కొత్త లుమియ ఫోన్లు వచ్చాయ్
కొత్త లుమియ ఫోన్లు వచ్చాయ్
Published Fri, Aug 23 2013 2:22 AM | Last Updated on Fri, Sep 1 2017 10:01 PM
న్యూఢిల్లీ: నోకియా కంపెనీ లుమియ సిరీస్‌లో రెండు ఫోన్లను లుమియ 925, లుమియ 625లను గురువారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. 18-25 ఏళ్ల యువతీ యువకులను ఆకట్టుకునేందుకు లుమియ ఫోన్లను అందుబాటులోకి తెస్తున్నామని నోకియా ఇండియా డెరైక్టర్ (మార్కెటింగ్) విరల్ ఓజా చెప్పారు. లుమియ 625 ఫోన్ ధర రూ. 19,999 అని, ఈ ఫోన్ 3-4 రోజుల్లో విక్రయించడం ప్రారంభిస్తామని వివరించారు. లుమియ 925 ధర రూ. 33,499 అని, ఈ ఫోన్ విక్రయాలు ఇప్పటికే ప్రారంభించామని తెలిపారు.
లుమియ 925 మోడల్ లుమియ 625
రూ.33,499 ధర రూ.19,999
4.5 అంగుళాలు డిస్‌ప్లే 4.7 అంగుళాలు
2జీ, 3జీ, 4జీ నెట్‌వర్క్ 2జీ,3జీ, 4జీ
విండోస్ 8 ఓఎస్ విండోస్ 8
1జీబీ ర్యామ్ 512 ఎంబీ
8ఎంపీ రియర్ కెమెరా 5 ఎంపీ రియర్
1.3 ఎంపీ ఫ్రంట్ 0.3 ఎంపీ ఫ్రంట్
16/32 జీబీ మెమెరీ 8 జీబీ
-- కార్డ్‌స్లాట్ 62 జీబీ
Advertisement
Advertisement