PC Jeweller
-
పీసీ జువెల్లరీ షేర్ బైబ్యాక్, స్టాక్ ర్యాలీ
న్యూఢిల్లీ : ప్రముఖ జువెల్లరీ సంస్థ పీసీ జువెల్లరీ షేర్ బైబ్యాక్ ప్రకటించింది. రూ.424 కోట్ల విలువైన బైబ్యాక్ చేపడుతున్నట్టు పీసీ జువెల్లరీ పేర్కొంది. ఒక్కో యూనిట్ ధర రూ.350గా నిర్ణయించింది. ఇది గురువారం స్టాక్ ముగింపు ధర 209 రూపాయలకు 67 శాతం అధికం. గురువారం జరిగిన బోర్డు మీటింగ్‌లో 1.21 కోట్ల షేర్ల బైబ్యాక్‌ను ఆమోదించినట్టు ఈ జువెల్లరీ సంస్థ తెలిపింది. ఈ షేర్ల బైబ్యాక్‌లో ప్రమోటర్లు, ప్రమోటర్ల గ్రూప్ పాల్గొనదు. మార్చి క్వార్టర్ డేటా ప్రకారం ఈ కంపెనీలో ప్రమోటర్లు 57.63 శాతం వాటాను కలిగి ఉన్నారు. షేర్ బైబ్యాక్ ప్రకటనతో కంపెనీ స్టాక్ ప్రారంభ ట్రేడింగ్‌లోనే 18 శాతం పైకి ఎగిసింది. ఇంట్రాడేలో రూ.247 వద్ద గరిష్ట స్థాయిలను తాకింది. గత కొన్ని సెషన్లలో ఈ కంపెనీ షేరు తీవ్ర ఒడిదుడుకులకు లోనైంది. కానీ ఆరు ట్రేడింగ్ సెషన్ల నుంచి మాత్రం పీసీ జువెల్లరీ స్టాక్ సుమారు 88 శాతం ర్యాలీ జరుపుతూ వస్తోంది. మే 2న రూ.110.65గా ఉన్న పీసీ జువెల్లరీ స్టాక్, మే 10 తేదీకి రూ.209కు పెరిగింది. కానీ మే 3 తేదీన మాత్రం స్టాక్ 52 వారాల కనిష్ట స్థాయిలకు పడిపోయింది. మరోవైపు మరికొన్ని రోజుల్లో కంపెనీ తన మార్చి క్వార్టర్ ఫలితాలను ప్రకటించబోతోంది. 2018 మే 25న బోర్డు ఆఫ్ డైరెక్టర్లతో సమావేశం నిర్వహించిన అనంతరం ఈ ఫలితాలు వెల్లడికానున్నాయి. ఆ సమావేశంలోనే 2017 ఏప్రిల్ నుంచి 2017 సెప్టెంబర్ 1 మధ్య వరకు ఉన్న ప్రిఫరెన్స్ షేర్లపై డివిడెండ్ ప్రతిపాదనలను నిర్ణయించనున్నారు. పీసీ జువెల్లరీ ప్రస్తుతం మార్కెట్లో జువెల్లరీలను తయారీచేయడం, రిటైల్ చేయడం, ఎగుమతి చేయడం వంటి వ్యాపారాలను చేస్తోంది. 2005లో ఏర్పాటైన ఈ సంస్థ, దేశీయంగా రెండో అతిపెద్ద లిస్టెడ్ జువెల్లరీ రిటైలర్‌గా ఉంది. -
టాప్ జ్యువెలరీ షేర్ భారీ పతనం..కారణం?
సాక్షి, ముంబై: భారీగా పతనమవుతున్న ప్రస్తుత స్టాక్మార్కెట్లో దేశంలోని అదిపెద్ద జ్యువెలరీ కూడా కుదేలైంది. ఢిల్లీకి చెందిన ప్రముఖ జ్యువెలరీ సంస్థ పీసీ జ్యువెలర్స్ లిమిటెడ్ షేర్లు గత కొన్ని సెషన్లుగా భారీ నష్టాలతో వార్తల్లో నిలిచింది. అయితే దీనికి కారణం ప్రముఖ ఫైనాన్షియల్ సంస్థ వక్రంజీ పీసీ జ్యువెలర్స్‌లో భారీ వాటా కొనుగోలు చేసిందన్న వార్త మార్కెట్లో హల్ చల్ చేయడమే. జనవరి 25న. 20లక్షల రూపాయల విలువైన షేర్లను అంటే సంస్థలో దాదాపు సగం వాటాను కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఈ వార్తలే ఈ రెండు కౌంటర్లలోనూ భారీ అమ్మకాలకు కారణమయ్యాయి. మరోవైపు వక్రంజీ కౌంటర్లో అక్రమ లావాదేవీలు జరిగిన అభియోగాలతో మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ దర్యాప్తును చేపట్టినట్లు వార్తలు వెలువడ్డాయి. దీంతో ఇన్వెస్టర్ల ఆందోళన పెరిగింది. ఇన్వెస్టర్ల ఆందోళన- అమ్మకాల ఒత్తిడి వరుసగా ఐదో రోజు టెక్నాలజీ సేవల సంస్థ వక్రంజీ లిమిటెడ్ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. సెబీ దర్యాప్తు వార్తలతో ఈ భారీ అమ్మకాలు మరింత జోరందుకున్నాయి. ఈ కౌంటర్ శుక్రవారం మరోసారి 10శాతం నష్టపోయి లోయర్ సర్క్యూట్‌ను తాకింది. వెరసి గత ఐదు రోజుల్లో 73శాతం కుప్పకూలింది. పీసీ జ్యువెలర్స్ కౌంటర్లోనూ ఇన్వెస్టర్లు అమ్మకాలకు క్యూ కట్టారు. ఇవాల్టి ట్రేడింగ్‌లో 60శాతం పతనమైంది. అనంతరంకొద్దిగా పుంజుకున్నా..నెగిటివ్ జోన్లోనే కొనసాగుతోంది. కాగా ఇటీవల వక్రంజీ లిమిటెడ్ షేరు భారీ లాభాలను గడించింది. రూ. 65 (2015)వద్ద ఉన్న ఈ షేరు ఈ ఏడాది జనవరికల్లా రూ. 500కి దాటేయడం అనేక అనుమానాలకు తావిచ్చింది. దీనికితోడు గత ఏడాది (2016) జనవరి- జూన్ మధ్య తిరిగి 2016 సెప్టెంబర్ మొదలు 2017 జూన్ 15 వరకూ వక్రంజీ కౌంటర్లో అక్రమ ట్రేడింగ్ చోటు చేసుకుందనీ, దీన్ని సెబీ పరిశీలిస్తోందని ముంబై మీడియా పేర్కొంది. మరోవైపు పీసీ జ్యువెలరీ ఆర్థిక అధికారి సంజీవ్ భాటియా ఈ వార్తలను ఖండించారు. తమ మధ్య ఎలాంటి వ్యాపార ఒప్పందం చోటు చేసుకోలేదని స్పష్టం చేశారు. ఇది చాలా ఆందోళన కలిగిస్తున్న వార్త అని పేర్కొన్నారు. అయితే తమ సంస్థ ఇప్పటికీ ఫండమెంటల్‌గా చాలా దృఢంగా ఉందనీ, విస్తరణ యోచనలో తామున్నామని ప్రకటించారు. -
జిల్ జిగేల్ మంటున్న జువెల్లరీ షేర్స్
బంగారంపై జీఎస్టీ పన్ను రేటుపై గతకొంతకాలంగా సాగుతున్న సస్పెన్షన్ కు తెరదించడంతో జువెల్లరీ షేర్లు జిల్ జిగేల్ మంటున్నాయి.. గోల్డ్ , బంగార ఆభరణాలపై 3 శాతం పన్ను వేయనున్నట్టు ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలోని జీఎస్టీ కౌన్సిల్ ప్రకటించింది. దీంతో జువెల్లరీ రిటైలర్ షేర్లు సోమవారం మార్కెట్లో మెరుపులు మెరిపిస్తున్నాయి. జీఎస్టీ బూస్ట్ తో టైటాన్ కంపెనీ, పీసీ జువెల్లరీ, గీతాంజలి జెమ్స్, తారా జువెల్స్ షేర్లు 6 శాతం నుంచి 15 శాతం మధ్యలో ట్రేడవుతున్నాయి. జీఎస్టీ కౌన్సిల్ ప్రకటించిన పన్ను రేట్లు తమకు ఆహ్వానించదగినగానే ఉన్నాయని జెమ్స్ అండ్ జువెల్లరీ ఇండస్ట్రీ చెబుతోంది. ప్రస్తుతం జువెల్లరీ ఇండస్ట్రీ 2 నుంచి 2.5 శాతం పన్ను చెల్లిస్తోంది. జీఎస్టీ పన్ను 3 శాతం. ఈ పన్ను రేటుతో జువెల్లరీ, బంగారం ఇండస్ట్రిపై ఎలాంటి ప్రభాముండదని డబ్ల్యూహెచ్పీ డైరెక్టర్ ఆదిత్య పేథె చెప్పారు. ఈ పన్ను రేట్లు అక్రమంగా వ్యాపారం నిర్వహిస్తున్న వారిని సక్రమమైన మార్గంలో ట్రేడ్ నిర్వహించడానికి ప్రోత్సహిస్తాయని అభిప్రాయం వ్యక్తంచేశారు. బంగారంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా ప్రోత్సహకరంగా ఉందని, లక్షల మంది పొట్టకూటిగా ఉన్న ఇండస్ట్రిని సుస్థిరంగా ఉంచేలా ఇది దోహదం చేస్తుందని వరల్డ్ గోల్డ్ కైన్సిల్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సోమసుందరామ్ పీఆర్ చెప్పారు. జువెల్లరీ తయారీదారుల ఇతర షేర్లు పీసీ జువెల్లరీ 8 శాతం జంప్ చేసింది. గీతాంజలి జెమ్స్, టాటా జువెల్స్ షేర్లు కూడా 8 శాతం పైగి ఎగిశాయి. ప్రారంభంలో నిఫ్టీ ఫ్లాట్ గా ఉన్నప్పటికీ, ఈ షేర్లు మంచి ప్రదర్శనను కనబర్చాయి.