Nokia 5
-
నోకియా ఫోన్‌పై రూ.8వేలు తగ్గింపు
నోకియా 5, నోకియా 8 స్మార్ట్ఫోన్లపై భారత్‌లో హెచ్ఎండీ గ్లోబల్ ధరలు తగ్గించింది. నోకియా 8 స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా 8 వేల రూపాయల ధర తగ్గించి రూ.28,999కు తీసుకొచ్చింది. ఈ ఫోన్‌ను గతేడాది అక్టోబర్‌లో లాంచ్ చేసినప్పుడు రూ.36,999గా ఉండేది. అంతేకాక నోకియా 5 (3జీబీ వేరియంట్) స్మార్ట్‌ఫోన్‌పై కూడా వెయ్యి రూపాయలు ధర తగ్గించి, రూ.12,499కు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ సమీక్షించిన ధరలు గురువారం నుంచి అమల్లోకి వచ్చాయని కంపెనీ తెలిపింది. త్వరలోనే మొబైల్ వరల్డ్ కాంగ్రెస్(ఎండబ్ల్యూసీ) 2018 జరుగబోతున్న తరుణంలో ఈ రేట్లను తగ్గించింది. నోకియా 5 స్పెషిఫికేషన్లు.. 5.2 అంగుళాల హెచ్డీ ఐపీఎస్ ఎల్సీడీ ప్యానల్ ఆక్టాకోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 430 ఎస్ఓసీ 3 జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 128 జీబీ వరకు విస్తరణ మెమరీ 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ నోకియా 8 స్పెషిఫికేషన్లు.... 5.3 అంగుళాల క్యూహెచ్డీ ఐపీఎస్ డిస్ప్లే ఆండ్రాయిడ్ 8.0 ఓరియో 2.5డీ కర్వ్డ్ గొర్రిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఆక్టా-కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 835 ఎస్ఓసీ 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఆన్‌బోర్డ్ స్టోరేజ్ 256 జీబీ వరకు విస్తరణ మెమరీ 13 మెగాపిక్సెల్ సెన్సార్లతో డ్యూయల్ రియర్ కెమెరా 13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 3090 ఎంఏహెచ్ బ్యాటరీ -
నోకియా 5 సరికొత్త ర్యామ్ వేరియంట్
నోకియా 5లో 3జీబీ ర్యామ్ వేరియంట్‌ను హెచ్ఎండీ గ్లోబల్ సోమవారం లాంచ్ చేసింది. దీని ధర రూ.13,499గా కంపెనీ పేర్కొంది. నవంబర్ 7 నుంచి ఈ కొత్త 3జీ వేరియంట్ నోకియా 5 స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌క్లూజివ్‌గా ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయానికి వస్తోంది. అనంతరం ఇది నవంబర్ 14 నుంచి ఆఫ్‌లైన్‌గా కూడా అందుబాటులో ఉండనుంది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌ను జియో-నోకియా అదనపు డేటా ఆఫర్‌గా ఫ్లిప్‌కార్ట్ తన ప్లాట్ఫామ్లో లిస్టు చేసింది. ఈ భాగస్వామ్యంలో జియో ప్రతి రూ.309 రీఛార్జ్ లేదా ఆపై మొత్తాలపై అదనంగా 5జీబీ డేటాను 2018 ఆగస్టు 31 వరకు అందించనుంది. మాట్ బ్లాక్, టెంపెడ్ బ్లూ రంగుల్లో ఈ వేరియంట్ లభ్యం కానుందని హెచ్ఎండీ గ్లోబల్ ప్రకటించింది. తొలుత ఏడాది జూన్‌లో నోకియా 5ను హెచ్ఎండీ గ్లోబల్ లాంచ్ చేసింది. ఈ సమయంలో కేవలం 2జీబీ వేరియంట్‌నే మార్కెట్లలోకి ప్రవేశపెట్టింది. ప్రస్తుతం