Pre-Bookings
-
రెడ్మి నోట్ 5 ఆఫ్‌లైన్‌గా...
ఫ్లాష్ సేల్కు వచ్చిన నిమిషాల్లో అవుటాఫ్ స్టాక్ అవుతున్న రెడ్మి నోట్ 5 స్మార్ట్‌ఫోన్‌ను ఇక నుంచి ఆఫ్‌లైన్‌గా కూడా బుక్ చేసుకోవచ్చు. ఆఫ్‌లైన్ స్టోర్లలో ఈ స్మార్ట్‌ఫోన్ ప్రీ-బుకింగ్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు షావోమి ప్రకటించింది. గత నెలలోనే రెడ్మి నోట్ 5, రెడ్మి నోట్ 5 ప్రొ స్మార్ట్ఫోన్లను షావోమి లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. లాంచ్ చేసిన అనంతరం వీటిని ఫ్లిప్‌కార్ట్, ఎంఐ.కామ్, ఎంఐ హోమ్ స్టోర్లలో అందుబాటులో ఉంచింది. ఫ్లాష్ సేల్కు వచ్చిన ప్రతీసారి ఈ స్మార్ట్ఫోన్లు నిమిషాల్లోనే అవుటాఫ్ స్టాక్ అవుతున్నాయి. త్వరలోనే ఆఫ్‌లైన్ రిటైల్ పార్టనర్ల వద్ద అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది. ప్రస్తుతం రెడ్మి నోట్ 5 ప్రీ-బుకింగ్స్‌ను ఆఫ్‌లైన్ స్టోర్ల వద్ద షావోమి ప్రారంభించింది. వీటి డెలివరీని మార్చి 8 నుంచి మొదలుపెడుతుంది. రెండు వేల రూపాయలు కట్టి ఈ ఫోన్‌ను ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చని రిటైల్ వర్గాలు తెలిపాయి. అంతేకాక త్వరలో ఆఫ్‌లైన్ రిటైల్ పార్టనర్ల వద్ద విక్రయానికి రాబోతున్న ఈ స్మార్ట్‌ఫోన్ ధర ఆన్లైన్ కంటే రూ.500 ఎక్కువగా ఉండనుంది. థర్డ్ పార్టీ ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్ల ద్వారా రెడ్మి నోట్ 5ను కొనుగోలు చేస్తే, 3జీబీ ర్యామ్, 32జీబీ మోడల్ ధర 10,499 రూపాయలు. అసలు ఆన్‌లైన్‌గా ఈ మోడల్ ధర 9,999 రూపాయలు. అదేవిధంగా 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను ఆఫ్‌లైన్‌గా 12,499 రూపాయలకు అందుబాటులోకి తెస్తోంది. ఆన్‌లైన్‌గా ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.11,999గా ఉంది. అదేవిధంగా రెడ్మి నోట్ 5 ప్రొ ధర కూడా ఆన్‌లైన్‌గా కంటే ఆఫ్‌లైన్‌గా 500 రూపాయలు ఎక్కువగా ఉండనుంది. షావోమి రెడ్మి నోట్ 5 ఫీచర్లు 5.99 అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ 2.5డి కర్వ్డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్ప్లే 2160 x 1080 పిక్సల్స్ రిజల్యూషన్, విత్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ 2 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్ 3/4 జీబీ ర్యామ్ 32/64 జీబీ స్టోరేజ్ 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 12 ఎంపీ బ్యాక్ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ. షావోమి రెడ్మి నోట్ 5 ప్రొ ఫీచర్లు 5.99 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ 2.5డి కర్వ్డ్ గ్లాస్ ఫుల్ వ్యూ డిస్ప్లే 2160 x 1080 పిక్సల్స్ రిజల్యూషన్, విత్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ 1.8 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 636 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, 12, 5 ఎంపీ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు 20 ఎంపీ సెల్ఫీ కెమెరా, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ -
రూ. 2వేలకే ఈ స్మార్ట్ఫోన్లు
గెలాక్సీ ఎస్ 8 కి సక్సెసర్‌గా తాజాగా కొత్త ఫ్లాగ్షిప్ ఎస్9, ఎస్9 ప్లస్ స్మార్ట్ఫోన్లను శాంసంగ్ లాంచ్ చేసింది. కొత్త కెమెరా, డేటా రక్షణ, వర్చువల్ రియాలీటీ తదితర టాప్-ఎండ్ ఫీచర్లతో వరల్డ్ మొబైల్ కాంగ్రెస్ 2018లోఆదివారం లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌పోన్ ప్రి ఆర్డర్స్ మార్చి 2న మొదలు కానున్నాయి. అయితే ఈ సందర్భంగా భారతీయ వినియోగదారులకు కంపెనీ ఒక ఆఫర్ కూడా ఇస్తోంది. కేవలం రూ.2వేల తో సంస్థ వెబ్సైట్ ద్వారా గెలాక్సీ ఎస్9, ఎస్9 ప్లస్ డివైస్‌లను ప్రీ ఆర్డర్ చేసుకోవచ్చని కంపనీ ప్రకటించింది. కాగా ఎంపిక చేసిన మార్కెట్లలో మార్చి 16నుంచి విక్రయానికి అందుబాటులో ఉండనున్నాయి. గెలాక్సీ ఎస్ 9 ఫీచర్లు 5.8కర్వ్డ్ సూపర్ ఎమోలెడ్ డిస్ప్లే ఆండ్రాయిడ్ 8 ఓరియో 1440 x 2960 పిక్సెల్స్‌రిజల్యూషన్ 4జీబీర్యామ్ 64జీబీస్టోరేజ్ 12ఎంపీ కెమెరా 8ఎంపీ సెల్ఫీ కెమెరా 3000 ఎంఏహెచ్‌బ్యాటరీ, గెలాక్సీ ఎస్9 ప్లస్ ఫీచర్లు 6.2 డిస్ప్లే 1440x2960 రిజల్యూషన్ ఆండ్రాయిడ్ 8 ఓరియో 6జీబీ ర్యామ్ 256జీబీ దాకా విస్తరించుకునే అవకాశం 64జీబీ స్టోరేజ్ 12 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 8ఎంపీ సెల్ఫీ కెమెరా 3500 ఎంఏహెచ్ బ్యాటరీ -
నేటి నుంచి నోకియా ఫోన్ ప్రీ-బుకింగ్స్
నోకియా బ్రాండులో మూడు స్మార్ట్ఫోన్లను ముచ్చటగా ఒకేసారి హెచ్ఎండీ గ్లోబల్ గత నెలలో భారత్ మార్కెట్లోకి లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ స్మార్ట్ఫోన్లలో ఒకటైన నోకియా 3 మార్కెట్లో అందుబాటులో ఉంది. మిగతా రెండు నోకియా 5, నోకియా 6 స్మార్ట్ఫోన్లు ఇంకా అందుబాటులోకి రావాల్సి ఉంది. ప్రస్తుతం నోకియా 5 స్మార్ట్‌ఫోన్ ప్రీ-బుకింగ్‌లను కంపెనీ నేటి నుంచి చేపడుతోంది. ఆఫ్లైన్గానే ఈ ఫోన్‌ను కూడా హెచ్ఎండీ గ్లోబల్ విక్రయించనుంది. ఎంపికచేసిన రిటైల్ అవుట్లెట్లలోనే ఈ ఫోన్‌ను ప్రీబుకింగ్ల కోసం అందుబాటులో ఉంచుతామని లాంచింగ్ సందర్భంగానే హెచ్ఎండీ గ్లోబల్ చెప్పింది. ఢిల్లీ, ఎన్సీఆర్, ముంబై, చెన్నై, ఛండీగర్, జైపూర్, కోల్కత్తా, లక్నో, ఇండోర్, హైదరాబాద్, పుణే, అహ్మదాబాద్, కాలికట్ ప్రాంతాల ఆఫ్‌లైన్ మొబైల్ రిటైల్ అవుట్లెట్లలో దీన్ని ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు. ఇక నోకియా 6 స్మార్ట్‌ఫోన్‌ను రిజిస్ట్రేషన్ కోసం జూలై 14 నుంచి అమెజాన్‌లో అందుబాటులో ఉంచుతుంది. అయితే నేటి నుంచి ప్రీ-బుకింగ్స్ నిర్వహిస్తున్న నోకియా 5 స్మార్ట్‌ఫోన్‌ను ఎప్పటి నుంచి విక్రయానికి వస్తుందో కంపెనీ స్పష్టం చేయలేదు. నోకియా 5 ధర, ఇతర వివరాలు.. 12,899 రూపాయలకు నోకియా 5 లాంచ్ అయింది. నోకియా 5 కొనుగోలు చేసే వొడాఫోన్ వినియోగదారులకు రూ.142 రీఛార్జ్‌పై 1జీబీ డేటాతో పాటు నెలకు 4జీబీ అదనపు డేటాను అందించనుంది. ఈ ఆఫర్ మూడు నెలలు లేదా మూడు రీఛార్జ్‌లకే వాలిడ్‌లో ఉంటుంది. అదేవిధంగా మేక్మైట్రిప్.కామ్‌లో రూ.2500 తగ్గింపును(హోటళ్లపై రూ.1800, దేశీయ విమానాలపై రూ.700 తగ్గింపు) కస్టమర్లు పొందనున్నారు. నోకియా 5 ఫీచర్లు... 5.2 అంగుళాల హెచ్డీ డిస్ప్లే ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 430ఎస్ఓసీ 2జీబీ ర్యామ్ 16జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ 128జీబీ వరకు విస్తరణ మెమరీ 13ఎంపీ బ్యాక్ కెమెరా 8ఎంపీ ఫ్రంట్ కెమెరా 3000ఎంఏహెచ్ బ్యాటరీ -
జియోనీ స్మార్ట్ ఫోన్‌కు భారీ బుకింగ్స్
జియోనీ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ఏ1 బుకింగ్స్ లో అదరగొడుతోంది. రిజిస్ట్రేషన్లు ప్రారంభమైన 10 రోజుల్లోనే 150 కోట్ల విలువైన జియోనీ ఏ1 స్మార్ట్ ఫోన్లు బుకింగ్ అయినట్టు కంపెనీ వెల్లడించింది. ఈ ఏడాదిలో ఇన్ని బుకింగ్స్ నమోదైన తొలి స్మార్ట్ ఫోన్ తమదేనని, మొత్తం 74,682 యూనిట్ల ప్రీఆర్డర్లను స్వీకరించినట్టు కంపెనీ తెలిపింది. 8 వేల ధర నుంచి 25వేల ధర మధ్యలో ఉన్న ఫోన్లకు ఎక్కువగా బుకింగ్స్ నమోదవుతాయని జియోనీ ఇండియా సీఈవో, ఎండీ అరవింద్ ఆర్ వోహ్రా చెప్పారు. గత నెలలో జరిగిన 2017 మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో ఈ ఫోన్ కంపెనీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టింది. జియోనీ ఏ1 తోపాటు ఏ1 ప్లస్ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. కాగ జియోనీ ఏ1 ధర రూ.19,999. మార్చి 31 నుంచి ఈ స్మార్ట్ ఫోన్ ప్రీ-బుకింగ్స్ ను కంపెనీ ప్రారంభించింది. బిగ్ బ్యాటరీ, సెల్ఫీ ఫోకస్డ్ గా ఈ ఫోన్ వినియోగదారులను అలరించడానికి మార్కెట్లోకి వచ్చింది. 4010 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యాన్ని ఇది కలిగి ఉంది. దీంతో పాటు సెల్ఫీ ఫ్లాష్ ను కూడా 16ఎంపీగా ఉండేటట్టు ఈ ఫోన్ ను కంపెనీ రూపొందించింది. రూ.8 వేల నుంచి రూ.25 వేల లోపు ధర కలిగిన స్మార్ట్ఫోన్లు కొనుగోలు చేసేవారిని దృష్టిలో ఉంచుకుని ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించినట్లు వోహ్రా లాంచింగ్ సందర్భంగానే చెప్పారు. ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ కు భారీ బుకింగ్స్ వస్తున్నాయి. ఎక్కువ బుకింగ్స్ ఆఫ్ లైన్ కస్టమర్ల నుంచే వస్తున్నట్టు తెలిసింది. ఆన్ లైన్ నుంచి కొంచెం తక్కువగానే వస్తున్నాయని వోహ్రా చెప్పారు. ప్రస్తుతం కంపెనీ ఈ ఫోన్లను ఎంపికచేసిన ప్రాంతాలోని కస్టమర్లకు ఇవ్వడం ప్రారంభించిందని, అథారైజడ్ స్టోర్లలో ఈ రాత్రి నుంచి ఇతరులకు కూడా అందుబాటులో ఉంచుతున్నామని పేర్కొన్నారు. 42వేల రిటైల్ అవుట్ లెట్లు, 555 ఎక్స్‌క్లూజివ్ సర్వీసులు సెంటర్లను కంపెనీ కస్టమర్లకు అందుబాటులో ఉంచుతున్నట్టు వోహ్రా తెలిపారు.