Gixxer SF
-
సుజుకీ ‘జిక్సర్’ కొత్త వెర్షన్
న్యూఢిల్లీ: సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా తన నూతన ‘జిక్సర్ ఎస్ఎఫ్’ సిరీస్‌లో 155సీసీ మోటో జీపీ ఎడిషన్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఫోర్ స్ట్రోక్, సింగిల్ సిలిండర్ ఫుయల్ ఇంజెక్షన్ ఇంజిన్‌తో అందుబాటులోకి వచ్చిన ఈ బైక్ ప్రారంభ ధర రూ.1,10,605 (ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ)గా కంపెనీ ప్రకటించింది. 249సీసీ ఇంజిన్ సామర్థ్యం కలిగిన జిక్సర్ ఎస్ఎఫ్ 250 మోటోజీపీ ఎడిషన్‌ను ఆగస్టులో విడుదల చేయనున్నట్లు ఈ సందర్భంగా సంస్థ వైస్ ప్రెసిడెంట్ దేవాశిష్ హండా వెల్లడించారు. -
మార్కెట్లోకి జిక్సర్ ఎస్ఎఫ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీ కంపెనీ సుజుకీ మోటార్ సైకిల్ ఇండియా (ఎస్ఎంఐపీఎల్) 250 సీసీ ప్రీమియం బైక్స్ విభాగంలోకి ఎంట్రీ ఇచ్చింది. సోమవారమిక్కడ జిక్సర్ ఎస్ఎఫ్ 250, జిక్సర్ ఎస్ఎఫ్ పేరిట రెండు స్పోర్ట్స్ బైక్స్‌ను విడుదల చేసింది. జిక్సర్ ఎస్ఎఫ్ 250 ధర రూ.1,70,655 కాగా, జిక్సర్ ఎస్ఎఫ్ ధర రూ.1,09,870గా కంపెనీ నిర్ణయించింది. ఈ సందర్భంగా సుజుకీ ఇండియా హెడ్ కిచిరో హిరావు మాట్లాడుతూ.. గత ఆర్ధిక సంవత్సరంలో 7.5 లక్షల బైక్‌లను విక్రయించామని, వీటిలో 6.7 లక్షలు దేశీ మార్కెట్లో, మిగిలినవి ఎగమతి మార్కెట్లో చేశామని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల బైక్‌ల విక్రయాలను సాధిస్తామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న ప్లాంట్ సామర్ధ్యం విస్తరణతో పాటూ కొత్త గ్రీన్‌ఫీల్డ్ ప్లాంట్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. -
సుజుకి జిక్సర్‌లో కొత్త వేరియంట్
సాక్షి, న్యూఢిల్లీ: సుజుకి మోటార్ సైకిల్ ఇండియా కొత్త బైక్‌ను లాంచ్ చేసింది. 155 సీసీ జిక్సర్ లో కొత్త వేరియంట్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఎబిఎస్)తో రూపొందించిన ఈ బైక్ ధరను రూ. 87,250 (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ) గా నిర్ణయించింది. ఇప్పటికే ఉత్తేజకరమైన రైడింగ్ అనుభవాన్ని సొంతం చేసుకున్నతమ వినియోగదారులకు ఏబీఎస్ ఆప్షన్ మరింత ఉత్సాహాన్నిస్తుందని సుజుకి మోటార్ సైకిల్ ఇండియా ఈవీపీ సేల్స్ అండ్ మార్కెటింగ్ సజీవ్ రాజశేఖరన్ ఒక ప్రకటనలో తెలిపారు. జిక్సర్ సిరీస్ తమ ఇండియా ప్రోడక్ట్-స్ట్రాటజీలో ఒక ముఖ్యమైన మోడల్ అని తెలిపారు. అయితే ఏబీఎస్ ఆప్షన్ జోడింపు తప్ప గిక్సర్ కొత్త వేరియంట్లో అదనంగా మార్పులు చేయలేదు. 155 సిసి ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్, 8,000ఆర్పీఎం వద్ద 14.8హెచ్‌పీ , 6,000ఆర్పిఎం వద్ద14ఎన్ఎంను ఉత్పత్తి చేస్తుంది. -
సుజుకి కొత్త గిక్సర్ బైక్స్ లాంచ్...
సాక్షి న్యూఢిల్లీ: సుజుకి మోటార్ కార్పొరేషన్‌కు చెందిన సుజుకీ మోటార్ సైకిల్ ఇండియా గిక్సర్ సిరీస్‌లో కొత్త మోడల్ బైక్‌లను లాంచ్ చేసింది. 2018 ఫ్లాగ్షిప్ మోటార్ సైకిల్ 2018 మోడల్స్‌ను మంగళవారం విడుదల చేసింది. 2014లో లాంచ్ చేసిన గిక్సర్ బ్రాండ్‌కు చెందిన గిక్సర్ , గిక్సర్ ఎస్ఎఫ్ పేరుతో వీటిని అందుబాటులోకి తెచ్చింది. గిక్సర్ ధరను రూ. 80,928, గిక్సర్ ఎస్ఎఫ్ ధరను రూ .90,037గా నిర్ణయించింది. వీటిల్లోసుజుకి ఎకో పెర్ఫామెన్స్ టెక్సాలజీ (ఎస్ఈపి) అల్ట్రా లైట్ 155 సీసీ ఇంజీన్ అమర్చినట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. గిక్సర్ మోడల్స్ తమకు కీలకమైన ఉత్పత్తులని సుజుకి మోటార్ సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ప్రతినిధి సజీవ్ రాజశేఖరన్ చెప్పారు. వీటి పంపణీ ఇప్పటికే మొదలైందని దేశవ్యాప్తంగా తమ డీలర్‌షిప్‌లలో లభ్యమవుతాయని వెల్లడించారు. -
కొత్త జిక్సర్ వచ్చేసింది
ధర రూ.83,439 జూన్‌లో రెండు సూపర్ బైక్‌లు సుజుకీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అతుల్ గుప్తా న్యూఢిల్లీ: సుజుకీ మోటార్ సైకిల్ ఇండియా కంపెనీ జిక్సర్ బైక్‌లో కొత్త వేరియంట్‌ను మార్కెట్లోకి తెచ్చింది. ఈ కొత్త వేరియంట్, జిక్సర్ ఎస్ఎఫ్ బైక్ ధర రూ.83,439(ఎక్స్ షోరూమ్, న్యూఢిల్లీ)గా నిర్ణయించామని సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ అతుల్ గుప్తా చెప్పారు. ఈ కొత్త వేరియంట్ కూడా యువ వినియోగదారులను ఆకట్టుకోగలదని ఆశిస్తున్నామని చెప్పారు. గత ఏడాది అక్టోబర్‌లో జిక్సర్ మోడల్‌ను మార్కెట్లోకి తెచ్చామని, నెలకు 8,000 వరకూ విక్రయిస్తున్నామని వివరించారు. జూన్‌లో సూపర్ బైక్‌లు: 150 సీసీ, అంతకు మించిన ఇంజిన్ సామర్థ్యం ఉన్న బైక్‌లపై దృష్టి సారిస్తున్నామని అతుల్ గుప్తా చెప్పారు. ఈ ఏడాది జూన్‌లో 800 సీసీ బైక్‌లు ఎస్1000, ఎస్1000 ఎఫ్లను మార్కెట్లోకి తేవాలని యోచిస్తున్నామని పేర్కొన్నారు. ప్రపంచ మార్కెట్లో, ఇక్కడా వాటిని ఒకేసారి అందిస్తామని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో హయబూసా, జీఎస్ఎక్స్-ఆర్ వంటి సూపర్ బైక్‌లను 280 వరకూ విక్రయించామని, ఈ ఆర్థిక సంవత్సరంలో 400 బైక్‌లు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని వివరించారు. మాస్ సెగ్మెంట్ బైక్‌ల్లో తీవ్రమైన పోటీ ఉందని, ఈ సెగ్మెంట్ మోటార్‌సైకిల్ హయతెను కొనసాగిస్తామని వివరించారు. ఎదురు గాలిని తట్టుకునేలా.. జిక్సర్ ఎస్ఎఫ్బైక్ నడిపే వ్యక్తికి ఎదురు గాలి నుంచి సాధ్యమైనంతగా రక్షణ నిచ్చేలా ఫుల్ ఫెయిరింగ్ ఫీచర్‌తో ఈ బైక్ సిద్ధమైంది. ముందు వైపు ఫెయిరింగ్ మినహా మిగిలిన అన్ని అంశాల్లో ఈ కొత్త వేరియంట్ జిక్సర్‌ను పోలి ఉంది. ఈ బైక్‌లో ఐదు గేర్లు, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, క్లియర్లెన్స్ ఇండికేటర్లు, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్క్‌లు, వెనక వైపు 7 స్టెప్ అడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్ తదితర ఫీచర్లున్నాయి.. నలుపు, తెలుపు, నీలం మూడు రంగుల్లో ఈ బైక్ లభ్యమవుతుంది. దేశంలో అత్యంత చౌకగా లభించే పూర్తి ఫెయిర్డ్ మోటార్ సైకిల్ ఇదే అవుతుంది. ఫెయిరింగ్ బైక్ అంటే.. ఇంజిన్ ఉన్న ఫ్రేమ్‌ను కప్పి ఉంచేలా డిజైన్ చేసిన బైక్. గాలి ఒత్తిడిని తట్టుకోవడం దీని ఉద్దేశం.