నోకియా 5 3జీబీ వేరియంట్ కూడా అందుబాటులోకి వచ్చేసింది. నోకియా 5 3జీబీ ర్యామ్ వేరియంట్ ఫీచర్లు... ర్యామ్ మినహాయిస్తే మిగిలిన ఫీచర్లన్నీ 3జీబీ ర్యామ్ వేరియంట్‌కు, 2జీబీ ర్యామ్ మోడల్‌కు ఒకే మాదిరిగా ఉండనున్నాయి డ్యూయల్ సిమ్ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్ 5.2 అంగుళాల హెచ్డీ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే 2.5డీ కర్వ్డ్ కార్నింగ్ గొర్రిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఆక్టా-కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 430 ఎస్ఓసీ 3జీబీ ర్యామ్, 16జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ 128జీబీ వరకు విస్తరణ మెమరీ 13 మెగాపిక్సెల్ రియర్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ -
ఇండిపెండెన్స్ డే స్పెషల్‌గా నోకియా 5 సేల్
నోకియా 5 బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ ఎట్టకేలకు కస్టమర్ల చేతిలోకి వచ్చేస్తోంది. గత నెల రోజులుగా చేపట్టిన ప్రీ-ఆర్డర్ల అనంతరం ఈ ఫోన్‌ను దేశవ్యాప్తంగా విక్రయానికి తీసుకురావాలని హెచ్ఎండీ గ్లోబల్ నిర్ణయించింది. స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా ఆగస్టు 15 నుంచి దీన్ని విక్రయించనున్నట్టు హెచ్ఎండీ గ్లోబల్ తెలిపింది. ముందస్తు ఫోన్లకు భిన్నంగా ఎక్స్‌క్లూజివ్‌గా ఆఫ్‌లైన్ రిటైలర్ల వద్దనే ఈ స్మార్ట్‌ఫోన్‌ను అందుబాటులో ఉంచనుంది. దేశవ్యాప్తంగా 10కి పైగా నగరాల్లో ఎంపికచేసిన రిటైల్ అవుట్లెట్లలో ఈ ఫోన్‌ను విక్రయించనున్నామని గాడ్జెట్స్ 360కి హెచ్ఎండీ గ్లోబల్ ధృవీకరించింది. నాలుగు రంగుల్లో ఈ ఫోన్ లాంచ్ అయింది. మేట్ బ్లాక్, సిల్వర్, టెంపెడ్ బ్లూ, కాపర్ రంగుల్లో అందుబాటులో ఉండనుంది. అయితే ప్రస్తుతం కేవలం మేట్ బ్లాక్ కలర్ డివైజ్ మాత్రమే వినియోగదారుల ముందుకు రానుంది. నోకియా 5 విక్రయానికి రానున్న సిటీల్లో ఢిల్లీ ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు, చెన్నై, ఛండీఘర్, జైపూర్, కోల్కత్తా, లక్నో, ఇండోర్, హైదరాబాద్, పుణే, అహ్మదాబాద్, కాలికట్‌లు ఉన్నాయి. ఇంకా మరిన్ని నగరాల్లో మున్ముందు అందుబాటులోకి తీసుకొస్తామని కంపెనీ తెలిపింది. మరోవైపు నోకియా 6 స్మార్ట్‌ఫోన్ కూడా ఎక్స్‌క్లూజివ్‌గా అమెజాన్‌లో విక్రయానికి వస్తోంది. ఇప్పటికే దీని రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభమయ్యాయి. ఆగస్టు 23 నుంచి మొదటి అమ్మకం ప్రారంభం కానుంది. నోకియా 5 ధర, లాంచ్ ఆఫర్లు నోకియా 5 స్మార్ట్‌ఫోన్ ధర 12,499 రూపాయలు. ఇప్పటికే కొన్ని లాంచ్ ఆఫర్లను హెచ్ఎండీ గ్లోబల్ రివీల్ చేసింది. నెలకు రూ.149 రీఛార్జ్‌తో వొడాఫోన్ కస్టమర్లకు నెలకు 5జీబీ డేటాను ఇవ్వనుంది. ఇలా ఈ స్మార్ట్‌ఫోన్‌పై 3 నెలల పాటు అందించనుంది. మేక్మైట్రిప్. కామ్‌లో రూ.2500 తగ్గింపును(హోటల్స్‌పై 1,800 రూపాయల తగ్గింపు, దేశీయ విమానాలపై రూ.700 తగ్గింపు) వినియోగదారులు పొందనున్నారు. నోకియా 5 స్పెషిఫికేషన్లు, ఫీచర్లు 5.2 అంగుళాల హెచ్డీ డిస్ప్లే ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 430 ఎస్ఓసీ 2జీబీ ర్యామ్ 16జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ 128జీబీ వరకు విస్తరణ మెమరీ 13 మెగాపిక్సెల్ వెనుక కెమెరా 8 మెగాపిక్సెల్ ముందు కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ -
నేటి నుంచి నోకియా ఫోన్ ప్రీ-బుకింగ్స్
నోకియా బ్రాండులో మూడు స్మార్ట్ఫోన్లను ముచ్చటగా ఒకేసారి హెచ్ఎండీ గ్లోబల్ గత నెలలో భారత్ మార్కెట్లోకి లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ స్మార్ట్ఫోన్లలో ఒకటైన నోకియా 3 మార్కెట్లో అందుబాటులో ఉంది. మిగతా రెండు నోకియా 5, నోకియా 6 స్మార్ట్ఫోన్లు ఇంకా అందుబాటులోకి రావాల్సి ఉంది. ప్రస్తుతం నోకియా 5 స్మార్ట్‌ఫోన్ ప్రీ-బుకింగ్‌లను కంపెనీ నేటి నుంచి చేపడుతోంది. ఆఫ్లైన్గానే ఈ ఫోన్‌ను కూడా హెచ్ఎండీ గ్లోబల్ విక్రయించనుంది. ఎంపికచేసిన రిటైల్ అవుట్లెట్లలోనే ఈ ఫోన్‌ను ప్రీబుకింగ్ల కోసం అందుబాటులో ఉంచుతామని లాంచింగ్ సందర్భంగానే హెచ్ఎండీ గ్లోబల్ చెప్పింది. ఢిల్లీ, ఎన్సీఆర్, ముంబై, చెన్నై, ఛండీగర్, జైపూర్, కోల్కత్తా, లక్నో, ఇండోర్, హైదరాబాద్, పుణే, అహ్మదాబాద్, కాలికట్ ప్రాంతాల ఆఫ్‌లైన్ మొబైల్ రిటైల్ అవుట్లెట్లలో దీన్ని ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు. ఇక నోకియా 6 స్మార్ట్‌ఫోన్‌ను రిజిస్ట్రేషన్ కోసం జూలై 14 నుంచి అమెజాన్‌లో అందుబాటులో ఉంచుతుంది. అయితే నేటి నుంచి ప్రీ-బుకింగ్స్ నిర్వహిస్తున్న నోకియా 5 స్మార్ట్‌ఫోన్‌ను ఎప్పటి నుంచి విక్రయానికి వస్తుందో కంపెనీ స్పష్టం చేయలేదు. నోకియా 5 ధర, ఇతర వివరాలు.. 12,899 రూపాయలకు నోకియా 5 లాంచ్ అయింది. నోకియా 5 కొనుగోలు చేసే వొడాఫోన్ వినియోగదారులకు రూ.142 రీఛార్జ్‌పై 1జీబీ డేటాతో పాటు నెలకు 4జీబీ అదనపు డేటాను అందించనుంది. ఈ ఆఫర్ మూడు నెలలు లేదా మూడు రీఛార్జ్‌లకే వాలిడ్‌లో ఉంటుంది. అదేవిధంగా మేక్మైట్రిప్.కామ్‌లో రూ.2500 తగ్గింపును(హోటళ్లపై రూ.1800, దేశీయ విమానాలపై రూ.700 తగ్గింపు) కస్టమర్లు పొందనున్నారు. నోకియా 5 ఫీచర్లు... 5.2 అంగుళాల హెచ్డీ డిస్ప్లే ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 430ఎస్ఓసీ 2జీబీ ర్యామ్ 16జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ 128జీబీ వరకు విస్తరణ మెమరీ 13ఎంపీ బ్యాక్ కెమెరా 8ఎంపీ ఫ్రంట్ కెమెరా 3000ఎంఏహెచ్ బ్యాటరీ -
నోకియా కొత్త ఫోన్లు వచ్చేస్తున్నాయ్!
స్మార్ట్ ఫోన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నోకియా కొత్త ఫోన్లు మన మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. నోకియా 6, నోకియా 5, నోకియా 3 స్మార్ట్ ఫోన్లను ఈ నెల 13వ న్యూఢిల్లీ వేదికగా భారత్ లో లాంచ్ చేయనున్నట్టు హెచ్ఎండీ గ్లోబల్ ప్రకటించింది. ఈ ఫోన్లు లాంచింగ్ ఈవెంట్ కు ఆహ్వానాలను కూడా కంపెనీ పంపిస్తోంది. నోకియా బ్రాండ్ హ్యాండ్ సెట్లను రూపొందించడానికి, డిజైన్ కు సంబంధించి ఫిన్నిస్ కంపెనీ హెచ్ఎండీ గ్లోబల్ కు గతేడాదే వాటి లైన్సెన్సులను సంపాదించుకుంది. ఇటీవలే నోకియా ఐకానిక్ ఫీచర్ ఫోన్ 3310ను హెచ్ఎండీ గ్లోబల్ ఇండియా మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఫిబ్రవరిలో జరిగిన ఎండబ్ల్యూసీ 2017లో హెచ్ఎండీ గ్లోబల్ ఈ కొత్త ఫోన్లను ఆవిష్కరించింది. అప్పటి నుంచి ఈ కొత్త ఫోన్లను జూన్ లోనే భారత్ లోకి ప్రవేశపెడతారంటూ రూమర్లు చక్కర్లు కొట్టాయి. ప్రస్తుతం ఈ రూమర్లను నిజం చేస్తూ ఈ మూడు ఫోన్లను జూన్ లో విడుదల చేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. నోకియా 6... నోకియా ఆండ్రాయిడ్ రేంజ్ లో నోకియా 6 టాప్ లైన్ మోడల్. 5.5 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ ప్లే, గొర్రిల్లా గ్లాస్ 3, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 256 జీబీ వరకు విస్తరణ మెమరీ, ముందు వైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3జీబీ ర్యామ్, స్నాప్ డ్రాగన్ 430 ప్రాసెసర్, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, 16ఎంపీ రియర్ కెమెరా, 8ఎంపీ సెల్ఫీ షూటర్ దీనిలో ఉంటాయని తెలుస్తోంది. నోకియా 5... గొర్రిల్లా గ్లాస్ తో 5.2 అంగుళాల 720పీ హెచ్డీ డిస్ ప్లేను ఇది కలిగిఉంటుందని, 16జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 256జీబీ వరకు విస్తరణ మెమరీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్, స్నాప్ డ్రాగన్ 430 ప్రాసెసర్, 2జీబీ ర్యామ్, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, 13ఎంపీ ప్రైమరీ కెమెరా, 8ఎంపీ ఫ్రంట్ షూటర్ ఈ ఫోన్లో ఫీచర్లు. నోకియా 3... 5.0 అంగుళాల 720పీ హెచ్డీ డిస్ ప్లే, 16జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 256జీబీ వరకు విస్తరణ మెమరీ, 2జీబీ ర్యామ్, 2650 ఎంఏహెచ్ బ్యాటరీ, 8ఎంపీ రియర్, ఫ్రంట్ కెమెరాలు ఈ ఫోన్ లో ఉండబోయే ఫీచర్లు. ఈ మూడు డివైజ్ ల ధరలు కూడా 17,600 రూపాయలు, 13,300 రూపాయలు, 9,800 రూపాయలుగా ఉండబోతున్నాయని అంచనాలు వస్తున్నాయి.