స్మార్ట్‌ఫోన్ల వాటా 30 శాతం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఏటా అమ్ముడవుతున్న 18 కోట్ల మొబైల్ ఫోన్లలో స్మార్ట్‌ఫోన్ల వాటా 10 శాతం. ఈ వాటా మూడేళ్లలో 30 శాతానికి చేరుతుందని మార్కెట్ అధ్యయనాలు చెబుతున్నాయని నోకియా ఇండియా దక్షిణప్రాంత డెరైక్టర్ టీఎస్ శ్రీధర్ తెలిపారు. ఈఎంఐ, బీమా, బై బ్యాక్ ఆఫర్లే స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలను పెంచుతున్నాయని వివరించారు.
నోకియా ఆశా సిరీస్ ఫోన్లను మంగళవారమిక్కడ రాష్ట్ర మార్కెట్లో ఆవిష్కరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా 2.5 కోట్ల ఆశా ఫోన్లు అమ్ముడయ్యాయని పేర్కొన్నారు. ఆశా 500 వారం చివరికల్లా అందుబాటులోకి వస్తుందని, ధర రూ.4,499 అని తెలిపారు. రూ.6,799 ధర ఉన్న ఆశా 503 సంక్రాంతి నాటికి మార్కెట్లోకి వస్తుందని చెప్పారు.