నోకియా 3, నోకియా 2 స్మార్ట్‌ఫోన్లు (ఫైల్ ఫోటో)
ఇంటెల్, శాంసంగ్, సెల్‌కాన్, ఇంటెక్స్‌తో భాగస్వామ్యం ఏర్పరుచుకున్న అనంతరం టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్, గ్లోబల్ దిగ్గజం హెచ్‌ఎండీ గ్లోబల్‌తో జతకట్టింది. ఈ భాగస్వామ్యంలో నోకియా స్మార్ట్‌ఫోన్లపై 2వేల రూపాయల వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్ చేస్తోంది. 'మేరా పెహ్లా స్మార్ట్‌ఫోన్' ఆఫర్ కింద నోకియా 2, నోకియా 3 స్మార్ట్‌ఫోన్లపై ఈ క్యాష్‌బ్యాక్‌ను అందించనున్నట్టు ఎయిర్‌టెల్ తెలిపింది. దీంతో నోకియా 2 స్మార్ట్‌ఫోన్ అత్యంత తక్కువగా 4,999 రూపాయలకే అందుబాటులోకి వచ్చింది. నోకియా 3 స్మార్ట్‌ఫోన్ ధర కూడా 7,499 రూపాయలకు దిగొచ్చింది. ఈ ఆఫర్‌తో పాటు 169 రూపాయల ప్యాక్‌ను ఎయిర్‌టెల్ తీసుకొచ్చింది. ప్రస్తుతం మార్కెట్‌లో నోకియా 2 స్మార్ట్‌ఫోన్ రూ.6,999కు, నోకియా 3 స్మార్ట్‌ఫోన్ రూ.9,499కు అందుబాటులో ఉన్నాయి.
అయితే ఎయిర్‌టెల్ ఈ క్యాష్‌బ్యాక్‌ను రెండు వాయిదాల్లో కస్టమర్లకు ఆఫర్ చేయనుంది. తొలిసారి 18 నెలల కాలంలో 500 రూపాయలను అందివనుంది. మిగతా మొత్తం అంటే 1500 రూపాయలను 36 నెలలో చెల్లించనుంది. అయితే ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవడానికి కస్టమర్లు తమ సిమ్ కార్డుపై 18 నెలల కాలంలో కనీసం 3500 రూపాయల రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. మరో 19 నుంచి 36 నెలల కాలంలో మరో 3500 రూపాయలతో రీఛార్జ్ చేసుకోవాలి. ఎయిర్‌టెల్ అందిస్తున్న రూ.169 ప్రీపెయిడ్ ప్యాక్‌పై రోజుకు 1జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు 28 రోజుల పాటు వాలిడ్‌లో ఉండనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment