భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన 'సుజుకి మోటార్‌సైకిల్' (Suzuki Motorcycle) ఇటీవల ఉత్పత్తిలో గొప్ప మైలురాయిని చేరుకుంది. ఇందులో భాగంగానే గురుగ్రామ్‌లోని ఖేర్కి ధౌలా ప్లాంట్ నుండి 7 మిలియన్ల యూనిట్ బైకుని అధికారికంగా విడుదల చేసింది.
కంపెనీ 7 మిలియన్ యూనిట్‌గా ఎల్లో కలర్ ఫినిషింగ్ పొందిన 'సుజుకి వి-స్ట్రామ్ ఎస్ఎక్స్' విడుదల చేసింది. ఇది నిజంగానే కంపెనీ సాధించిన అపూర్వమైన విజయం అనే చెప్పాలి. ఫిబ్రవరి 2006లో ఇండియన్ మార్కెట్లో కార్యకలాలను ప్రారంభించిన సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా మార్చి 2023తో ముగిసిన ఆర్థిక సంవత్సరం నాటికి ఏకంగా 9.38 లక్షల యూనిట్లను విక్రయించినట్లు కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కెనిచి ఉమెడ తెలిపారు.
(ఇదీ చదవండి: కంప్యూటర్ వద్దనుకున్నారు.. వంకాయ సాగు మొదలెట్టాడు - ఇప్పుడు సంపాదన చూస్తే..)
సుజుకి మోటార్‌సైకిల్ ఇండియా వి-స్ట్రామ్ ఎస్ఎక్స్, జిక్సర్ ఎస్ఎఫ్ 250, జిక్సర్ 250, జిక్సర్ ఎస్ఎఫ్, జిక్సర్, యాక్సెస్ 125, అవెనిస్, బర్గ్‌మాన్ స్ట్రీట్, బర్గ్‌మాన్ స్ట్రీట్ ఈఎక్స్ వంటి ద్విచక్ర వాహనాలను దేశీయ విఫణిలో తయారు చేస్తోంది. అంతే కాకుండా పెద్ద-బైక్ పోర్ట్‌ఫోలియోలో వి- స్ట్రామ్ 650XT, కటన, హయబుసా మోడల్స్ ఉత్పత్తి చేస్తోంది. రానున్న రోజుల్లో కంపెనీ మరిన్ని కొత్త ఉత్పత్తులను దేశీయ మార్కెట్లో విడుదల చేసేందుకు తగిన సన్నాహాలు సిద్ధం చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment