48 గంటల్లో 20000 బుకింగ్స్ | Ultraviolette Tesseract Gets Over 20000 Pre Bookings in Under 48 Hours | Sakshi
Sakshi News home page

48 గంటల్లో 20000 బుకింగ్స్: మొదటి 50వేల మందికి..

Published Mon, Mar 10 2025 9:20 PM | Last Updated on Mon, Mar 10 2025 9:28 PM

Ultraviolette Tesseract Gets Over 20000 Pre Bookings in Under 48 Hours

మార్చి 5న అల్ట్రావయొలెట్ కంపెనీ తన టెస్సెరాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. సంస్థ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించిన 48 గంటల్లో రికార్డ్ స్థాయిలో బుకింగ్స్ స్వీకరించింది.

అల్ట్రావయొలెట్ టెస్సెరాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ 48 గంటల్లో 20,000 కంటే ఎక్కువ ప్రీ-బుకింగ్‌లను పొందింది. ఈ విషయాన్ని సంస్థ అధికారికంగా ప్రకటించింది. అయితే ప్రారంభ పరిచయ ధరను (రూ. 1.20 లక్షలు) 10000 నుంచి 50000 యూనిట్లకు పెంచింది. అంటే మొదటి 50వేలమందికి మాత్రమే ఆ ధర వర్తిస్తుంది. ఆ తరువాత దీని ధర రూ. 1.45 లక్షలకు (ఎక్స్ షోరూమ్) చేరుకుంటుంది.

అల్ట్రావయొలెట్ టెస్సెరాక్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు 2026 మొదటి త్రైమాసికంలో ప్రారంభమవుతాయి. దీనిని రూ. 999 కు ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు. ఇది ఒక ఫుల్ ఛార్జితో 261 కిమీ రేంజ్ అందిస్తుందని తెలుస్తోంది. కేవలం 100 రూపాయలతో రెండుసార్లు ఛార్జ్ చేయడం ద్వారా 500 కిలోమీటర్ల పరిధిని సాధించగలదని అల్ట్రావయోలెట్ పేర్కొంది.

ఇదీ చదవండి: ఎక్కువమంది కొంటున్న ఎలక్ట్రిక్ స్కూటర్ ఏదంటే?

టెస్సెరాక్ట్‌ ఎలక్ట్రిక్ స్కూటర్.. ఆన్‌బోర్డ్ నావిగేషన్‌తో కూడిన 7 ఇంచెస్ టచ్‌స్క్రీన్ TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, రెండు డాష్‌క్యామ్‌లు (ముందు, వెనుక), వైర్‌లెస్ ఛార్జింగ్, హ్యాండిల్‌బార్ కోసం హాప్టిక్ ఫీడ్‌బ్యాక్, డ్యూయల్ ఛానల్ ఏబీఎస్, డ్యూయల్ డిస్క్‌లు, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ హోల్డ్, డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటివి పొందుతుంది.

టెస్సెరాక్ట్ అనేది రాడార్ బేస్డ్ ADAS టెక్నాలజీతో కూడిన భారతదేశపు మొట్టమొదటి స్కూటర్. ఇది బ్లైండ్ స్పాట్ డిటెక్షన్, ఓవర్‌టేక్ అలర్ట్, కొలిజన్ అలర్ట్, లేన్ చేంజ్ అసిస్ట్ వంటి ఫీచర్స్ పొందుతుంది. ఈ స్కూటర్ ఫ్లోటింగ్ డీఆర్ఎల్, ఎల్ఈడీ టెయిల్‌ల్యాంప్‌లతో కూడిన డ్యూయల్ ఎల్ఈడీ ప్రొజెక్టర్ ల్యాంప్‌ పొందుతుంది. దీని అండర్ సీట్ స్టోరేజ్ 34 లీటర్లు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement