Nokia 3
-
రూ.4,999కే నోకియా స్మార్ట్‌ఫోన్
ఇంటెల్, శాంసంగ్, సెల్కాన్, ఇంటెక్స్‌తో భాగస్వామ్యం ఏర్పరుచుకున్న అనంతరం టెలికాం దిగ్గజం ఎయిర్టెల్, గ్లోబల్ దిగ్గజం హెచ్ఎండీ గ్లోబల్‌తో జతకట్టింది. ఈ భాగస్వామ్యంలో నోకియా స్మార్ట్ఫోన్లపై 2వేల రూపాయల వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్ చేస్తోంది. 'మేరా పెహ్లా స్మార్ట్‌ఫోన్' ఆఫర్ కింద నోకియా 2, నోకియా 3 స్మార్ట్ఫోన్లపై ఈ క్యాష్‌బ్యాక్‌ను అందించనున్నట్టు ఎయిర్టెల్ తెలిపింది. దీంతో నోకియా 2 స్మార్ట్‌ఫోన్ అత్యంత తక్కువగా 4,999 రూపాయలకే అందుబాటులోకి వచ్చింది. నోకియా 3 స్మార్ట్‌ఫోన్ ధర కూడా 7,499 రూపాయలకు దిగొచ్చింది. ఈ ఆఫర్‌తో పాటు 169 రూపాయల ప్యాక్‌ను ఎయిర్టెల్ తీసుకొచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో నోకియా 2 స్మార్ట్‌ఫోన్ రూ.6,999కు, నోకియా 3 స్మార్ట్‌ఫోన్ రూ.9,499కు అందుబాటులో ఉన్నాయి. అయితే ఎయిర్టెల్ ఈ క్యాష్‌బ్యాక్‌ను రెండు వాయిదాల్లో కస్టమర్లకు ఆఫర్ చేయనుంది. తొలిసారి 18 నెలల కాలంలో 500 రూపాయలను అందివనుంది. మిగతా మొత్తం అంటే 1500 రూపాయలను 36 నెలలో చెల్లించనుంది. అయితే ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవడానికి కస్టమర్లు తమ సిమ్ కార్డుపై 18 నెలల కాలంలో కనీసం 3500 రూపాయల రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. మరో 19 నుంచి 36 నెలల కాలంలో మరో 3500 రూపాయలతో రీఛార్జ్ చేసుకోవాలి. ఎయిర్టెల్ అందిస్తున్న రూ.169 ప్రీపెయిడ్ ప్యాక్‌పై రోజుకు 1జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు 28 రోజుల పాటు వాలిడ్‌లో ఉండనున్నాయి. -
నోకియా 3 స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా?
హెచ్ఎండీ గ్లోబల్ ఇటీవల కొత్తగా లాంచ్ చేసిన నోకియా 3 స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ ఫోన్ ఇప్పుడు మీ పక్కనున్న మొబైల్ స్టోర్లలోకి వచ్చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ షాపుల్లో నోకియా అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ ధర 9,499 రూపాయలు. నోకియా 3 స్మార్ట్ ఫోన్ తో పాటు నోకియా 5, నోకియా 6 స్మార్ట్ ఫోన్లను కూడా హెచ్ఎండీ గ్లోబల్ ఈ వారం మొదట్లో లాంచ్ చేసింది. లాంచింగ్ సందర్భంగానే నోకియా 3 స్మార్ట్ ఫోన్ ను జూన్ 16 నుంచి ఆఫ్ లైన్ విక్రయానికి తీసుకురాబోతున్నామని కంపెనీ పేర్కొంది. ఇతర రెండు ఫోన్లు నోకియా 5 జూలై 7న మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుండగా.. నోకియా 6 జూలై 14న విక్రయానికి వస్తోంది. దేశవ్యాప్తంగా 80,000 రిటైల్ స్టోర్లలో ఈ ఫోన్లను అందుబాటులో ఉంచేందుకు గాను 400 డిస్ట్రిబ్యూటర్లను హెచ్ఎండి గ్లోబల్ అపాయింట్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా నోకియా మొబైల్ కేర్ సర్వీసును 300 నగరాలకు హెచ్ఎండి గ్లోబల్ విస్తరించినట్లు తెలుస్తోంది. బడ్జెట్ లో నోకియా 3 లాంచ్ అయింది. నోకియా 3 స్మార్ట్ ఫోన్ ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి... 5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్) విత్ 2.5డి కర్వ్డ్ గ్లాస్ డిస్ ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.0 నోగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్-కోర్ 1.3గిగాహెడ్జ్ ప్రాసెసర్, 2జీబీ ర్యామ్, 16జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ , మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబీ వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రియర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై, ఎన్ఎఫ్సీ సపోర్ట్, మైక్రో యూఎస్బీ, 2650 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యూయల్ దీనిలో ఫీచర్లు. అందుబాటులో ఉండే రంగులు (సిల్వర్ వైట్, మాటీ బ్లాక్, టెంపర్డ్ బ్లూ, కాపర్ వైట్). -
నోకియా కొత్త ఫోన్లు వచ్చేస్తున్నాయ్!
స్మార్ట్ ఫోన్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న నోకియా కొత్త ఫోన్లు మన మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. నోకియా 6, నోకియా 5, నోకియా 3 స్మార్ట్ ఫోన్లను ఈ నెల 13వ న్యూఢిల్లీ వేదికగా భారత్ లో లాంచ్ చేయనున్నట్టు హెచ్ఎండీ గ్లోబల్ ప్రకటించింది. ఈ ఫోన్లు లాంచింగ్ ఈవెంట్ కు ఆహ్వానాలను కూడా కంపెనీ పంపిస్తోంది. నోకియా బ్రాండ్ హ్యాండ్ సెట్లను రూపొందించడానికి, డిజైన్ కు సంబంధించి ఫిన్నిస్ కంపెనీ హెచ్ఎండీ గ్లోబల్ కు గతేడాదే వాటి లైన్సెన్సులను సంపాదించుకుంది. ఇటీవలే నోకియా ఐకానిక్ ఫీచర్ ఫోన్ 3310ను హెచ్ఎండీ గ్లోబల్ ఇండియా మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఫిబ్రవరిలో జరిగిన ఎండబ్ల్యూసీ 2017లో హెచ్ఎండీ గ్లోబల్ ఈ కొత్త ఫోన్లను ఆవిష్కరించింది. అప్పటి నుంచి ఈ కొత్త ఫోన్లను జూన్ లోనే భారత్ లోకి ప్రవేశపెడతారంటూ రూమర్లు చక్కర్లు కొట్టాయి. ప్రస్తుతం ఈ రూమర్లను నిజం చేస్తూ ఈ మూడు ఫోన్లను జూన్ లో విడుదల చేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది. నోకియా 6... నోకియా ఆండ్రాయిడ్ రేంజ్ లో నోకియా 6 టాప్ లైన్ మోడల్. 5.5 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ ప్లే, గొర్రిల్లా గ్లాస్ 3, 32జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 256 జీబీ వరకు విస్తరణ మెమరీ, ముందు వైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్, 3జీబీ ర్యామ్, స్నాప్ డ్రాగన్ 430 ప్రాసెసర్, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, 16ఎంపీ రియర్ కెమెరా, 8ఎంపీ సెల్ఫీ షూటర్ దీనిలో ఉంటాయని తెలుస్తోంది. నోకియా 5... గొర్రిల్లా గ్లాస్ తో 5.2 అంగుళాల 720పీ హెచ్డీ డిస్ ప్లేను ఇది కలిగిఉంటుందని, 16జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 256జీబీ వరకు విస్తరణ మెమరీ, ఫింగర్ ప్రింట్ సెన్సార్, స్నాప్ డ్రాగన్ 430 ప్రాసెసర్, 2జీబీ ర్యామ్, 3000 ఎంఏహెచ్ బ్యాటరీ, 13ఎంపీ ప్రైమరీ కెమెరా, 8ఎంపీ ఫ్రంట్ షూటర్ ఈ ఫోన్లో ఫీచర్లు. నోకియా 3... 5.0 అంగుళాల 720పీ హెచ్డీ డిస్ ప్లే, 16జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 256జీబీ వరకు విస్తరణ మెమరీ, 2జీబీ ర్యామ్, 2650 ఎంఏహెచ్ బ్యాటరీ, 8ఎంపీ రియర్, ఫ్రంట్ కెమెరాలు ఈ ఫోన్ లో ఉండబోయే ఫీచర్లు. ఈ మూడు డివైజ్ ల ధరలు కూడా 17,600 రూపాయలు, 13,300 రూపాయలు, 9,800 రూపాయలుగా ఉండబోతున్నాయని అంచనాలు వస్తున్నాయి.