రిలయన్స్ రిటైల్ తన కార్యకలాపాలు విస్తరిస్తోంది. యువతకు ఫ్యాషన్ ఉత్పత్తులను అందించే ‘అజార్ట్’ బ్రాండ్ స్టోర్లను పెంచాలని నిర్ణయించింది. అందులో భాగంగా దేశంలోని ప్రధాన నగరాల్లో 12 కొత్త స్టోర్లను ప్రారంభించినట్లు తెలిపింది. జైపూర్, ఉదయపూర్, రాయ్‌పూర్, దెహ్రాదూన్, గోరఖ్‌పూర్, రాంచీ, బెంగళూరులోని వివిధ ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.
ఇప్పటికే బెంగళూరులో అజార్ట్ బ్రాండ్ పేరుతో స్టోర్లను ప్రారంభించిన రిలయన్స్ రిటైల్ వీటి సంఖ్యను ఐదుకు పెంచింది. ఈ సందర్భంగా రిలయన్స్ రిటైల్ ఫ్యాషన్, లైఫ్‌స్టైల్ సీఈఓ అఖిలేష్ ప్రసాద్ మాట్లాడుతూ..‘అజార్ట్ బ్రాండ్‌ను 2022లో స్థాపించాం. క్రమంగా బ్రాండ్ కార్యకలాపాలు విస్తరిస్తున్నాం. యువత నుంచి ఈ బ్రాండ్‌కు ఆదరణ పెరుగుతోంది. టైర్ 2, టైర్ 3 నగరాల్లో ఈ బ్రాండ్ యువతకు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాం. వినియోగదారుల జీవనశైలిని ప్రతిబింబించేలా, మెరుగైన షాపింగ్ అనుభవాన్ని అందించేలా కంపెనీ పనిచేస్తోంది’ అన్నారు.
ఇదీ చదవండి: పాలసీదారుల డేటా లీక్..! ఐటీ సిస్టమ్‌ల ఆడిట్
పండగ సీజన్‌లో చాలా కంపెనీలు తమ వ్యాపారాలు విస్తరించాలని యోచిస్తుంటాయి. ఫెస్టివల్ నేపథ్యంలో తమ బ్రాండ్ ఉత్పత్తులకు ఆదరణ ఉంటుందని నమ్ముతాయి. కంపెనీ ఉత్పత్తులు వినియోగదారులకు నచ్చితే తదుపరి గిరాకీ ఏర్పడుతుందని భావిస్తాయి.
Comments
Please login to add a commentAdd a comment