సాక్షి, ముంబై: భారీగా పతనమవుతున్న ప్రస్తుత స్టాక్‌మార్కెట్‌లో దేశంలోని అదిపెద్ద జ్యువెలరీ కూడా కుదేలైంది. ఢిల్లీకి చెందిన ప్రముఖ జ్యువెలరీ సంస్థ పీసీ జ్యువెలర్స్ లిమిటెడ్ షేర్లు గత కొన్ని సెషన్లుగా భారీ నష్టాలతో వార్తల్లో నిలిచింది. అయితే దీనికి కారణం ప్రముఖ ఫైనాన్షియల్ సంస్థ వక్రంజీ పీసీ జ్యువెలర్స్‌లో భారీ వాటా కొనుగోలు చేసిందన్న వార్త మార్కెట్లో హల్ చల్ చేయడమే. జనవరి 25న. 20లక్షల రూపాయల విలువైన షేర్లను అంటే సంస్థలో దాదాపు సగం వాటాను కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఈ వార్తలే ఈ రెండు కౌంటర్లలోనూ భారీ అమ్మకాలకు కారణమయ్యాయి. మరోవైపు వక్రంజీ కౌంటర్లో అక్రమ లావాదేవీలు జరిగిన అభియోగాలతో మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దర్యాప్తును చేపట్టినట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో ఇన్వెస్టర్ల ఆందోళన పెరిగింది.
ఇన్వెస్టర్ల ఆందోళన- అమ్మకాల ఒత్తిడి
వరుసగా ఐదో రోజు టెక్నాలజీ సేవల సంస్థ వక్రంజీ లిమిటెడ్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. సెబీ దర్యాప్తు వార్తలతో ఈ భారీ అమ్మకాలు మరింత జోరందుకున్నాయి. ఈ కౌంటర్ శుక్రవారం మరోసారి 10శాతం నష్టపోయి లోయర్ సర్క్యూట్‌ను తాకింది. వెరసి గత ఐదు రోజుల్లో 73శాతం కుప్పకూలింది. పీసీ జ్యువెలర్స్ కౌంటర్లోనూ ఇన్వెస్టర్లు అమ్మకాలకు క్యూ కట్టారు. ఇవాల్టి ట్రేడింగ్‌లో 60శాతం పతనమైంది. అనంతరంకొద్దిగా పుంజుకున్నా..నెగిటివ్ జోన్‌లోనే కొనసాగుతోంది.
కాగా ఇటీవల వక్రంజీ లిమిటెడ్ షేరు భారీ లాభాలను గడించింది. రూ. 65 (2015)వద్ద ఉన్న ఈ షేరు ఈ ఏడాది జనవరికల్లా రూ. 500కి దాటేయడం అనేక అనుమానాలకు తావిచ్చింది. దీనికితోడు గత ఏడాది (2016) జనవరి- జూన్ మధ్య తిరిగి 2016 సెప్టెంబర్ మొదలు 2017 జూన్ 15 వరకూ వక్రంజీ కౌంటర్లో అక్రమ ట్రేడింగ్ చోటు చేసుకుందనీ, దీన్ని సెబీ పరిశీలిస్తోందని ముంబై మీడియా పేర్కొంది.
మరోవైపు పీసీ జ్యువెలరీ ఆర్థిక అధికారి సంజీవ్ భాటియా ఈ వార్తలను ఖండించారు. తమ మధ్య ఎలాంటి వ్యాపార ఒప్పందం చోటు చేసుకోలేదని స్పష్టం చేశారు. ఇది చాలా ఆందోళన కలిగిస్తున్న వార్త అని పేర్కొన్నారు. అయితే తమ సంస్థ ఇప్పటికీ ఫండమెంటల్‌గా చాలా దృఢంగా ఉందనీ, విస్తరణ యోచనలో తామున్నామని ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment