
రిలయన్స్ రిటైల్ తన వినియోగదారులకు మరిన్ని బ్రాండ్లను చేరువ చేసేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్ సమీపంలో నాగోల్-అల్కపురి క్రాస్ రోడ్ వద్ద కొత్తగా ‘యూస్టా’ ఫ్యాషన్ బ్రాండ్ స్టోర్‌ను ప్రారంభించింది. ఇప్పటికే దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ స్టోర్లు ఉన్నాయని కంపెనీ అధికారులు తెలిపారు. దక్షిణ భారతదేశంలో మరింతగా తమ వ్యాపారాన్ని విస్తరించేందుకు సంస్థ ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు.
దేశంలోని యువత అధికంగా ఇష్టపడే స్టైల్స్‌లో విభిన్న మోడల్స్‌ను యూస్టా అందిస్తోందన్నారు. ప్రస్తుతం యూస్టా స్టోర్స్ మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో విస్తరించినట్లు చెప్పారు. ప్రీమియం మోడల్స్‌తోపాటు సామాన్యులకు అందుబాటు ధరల్లో ఫ్యాషన్ ఉత్పత్తులను అందిస్తున్నట్లు చెప్పారు.
ఇదీ చదవండి: ‘బంగారం’లాంటి అవకాశం.. తులం ఎంతంటే..
యువతను ఆకర్షించేలా చాలా ఫ్యాషన్ రిటైల్ కంపెనీలు తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి. అందుబాటు దరల్లోనే తమ ఉత్పత్తులను అందిస్తున్నాయి. గార్మెంట్ పరిశ్రమ కూడా స్థానికంగా ఎంతో వృద్ధి చెందుతోంది. ఈ రంగంలో ఇతర దేశాలకు చేసే ఎగుమతులు అధికమవుతున్నాయి. స్థానికంగా మంచి ఉత్పత్తులు అందిస్తే సంస్థల బ్రాండ్‌కు ఆదరణ పెరుగుతుందని కంపెనీలు భావిస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment