Suzuki Motorcycle India
-
సుజుకీ స్కూటర్ ఓనర్లకు అలర్ట్.. 4 లక్షల వాహనాలు రీకాల్!
ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ప్రై. లిమిటెడ్ భారత్‌లో దాదాపు నాలుగు లక్షల ద్విచక్ర వాహనాలకు రీకాల్ జారీ చేసింది. వీటిలో సుజుకీ యాక్సెస్ 125, అవెనిస్ 125, బర్గ్మాన్ స్ట్రీట్ మోడల్ వాహనాలు ఉన్నాయి.సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ వెబ్‌సైట్‌లోని వివరాల ప్రకారం యాక్సెస్ 125 అత్యధికంగా 2,63,788 యూనిట్లు, అవెనిస్ 125 మోడల్ 1,52,578 యూనిట్లు, బర్గ్మాన్ స్ట్రీట్ వాహనాలు 72,045 యూనిట్లను ఇగ్నిషన్ కాయిల్‌లోని హై-టెన్షన్ వైర్ లోపం కారణంగా కంపెనీ రీకాల్ చేసింది. ఈ వాహనాలు 2022 ఏప్రిల్ 30 నుంచి 2022 డిసెంబర్ 3 మధ్య కాలంలో తయారయ్యాయి. ఆయా మోడల్ స్కూటర్లు కొనుగోలు చేసినవారిని సంప్రదించే పనిలో కంపెనీ ఉంది. సమీపంలోని సర్వీస్ సెంటర్లో లోపభూయిష్ట భాగాన్ని కంపెనీ ఉచితంగా రీప్లేస్ చేసిస్తుంది.సమస్య ఇదే..వెబ్సైట్లో పేర్కొన్న దాని ప్రకారం.. డ్రాయింగ్ అవసరాలకు సరిపోని హై టెన్షన్ వైర్‌ను ఇగ్నిషన్ కాయిల్‌కు అమర్చడం వల్ల రన్నింగ్ సమయంలో వైర్ కోతలు పడటం, తెగిపోవడం జరుగుతోంది. దీంతో ఇంజన్ ఆగిపోవడం, స్టార్ట్ కాకపోవడం వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. కోతలు పడిన హై టెన్షన్ వైర్ నీటితో తడిసినప్పుడు వాహనం స్పీడ్ సెన్సార్, థొరెటల్ పొజిషన్ సెన్సార్ లీక్ దెబ్బతినే అవకాశం ఉంది.కాగా సుజుకీ మోటర్‌సైకిల్ కంపెనీ మిడిల్ వెయిట్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్ వీ-స్ట్రోమ్ 800 డీఈ (V-Strom 800 DE)కి సంబంధించిన 67 యూనిట్లను కూడా రీకాల్ చేసింది. లోపభూయిష్టమైన వెనుక టైర్ దీనికి కారణంగా కంపెనీ చెబుతోంది. బైక్ వెనుక వెనుక టైర్‌పై పగుళ్లు వస్తున్నాయని, టైర్ ట్రెడ్ బయటకు వచ్చేస్తోందని, టైర్ రూపం దెబ్బతింటోందని కంపెనీ పేర్కొంది. ఆయా వాహనాల యజమానులకు సంప్రదిస్తున్నమని అవసరమైతే వెనుక టైర్ రీప్లేస్ చేస్తామని వివరించింది. ఈ వాహనాలు 2023 మే 5 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 23 మధ్య కాలంలో తయారయ్యాయి. -
సుజుకి మోటార్‌సైకిల్ కంపెనీపై సైబర్ అటాక్ - నిలిచిపోయిన ఉత్పత్తి
Cyber Attack: భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్ తయారీ సంస్థ 'సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా' గత కొంత కాలంగా ఫ్యాక్టరీలలో ఉత్పత్తిని నిలిపివేసింది. సైబర్ దాడుల కారణంగానే ఉత్పత్తి నిలిచిపోయినట్లు కంపెనీ ప్రకటించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. నిలిచిపోయిన ఉత్పత్తి.. నివేదికల ప్రకారం, 2023 మే 10 నుంచి సుజుకి మోటార్‌సైకిల్ ఉత్పత్తిని నిలిపివేసింది. ఫ్యాక్టరీలో ఉత్పత్తి నిలిచిపోవడంతో ఈ కాలంలో దాదాపు 20,000 వాహనాల ఉత్పత్తి నిలిచిపోయినట్లు సమాచారం. అంతే కాకుండా వచ్చే వారం జరగాల్సిన వార్షిక సరఫరాదారుల సమావేశాన్ని కూడా సంస్థ వాయిదా వేసింది. దీని గురించి సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ప్రతినిధి మాట్లాడుతూ.. ఈ సంఘటన గురించి తెలిసిన వెంటనే సంబంధిత ప్రభుత్వ విభాగానికి నివేదించామని, ప్రస్తుతం దీనిపైనా విచారణ జరుగుతోంది, భద్రతా ప్రయోజనాల దృష్ట్యా దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు అందించలేమని అన్నారు. అయితే మళ్ళీ ఉత్పత్తి ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయం కూడా ప్రస్తావించలేదు. కానీ త్వరలోనే ఉత్పత్తి ప్రారంభమవుతుందని భావిస్తున్నాము. (ఇదీ చదవండి: ఉద్యోగం పోతుందని భయమా? ఈ టిప్స్ మీకోసమే..!) భారతదేశంలో అతిపెద్ద వాహన తయారీ సంస్థగా కీర్తి పొందిన సుజుకి మోటార్‌సైకిల్ ఇప్పటికే దేశీయ, అంతర్జాతీయ మార్కెట్లలో మిలియన్ యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది. అంతే కాకుండా కంపెనీకి భారత్ మాత్రమే కాకుండా జపాన్ కూడా అతిపెద్ద మార్కెట్ కావడం విశేషం. సుజుకి మోటార్ కార్పొరేషన్ గ్లోబల్ అవుట్‌పుట్‌లో భారతదేశం 50% వాటాను కలిగి ఉంది. అంతే కాకుండా గత ఆర్థిక సంవత్సరం కూడా అమ్మకాల్లో మంచి వృద్ధిని సాధించగలిగింది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి సాక్షి బిజినెస్ చూస్తూ ఉండండి. -
ఉత్పత్తిలో కనివిని ఎరుగని రికార్డ్ - 70 లక్షల యూనిట్‌గా ఆ బైక్
భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన 'సుజుకి మోటార్‌సైకిల్' (Suzuki Motorcycle) ఇటీవల ఉత్పత్తిలో గొప్ప మైలురాయిని చేరుకుంది. ఇందులో భాగంగానే గురుగ్రామ్‌లోని ఖేర్కి ధౌలా ప్లాంట్ నుండి 7 మిలియన్ల యూనిట్ బైకుని అధికారికంగా విడుదల చేసింది. కంపెనీ 7 మిలియన్ యూనిట్‌గా ఎల్లో కలర్ ఫినిషింగ్ పొందిన 'సుజుకి వి-స్ట్రామ్ ఎస్ఎక్స్' విడుదల చేసింది. ఇది నిజంగానే కంపెనీ సాధించిన అపూర్వమైన విజయం అనే చెప్పాలి. ఫిబ్రవరి 2006లో ఇండియన్ మార్కెట్లో కార్యకలాలను ప్రారంభించిన సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా మార్చి 2023తో ముగిసిన ఆర్థిక సంవత్సరం నాటికి ఏకంగా 9.38 లక్షల యూనిట్లను విక్రయించినట్లు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కెనిచి ఉమెడ తెలిపారు. (ఇదీ చదవండి: కంప్యూటర్ వద్దనుకున్నారు.. వంకాయ సాగు మొదలెట్టాడు - ఇప్పుడు సంపాదన చూస్తే..) సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా వి-స్ట్రామ్ ఎస్ఎక్స్, జిక్సర్ ఎస్ఎఫ్ 250, జిక్సర్ 250, జిక్సర్ ఎస్ఎఫ్, జిక్సర్, యాక్సెస్ 125, అవెనిస్, బర్గ్మాన్ స్ట్రీట్, బర్గ్మాన్ స్ట్రీట్ ఈఎక్స్ వంటి ద్విచక్ర వాహనాలను దేశీయ విఫణిలో తయారు చేస్తోంది. అంతే కాకుండా పెద్ద-బైక్ పోర్ట్‌ఫోలియోలో వి- స్ట్రామ్ 650XT, కటన, హయబుసా మోడల్స్ ఉత్పత్తి చేస్తోంది. రానున్న రోజుల్లో కంపెనీ మరిన్ని కొత్త ఉత్పత్తులను దేశీయ మార్కెట్లో విడుదల చేసేందుకు తగిన సన్నాహాలు సిద్ధం చేస్తోంది. -
వచ్చేస్తోంది..సుజుకి ఎలక్ట్రిక్ స్కూటర్...రేంజ్ ఏంతంటే..?
ఇంధన ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. అనేక కంపెనీలు కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ల, బైక్‌లను విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్లలో టీవీఎస్, బజాజ్, ఒలా ఎలక్ట్రిక్, ఏథర్ వంటి కంపెనీలు పాతుకుపోయాయి. వీటికి పోటీగా ప్రముఖ జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం సుజుకి మోటార్ సైకిల్ ఇండియా ఎలక్ట్రిక్ స్కూటర్లను లాంచ్ చేసేందుకు సిద్దమైంది. తాజాగా సుజుకి త్వరలోనే లాంచ్ చేయనున్న ఎలక్ట్రిక్ స్కూటర్ బర్గ్మాన్ ఈవీ ప్రోటోటైప్‌కు సంబంధించిన చిత్రాలు ఇటీవల వైరల్‌గా మారాయి. సుజుకీ ఎలక్ట్రిక్ స్కూటర్ బర్గ్మాన్ 125కు ఎలక్ట్రిక్ వెర్షన్ రానుంది. సుజుకిలో బెస్ట్ సెల్లింగ్ స్కూటర్లలో బర్గ్మాన్ స్ట్రీట్ 125 నిలిచింది. దీన్నే ఎలక్ట్రిక్ వెర్షన్ స్కూటర్‌గా లాంచ్ చేయనుంది సుజుకి. మీడియా నివేదికల ప్రకారం...డ్యూయల్ టోన్ కలర్స్‌లో లాంచ్ కానుంది. బ్లూ, వైట్ కలర్ వేరియంట్స్‌లో రానుంది. స్కూటర్ వెనుక భాగంలో ట్విన్ షాక్ అబ్జార్బర్లు, లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌తో రానున్నట్లు తెలుస్తోంది. ఫీచర్స్ విషయానికి వస్తే..! సుజుకి బర్గ్మాన్ స్ట్రీట్ ఎలక్ట్రిక్ స్కూటర్లో...బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, USB ఛార్జర్, ఫుల్-LED హెడ్‌లైట్, పెద్ద సీట్ స్టోరేజ్‌తో అప్డేట్ చేయబడిన డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్‌ను వచ్చే అవకాశం ఉంది. రేంజ్ ఏంతంటే..! సుజుకి బర్గ్మాన్ స్ట్రీట్ ఎలక్ట్రిక్ స్కూటర్ సంబంధించిన పవర్‌ట్రెయిన్, ఇతర సాంకేతిక వివరాలను కంపెనీ ఇంకా వెల్లడించలేదు. అయితే బర్గ్‌మ్యాన్ ఎలక్ట్రిక్ 3-4kWh బ్యాటరీ ప్యాక్, 4-6kWh ఎలక్ట్రిక్ మోటారుతో రానుంది. ఇది ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే దాదాపు 80 నుంచి 90 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలదని సమాచారం. భారత్‌లో అధికారిక లాంచ్ 2022 తర్వాత జరగవచ్చునని తెలుస్తోంది. చదవండి: ఎలక్ట్రిక్ బైకులకు ఎండాకాలం ఎఫెక్ట్.. ఉన్నట్టుండి తగలబడి పోతున్నాయ్! -
సుజుకీ అవెనిస్ 125 స్కూటర్ ఆవిష్కరణ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన కంపెనీ సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా సరికొత్త అవెనిస్ 125 సీసీ స్కూటర్‌ను ఆవిష్కరించింది. ధర ఢిల్లీ ఎక్స్‌షోరూంలో రూ. 86,700. రేస్ ఎడిషన్ వేరియంట్ ధర రూ. 87,000. డిసెంబర్ మూడవ వారం నుంచి మార్కెట్లో ఇది అందుబాటులోకి వస్తుంది. జపాన్, భారత ఇంజనీరింగ్ బృందాలు యువ కస్టమర్లు లక్ష్యంగా స్పోర్టీ డిజైన్‌తో స్కూటర్‌ను రూపొందించారు. -
కళ్లు చెదిరే లుక్స్‌తో సుజుకీ నయా స్కూటీ లాంచ్..! ధర ఎంతంటే..?
చాలా ఊహాగానాల తరువాత ప్రముఖ జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం సుజుకీ భారత మార్కెట్లలోకి సరికొత్త స్కూటీను లాంచ్ చేసింది. స్కూటీ వేరియంట్లలో ‘అవెనీస్’ పేరుతో కొత్త స్కూటీను సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా ఆవిష్కరించింది. యువతను, టెక్ సావీలను లక్ష్యంగా చేసుకొని ఈ స్కూటీను సుజుకీ తయారు చేసింది. ఈ కొత్త స్కూటీ వచ్చే నెల డిసెంబర్లో కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనుంది. రేసింగ్ ఎడిషన్‌గా పరిచయం చేసిన అవెనీస్ మెటాలిక్ ట్రిటాన్ బ్లూ కలర్‌తో సహా ఐదు రంగుల వేరియంట్స్‌తో రానుంది. రేస్ ఎడిషన్ వేరియంట్లో సుజుకి రేసింగ్ గ్రాఫిక్స్‌ను అమర్చారు. రేస్ ఎడిషన్ సుజుకీ అవెనీస్ బేస్ వేరియంట్ ధర రూ. 86,700 ( ఢిల్లీ ఎక్స్-షోరూమ్ ధర)గా ఉంది. చదవండి: కొత్త కారు.. కొనక్కర్లేదు.. అద్దెతోనే నడిపేయండి జెన్ జీ...టెక్ సావీలే లక్ష్యంగా ఫీచర్స్..! జెన్‌జీ, టెక్సావీలను లక్ష్యంగా చేసుకొని అద్భుతమైన ఫీచర్స్‌తో సుజుకీ అవెనీస్ సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా లాంచ్ చేసింది. ఈ స్కూటీలో ముఖ్యంగా అవెనీస్ కాలర్ ఐడీ, ఎస్ఎమ్ఎస్ అలర్ట్, వాట్సాప్ అలర్ట్, స్పీడ్ అలర్ట్, ఫోన్ బ్యాటరీ స్థాయి డిస్ప్లేను అందించనుంది. ఐవోఎస్, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫారమ్స్‌తో కనెక్ట్ చేయవచ్చును. సుజుకీ అవెనీస్ ఇంజిన్ విషయానికి వస్తే...ఎఫ్1 టెక్నాలజీతో 125సీసీ ఇంజిన్ అమర్చారు. 6750 ఆర్పీఎమ్ వద్ద 8.7 పీఎస్ పవర్‌ను డెలివరీ చేస్తోంది. 5500ఆర్పీఎమ్ వద్ద 10ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. ఈ స్కూటీలో బాడీ మౌంటెడ్ ఎల్ఈడీ, భారీ స్టోరేజ్ స్పేస్, యూఎస్బీ ఛార్జింగ్ పోర్ట్, ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్, స్పోర్టీ మఫ్లర్ కవర్, అల్లాయ్ వీల్, క్యాచీ గ్రాఫిక్స్, సైడ్ స్టాండ్ లాక్, ఇంజన్ కిల్ స్విచ్, డ్యూయల్ లగేజ్ హుక్స్, ఫ్రంట్ రాక్ స్టోరేజ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సుజుకీ అవెనిస్ కోసం కొత్తగా ఎక్స్టర్నల్ హింజ్ టైప్ ఫ్యూయల్ క్యాప్‌ను సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా పరిచయం చేసింది. చదవండి: ఎలక్ట్రిక్ వాహన ప్రపంచంలో లూసిడ్ రికార్డు.. 840 కి.మీ రేంజ్, ధర ఎంతో తెలుసా? -
కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనుకునే వారికి గుడ్ న్యూస్!
ముంబై: దేశంలో పెట్రో ధరలు మండిపోతున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో పెట్రోల్ ధర సెంచరీ కూడా కొట్టేసింది. దీంతో చాలా మంది ప్రజలు మండుతున్న ఇందన ధరలు చూసి తక్కువ ధరలో మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ఎదురుచూస్తున్నారు. అయితే, అలాంటి వారి అంచనాలకు తగ్గట్టుగా జపాన్ కు చెందిన ఆటోమొబైల్ కంపెనీ సుజుకీ ఒక ఎలక్ట్రిక్ స్కూటర్(బర్గ్మాన్ ఎలక్ట్రిక్ స్కూటర్)ను త్వరలో మార్కెట్ లోకి తీసుకొని రాబోతుంది. దీనిలోబైక్ రేంజ్లో ఫీచర్లు ఉన్నాయి. సుజుకీకి దేశీయంగా క్వాలిటీ వాహనాలు తయారుచేస్తుందనే మంచి పేరు ఉంది. సర్వీస్ విషయంలోనూ కస్టమర్ల నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ పొందుతోంది. అందుకే తన సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ని అన్ని రకాల టెస్టులూ చేశాకే విడుదల చెయ్యాలని నిర్ణయించింది. ఈ మధ్యే ఈ స్కూటర్‌కి అన్నీ పరీక్షలను పూర్తి చేసింది. ఈ పరీక్షలో ఇది మంచి ఫలితాలు సాధించింది. ఈ స్కూటర్ 5 రంగుల్లో విడుదల కానుంది. దీనిలో బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నేవిగేషన్, యూఎస్బీ ఛార్జర్, ఫుల్-ఎల్ఈడీ హెడ్ లైట్, డిజిటల్ అండర్ సీట్ స్టోరేజ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి ఉన్నాయి. కంపెనీ ఈ స్కూటర్ పవర్ ఎంత అన్నది బయటకి వెల్లడించకపోయినా బీఎస్6 ప్రమాణాలతో ఉన్న 4 స్ట్రోక్ ఇంజిన్, సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ టైప్ అని స్పష్టం చేసింది. దీనిని ఒకసారి ఛార్జ్ చేస్తే 125 కిలోమీటర్ల దాకా వెళ్లనున్నట్లు సమాచారం. సిటీలో ఆఫీస్ పనుల కోసం, రోజు తక్కువ దూరం వెళ్లేవారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే దీని టాప్ స్పీడ్ వచ్చేసి గంటకు 80 కి.మీగా ఉంది. చదవండి: కరోనా పేషెంట్స్ కోసం గూగుల్ మ్యాప్స్ లో సరికొత్త ఫీచర్ -
మార్కెట్లోకి జిక్సర్ ఎస్ఎఫ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీ కంపెనీ సుజుకీ మోటార్ సైకిల్ ఇండియా (ఎస్ఎంఐపీఎల్) 250 సీసీ ప్రీమియం బైక్స్ విభాగంలోకి ఎంట్రీ ఇచ్చింది. సోమవారమిక్కడ జిక్సర్ ఎస్ఎఫ్ 250, జిక్సర్ ఎస్ఎఫ్ పేరిట రెండు స్పోర్ట్స్ బైక్స్‌ను విడుదల చేసింది. జిక్సర్ ఎస్ఎఫ్ 250 ధర రూ.1,70,655 కాగా, జిక్సర్ ఎస్ఎఫ్ ధర రూ.1,09,870గా కంపెనీ నిర్ణయించింది. ఈ సందర్భంగా సుజుకీ ఇండియా హెడ్ కిచిరో హిరావు మాట్లాడుతూ.. గత ఆర్ధిక సంవత్సరంలో 7.5 లక్షల బైక్‌లను విక్రయించామని, వీటిలో 6.7 లక్షలు దేశీ మార్కెట్లో, మిగిలినవి ఎగమతి మార్కెట్లో చేశామని చెప్పారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 10 లక్షల బైక్‌ల విక్రయాలను సాధిస్తామని తెలిపారు. ప్రస్తుతం ఉన్న ప్లాంట్ సామర్ధ్యం విస్తరణతో పాటూ కొత్త గ్రీన్‌ఫీల్డ్ ప్లాంట్ ఏర్పాటు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నామని చెప్పారు. -
వి–స్ట్రోమ్ 650 ఎక్స్‌టీ ఏబీఎస్
న్యూఢిల్లీ: సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా తన ప్రీమియమ్ బైక్ మోడల్ వి–స్ట్రోమ్ 650 ఎక్స్‌టీలో కొత్త వేరియంట్‌ను మార్కెట్లోకి తెచ్చింది. వి–స్ట్రోమ్ 650 ఎక్స్‌టీ ఏబీఎస్ పేరుతో అందిస్తున్న ఈ బైక్ ధరను రూ.7.46 లక్షలుగా (ఎక్స్ షోరూమ్, న్యూఢిల్లీ) నిర్ణయించామని సుజుకీ మోటార్ సైకిల్ ఇండియా తెలిపింది. కొత్త గ్రాఫిక్స్‌తో రూపొందిన ఈ బైక్‌లో 4 స్ట్రోక్ 645 సీసీ ఇంజిన్, సైడ్ రెఫ్లిక్టర్లు, హజార్డ్స్ లైట్స్ వంటి ప్రత్యేకతలున్నాయని కంపెనీ ఎమ్డీ సంతోషి ఉచిద తెలిపారు. బ్రిడ్జిస్టోన్ బాట్‌లాక్స్ అడ్వెంచర్ ఏ40 ట్యూబ్‌లెస్ టైర్లు, ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్క్, ఆరు గేర్లు, త్రీ–స్టేజ్ ట్రాక్షన్ కంట్రోల్, మూడు రకాలుగా అడ్జెస్ట్ చేసుకునే వీలున్న విండ్‌స్క్రీన్, తదితర ఫీచర్లున్నాయని పేర్కొన్నారు. గత ఏడాదే ఈ బైక్‌ను మార్కెట్లోకి తెచ్చామని, మంచి స్పందన లభిస్తోందని పేర్కొన్నారు. ఈ కొత్త బైక్‌ను ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీతో రూపొందించామని, పనితీరు మరింతగా మెరుగుపడగలదని వివరించారు. ఈ బైక్ కవాసకి వెర్సీస్ 650, ఎస్డబ్ల్యూఎమ్ సూపర్‌డ్యూయల్ టీ బైక్‌లకు గట్టిపోటీనివ్వగలదని పరిశ్రమ వర్గాల అంచనా. -
మార్కెట్లోకి సుజుకీ వి-స్ట్రామ్ బైక్
సాక్షి, న్యూఢిల్లీ: సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా కొత్త ప్రీమియం మోటార్ బైక్ మోడల్‌ను లాంచ్ చేసింది. అడ్వెంచర్ టూరర్ బైక్ వి-స్ట్రామ్ 650ఎక్స్‌టి ఏబీఎస్(2019) ను సోమవారం మార్కెట్లోకి విడుదల చేసింది. రెండు రంగుల్లో లభించనున్న ఈ బైక్ ధర రూ.7.46 లక్షలు (ఢిల్లీ ఎక్స్‌షోరూమ్). కొత్త గ్రాఫిక్స్, అదనపు ఫీచర్లతో వి-స్ట్రామ్ కొత్త వెర్షన్ భారతీయ వినియోగదారులకు అద్భుతమైన అడ్వెంచర్ అనుభూతిని అందిస్తుందని సుజుకీ మోటార్‌సైకిల్ ఇండియా ఎండీ సతోషి ఉచిడా వెల్లడించారు. గత ఏడాది లాంచ్ చేసిన ఈ వి- స్ట్రామ్ మోటార్ సైకిల్‌కు మంచి ఆదరణ లభించిందనీ, ఇపుడు కూడా అదే స్పందన లభిస్తుందని తాము ఆశిస్తున్నామన్నారు. లైట్ వెయిట్ యాంటీ లాక్ బ్రేక్ సిస్టమ్.. రహదారిపై పట్టును కోల్పోకుండా చేస్తుందని పేర్కొన్నారు. -
ఏడు లక్షల ద్విచక్ర వాహనాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏడు లక్షలకు పైగా యూనిట్లను విక్రయించాలని లకి‡్ష్యంచింది. 2017–18లో అయిదు లక్షల పైచిలుకు సుజుకి టూవీలర్లు రోడ్డెక్కాయి. 2020 నాటికి 10 లక్షల యూనిట్ల మార్కును చేరుకోవాలన్నది లక్ష్యమని సంస్థ సేల్స్, మార్కెటింగ్ జోనల్ మేనేజర్ కేఎన్‌వీఎస్ సురేశ్ సోమవారం తెలిపారు. బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ స్కూటర్‌ను హైదరాబాద్ మార్కెట్లో విడుదల చేసిన సందర్భంగా రీజినల్ మేనేజర్ పంకిత్ మోడి తో కలిసి మీడియాతో మాట్లాడారు. ‘యాక్సెస్ 125 స్కూటర్‌కు మంచి డిమాండ్ ఉంది. సీబీఎస్ వేరియంట్‌తోపాటు స్పెషల్ ఎడిషన్‌ను ఇటీవలే ప్రవేశపెట్టాం. 150 సీసీ సెగ్మెంట్లో కంపెనీకి 8% వాటా ఉంది. ఈ విభాగంలో ఇంట్రూడర్ హల్చల్ చేస్తోంది. నెలకు 5,000లకుపైగా యూనిట్లు అమ్ముడవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సంఖ్య 200 ఉంది. కంపెనీ మొత్తం అమ్మకాల్లో కర్నాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 25 శాతం వాటా చేజిక్కించుకున్నాయి.’ అని వివరించారు. హైదరాబాద్ ఎక్స్‌షోరూంలో బర్గ్‌మ్యాన్ స్ట్రీట్ ధర రూ.70,292 ఉంది. -
యాక్సెస్ స్పెషల్ ఎడిషన్ స్కూటీ
ముంబై : జపాన్‌కు చెందిన స్కూటర్ తయారీ సంస్థ సుజుకీ యాక్సెస్ స్పెషల్ ఎడిషన్‌ను తీసుకొచ్చింది. కంబైండ్ బ్రేకింగ్ సిస్టమ్(సీబీఎస్) టెక్నాలజీని ఈ బైక్‌కు సుజుకీ జోడించింది. ప్రస్తుతం సుజుకీ యాక్సెస్ సీబీఎస్ స్పెషల్ ఎడిషన్ ధర రూ.60,580గా నిర్ణయించారు. 125 సీసీ ఇంజిన్‌తో వచ్చే ఈ బైక్ ఎస్ఈపీ టెక్నాలజీపై పని చేస్తుంది. అంతేకాకుండా కొత్త యాక్సెస్‌లో ఉన్న సీబీఎస్ బ్రేకింగ్ వ్యవస్థ వాహనాన్ని మరింత బ్యాలెన్సింగ్‌గా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషిస్తుందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. మెటాలిక్ సోనిక్ సిల్వర్ స్పెషల్ ఎడిషన్‌లో నల్లరంగు అలాయ్ వీల్స్, గుండ్రటి అద్దాలు కొత్త యాక్సెస్‌కు అదనపు ఆకర్ణణగా నిలుస్తాయని పేర్కొన్నారు. -
సుజుకి జిక్సర్‌లో కొత్త వేరియంట్
సాక్షి, న్యూఢిల్లీ: సుజుకి మోటార్ సైకిల్ ఇండియా కొత్త బైక్‌ను లాంచ్ చేసింది. 155 సీసీ జిక్సర్ లో కొత్త వేరియంట్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఎబిఎస్)తో రూపొందించిన ఈ బైక్ ధరను రూ. 87,250 (ఎక్స్ షోరూమ్ ఢిల్లీ) గా నిర్ణయించింది. ఇప్పటికే ఉత్తేజకరమైన రైడింగ్ అనుభవాన్ని సొంతం చేసుకున్నతమ వినియోగదారులకు ఏబీఎస్ ఆప్షన్ మరింత ఉత్సాహాన్నిస్తుందని సుజుకి మోటార్ సైకిల్ ఇండియా ఈవీపీ సేల్స్ అండ్ మార్కెటింగ్ సజీవ్ రాజశేఖరన్ ఒక ప్రకటనలో తెలిపారు. జిక్సర్ సిరీస్ తమ ఇండియా ప్రోడక్ట్-స్ట్రాటజీలో ఒక ముఖ్యమైన మోడల్ అని తెలిపారు. అయితే ఏబీఎస్ ఆప్షన్ జోడింపు తప్ప గిక్సర్ కొత్త వేరియంట్లో అదనంగా మార్పులు చేయలేదు. 155 సిసి ఎయిర్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజిన్, 8,000ఆర్పీఎం వద్ద 14.8హెచ్‌పీ , 6,000ఆర్పిఎం వద్ద14ఎన్ఎంను ఉత్పత్తి చేస్తుంది. -
సుజుకి కొత్త గిక్సర్ బైక్స్ లాంచ్...
సాక్షి న్యూఢిల్లీ: సుజుకి మోటార్ కార్పొరేషన్‌కు చెందిన సుజుకీ మోటార్ సైకిల్ ఇండియా గిక్సర్ సిరీస్‌లో కొత్త మోడల్ బైక్‌లను లాంచ్ చేసింది. 2018 ఫ్లాగ్షిప్ మోటార్ సైకిల్ 2018 మోడల్స్‌ను మంగళవారం విడుదల చేసింది. 2014లో లాంచ్ చేసిన గిక్సర్ బ్రాండ్‌కు చెందిన గిక్సర్ , గిక్సర్ ఎస్ఎఫ్ పేరుతో వీటిని అందుబాటులోకి తెచ్చింది. గిక్సర్ ధరను రూ. 80,928, గిక్సర్ ఎస్ఎఫ్ ధరను రూ .90,037గా నిర్ణయించింది. వీటిల్లోసుజుకి ఎకో పెర్ఫామెన్స్ టెక్సాలజీ (ఎస్ఈపి) అల్ట్రా లైట్ 155 సీసీ ఇంజీన్ అమర్చినట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. గిక్సర్ మోడల్స్ తమకు కీలకమైన ఉత్పత్తులని సుజుకి మోటార్ సైకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సేల్స్ అండ్ మార్కెటింగ్ ప్రతినిధి సజీవ్ రాజశేఖరన్ చెప్పారు. వీటి పంపణీ ఇప్పటికే మొదలైందని దేశవ్యాప్తంగా తమ డీలర్‌షిప్‌లలో లభ్యమవుతాయని వెల్లడించారు. -
ఇక స్కూటర్ల పైనే సుజుకి ఫోకస్..
అమ్మకాల్లో 70% వాటా వీటిదే భవిష్యత్‌లో అధిక సామర్థ్యమున్న మోడళ్లు తీసుకొస్తాం... కంపెనీ జోనల్ మేనేజర్ ప్రభాకర్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీలో ఉన్న సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా స్కూటర్ల విపణిపైనే ఫోకస్ చేసింది. దేశవ్యాప్తంగా సంస్థ అమ్మకాల్లో వీటి వాటా అత్యధికంగా 65-70 శాతం ఉండడమే ఇందుకు కారణం. దీనికితోడు భారత్‌లో స్కూటర్ల మార్కెట్ 12 శాతం వృద్ధి నమోదు చేస్తోంది. సుజుకి సైతం ఇదే స్థాయిలో పనితీరు కనబరుస్తోంది. దీంతో ట్రెండ్‌కు తగ్గట్టుగా వ్యూహాన్ని అమలు చేస్తున్నట్టు సంస్థ దక్షిణప్రాంత సేల్స్ జోనల్ మేనేజర్ డి.వి.ప్రభాకర్ తెలిపారు. సోమవారమిక్కడ నారాయణగూడలో నవకర్ సుజుకి షోరూంను ప్రారంభించిన సందర్భంగా సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. దక్షిణాదితోపాటు పశ్చిమ భారత్‌లో స్కూటర్ల అమ్మకాలు గణనీయంగా పెరుగుతున్నాయని వివరించారు. 100-110 సీసీ బైక్‌ల యజమానులు స్కూటర్లకు మళ్లుతున్నారని చెప్పారు. 150 సీసీ స్కూటర్లు సైతం.. ప్రస్తుతం కంపెనీ 125 సీసీ వరకు సామర్థ్యమున్న స్కూటర్లను భారత్‌లో విక్రయిస్తోంది. 150 సీసీ స్కూటర్ 2017లో భారత్‌కు వచ్చే అవకాశం ఉందని ప్రభాకర్ వెల్లడించారు. యాక్సెస్ 125 మోడల్‌ను మరింత స్పోర్టీ లుక్‌తో తీర్చిదిద్ది ఈ ఏడాది చివరికల్లా విడుదల చేయనున్నట్టు చెప్పారు. రాబోయే మోడళ్లన్నీ 125 సీసీ, ఆపై సామర్థ్యమున్నవే ఉంటాయన్నారు. భారత్‌లో మోటార్‌సైకిళ్ల విభాగంలో 150 సీసీ, ఆపై సామర్థ్యమున్న విభాగాలే వృద్ధి చెందుతున్నాయి. కంపెనీ సైతం దీనికి అనుగుణంగా మోడళ్లను తెస్తుందని వివరించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కంపెనీ నెలకు అన్ని మోడళ్లు కలిపి 1,800 యూనిట్లు విక్రయిస్తోంది. దీనిని 3,000 యూనిట్లకు పెంచాలన్నది లక్ష్యం.