మార్కెట్లోకి జిక్సర్‌ ఎస్‌ఎఫ్‌ | Suzuki Gixxer SF Launch in Market | Sakshi
Sakshi News home page

మార్కెట్లోకి జిక్సర్‌ ఎస్‌ఎఫ్‌

Published Tue, Jun 4 2019 7:49 AM | Last Updated on Tue, Jun 4 2019 7:49 AM

Suzuki Gixxer SF Launch in Market - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీ కంపెనీ సుజుకీ మోటార్‌ సైకిల్‌ ఇండియా (ఎస్‌ఎంఐపీఎల్‌) 250 సీసీ ప్రీమియం బైక్స్‌ విభాగంలోకి ఎంట్రీ ఇచ్చింది. సోమవారమిక్కడ జిక్సర్‌ ఎస్‌ఎఫ్‌ 250, జిక్సర్‌ ఎస్‌ఎఫ్‌ పేరిట రెండు స్పోర్ట్స్‌ బైక్స్‌ను విడుదల చేసింది. జిక్సర్‌ ఎస్‌ఎఫ్‌ 250  ధర రూ.1,70,655 కాగా, జిక్సర్‌ ఎస్‌ఎఫ్‌ ధర రూ.1,09,870గా కంపెనీ నిర్ణయించింది. ఈ సందర్భంగా సుజుకీ ఇండియా హెడ్‌ కిచిరో హిరావు మాట్లాడుతూ.. గత ఆర్ధిక సంవత్సరంలో 7.5 లక్షల బైక్‌లను విక్రయించామని, వీటిలో 6.7 లక్షలు దేశీ మార్కెట్లో, మిగిలినవి ఎగమతి మార్కెట్లో చేశామని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల బైక్‌ల విక్రయాలను సాధిస్తామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న ప్లాంట్‌ సామర్ధ్యం విస్తరణతో పాటూ కొత్త గ్రీన్‌ఫీల్డ్‌ ప్లాంట్‌ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement