నోకియా 3 స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా?
నోకియా 3 స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా?
Published Sat, Jun 17 2017 6:44 PM | Last Updated on Tue, Sep 5 2017 1:52 PM
హెచ్ఎండీ గ్లోబల్ ఇటీవల కొత్తగా లాంచ్ చేసిన నోకియా 3 స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా? అయితే ఈ ఫోన్ ఇప్పుడు మీ పక్కనున్న మొబైల్ స్టోర్లలోకి వచ్చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న రిటైల్ షాపుల్లో నోకియా అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్ ఫోన్ ధర 9,499 రూపాయలు. నోకియా 3 స్మార్ట్ ఫోన్ తో పాటు నోకియా 5, నోకియా 6 స్మార్ట్ ఫోన్లను కూడా హెచ్ఎండీ గ్లోబల్ ఈ వారం మొదట్లో లాంచ్ చేసింది. లాంచింగ్ సందర్భంగానే నోకియా 3 స్మార్ట్ ఫోన్ ను జూన్ 16 నుంచి ఆఫ్ లైన్ విక్రయానికి తీసుకురాబోతున్నామని కంపెనీ పేర్కొంది.
ఇతర రెండు ఫోన్లు నోకియా 5 జూలై 7న మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుండగా.. నోకియా 6 జూలై 14న విక్రయానికి వస్తోంది. దేశవ్యాప్తంగా 80,000 రిటైల్ స్టోర్‌లలో ఈ ఫోన్‌లను అందుబాటులో ఉంచేందుకు గాను 400 డిస్ట్రిబ్యూటర్లను హెచ్‌ఎండి గ్లోబల్ అపాయింట్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా నోకియా మొబైల్ కేర్ సర్వీసును 300 నగరాలకు హెచ్‌ఎండి గ్లోబల్ విస్తరించినట్లు తెలుస్తోంది. బడ్జెట్ లో నోకియా 3 లాంచ్ అయింది.
నోకియా 3 స్మార్ట్ ఫోన్ ఫీచర్లు ఈ విధంగా ఉన్నాయి...
5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్) విత్ 2.5డి కర్వ్డ్ గ్లాస్ డిస్ ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ఆండ్రాయిడ్ 7.0 నోగట్ ఆపరేటింగ్ సిస్టం, క్వాడ్-కోర్ 1.3గిగాహెడ్జ్ ప్రాసెసర్, 2జీబీ ర్యామ్, 16జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ , మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబీ వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ రియర్ ఫేసింగ్ కెమెరా, 8 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, వై-ఫై, ఎన్ఎఫ్సీ సపోర్ట్, మైక్రో యూఎస్బీ, 2650 ఎంఏహెచ్ బ్యాటరీ, డ్యూయల్ దీనిలో ఫీచర్లు. అందుబాటులో ఉండే రంగులు (సిల్వర్ వైట్, మాటీ బ్లాక్, టెంపర్డ్ బ్లూ, కాపర్ వైట్).
Advertisement
Advertisement