కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2024-25లో సాంకేతిక రంగానికి ప్రోత్సాహకాలను అందించింది. మొబైల్ ఫోన్స్, ఛార్జర్లు, పీసీబీఏ సుంకాలను 20 నుంచి 15 శాతానికి తగ్గించారు. దేశంలో మొబైల్ ఫోన్స్ ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. దేశం నుంచి ఎగుమతులు కూడా విరివిగా జరుగుతున్నాయి.
గత ఆరేళ్లలో మొబైల్ ఫోన్స్ ఉత్పత్తి ఏకంగా మూడు రెట్లు పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. మొబైల్ పరిశ్రమ గణనీయంగా వృద్ధి చెందటంతో బేసిక్ కస్టమ్స్ డ్యూటీని తగ్గించాలని కేంద్రం నిర్ణయించింది. అంతే కాకుండా ఈ ఏది జనవరిలోనే కేంద్ర ప్రభుత్వం మొబైల్ ఫోన్ విడిభాగాల దిగుమతి సుంకాలను కూడా 15 నుంచి 10 శాతానికి తగ్గించింది.
యాపిల్, ఒప్పో, వివో మొదలైన కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇండియా సెల్యులార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ టారిఫ్ స్లాబ్ హేతుబద్ధీకరణ ప్రతిపాదనను కూడా అంగీకరించింది. దిగుమతి సుంకాలు తగ్గించడంతో భారతదేశంలో ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలు బాగా తగ్గుతాయని స్పష్టమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment