![Upcoming Suzuki Burgman Street Electric Spied Up Close - Sakshi](/styles/webp/s3/article_images/2021/05/10/Suzuki%20Burgman%20Electric%20Scooter.jpg.webp?itok=DGDET-WP)
ముంబై: దేశంలో పెట్రో ధరలు మండిపోతున్నాయి. ఇప్పటికే కొన్ని రాష్ట్రాలలో పెట్రోల్ ధర సెంచరీ కూడా కొట్టేసింది. దీంతో చాలా మంది ప్రజలు మండుతున్న ఇందన ధరలు చూసి తక్కువ ధరలో మంచి ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని ఎదురుచూస్తున్నారు. అయితే, అలాంటి వారి అంచనాలకు తగ్గట్టుగా జపాన్ కు చెందిన ఆటోమొబైల్ కంపెనీ సుజుకీ ఒక ఎలక్ట్రిక్ స్కూటర్(బర్గ్‌మాన్ ఎలక్ట్రిక్ స్కూటర్)ను త్వరలో మార్కెట్ లోకి తీసుకొని రాబోతుంది. దీనిలోబైక్ రేంజ్‌లో ఫీచర్లు ఉన్నాయి. సుజుకీకి దేశీయంగా క్వాలిటీ వాహనాలు తయారుచేస్తుందనే మంచి పేరు ఉంది.
సర్వీస్ విషయంలోనూ కస్టమర్ల నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ పొందుతోంది. అందుకే తన సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ని అన్ని రకాల టెస్టులూ చేశాకే విడుదల చెయ్యాలని నిర్ణయించింది. ఈ మధ్యే ఈ స్కూటర్‌కి అన్నీ పరీక్షలను పూర్తి చేసింది. ఈ పరీక్షలో ఇది మంచి ఫలితాలు సాధించింది. ఈ స్కూటర్ 5 రంగుల్లో విడుదల కానుంది. దీనిలో బ్లూటూత్ కనెక్టివిటీ, టర్న్ బై టర్న్ నేవిగేషన్, యూఎస్‌బీ ఛార్జర్, ఫుల్-ఎల్ఈడీ హెడ్ లైట్, డిజిటల్ అండర్ సీట్ స్టోరేజ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి ఉన్నాయి. కంపెనీ ఈ స్కూటర్ పవర్ ఎంత అన్నది బయటకి వెల్లడించకపోయినా బీఎస్6 ప్రమాణాలతో ఉన్న 4 స్ట్రోక్ ఇంజిన్, సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ టైప్ అని స్పష్టం చేసింది. దీనిని ఒకసారి ఛార్జ్ చేస్తే 125 కిలోమీటర్ల దాకా వెళ్లనున్నట్లు సమాచారం. సిటీలో ఆఫీస్ పనుల కోసం, రోజు తక్కువ దూరం వెళ్లేవారికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే దీని టాప్ స్పీడ్ వచ్చేసి గంటకు 80 కి.మీగా ఉంది.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment