నేటి నుంచి నోకియా ఫోన్ ప్రీ-బుకింగ్స్
నేటి నుంచి నోకియా ఫోన్ ప్రీ-బుకింగ్స్
Published Fri, Jul 7 2017 1:57 PM | Last Updated on Tue, Sep 5 2017 3:28 PM
నోకియా బ్రాండులో మూడు స్మార్ట్‌ఫోన్లను ముచ్చటగా ఒకేసారి హెచ్‌ఎండీ గ్లోబల్ గత నెలలో భారత్ మార్కెట్లోకి లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్లలో ఒకటైన నోకియా 3 మార్కెట్లో అందుబాటులో ఉంది. మిగతా రెండు నోకియా 5, నోకియా 6 స్మార్ట్‌ఫోన్లు ఇంకా అందుబాటులోకి రావాల్సి ఉంది. ప్రస్తుతం నోకియా 5 స్మార్ట్‌ఫోన్ ప్రీ-బుకింగ్‌లను కంపెనీ నేటి నుంచి చేపడుతోంది. ఆఫ్‌లైన్‌గానే ఈ ఫోన్‌ను కూడా హెచ్‌ఎండీ గ్లోబల్ విక్రయించనుంది. ఎంపికచేసిన రిటైల్ అవుట్‌లెట్లలోనే ఈ ఫోన్‌ను ప్రీబుకింగ్‌ల కోసం అందుబాటులో ఉంచుతామని లాంచింగ్ సందర్భంగానే హెచ్‌ఎండీ గ్లోబల్ చెప్పింది.
ఢిల్లీ, ఎన్‌సీఆర్, ముంబై, చెన్నై, ఛండీగర్, జైపూర్, కోల్‌కత్తా, లక్నో, ఇండోర్, హైదరాబాద్, పుణే, అహ్మదాబాద్, కాలికట్ ప్రాంతాల ఆఫ్‌లైన్ మొబైల్ రిటైల్ అవుట్‌లెట్లలో దీన్ని ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు. ఇక నోకియా 6 స్మార్ట్‌ఫోన్‌ను రిజిస్ట్రేషన్ కోసం జూలై 14 నుంచి అమెజాన్‌లో అందుబాటులో ఉంచుతుంది. అయితే నేటి నుంచి ప్రీ-బుకింగ్స్ నిర్వహిస్తున్న నోకియా 5 స్మార్ట్‌ఫోన్‌ను ఎప్పటి నుంచి విక్రయానికి వస్తుందో కంపెనీ స్పష్టం చేయలేదు.
నోకియా 5 ధర, ఇతర వివరాలు..
12,899 రూపాయలకు నోకియా 5 లాంచ్ అయింది. నోకియా 5 కొనుగోలు చేసే వొడాఫోన్ వినియోగదారులకు రూ.142 రీఛార్జ్‌పై 1జీబీ డేటాతో పాటు నెలకు 4జీబీ అదనపు డేటాను అందించనుంది. ఈ ఆఫర్ మూడు నెలలు లేదా మూడు రీఛార్జ్‌లకే వాలిడ్‌లో ఉంటుంది. అదేవిధంగా మేక్‌మైట్రిప్.కామ్‌లో రూ.2500 తగ్గింపును(హోటళ్లపై రూ.1800, దేశీయ విమానాలపై రూ.700 తగ్గింపు) కస్టమర్లు పొందనున్నారు.
నోకియా 5 ఫీచర్లు...
5.2 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే
ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్
క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 430ఎస్‌ఓసీ
2జీబీ ర్యామ్
16జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్
128జీబీ వరకు విస్తరణ మెమరీ
13ఎంపీ బ్యాక్ కెమెరా
8ఎంపీ ఫ్రంట్ కెమెరా
3000ఎంఏహెచ్ బ్యాటరీ
Advertisement
Advertisement