స్మార్ట్ ఫోన్ యూజర్లకు బంపర్ ఆఫర్. రియల్ మీ ఇండియా పేరుతో దేశ వ్యాప్తంగా ఆఫ్‌లైన్ స్టోర్లను ప్రారంభిస్తున్నట్లు తెలిపింది.ఇందులో భాగంగా అక్టోబర్ 8,9 తేదీలలో ఎక్స్ క్లూజీవ్ ఆఫర్లు ప్రకటించింది. రియల్ మీ నిర్వహించే ఆఫర్‌లో రూపాయికే పలు గాడ్జెట్స్‌ను అందిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది.
దేశ వ్యాప్తంగా ఆఫ్‌లైన్ స్టోర్లు
ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో విదేశీ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థలు మార్కెట్‌ను విస్తరించే పనిలో పడ్డాయి. ఇప్పటికే ఇండియన్ ఆన్‌లైన్ మార్కెట్‌లో షావోమీ 28 (క్యూ2) శాతం, శాంసంగ్ 18 శాతం, వివో 15 శాతం సేల్స్ తో రాణిస్తున్నాయి. 15 శాతం మార్కెట్ షేర్‌ను పెంచేందుకు రియల్ మీ ఆఫ్‌లైన్ మార్కెట్‌పై కన్నేసింది. గతేదాడి ఆగస్ట్ 20న రియల్ మీ తొలి ఆఫ్‌లైన్ స్టోర్‌ను ప్రారంభించింది. ఇప్పుడు ఆ స్టోర్ల సంఖ్యను పెంచేందుకు కీలక నిర్ణయం తీసుకుంది.
దేశ వ్యాప్తంగా 100 ఆఫ్‌లైన్ స్టోర్లను త్వరలోనే ప్రారంభిస్తున్నట్లు ఇండియా రియల్ మీ సీఈఓ మాధవ్ సేఠ్ ప్రకటించారు. టైర్ 2, టైర్ 3 సిటీస్ తో పాటు అదనంగా గుజరాత్‌లో ఫ్లాగ్ షిప్ స్టోర్(ను ప్రారంభిస్తున్నట్లు చెప్పారు. ఈ ఏడాది చివరి నాటికి దేశంలో 300 రియల్ మీ స్టోర్లను ప్రారంభించే లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. 2022నాటికి ఆ సంఖ్యను 1000 స్టోర్లకు పెంచుతామని తెలిపారు.
Congratulations to the entire #realme family!
— Madhav Sheth (@MadhavSheth1) October 8, 2021
We're launching 100 exclusive realme stores today. I am quite excited, and I hope that all the #realmeFans will enjoy visiting these unique stores as well.#Centurywithrealme pic.twitter.com/dv5iBsx6Zn
ఆఫ్‌లైన్ స్టోర్‌లలో ఏముంటాయ్
రియల్ మీ లాంఛ్ చేయనున్న ఈ రియల్ మీ స్టోర్‌లలో స్మార్ట్ ఫోన్స్, ల్యాప్‌ట్యాప్స్, ట్యాబ్లెట్స్ తో పాటు ఇతర టెక్ గాడ్జెట్స్ ఉంటాయని మాధవ్ సేఠ్ వెల్లడించారు. ఆఫ్‌లైన్ మార్కెట్‌లో కష్టమర్లను అట్రాక్ట్ చేసేందుకు స్టోర్లను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు.
చదవండి: 'మాధవ్ సార్ ఇంకా ఎన్నిరోజులు మమ్మల్ని కాపీ కొడతారు'
Comments
Please login to add a commentAdd a comment