నోకియా కొత్త ఫోన్లు వచ్చేస్తున్నాయ్!
నోకియా కొత్త ఫోన్లు వచ్చేస్తున్నాయ్!
Published Sat, Jun 3 2017 3:15 PM | Last Updated on Tue, Sep 5 2017 12:44 PM
స్మార్ట్ ఫోన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నోకియా కొత్త ఫోన్లు మన మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. నోకియా 6, నోకియా 5, నోకియా 3 స్మార్ట్ ఫోన్లను ఈ నెల 13వ న్యూఢిల్లీ వేదికగా భారత్ లో లాంచ్ చేయనున్నట్టు హెచ్ఎండీ గ్లోబల్ ప్రకటించింది. ఈ ఫోన్లు లాంచింగ్ ఈవెంట్ కు ఆహ్వానాలను కూడా కంపెనీ పంపిస్తోంది. నోకియా బ్రాండ్ హ్యాండ్ సెట్లను రూపొందించడానికి, డిజైన్ కు సంబంధించి ఫిన్నిస్ కంపెనీ హెచ్ఎండీ గ్లోబల్ కు గతేడాదే వాటి లైన్సెన్సులను సంపాదించుకుంది.
ఇటీవలే నోకియా ఐకానిక్ ఫీచర్ ఫోన్ 3310ను హెచ్ఎండీ గ్లోబల్ ఇండియా మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఫిబ్రవరిలో జరిగిన ఎండబ్ల్యూసీ 2017లో హెచ్ఎండీ గ్లోబల్ ఈ కొత్త ఫోన్లను ఆవిష్కరించింది. అప్పటి నుంచి ఈ కొత్త ఫోన్లను జూన్ లోనే భారత్ లోకి ప్రవేశపెడతారంటూ రూమర్లు చక్కర్లు కొట్టాయి. ప్రస్తుతం ఈ రూమర్లను నిజం చేస్తూ ఈ మూడు ఫోన్లను జూన్ లో విడుదల చేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది.
నోకియా 6... నోకియా ఆండ్రాయిడ్ రేంజ్ లో నోకియా 6 టాప్ లైన్ మోడల్. 5.5 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ ప్లే, గొర్రిల్లా గ్లాస్ 3, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 256 జీబీ వరకు విస్తరణ మెమరీ, ముందు వైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3జీబీ ర్యామ్, స్నాప్ డ్రాగన్ 430 ప్రాసెసర్, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, 16ఎంపీ రియర్ కెమెరా, 8ఎంపీ సెల్ఫీ షూటర్ దీనిలో ఉంటాయని తెలుస్తోంది.
నోకియా 5... గొర్రిల్లా గ్లాస్ తో 5.2 అంగుళాల 720పీ హెచ్డీ డిస్ ప్లేను ఇది కలిగిఉంటుందని, 16జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 256జీబీ వరకు విస్తరణ మెమరీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్, స్నాప్ డ్రాగన్ 430 ప్రాసెసర్, 2జీబీ ర్యామ్, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, 13ఎంపీ ప్రైమరీ కెమెరా, 8ఎంపీ ఫ్రంట్ షూటర్ ఈ ఫోన్లో ఫీచర్లు.
నోకియా 3... 5.0 అంగుళాల 720పీ హెచ్డీ డిస్ ప్లే, 16జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 256జీబీ వరకు విస్తరణ మెమరీ, 2జీబీ ర్యామ్, 2650 ఎంఏహెచ్ బ్యాటరీ, 8ఎంపీ రియర్, ఫ్రంట్ కెమెరాలు ఈ ఫోన్ లో ఉండబోయే ఫీచర్లు.
ఈ మూడు డివైజ్ ల ధరలు కూడా 17,600 రూపాయలు, 13,300 రూపాయలు, 9,800 రూపాయలుగా ఉండబోతున్నాయని అంచనాలు వస్తున్నాయి.
Advertisement
Advertisement