Nokia smartphones
-
Nokia C99: నోకియా నుంచి సరికొత్త మొబైల్: ప్రత్యర్థులకు చుక్కలే..
ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీలతో ఆధునిక స్మార్ట్ఫోన్లు విడుదలవుతున్నాయి. ఇలాంటి వాటినే వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడుతున్నారు. కాగా ఇప్పుడు నోకియా కంపెనీ ఒక లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తోంది. శామ్సంగ్, వన్‌ప్లస్, రియల్మీ మొదలైన వాటికి గట్టి పోటీ ఇవ్వడానికి నోకియా సీ99 స్మార్ట్‌ఫోన్ విడుదలకానుంది. బార్సిలోనాలో జరిగిన ఏండబ్ల్యుసి 2023 ఈవెంట్లో 'నోకియా సీ99' అడుగుపెట్టింది. అప్పటి నుంచి ఈ మొబైల్ ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ వంటివి ఒక్కొక్కటిగా లీక్ అవుతూనే ఉన్నాయి. అయితే ఈ మొబైల్ మార్కెట్లో ఎప్పుడు అధికారికంగా విడుదలవుతుందనే విషయం వెల్లడి కాలేదు. నోకియా సీ99 ధరలు కూడా కంపెనీ వెల్లడించలేదు, కానీ దీని ధర సుమారు 480 డాలర్ల వరకు ఉంటుందని అంచనా. అంటే భారతీయ కరెన్సీ ప్రకారం దాదాపు రూ. 36,000 కంటే ఎక్కువే. ఈ స్మార్ట్‌ఫోన్ 6.7 ఇంచెస్ డిస్ప్లే, లేటెస్ట్ హై ఎండ్ చిప్సెట్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్, 144 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, 180డబ్ల్యు ఫాస్ట్ ఛార్జింగ్ వంటివి పొందుతుంది. (ఇదీ చదవండి: గ్రేట్ ఆఫర్: రూ. 22,999కే ఐఫోన్ సొంతం చేసుకోండి: కానీ..!) కొత్త నోకియా సీ99 స్మార్ట్‌ఫోన్‌లోని స్నాప్‌డ్రాగన్ చిప్సెట్ గరిష్టంగా 16GB RAMతో జత చేయవచ్చు. ఈ సరికొత్త మొబైల్ గురించి తెలియాల్సిన వివరాలు చాలానే ఉన్నాయి. కాగా ఇది దేశీయ మార్కెట్లో ఎప్పుడు విడుదలవుతుందనేది త్వరలో తెలుస్తుంది. -
నోకియా 3 స్మార్ట్ఫోన్లు, ఫీచర్లు అదుర్స్...
సాక్షి, న్యూఢిల్లీ : నోకియా బ్రాండ్ స్మార్ట్ ఫోన్లను ఉత్పత్తి చేస్తున్న హెచ్ఎండీ గ్లోబల్ కంపెనీ మరింత దూకుడుగా దూసుకెళ్లోంది. ఫిబ్రవరి నెలలో మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ వేదికగా విడుదల చేసిన మూడు కొత్త నోకియా బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లను హెచ్ఎండీ గ్లోబల్ నేడు భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. నోకియా 6 (2018), నోకియా 7 ప్లస్, నోకియా 8 సిరోకో పేర్లతో ఈ స్మార్ట్ఫోన్లను వినియోగదారుల ముందుకు తీసుకొచ్చింది. నోకియా 8 సిరోకో ధర, ఆఫర్లు.... నోకియా 8 సిరోకో ధర రూ.49,999గా కంపెనీ నిర్ణయించింది. ఈ ఫోన్‌ను ఏప్రిల్ 20 నుంచి ఎంపిక చేసిన రిటైల్ స్టోర్లలో, ఫ్లిప్‌కార్ట్, నోకియా సొంత ఆన్లైన్ స్టోర్లలో ప్రీ-బుక్ చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది. ఈ ఫోన్‌పై ఎయిర్టెల్ అదనపు డేటా ప్రయోజనాలను ప్రకటించింది. ఈ ఫోన్ కొనుగోలు చేసే కస్టమర్లకు 120జీబీ డేటా అందించనున్నట్టు తెలిపింది.