సాక్షి, న్యూఢిల్లీ: సుజుకి మోటార్ సైకిల్ ఇండియా కొత్త బైక్‌ను లాంచ్ చేసింది. 155 సీసీ జిక్సర్ లో కొత్త వేరియంట్‌ను భారత మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఎబిఎస్)తో రూపొందించిన ఈ బైక్ ధరను రూ. 87,250 (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ) గా నిర్ణయించింది. ఇప్పటికే ఉత్తేజకరమైన రైడింగ్ అనుభవాన్ని సొంతం చేసుకున్నతమ వినియోగదారులకు ఏబీఎస్ ఆప్షన్ మరింత ఉత్సాహాన్నిస్తుందని సుజుకి మోటార్ సైకిల్ ఇండియా ఈవీపీ సేల్స్ అండ్ మార్కెటింగ్ సజీవ్ రాజశేఖరన్ ఒక ప్రకటనలో తెలిపారు. జిక్సర్ సిరీస్ తమ ఇండియా ప్రోడక్ట్-స్ట్రాటజీలో ఒక ముఖ్యమైన మోడల్ అని తెలిపారు. అయితే ఏబీఎస్ ఆప్షన్ జోడింపు తప్ప గిక్సర్ కొత్త వేరియంట్‌లో అదనంగా మార్పులు చేయలేదు. 155 సిసి ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్, 8,000ఆర్‌పీఎం వద్ద 14.8హెచ్‌పీ , 6,000ఆర్‌పిఎం వద్ద14ఎన్‌ఎంను ఉత్పత్తి చేస్తుంది.
సుజుకి జిక్సర్‌లో కొత్త వేరియంట్
Published Mon, May 28 2018 6:07 PM | Last Updated on Mon, May 28 2018 6:12 PM
1/2
2/2
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment