న్యూఢిల్లీ: సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా తన నూతన ‘జిక్సర్ ఎస్‌ఎఫ్’ సిరీస్‌లో 155సీసీ మోటో జీపీ ఎడిషన్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఫోర్ స్ట్రోక్, సింగిల్ సిలిండర్ ఫుయల్ ఇంజెక్షన్ ఇంజిన్‌తో అందుబాటులోకి వచ్చిన ఈ బైక్ ప్రారంభ ధర రూ.1,10,605 (ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ)గా కంపెనీ ప్రకటించింది. 249సీసీ ఇంజిన్ సామర్థ్యం కలిగిన జిక్సర్ ఎస్‌ఎఫ్ 250 మోటోజీపీ ఎడిషన్‌ను ఆగస్టులో విడుదల చేయనున్నట్లు ఈ సందర్భంగా సంస్థ వైస్ ప్రెసిడెంట్ దేవాశిష్ హండా వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment