జియోనీ స్మార్ట్ ఫోన్కు భారీ బుకింగ్స్ | Gionee A1 Pre-Bookings See Nearly 75,000 Units Booked in 10 Days | Sakshi
Sakshi News home page

జియోనీ స్మార్ట్ ఫోన్కు భారీ బుకింగ్స్

Published Tue, Apr 11 2017 1:42 PM | Last Updated on Tue, Sep 5 2017 8:32 AM

జియోనీ స్మార్ట్ ఫోన్కు భారీ బుకింగ్స్

జియోనీ స్మార్ట్ ఫోన్కు భారీ బుకింగ్స్

జియోనీ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ఏ1 బుకింగ్స్ లో అదరగొడుతోంది. రిజిస్ట్రేషన్లు ప్రారంభమైన 10 రోజుల్లోనే 150 కోట్ల విలువైన జియోనీ ఏ1 స్మార్ట్ ఫోన్లు బుకింగ్ అయినట్టు కంపెనీ వెల్లడించింది. ఈ ఏడాదిలో ఇన్ని బుకింగ్స్ నమోదైన తొలి స్మార్ట్ ఫోన్ తమదేనని, మొత్తం 74,682 యూనిట్ల ప్రీఆర్డర్లను స్వీకరించినట్టు కంపెనీ తెలిపింది. 8 వేల ధర నుంచి 25వేల ధర మధ్యలో ఉన్న ఫోన్లకు ఎక్కువగా బుకింగ్స్ నమోదవుతాయని జియోనీ ఇండియా సీఈవో, ఎండీ అరవింద్ ఆర్ వోహ్రా చెప్పారు. గత నెలలో జరిగిన 2017 మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ లో ఈ ఫోన్ కంపెనీ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టింది. జియోనీ ఏ1 తోపాటు ఏ1 ప్లస్ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. కాగ జియోనీ ఏ1 ధర రూ.19,999. మార్చి 31 నుంచి ఈ స్మార్ట్ ఫోన్ ప్రీ-బుకింగ్స్ ను కంపెనీ ప్రారంభించింది. 
 
బిగ్ బ్యాటరీ, సెల్ఫీ ఫోకస్డ్ గా ఈ ఫోన్ వినియోగదారులను అలరించడానికి మార్కెట్లోకి వచ్చింది.  4010 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యాన్ని ఇది కలిగి ఉంది. దీంతో పాటు సెల్ఫీ ఫ్లాష్ ను కూడా 16ఎంపీగా ఉండేటట్టు ఈ ఫోన్ ను కంపెనీ రూపొందించింది. రూ.8 వేల నుంచి రూ.25 వేల లోపు ధర కలిగిన స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసేవారిని దృష్టిలో ఉంచుకుని ఈ స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించినట్లు వోహ్రా లాంచింగ్ సందర్భంగానే చెప్పారు.  ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ కు భారీ బుకింగ్స్ వస్తున్నాయి. ఎక్కువ బుకింగ్స్ ఆఫ్ లైన్ కస్టమర్ల నుంచే వస్తున్నట్టు తెలిసింది. ఆన్ లైన్ నుంచి కొంచెం తక్కువగానే వస్తున్నాయని వోహ్రా చెప్పారు. ప్రస్తుతం కంపెనీ ఈ ఫోన్లను ఎంపికచేసిన ప్రాంతాలోని కస్టమర్లకు ఇవ్వడం ప్రారంభించిందని, అథారైజడ్ స్టోర్లలో ఈ రాత్రి నుంచి ఇతరులకు కూడా అందుబాటులో ఉంచుతున్నామని పేర్కొన్నారు. 42వేల రిటైల్ అవుట్ లెట్లు, 555 ఎక్స్క్లూజివ్ సర్వీసులు సెంటర్లను కంపెనీ కస్టమర్లకు అందుబాటులో ఉంచుతున్నట్టు వోహ్రా తెలిపారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement