయి. వాటాదారుల వివరాలివీ... మారుతీలో సుజుకీ కార్పొరేషన్‌కు 56% వాటా ఉంది. మిగిలిన 44% వాటాలో ఎల్ఐసీకి 7%, దేశీయ సంస్థాగత ఇన్వెస్ట్మెంట్ సంస్థలకు మరో 7% చొప్పున వాటా ఉంది. హెచ్ఎస్బీసీ, క్రెడిట్ సూసీ, నార్వే ప్రభుత్వ పెన్షన్ ఫండ్ తదితర ఎఫ్ఐఐ సంస్థలు 21.5% వాటా కలిగి ఉన్నాయి. ఇక కార్పొరేట్ బాడీస్, రిటైల్ ఇన్వెస్టర్లకు 8%పైగా వాటా ఉంది. -
విలువైన బ్రాండ్ టాటా
లండన్: భారత దేశపు అత్యంత విలువైన బ్రాండ్‌గా టాటా గ్రూప్ అవతరించింది. బ్రాండ్ ఫైనాన్స్ సంస్థ రూపొందించిన ఈ గ్లోబల్ టాప్ 500 బ్రాండ్ జాబితాలో 2,110 కోట్ల డాలర్ల విలువతో టాటా గ్రూప్ తన అగ్రస్థానాన్ని(భారత్ వరకూ) ఈ ఏడాది కూడా నిలుపుకుంది. గత ఏడాది 39వ స్థానంలో ఉన్న టాటా బ్రాండ్ ఈ ఏడాది 34వ స్థానానికి ఎగబాకింది. ఈ జాబితాలో భారత కంపెనీలు గత ఏడాది ఆరు ఉండగా, ఈ ఏడాది ఈ సంఖ్య 5కు పడిపోయింది. ఒక్క టాటా మినహా మిగిలిన నాలుగు సంస్థల ర్యాంక్‌లు ఈ ఏడాది తగ్గాయి. అంతర్జాతీయ జాబితాలోని ఇతర భారత కంపెనీలు ఎస్బీఐ (347వ స్థానం), ఎయిర్టెల్(381), రిలయన్స్ ఇండస్ట్రీస్(413), ఇండియన్ ఆయిల్(474), ఈ జాబితాలో ఈ ఏడాది చోటు దక్కించుకోలేని కంపెనీగా ఐటీసీ నిలిచింది. మూడోసారీ యాపిలే ఇక ఈ జాబితాలో 10,500 కోట్ల డాలర్లతో యాపిల్ బ్రాండ్ మొదటి స్థానాన్ని చేజిక్కించుకుంది. అగ్రస్థానంలో యాపిల్ నిలవడం ఇది వరుసగా మూడో ఏడాది. 7,900 కోట్ల డాలర్లతో శామ్సంగ్ రెండో స్థానం సాధించింది. ఆ తర్వాతి స్థానాల్లో గూగుల్, మైక్రోసాఫ్ట్, వెరిజాన్, జీఈ, ఏటీఅండ్‌టీ, అమెజాన్, వాల్‌మార్ట్, ఐబీఎంలు నిలిచాయి. ఇక అత్యంత శక్తివంతమైన అంతర్జాతీయ బ్రాండ్‌గా ఫెరారి నిలిచింది. ఈ గ్లోబల్ జాబితాలో అమెరికా బ్రాండ్లు ఎక్కువగా(185) ఉన్నాయి. -
సుజుకి కొత్త టూవీలర్లు
ముంబై: జపాన్ టూ-వీలర్ దిగ్గజం సుజుకి... సోమవారం రెండు కొత్త టూ-వీలర్లను ఆవిష్కరించింది. లెట్స్ పేరుతో ఒక స్కూటర్‌ను, జిక్సర్ పేరుతో కొత్త మోటార్ బైక్‌ను తెస్తున్నట్లు సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా(ఎస్ఎంఐఎల్) ఎగ్జిక్యూటివ్ వైస్-ప్రెసిడెంట్ అతుల్ గుప్తా చెప్పారు. లెట్స్ స్కూటర్‌ను బాలీవుడ్ నటి పరిణితి చోప్రా, జిక్సర్ బైక్‌ను హీరో సల్మాన్‌ఖాన్ ఆవిష్కరించారు. వచ్చే నెలలో జరిగే ఆటో ఎక్స్‌పోలో ఈ టూవీలర్ల ధరలను వెల్లడిస్తామని, ఇతర కంపెనీలకు గట్టి పోటీనిచ్చేలా ధరలుంటాయని