మేమూ తప్పు చేశాం..
టోక్యో : కర్బన్ ఉద్గారాల పరీక్షల్లో అక్రమాలకు పాల్పడుతూ.. తప్పయిందరనీ లెంపలేసుకుంటున్న కంపెనీల కోవలోకి ఇపుడు మరో జపాన్ ఆటో దిగ్గజం చేరింది. మేమూ తప్పు చేశామంటూ బహిరంగంగా సుజుకి మోటార్ కార్పొరేషన్ ప్రకటించింది. దీంతో ఇంధన పరీక్షల్లో అక్రమాలకు పాల్పడుతూ మోటార్ కార్పొరేషన్లు భారీ చిక్కుల్లో పడుతున్నాయి. మిత్సుబిషీ అనంతరం మరో జపనీస్ ఆటో దిగ్గజం సుజుకీ మోటార్ కార్పొరేషన్ సైతం ఇంధన పరీక్షల్లో అక్రమాలకు పాల్పడిందని వెల్లడైంది.
ఈ విషయాన్ని మారుతి సుజికి పేరెంట్ కంపెనీ అయిన సుజికీనే ఒప్పుకుంది. కంపెనీ ప్రతినిధి ఆండ్రూ హెలాండ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు. ఈ అక్రమ ఇంధన పరీక్ష విషయం మార్కెట్లోకి పొక్కగానే, సుజుకీ షేర్లు అంతర్జాతీయ మార్కెట్లో 15శాతం మేర పతనమయ్యాయి. జపనీస్ నిబంధనలకు వ్యతిరేకంగా ఇంధన సామర్థ్య టెస్టింగ్ పద్ధతులున్నాయని, కర్బన ఉద్గారాలను వాడుతున్నట్టు కంపెనీ ప్రకటించింది. జపాన్ లో 16 మోడళ్లను ఈ అక్రమ ఇంధన టెస్టింగ్ లతోనే విక్రయించినట్టు ఒప్పుకుంది.
ఈ అక్రమ ఇంధన పరీక్షల వల్ల 2010 నాటి నుంచి ఉన్న 21లక్షల వెహికిల్స్ ప్రభావం చూపనుందని కంపెనీ వెల్లడించింది. సుజుకీ ప్రకటన అనంతరం జపాన్ రవాణా మంత్రి అన్నీ దేశీయ ఆటోమేకర్స్ పై ఇంధన ఎకానమీ టెస్టింగ్ పద్ధతులపై విచారణకు ఆదేశించారు. ఇప్పటికే మిత్సుబిషీ నిబంధనలకు అనుగుణంగా ఇంధన పరీక్ష పద్ధతులను చేపట్టడం లేదని వెల్లడైంది. అయితే ఈ విషయమై సుజుకీ కంపెనీ చైర్ పర్సన్ ఓసామో సుజుకీ రవాణా మంత్రితో భేటీ కానున్నారు. ఆకగా మారుతి సుజికీ ఇండియాలో సుజుకి మోటార్ కార్పొరేషన్ 56 శాతం వాటాను కలిగిఉంది. దీంతో మారుతి సుజికీ దేశీయ మార్కెట్ 4శాతాలను నమోదు చేసింది.