రూ.199, రూ.349 మొత్తాల తొలి ఆరు రీఛార్జ్‌లపై 20జీబీ చొప్పున ఈ అదనపు డేటా అందించనుంది. అదే పోస్టు పెయిడ్ యూజర్లకైతే, రూ.399, రూ.499 ప్లాన్లపై ఆరు నెలల పాటు ఈ మొత్తాన్ని ఆఫర్ చేయనుంది. దీనిలోనే 2018 డిసెంబర్ 31 వరకు ఎయిర్టెల్ టీవీ యాప్ ఉచిత సబ్స్క్రిప్షన్ ఉండనుంది. ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్లకు 5 శాతం క్యాష్‌బ్యాక్ లభించనుంది. నోకియా 8 సిరోకో ఫీచర్లు... 5.5 ఇంచ్ క్యూహెచ్డీ పీఓలెడ్ డిస్ప్లే 2560 x 1440 పిక్సెల్స్ రిజల్యూషన్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ వన్ 6 జీబీ ర్యామ్ 128 జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్‌కు అవకాశం లేదు 12+13 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 5 ఎంపీ సెల్ఫీ కెమెరా 3260 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్. నోకియా 7 ప్లస్ ధర, ఆఫర్లు... ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.25,999గా కంపెనీ పేర్కొంది. ఏప్రిల్ 20 నుంచి నోకియా వెబ్సైట్, అమెజాన్ ఇండియా, ఎంపిక చేసిన రిటైల్ అవుట్లెట్లలో ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రీ-బుక్ చేసుకోవచ్చు. ఎయిర్టెల్ యూజర్లకు ఈ స్మార్ట్‌ఫోన్‌పై రూ.2000 వరకు క్యాష్‌బ్యాక్ లభించనుంది. ఎయిర్టెల్ టీవీ యాప్ సబ్స్క్రిప్షన్ కూడా ఆఫర్ చేయనుంది. ఐసీఐసీఐ బ్యాంకు కస్టమర్లకూ ఈ స్మార్ట్‌ఫోన్‌పై 5 శాతం క్యాష్‌బ్యాక్ లభించనుంది. నోకియా 7 ప్లస్ ఫీచర్లు 6 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 660 ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 8.1 ఓరియో 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ 256 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్ 12+13 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరా 16 ఎంపీ సెల్ఫీ కెమెరా 3800 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్ నోకియా 6 కొత్త ఫోన్ ధర, ఆఫర్లు... నోకియా 6 కొత్త ఫోన్ ధర రూ.16,999గా కంపెనీ తెలిపింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 6 నుంచి నోకియా షాపు, దిగ్గజ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై కూడా రూ.2000 క్యాష్‌బ్యాక్‌ను ఎయిర్టెల్ ఆఫర్ చేస్తోంది. ఎయిర్టెల్ టీవీ సబ్స్క్రిప్షన్ కూడా ఈ ఫోన్ కొనుగోలుదారులకు లభించనుంది. మేక్మైట్రిప్ హోటల్ బుకింగ్స్‌పై ఈ ఫోన్ యూజర్లు డిస్కౌంట్ పొందుతారు. నోకియా 6 కొనుగోలుదారులకు 12 నెలల కాంప్లిమెంటరీ యాక్సిడెంటల్ డ్యామేజ్ ఇన్సూరెన్స్ అందుబాటులో ఉంటుంది. నోకియా 6 (2018) ఫీచర్లు 5.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ ఐపీఎస్ ఎల్సీడీ ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 630 ప్రాసెసర్ 4 జీబీ ర్యామ్ 64 జీబీ స్టోరేజ్ 16 ఎంపీ రియర్ కెమెరా 8 ఎంపీ సెల్ఫీ కెమెరా 3000 ఎంఏహెచ్ బ్యాటరీ -
రూ.4,999కే నోకియా స్మార్ట్‌ఫోన్
ఇంటెల్, శాంసంగ్, సెల్కాన్, ఇంటెక్స్‌తో భాగస్వామ్యం ఏర్పరుచుకున్న అనంతరం టెలికాం దిగ్గజం ఎయిర్టెల్, గ్లోబల్ దిగ్గజం హెచ్ఎండీ గ్లోబల్‌తో జతకట్టింది. ఈ భాగస్వామ్యంలో నోకియా స్మార్ట్ఫోన్లపై 2వేల రూపాయల వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్ చేస్తోంది. 'మేరా పెహ్లా స్మార్ట్‌ఫోన్' ఆఫర్ కింద నోకియా 2, నోకియా 3 స్మార్ట్ఫోన్లపై ఈ క్యాష్‌బ్యాక్‌ను అందించనున్నట్టు ఎయిర్టెల్ తెలిపింది. దీంతో నోకియా 2 స్మార్ట్‌ఫోన్ అత్యంత తక్కువగా 4,999 రూపాయలకే అందుబాటులోకి వచ్చింది. నోకియా 3 స్మార్ట్‌ఫోన్ ధర కూడా 7,499 రూపాయలకు దిగొచ్చింది. ఈ ఆఫర్‌తో పాటు 169 రూపాయల ప్యాక్‌ను ఎయిర్టెల్ తీసుకొచ్చింది. ప్రస్తుతం మార్కెట్లో నోకియా 2 స్మార్ట్‌ఫోన్ రూ.6,999కు, నోకియా 3 స్మార్ట్‌ఫోన్ రూ.9,499కు అందుబాటులో ఉన్నాయి. అయితే ఎయిర్టెల్ ఈ క్యాష్‌బ్యాక్‌ను రెండు వాయిదాల్లో కస్టమర్లకు ఆఫర్ చేయనుంది. తొలిసారి 18 నెలల కాలంలో 500 రూపాయలను అందివనుంది. మిగతా మొత్తం అంటే 1500 రూపాయలను 36 నెలలో చెల్లించనుంది. అయితే ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవడానికి కస్టమర్లు తమ సిమ్ కార్డుపై 18 నెలల కాలంలో కనీసం 3500 రూపాయల రీఛార్జ్ చేయించుకోవాల్సి ఉంటుంది. మరో 19 నుంచి 36 నెలల కాలంలో మరో 3500 రూపాయలతో రీఛార్జ్ చేసుకోవాలి. ఎయిర్టెల్ అందిస్తున్న రూ.169 ప్రీపెయిడ్ ప్యాక్‌పై రోజుకు 1జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్లు 28 రోజుల పాటు వాలిడ్‌లో ఉండనున్నాయి. -
నోకియా స్మార్ట్ఫోన్ల కేర్‌టేకర్ అనూహ్య నిర్ణయం
నోకియా బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి పునఃప్రవేశపెట్టిన కొన్నినెలల్లోనే హెచ్ఎండీ గ్లోబల్ సీఈవో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. హెచ్ఎండీ గ్లోబల్ సీఈవో ఆర్టో నుమెలా తన పదవి నుంచి నిష్క్రమించారు. ఆర్టో రాజీనామా చేయడంతో ప్రస్తుతం హెచ్ఎండీ గ్లోబల్‌కు అధినేతగా ఉన్న ఫ్లోరియన్ సెషినే సీఈవోగా విధులు నిర్వర్తించనున్నారని తెలిసింది. హెచ్ఎండీ గ్లోబల్ ఆపరేషన్స్‌ను సృష్టించడానికి, టీమ్‌ను రూపొందించడానికి, కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి లాంచ్ చేయడానికి ఆర్టో నుమెలా కీలక పాత్ర పోషించారు. ఆర్టో అందించిన