గుప్తా తెలిపారు. ఈ ఏడాదిలోనే మరో రెండు కొత్త టూవీలర్లను అందిస్తామన్నారు. వచ్చే నెల నుంచి లెట్స్ స్కూటర్లను, జూలై నుంచి జిక్సర్ బైక్‌లను విక్రయిస్తామని చెప్పారు. లెట్స్ స్కూటర్ ‘ 98 కేజీలు ప్రస్తుతం మార్కెట్లో సుజుకి యాక్సెస్, స్విష్ ఉన్నాయి. లెట్స్‌లో ముందువైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్, వెనక వైపు ఆయిల్-డాంప్డ్ కాయిల్ స్ప్రింగ్ సస్పెన్షన్ ట్యూబ్‌లెస్ టైర్లు, 4-స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ వంటి ప్రత్యేకతలున్నాయి. తక్కువ బరువుండే(98 కేజీలు) లెట్స్ 5 రంగుల్లో లభిస్తుంది. సుజుకి ఈకో పెర్ఫామెన్స్ (సెప్) టెక్నాలజీతో రూపొందిన ఈ స్కూటర్ 63 కిలోమీటర్ల మైలేజీనిస్తుందని కంపెనీ తెలియజేసింది. జిక్సర్ బైక్ ప్రత్యేకతలు ఇవీ... ఈ 150 సీసీ బైక్‌లో సింగిల్ సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఎస్ఓహెచ్సీ ఫోర్ స్ట్రోక్ ఇంజిన్, ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్క్‌లు, వెనక వైపు మోనో షాక్ సస్పెన్షన్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్, రియర్ డ్రమ్ బ్రేక్ వంటి ప్రత్యేకతలున్నాయి. యమహా ఎఫ్‌జడ్, హోండా సీబీ ట్రిగ్గర్, బజాజ్ పల్సర్ 150, టీవీఎస్ అపాచీలకు ఈ కొత్త బైక్ గట్టి పోటీనివ్వగలదని సుజుకి భావిస్తోంది. -
సుజుకి యాక్సెస్... లిమిటెడ్ ఎడిషన్
ముంబై: సుజుకి మోటార్‌సైకిల్స్ యాక్సెస్ స్కూటర్ మోడల్లో స్పెషల్ ఎడిషన్‌ను మార్కెట్లోకి తెస్తోంది. ఈ స్కూటర్ ఆవిష్కరణ సందర్భంగా బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్‌కు చెందిన బీయింగ్ హ్యూమన్ ఫౌండేషన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని సుజుకి మోటార్‌సైకిల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్-ప్రెసిడెంట్ అతుల్ గుప్తా చెప్పారు. ఈ స్కూటర్ ధరను రూ.58,978గా నిర్ణయించామని పేర్కొన్నారు. ఇప్పటికే తమ బ్రాండ్ అంబాసిడర్‌గా సల్మాన్ ఖాన్ వ్యవహరిస్తున్నారని, తాజా ఒప్పందం దీనికి కొనసాగింపని చెప్పారు. ఒప్పందంలో భాగంగా బీయింగ్ హ్యూమన్ దుస్తులు, వస్తువులను సుజుకి డీలర్లు విక్రయిస్తారని తెలిపారు. వీటి విక్రయాల ద్వారా వచ్చిన సొమ్మును ధార్మిక కార్యక్రమాలకు వినియోగిస్తామన్నారు. సుజుకి భాగస్వామ్యంతో బీయింగ్ హ్యూమ న్ ఫౌండేషన్ కార్యక్రమాలు మరింత విస్తృత మవుతాయని సల్మాన్ ఖాన్ పేర్కొన్నారు.