సహకారానికి కంపెనీ బోర్డు తరుఫున కృతజ్ఞతలు చెబుతున్నట్టు హెచ్ఎండీ గ్లోబల్ బోర్డు చైర్మన్ శామ్ చిన్ చెప్పారు. ఆయన భవిష్యత్తు లక్ష్యాలకు శుభాకాంక్షలు తెలిపారు. కంపెనీ ప్రారంభమైన దగ్గర్నుంచి హెచ్ఎండీ గ్లోబల్‌కు అధినేతలాగా ఫ్లోరియన్ కో-లీడింగ్ సేవలందించినట్టు కొనియాడారు. ఆర్టో పదవిలో ఉన్న కాలంలో హెచ్ఎండీ గ్లోబల్ నోకియా 3, 5, 6 స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. మరో స్మార్ట్‌ఫోన్ నోకియా 8ను హెచ్ఎండీ గ్లోబల్ జూలై 31న మార్కెట్లోకి ప్రవేశపెట్టబోతుంది. నోకియా బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లలో కెల్లా అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్ ఇదే. దీని ధర భారత్‌లో రూ.40వేలకు పైననే ఉంటుందని తెలుస్తోంది. స్టీల్, గోల్డ్/కాపర్, బ్లూ, గోల్డ్/బ్లూ రంగుల్లో ఇది అందుబాటులోకి రాబోతుంది. -
స్మార్ట్ఫోన్ల వాటా 30 శాతం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఏటా అమ్ముడవుతున్న 18 కోట్ల మొబైల్ ఫోన్లలో స్మార్ట్ఫోన్ల వాటా 10 శాతం. ఈ వాటా మూడేళ్లలో 30 శాతానికి చేరుతుందని మార్కెట్ అధ్యయనాలు చెబుతున్నాయని నోకియా ఇండియా దక్షిణప్రాంత డెరైక్టర్ టీఎస్ శ్రీధర్ తెలిపారు. ఈఎంఐ, బీమా, బై బ్యాక్ ఆఫర్లే స్మార్ట్ఫోన్ల అమ్మకాలను పెంచుతున్నాయని వివరించారు. నోకియా ఆశా సిరీస్ ఫోన్లను మంగళవారమిక్కడ రాష్ట్ర మార్కెట్లో ఆవిష్కరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా 2.5 కోట్ల ఆశా ఫోన్లు అమ్ముడయ్యాయని పేర్కొన్నారు. ఆశా 500 వారం చివరికల్లా అందుబాటులోకి వస్తుందని, ధర రూ.4,499 అని తెలిపారు. రూ.6,799 ధర ఉన్న ఆశా 503 సంక్రాంతి నాటికి మార్కెట్లోకి వస్తుందని చెప్పారు. -
కొత్త లుమియ ఫోన్లు వచ్చాయ్
న్యూఢిల్లీ: నోకియా కంపెనీ లుమియ సిరీస్‌లో రెండు ఫోన్లను లుమియ 925, లుమియ 625లను గురువారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 18-25 ఏళ్ల యువతీ యువకులను ఆకట్టుకునేందుకు లుమియ ఫోన్లను అందుబాటులోకి తెస్తున్నామని నోకియా ఇండియా డెరైక్టర్ (మార్కెటింగ్) విరల్ ఓజా చెప్పారు. లుమియ 625 ఫోన్ ధర రూ. 19,999 అని, ఈ ఫోన్ 3-4 రోజుల్లో విక్రయించడం ప్రారంభిస్తామని వివరించారు. లుమియ 925 ధర రూ. 33,499 అని, ఈ ఫోన్ విక్రయాలు ఇప్పటికే ప్రారంభించామని తెలిపారు. లుమియ 925 మోడల్ లుమియ 625 రూ.33,499 ధర రూ.19,999 4.5 అంగుళాలు డిస్ప్లే 4.7 అంగుళాలు 2జీ, 3జీ, 4జీ నెట్వర్క్ 2జీ,3జీ, 4జీ విండోస్ 8 ఓఎస్ విండోస్ 8 1జీబీ ర్యామ్ 512 ఎంబీ 8ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ రియర్ 1.3 ఎంపీ ఫ్రంట్ 0.3 ఎంపీ ఫ్రంట్ 16/32 జీబీ మెమెరీ 8 జీబీ -- కార్డ్‌స్లాట్ 62 జీబీ